ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలపై టెర్రరిస్టు ముద్రవేయడం, ముద్దాయిలే తాము నేరం చేయలేదని నిరూపించుకోవల్సి రావడం, న్యాయవిచారణకు చాలాకాలం ముందునుండే వాళ్ళను నిర్బంధించడం మొదలైనవి అంతర్జాతీయ మానవహక్కులకు, న్యాయ సూత్రాలకు అనుగుణంగా లేవని ప్రకటించింది.
మే 6, 2020న విడుదల చేసిన ఒక ప్రత్యేక పత్రికా ప్రకటనలో, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, ఊపాచట్టం 1967, 2019లో దానికి చేసిన సవరణలలోని అనేక అంశాలు మానవహక్కుల ఉల్లంఘనకు దారితీస్తుండడంపట్ల, భారత ప్రభుత్వానికి తమ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.
ఈ ప్రకటనపై సంతకం చేసినవాళ్ళు : టెర్రరిజాన్ని ఎదుర్కొనే క్రమంలో మానవహక్కులను, ప్రాథమిక స్వేచ్ఛల ప్రాధాన్యతను ఎత్తిపట్టటం, వాటిని కాపాడడానికి సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి ; విచక్షణారహితమైన నిర్బంధాలపట్ల వ్యవహరించే కార్యాచరణ బృందం. భావప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛలకు సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి, శాంతియుతంగా సమావేశం కావడం, సంఘాలు ఏర్పాటుచేసుకోవడం వంటి హక్కులకు సబంధించిన ప్రత్యేక ప్రతినిధి. మానవహక్కుల పరిరక్షకుల స్థితిని పరిశీలించే ప్రత్యేక ప్రతినిధి. న్యాయమూర్తులు, న్యాయవాదుల స్వతంత్ర ప్రతిపక్తికి సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి. మైనారిటీల సమస్యలకు సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి. వ్యక్తిగత గోప్యత హక్కుకు సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి. మత స్వేచ్ఛను, విశ్వాసాలు కలిగివుండే స్వేచ్ఛకు సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి.
మత సంబంధమైన, మతేతర మైనారిటీలపట్ల, మానవహక్కుల పరిరక్షకులపట్ల, రాజకీయ అసమ్మతివాదులపట్ల ఊపా చట్టాన్ని ఉపయోగించడంలో కొనసాగుతున్న వివక్షత నేపథ్యంలో, వ్యక్తులపై ʹటెర్రరిస్టులుʹ అనే ముద్రను వేయడంపట్ల ఈ ప్రకటన తన ఆందోళనను వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మానవహక్కుల న్యాయసూత్రాల కారణంగా తనకున్న బాధ్యతలకు అనుగుణంగాలేని అంశాలను భారత ప్రభుత్వం సమీక్షించాలని ఆ ప్రకటన కోరింది.
పౌర, రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒడంబడిక, అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన పైన సంతకం చేసిన దేశంగా భారత ప్రభుత్వానికి వున్న బాధ్యతలను ఈ ప్రకటన గుర్తుచేసింది. టెర్రరిజాన్ని వ్యతిరేకించే క్రమంలో మానవ హక్కులను, థమిక హక్కులను కాపాడడానికి సంబంధించిన సూత్రాలకు ఊపా చట్టంలోని ʹటెర్రరిస్టు కార్యకలాపాలʹకు ఇచ్చిన నిర్వచనం భిన్నంగా వుండడంపట్ల ఈ ప్రకటన ఆందోళనను వ్యక్తం చేసింది. ఊపా చట్టంలో పేర్కొన్న నిర్వచనం ʹఅస్పష్టంగానూ, అనుమానాలు రేకెత్తించే రీతిలోనూʹ వుందని ఆ ప్రకటన అభిప్రాయపడింది. ʹటెర్రరిస్టు సంస్థʹ, ʹచట్ట వ్యతిరేక సంస్థʹ అనే వాటికి ఇచ్చిన నిర్వచనంపట్ల కూడా అది తన తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.
ʹమానవహక్కుల సంఘం ఆమోదించిన 40/16, 42/22, 34/18, 41/12, 42/10, 35/11, 34/6, 37/2, 40/10 తీర్మానాలకు అనుగుణంగా ఊపా చట్టంలోని అంశాలు లేవు. అందుచేత భారత ప్రభుత్వం అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటన కారణంగా తనకు సక్రమించిన బాధ్యతలకు అనుగుణంగా, సవరించబడిన ఊపా చట్టంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను పున:పరిశీలించాలని, ఎప్పటికప్పుడు సమీక్షించడాన్ని ప్రోత్సహించాలని తాము కోరుతున్నామనిʹ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Type in English and Press Space to Convert in Telugu |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |