విచారణ

| సాహిత్యం | క‌విత్వం

విచారణ

- రవి మారుత్ | 06.06.2020 04:50:27pm

ఆర్డర్ ఆర్డర్...
మీరందరూ
ప్యారిస్ కమ్యూన్ ని
ప్రేమించిన వాళ్ళే కదా
అక్టోబర్ విప్లవాన్ని
కీర్తించిన వాళ్ళే కదా
అల్లూరి సీతారామరాజు ని ఎక్కడ కలిసారు
లాంగ్ మార్చ్ తో
ఏకీభవించిన వాళ్ళే కదా
జలియన్ వాలాబాగ్ లో ఏమ్మాట్లాడుకున్నారు
భగత్సింగ్ మీవాడేగా
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ పక్షమా
విచారణ వాయిదా వేసాం

సైలెన్స్ హాజరీహో...
చెప్పండి
తెలంగాణా సాయుధ పోరాటం సరైందేనా
కిలవేన్మణి దళితులతో
మీకేంటి సంబంధం
వియత్నామ్ ఎందుకెళ్లారో చెప్పండి
నగ్స్ ల్బరి గురించి మాట్లాడుకోలేదా
శ్రీకాకుళంలో గిరిజనుల్ని కలిశారు కదా
ది కేస్ ఈస్ ఎడ్జెర్న్డ్

కోర్టు సమావేశమైనది
... ప్రొసీడ్
ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా సమావేశమయ్యారా లేదా
గోదావరి లోయ
సిరిసిల్ల జగిత్యాల
జైత్రయాత్రలతో సంబంధముందా
కారంచేడు చుండూరు దళితుల్ని రెచ్చగొడుతుంది మీరేకదా
కాశ్మీరు పదే పదే ఎందుకెళ్తున్నారు
యూనివర్సిటీల్లో అలజడికి కారణం మీరేనా
విచారణ పెద్ద కోర్టుకు మారింది

ఆనరబుల్ జస్టిస్...
కొన్ని వందలయేళ్ళుగా వీళ్ళింతే
వీళ్ళకొక ఉటోపియన్
సిద్ధాంతముంది
భారతీయ అంతరాత్మని ద్వేషిస్తారు
గాంధీని ఒప్పుకోరు
అంబేద్కర్ని అడ్డంపెడతారు
విమర్శించటం వీళ్ళశ్వాస రెచ్చగొట్టటం వీళ్ళఆశ
ప్రపంచీకరణని ఒప్పుకోరు అమెరికా అంటే పడదు
అభివృద్ధికి అడ్డుపడతారు దరిద్రంతో అంటకాగుతారు
వీళ్ల రేషన్ కార్డు రద్దుచెయ్యండి
ఆధార్ కార్డు చించేయ్యండి
పాసుపోర్టు తగలెయ్యండి
ఎరవాడ జైలులో శాశ్వతంగా బందీచేయ్యండి
తిండి దండగనుకొంటే
ఎన్ కౌంటర్ లో కాల్చిపారెయ్యండి! దట్సాల్.





No. of visitors : 189
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    సాహ‌సోపేత జీవితం
    నలబై వసంతాల దండకారణ్యం
    అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
    తారకంగారంటే..
    సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
    అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
    హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
    అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
    దేశీయుడి కళ
    మీరొస్తారని
    బందీ
    ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •