రాబందులు రాజ్యంలో
జనబందువులు బందీ
విడుదలెప్పుడు విడుదలెప్పుడు
విడువాలి ఇప్పుడే విడువాలి ఇప్పుడేీ
కమ్మని కంఠంతో కూతకూసే కోకిలమ్మను
ఓర్వలేక కావుకావు మనే కాకుల గుంపు
కోకిల పై దాడి చేసినట్లు
గలగల పారే గోదారమ్మ పరవళ్లను కక్షతో
కరకట్టకట్టి తన సహజ సవ్వడిని అడ్డుకున్నట్లు
అందమైన అరణ్యం అద్భుతంగా నాట్యమాడే
ఆరడుగుల అందాల మయూరన్ని వేటాడినట్టు
కల్లాకపటం ఎరుగని
స్వేచ్ఛగా ఎగిరే స్వేత
కపోతాన్ని రెక్కలు కట్టి
పంజరంలో బందించి నట్టు
అమ్ముడు పోని కలాలు
బజనచేయని గళాలు
ప్రజలతరుపున ప్రశ్నలై
అస్త్రాలు సంధిస్తే
సమాధానాలు లేని ప్రభుత్వాలు
ప్రజల మనుషులను కుంటి సాకులు
దొంగచట్టాలతో చెరసాలలో బందించే ..
ఎన్నాల్లు ఇంకెన్నేళ్ళు నియంతల పాలనలో
ప్రజల మనుషుల బందీలు
విడుదలెప్పుడు విడుదలెప్పుడు
విడువాలి ఇప్పుడే.
విడువాలి ఇప్పుడే
Type in English and Press Space to Convert in Telugu |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |