ఎన్ఐఏ అంటే బందిపోటు ముఠా, తోడేళ్ల మంద - మళ్లీ నలమాస క్రిష్ణ అరెస్టు

| సంపాద‌కీయం

ఎన్ఐఏ అంటే బందిపోటు ముఠా, తోడేళ్ల మంద - మళ్లీ నలమాస క్రిష్ణ అరెస్టు

- పాణి | 16.06.2020 05:11:53pm

మనం చిన్నప్పుడు చదువుకున్న కథల్లోని దృశ్యాలు ఇప్పటికీ వెంటాడుతుంటాయి. ఊరి మధ్యలో రచ్చకట్ట మీద పంచాయితీ జరుగుతుంది. కింద నిలబడ్డ బక్క మనుషుల మీద పంచాయితీ పెద్ద ఆరోపణలు చేస్తాడు. ఆయనే తీర్పు చెబుతాడు. అక్కడికక్కడే దారుణ శిక్షలు అమలు చేయిస్తాడు. ఆ శిక్షలకు ప్రమాణం ఉండదు. అసలు అక్కడ న్యాయా న్యాయాలకు తావు లేదు. నిరంకుశ సర్వాధికారాలు ఒకే చోట కేంద్రీకరించబడి ఉంటాయి. అది అందరినీ నేరస్థులను చేసి కొరత వేస్తుంది. ఇంతకంటే భయానకమైన సంఘటనలను కూడా కొన్ని కథల్లో చదివే ఉంటాం.

గుర్రాల మీద బందిపోటు దొంగల ముఠా ఊరి మీద పడుతుంది. ఇండ్లను దోచుకుంటుంది. కొంపలను తగలబెడుతుంది. అడ్డం వచ్చిన వాళ్లను తెగ నరికేస్తుంది. ఎవర్ని ఎత్తుకపోతుందో తెలియదు. అది కొల్లగొట్టుకపోయేది జనాల సంపదనే కాదు. ధైర్యాన్ని కూడా. చివరికి ఊరును శ్మశానం చేస్తుంది. వల్లకాడైన ఊరి మధ్య తోడేళ్ల మందలా భయానకమైన ఊళలు వేసుకుంటూ తిరుగుతుంది.

చిన్నప్పుడు చదివిన ఈ కథలు పాత సమాజానికి సంబంధించినవనీ, ఇప్పుడు ఆ బెడద లేదని ఊరట పొందుతాం. ఇది ఆధునిక వ్యవస్థ, ఇక్కడ నేరారోపణలు చేసేవాళ్లు, న్యాయ విచారణ చేసేవాళ్లు, శిక్షలు వేసే వాళ్లు ఒక్కరే కాదు, అనేక వ్యవస్థలు పని చేస్తుంటాయి. అన్నీ తర్కబద్ధంగా పని చేస్తుంటాయి, అన్నీ ప్రజాస్వామ్య సూత్రాల మీద పని చేస్తుంటాయి అని మన తెలివిడితో విశ్లేషించుకుంటాం.

కానీ నిజమా?

నమ్మగలమా?

కేవలం ఇద్దరు వ్యక్తుల కనుసన్నల్లో నడిచే బందిపోటు ముఠా రాజ్యాంగబద్దంగానే దేశం మీదే వీర విహారం చేస్తుంది. దానికి న్యాయం లేదు. సాక్షం లేదు. దాని అధికారానికి హద్దులు లేవు. కాగితం మీద ఉండే చట్టం, న్యాయం గురించిన అక్షరాలతో దానికి సంబంధమే లేదు. ఆ ఇద్దరికీ తప్ప మరెవ్వరికీ జవాబుదారీగా ఉండాల్సిన పని లేదు. ఎప్పుడు ఎవరినైనా అనుమానించవచ్చు. ఎవరి మీద ఏ అరోపణ అయినా చేయవచ్చు. ఎవరి ఇంటి మీదైనా పడి తోడేళ్ల మందలా మనుషుల్ని ఎత్తుకెళ్లవచ్చు. ఆ ఇద్దరి మానవ వ్యతిరేకతే, విద్వేష భావజాలమే దాని రహస్యం. వాళ్లకు ఎవరు ఇష్టం లేకుంటే వాళ్లను ఈ బందిపోటు ముఠా ఎగరేసుకపోతుంది. ఇక అంతే. దాని ఇష్టం. ఎవ్వరూ ఏమీ చేయలేని నిర్బంధ దుర్గంలోకి మనుషులు జారిపోయినట్లే. చుట్టూ ఉన్నవాళ్లు నిస్సహాయంగా చూస్తుండటం తప్ప ఏమీ చేయలేరు. తమ వంతు వచ్చే వరకు ఊపిరి ఉగ్గబట్టి ఉండటం తప్ప ఇంకేమీ చేయలేరు.

అదే ఎన్ఐఏ. నేషనల్ అనే మాట లేకుంటే ఆ ఇద్దరికీ ముద్ద దిగదు. అన్నీ జాతీయం అనే మురికి గుంట భావనలోంచి పుట్టుకరావాల్సిందే. ఎన్ఐఏ కోరల పదును ఉపా. దానికి కావాల్సింది.. వొళ్లు, మెదడు, హృదయం గగుర్పొడిచే ఈ భయ స్థితి. భయపెట్టడం, ఎత్తుకెళ్లడం, బంధించడం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లక్ష్యం ఇదే. ముస్లిం ఉగ్రవాదం, మావోయిస్టుల అణిచివేత పేరుతో ప్రజల్ని నిర్బంధించడం, భయపెట్టడం దీని పని.

భయపడాలి. అందరూ భయపడాలి. ఎవ్వరూ నోరెత్త కూడదు. కళ్లు తెరిచి చూడకూడదు. చూసిన సత్యాన్ని నమ్మకూడదు. నమ్మిన విషయాన్ని మాట్లాడకూడదు. రోడ్ల మీద ధైర్యంగా తిరగకూడదు. నేను పౌరురాలిననీ, పౌరుణ్ణనీ అనుకోకూడదు. అనుకుంటే ఈ తోడేళ్ల మంద దాడి చేస్తుంది.

భయపెట్టకపోతే పాలించలేమని, వీలైనంత మందిని చీకటి కొట్లలోకి తోసేయకపోతే ప్రశాంతంగా ఉండలేమని అనుకొనే వాళ్లకే ఇలాంటి సంస్థ అవసరం అవుతుంది. దేశ వ్యాప్తంగా ఇది ఏమేం చేస్తున్నదో చెప్పడం ఇక్కడ సాధ్యం కాదు. తాజాగా అది నలమాస కృష్ణ మీద దాడి చేసింది. తెలంగాణలో ఆయన గురించి పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకుడు. ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఆ సంస్థ లక్ష్యం ప్రజాస్వామిక తెలంగాణ. కేసీఆర్ ఏలుబడిలోని దోపిడీ, దౌర్జన్యాలు లేని తెలంగాణ స్థాపించడమే దాని లక్ష్యం.

దాని కోసం ఆయన పని చేస్తున్నాడు. ఈ నేరం కింద తెలంగాణ పోలీసులు ఇప్పటికి అనేక కేసులు పెట్టారు. ఎనిమిది నెలలుగా వివిధ జైళ్లలో ఉండి గత శనివారమే బెయిలు మీద విడుదలయ్యాడు. సరిగ్గా వారం గడిచింది. మళ్లీ ఆదివారం అరెస్టు చేశారు.

ఈసారి ఎన్ఐఏ పోలీసులు ఆయన్ను ఆదుపులోకి తీసుకున్నారు. జైలు జీవితం వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడైపోవడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో ఆయన వైద్యం చేయించుకుంటున్నాడు. అలాంటి రోగగ్రస్థుడి మీద ఎన్ఐఏ పంజా విసిరింది. ఇప్పటికే భీమా కొరేగావ్ కేసు ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ కేసు కూడా.

తెలంగాణకు చెందిన వరవరరావు విడుదలపట్ల కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కొందరు పెద్దలు విజ్ఞప్తి చేశారు. ఆ ప్రయత్నం కూడా చేయాల్సిందే. కానీ తెలంగాణ ప్రభుత్వమే ఇక్కడి కేసుల్ని ఎన్ఐఏకు ఇచ్చేస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నలమాస కృష్ణనే కాదు. ఈ మంద ఇంకెంత మందిని ఎత్తుకపోతుందో, ఎవరి వంతు వస్తుందో చెప్పలేం.

ఇదంతా రాజ్యాంగబద్దమే. దాపరికమే లేదు. పాలకులు చేసే ఈ పనులపట్ల మన మహోత్కృష్ట రాజ్యాంగానికి ఏ అభ్యంతరమూ ఉండదు. ఈ హింసోన్మాదానికి తగిన వాక్యాలు, వ్యాక్యార్థాలు అందులో ఏమూలో ఉండే ఉంటాయి. కాబట్టి అంతా సజావుగా సైలెంట్ గా జరిగిపోతుంది. భయానక నిశ్శబ్దమే రాజ్యాంగబద్ధ పాలన ప్రాణ వాయువు. ఫాసిజం అంటే ఈ నిశ్శబ్దమే. దీని కోసం.. ఆర్ఎస్ఎస్ విషపు ఆలోచనల ఆ ఇద్దరి సృష్టి ఎన్ఐఏ. ఈ తోడేళ్ల మందకు సారధ్యం వాళ్లదే. వాళ్లే అజిత్ దోవల్, అమిత్ షా.

No. of visitors : 650
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •