న్యాయవిచారణ

| సాహిత్యం | క‌థ‌లు

న్యాయవిచారణ

- అవధేశ్ ప్రీత్ | 16.06.2020 05:28:58pm

గ‌త సంచిక త‌రువాయి..డాక్టర్ భగత్, విజయ్ మిత్రకు అందుతున్న వైద్య చికిత్స ప్రక్రియను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు. ECG మోనిటర్ లో ఏమాత్రం తేడా కనిపించినా ఆయన భృకుటి ముడివడేది. డాక్టర్ భగత్ చాలా మ్రాన్పడ్డాడని, ఉద్విగ్నస్థితిలో ఉన్నాడని గమనించాను. ఆయననా స్థితి నుండి బయట పడేయడానికి ప్రయత్నిస్తూ, నక్సల్స్ పట్ల నాకున్న భయం వల్ల గావచ్చు , ఒక తెలివిమాలిన ప్రశ్న, ʹసర్,ఆ క్రూరమైన మనిషికో హృదయం ఉండే అవకాశం ఉందనంటారా?ʹ అడిగాను. డాక్టర్ భగత్ నిట్టూర్పుతో, ఈ మనిషి ఎటువంటి ప్రపంచాన్ని సృజించడానికి పోరాడుతున్నాడో, ఆ ప్రపంచం, ఆ పోరాట దారి, ఒక సాధారణ మనిషి అంచనాకు అందనిది అన్నాడు.

డాక్టర్ భగత్ కు రోగి గురించి, చాలానే తెలుసని నాకన్పించింది, ʹఆయన చేస్తున్న పోరాటాన్ని సమర్థిస్తున్నారాʹ అనడగాలని, కాని ఒక స్టుడెంట్ తన సీనియర్ ప్రొఫెసర్ ను అట్లా సూటిగా అడగడం తగింది కాదనిపించింది ఊరుకున్న.

డాక్టర్ భగత్ ఇంకా చెదిరిన స్థితిలోనికి వెళ్ళి, ʹడాక్టర్ సుజాతా రోగిని ఎట్లైనా, ఎంత ప్రయత్నం చేసైనా మనం రక్షించాలిʹ అని గొణిగాడు. ఎట్లైతేనేం రోగి బ్రతకలేకపోయాడు. డాక్టర్ భగత్ తన అన్ని శక్తులనూ వెచ్చించినా అతన్ని కాపాడలేక పోయాడు. ఆ సమయంలో భగత్ తన సర్వస్వాన్నీ కోల్పోయిన ప్రయాణీకుడిలాగ, అతని విశాదాన్నెవరూ పట్టించుకోలేదని అనుకుంటున్నట్లు కనిపించాడు. నిరాశ నిస్పృహలతో ICCU నుండి బయటపడి డాక్టర్ ఛేంబర్ లోనికి నడిచాడు. నిశ్శబ్ధంగా నేనూ ఆయనననుసరించి అదే ఛేంబర్ లోనికి నడిచి ఆయనతోపాటు కూచున్నాను.

తర్వాత కొద్ది సేపట్లోనే డాక్టర్ చౌదరి గారు లోపలికి వచ్చారు. బైట జనాల ఉద్వేగావేశ పూరిత గొంతులు వినిపిస్తూనే ఉన్నవి. చౌదరి గారి ప్రవేశం చూసి, డాక్టర్ భగత్ కుర్చీలో నుండి లేస్తూ, తనిక ఇంటికి వెళతానని, మరణ ధృవీకరణ పత్రాన్ని సిద్ధం చేయమని చౌదరి గార్కి చెప్పాడు. చౌదరి గారు తన అశక్తతను ప్రకటించారు. వాళ్ళ మధ్య ఓ చిన్న వాగ్వివాదం జరిగింది. అంతలోనే భగత్ గారు కోపంతో కుర్చీలో కూర్చుని, అదే తీవ్ర ఆగ్రహస్థితిలో, మరణ ధృవీకరణ పత్రం రాసి, సంతకం చేసి, టేబుల్ పై ఉంచి, వేగంగా ఛేంబర్ నుంచి నిష్క్రమించాడు.

సిస్టర్ అల్విన్ వాగ్మూలం:


సిస్టర్ అల్విన్ అనే నేను, సీనియర్ నర్సుగా, జనవరి 1వ తేదీన రాత్రి హృద్రోగులకు విభాగంలో విధుల్లో ఉన్న. పెద్ద ప్రజలగంపు ఒకటి రోగి విజయ్ మిత్రాను ఆస్పత్రికి తీసుక వచ్చినప్పుడు, డాక్టర్ సుజాతా రాయ్ వెంటనే అతన్ని పరీక్షించి, అతనికి ఆక్సిజన్ మాస్క్ అమర్చి అత్యవసర విభాగానికి తరలించమని ఆదేశించింది. కొంత సమయం తర్వాత డాక్టర్ భగత్, సుజాతా రాయ్ తో కలిసి అత్యవసర విభాగంలోకి వచ్చారు. ఆయన రోగిని పరీక్షించి, ఆతని రక్త శాంపిల్ ను జీవరసాయన పరీక్షకు ఏర్పాటు చేయించమన్నారు. నేను పరీక్షా ప్రయోగశాలకు (pathologycal lab) బయల్దేరాను. దానికి తాళం వేసి ఉంది. ఆ సమాచారాన్ని డాక్టర్ భగత్ కు అందించిన వెంటనే, ఆయన కలత జెంది, కారిడార్ వైపు దూసుకెళ్ళడం చూశాను. అంతలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తిరిగి వచ్చేటప్పటికి, డాక్టర్ భగత్ అత్యవసర విభాగం వైపు దూసుకెళ్ళడం చూశాను. ఆయన ఈసీజీ మోనిటర్ వైపు చూసి, ఓహ్హో నో అని అరిచాడు.

డాక్టర్ భగత్ రోగి నాడీని దొరికించుకునే ప్రయత్నం చేయడం కనిపించింది. ఆయన చికాకుకు గురైనట్లు కనిపించాడు. అంతలో డాక్టర్ సుజాతా రాయ్, ʹసర్ రోగి మరణించాడుʹ అని అనడం వినిపించింది.

జనరేటర్ ఆపరేటర్ వాగ్మూలం:

జనవరి 1వ తేదీన రాత్రి విద్యుత్ అంతరాయం కల్గినపుడు నేను విధుల్లో నున్న. వెంటనే జనరేటర్ ను స్విచ్ ఆన్ చేయడానికి పరిగెత్తాను. కానీ ఇంధనం ప్రవహించే నాళం లో ఏదో మలినం తట్టి ఉంది. దాన్ని తొలగించి సరిచేసి ఆన్ చేయడానికి ఎంత సమయం పట్టిందో తెలియదు. ఆ సమయంలో నేను రిస్ట్ వాచ్ ను ధరించలేదు.

డాక్టర్ చౌదరి వాగ్మూలం:

డాక్టర్ నీలకాంత్ చౌదరి అను నేను, జనవరి ఒకటి రాత్రి, ఆస్పత్రి హృద్రోగ విభాగంలో డ్యూటీలో ఉండవలసి ఉండింది. కాని హాస్పిటల్ ఆవరణ (campus)లో నాకు ఇల్లు కెటాయించబడనందువల్ల, నగరంలో అద్దె ఇంట్లో ఉన్న. డ్యూటీకని నేను బయల్దేరినప్పుడు, ప్రధాన రోడ్, గవర్నర్ మోటారు వాహనాల ఊరేగింపుకోసం, ఇతర వాహనాల రాకపోకలను
నిలిపివేసిందీ. ట్రాఫిక్ ను దారి మళ్ళించారు. ప్రత్యామ్నాయ రోడ్ లు కూడా ట్రాఫిక్ రద్దీ తో స్తంభించిపోయినయ్. అందువల్ల ఆస్పత్రికి సరియైన సమయంలో చేరుకోలేకపోయాను.

నేను ఆలస్యంగానే ఆస్పత్రికి చేరుకునేటప్పటికి, భవనం ముందు ఒక మృతదేహం, దాని చుట్టూ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉన్నరు. వాళ్ళు బిగ్గరగా నినదిస్తూ అనియంత్రిత స్థితిలో ఉన్నరు. వాళ్ళేక్షణమైనా దౌర్జన్యానికి తెగబడేటట్లున్నరనిపించి భయమైంది నాకు. డీలాపడిపోయాను. నేను డాక్టర్ ఛేంబర్ లోనికి అడుగిడే సమయానికి డాక్టర్ భగత్, డాక్టర్ సుజాత రాయ్ లు కూర్చొని అగుపడ్ఢారు. డాక్టర్ భగత్ నన్ను మరణ ధృవీకరణ పత్రాన్ని రాయమని అడిగాడు. నేను రోగికి చికిత్సనందించలేదు గనుక, అట్లే రోగికందించబడిన చికిత్స క్రమ వివరాలు తెలియవు గనుక నేను మరణ ధృవీకరణ పత్రం రాయడం సరియైంది కాదనీ, అసంబద్ధమనీ భావించి, నా అసమ్మతిని తెలియజేశాను.డాక్టర్ భగత్ చిరాకుపడ్డాడు. తన సమతుల్యాన్ని కోల్పోయాడు. అప్పుడతనే రెచ్చిపోయిన కోపోద్రిక్త స్ధితిలో మ.ధృ.పత్రాన్ని రాశాడు.

ఆ పత్రాన్ని చూసి నేను విస్తుపోయాను. నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. ఆ పత్రాన్ని సుజాత రాయ్ కందించాను, చూసి చదవమని.

ఆమె కూడా బిత్తర పోయినట్లగుపించింది. మరణానికి కారణం పేర్కునే చోటులో భగత్, ʹవ్యవస్థ వైఫల్యం వల్ల మరణం సంభవించిందిʹ అని రాసాడు.

సమీక్ష:

విచారణ కమిటీకి, భగత్ నుండి స్పష్టమైన వివరణ కోరాలనిపించి, ఆయనను మళ్ళీ తమముందు హాజరు కావాలని ఆదేశించింది. కమిటీ తరఫున డాక్టర్ రజనీష్ ఆచార్య, ʹడాక్టర్ భగత్ మీరొక సీనియర్ బాధ్యతాయుత వైద్యులు అయిఉండి, ఎందుకు అటువంటి మ.ధృ.పత్రాన్ని ఇచ్చారు?ʹ అడిగాడు.

ʹనేనేమైనా తప్పుగా రాశానాʹ అంటూ చిన్నగా నవ్వాడు భగత్ నిశ్శబ్దంగా. కమిటీ సభ్యులందరూ నిరుత్తరులయ్యారు. కొద్దిగా సంకోచిస్తూనే, ధైర్యం కూడగట్టుకొని, డాక్టర్ రమాషిశ్ దేవ్ మళ్ళీ, ʹమీరు రాసింది సరిగానే ఉందని మీరు నమ్ముతున్నారా?ʹ అన్నాడు.

ʹఔను నేను రాసింది వంద శాతం సరియైందే.ʹ భగత్ కఠినంగా సమాధానమిచ్చి, వెంటనే అదే స్వరంతో ʹఇంకేమైనా ప్రశ్నలున్నాయా జెంటిల్మెన్?ʹ అడిగాడు.

విచారణ కమిటీకి అడిగేదింకేమీ లేకపోయిందిక. ఈ సంఘటనతో సూటిగా సంబంధం లేని, విభాగ డైరెక్టర్ ను ఇతర డాక్టర్ లనూ ప్రశ్నించడానికిక పిలవలేదు.

నివేదిక:


కమిటీ సభ్యుల్లోని ప్రతిఒక్కరూ, తమ ముందున్న సాక్ష్యాధారాలు, వాగ్మూలాలను పరిగణనలోనికి తీసుకొని ఈ కింది విధంగా నివేదికను సిద్ధం చేశారు.

హృద్రోగ నిపుణుడు డాక్టర్ రజనీష్ ఆచార్య:
విజయ్ మిత్ర రక్త పరీక్ష చేయకుండా, ఆయనది గుండె పోటు అని నిర్ధారించబడజాలదు. ఏదేమైనా కేసు రికార్డుల ప్రకారం, అతని ఆరోగ్య పరిస్థితి గంభీరంగానే ఉండిందనేది స్పష్టం. అతనికి అతి శ్రద్ధతో కూడిన వైద్యచికిత్స అవసరమున్న స్థితిలో, అటువంటి చికిత్స ఆయనకు అందలేదు. అదొక, వైద్య సంబంధ అన్నినైతికతలూ ఉల్లంఘించబడిన కేసు.

నాడీరోగ నిపుణుడు డాక్టర్ జీవకాంత్ నివేదిక:

సాక్ష్యాధారాలను జాగ్రత్తగా పరిగణనలోనికి తీసుకొని, రోగి నేపథ్యాన్ని అధ్యయనం చేసినాక స్పష్టమైన దేమిటంటే, విజయ్ నాడీ వ్యవస్థ ఛిధ్రమై ఉండింది. అతడి మెదడు పనిచేయడం ఆగింది. అటువంటి రోగి భౌతికంగా సజీవంగా ఉన్నా మెదడు మరణించింది. అటువంటి సమయంలో వెంటనే ఒక నాడీ రోగ నిపుణుడిని సంప్రదించవలసి ఉండింది. అది జరగలేదు. నా ఉద్దేశంలో విజయ్ మిత్రది మెదడు మరణం(brain death).

మానసిక రోగి నిపుణుడు డాక్టర్ రమాషిశ్ దేవ్ నివేదిక:

రోగి విజయ్ మిత్ర నక్సల్స్ నాయకుడూ కార్యకర్తా ఐనందువల్ల, ఆయన బాగా ఒత్తిడిలో ఉన్నడని, ఆయనొక ఊహాజనిత ప్రపంచంలో నివసించే వాడనీ అర్థమౌతుంది. అట్లాంటందరూ బాధపడే ఒక మానసిక రుగ్మత. అది అత్యున్నత స్థితికి చేరినపుడు తీవ్ర మానసిక బాధతో పిచ్చి లేస్తుంది, లేదా తీవ్ర నిస్పృహ లోనికి వెళ్తారు. అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన పిదప, విజయ్ మిత్ర మానసిక వత్తిడితో మరణించాడని నమ్ముతున్నాన్నేను.
*

ఏదేమైనా విచారణ కమిటీలోని ముగ్గురు సభ్యులు అనేక అంశాల మీద ఏకీభావంతో ఉన్నరు. వాళ్ళందరూ అంగీకరించే దేమిటంటే, జనవరి ఒకటవ తేదిన రాత్రి, డాక్టర్ చౌదరి డ్యూటీలో ఉండవలసిన వాడు. ట్రాఫిక్ జామ్ వల్ల నిర్ణీత సమయంలో విధులకు హాజరు కాలేకపోయాడు. ఎట్లైనా, డాక్టర్ చౌదరి స్థానంలో భగత్ చేరి వైద్య చికిత్స అందించవలసింది కాదు. అట్లా చేసి డాక్టర్ భగత్ సంస్థ నియమ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు.

ఇంకా, కమిటీ సభ్యులు, ʹభగత్, తన భార్య సుదీర్ఘ అనారోగ్యం వల్లనూ, ఆయన హృద్రోగ విభాగ డైరెక్టర్గా నియామకం చేయబడడంలో ఎదురైన వ్యాజ్యం వల్ల కుంగిపోయి ఉండడం వల్లనూ, ఒక శూన్యతా భావం, ఆశాభంగానికి గురై సాధారణ స్థితిలో నున్నట్లు కనిపించుట లేదు.

ఇక డాక్టర్ భగత్ జారీచేసిన మ.ధృ.పత్రం చట్టబద్ధత గురించి, కమిటీ తమ అభిప్రాయాన్ని ఇట్లా, ʹఆయన ఆ రాత్రి విధుల్లో లేనందువల్ల మరణ ధృవీకరణ పత్రం జారీ చేయవలిసింది కాదు. అట్లా చేసి ఆయన, అన్ని నియమ నిబంధనలనూ ఉల్లంఘించాడు.

ఏదేమైనా ఆయనమీద ఒక చివరి నిర్ణయాన్ని ప్రకటించేముందు ఒక చట్ట న్యాయ నిపుణుడి అభిప్రాయం తీసుకుంటే మంచిది ʹఅని సూచించింది.

ప్రభుత్వ నిర్ణయం:


విచారణ కమిటీ నివేదిక వెలుగులో, సాక్ష్యాధారాలు తత్కాల పరిస్థితుల నాధారంగా, డాక్టర్ సి.కె.భగత్ నక్సల్స్ నాయకుడు విజయ్ మిత్రతో సన్నిహిత సంబంధాల్లో ఉన్నడు. ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వానికి అపఖ్యాతి తేవడానికి కుట్ర పన్ని, అటువంటి మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేశాడు. అట్లా ఆతని చర్య అత్యంత క్రమశిక్షణారాహిత్యంగా ఉండి, ప్రభుత్వ సేవారంగానికి సరిపడే గుణాన్ని కల్గిలేడు. అతడన్ని నైతికతలనూ ఉల్లంఘించి అభ్యంతరకర రీతిలో ప్రవర్తించాడు. కనుక ఆయనను వెంటనే సర్వీసులో నుండి తొలగించబడుతున్నది.

డాక్టర్ సి.కె.భగత్ స్పందన:


ʹకామ్రేడ్ విజయ్ మిత్రా, కేవలం నీకు మాత్రమే హృదయం లేకుండి ఉంటే!ʹ

మూలం: అవధేశ్ ప్రీత్(హింది)
ఆంగ్లానువాదం: యతీశ్ అగర్వాల్
తెలుగు:సమీర

No. of visitors : 307
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


న్యాయవిచారణ

అవధేశ్ ప్రీత్ | 02.06.2020 11:01:28pm

కామ్రేడ్ విజయ్ మిత్ర మరణంతో ఉవ్వెత్తున లేచిన ప్రజాగ్రహాందోళనలు ప్రభుత్వాన్ని, హృద్రోగనిపుణుడు డా. సి.కె.భగత్ ను తత్కాలికంగా విధులనుంచి తప్పించకనూ,ఇంకా అతని ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •