దేశమంతా
మీ పేర్లే
నిర్బంధించబడిన
మీ గొంతులే
కోర్టు మెట్లెక్కి
కాలరాయబడిన హక్కును
చిదిమేయబడిన వాక్కును
విశ్వానికి వినిపించారు
ఇనుప చువ్వలు
రాతి గుండెలు
రాజ్యపు రక్షణ
భక్షణ కవచాలన్నారు
ఆలోచిస్తే ఊపాలు
అడుగేస్తే అరెస్టులు
ఇంకెన్నాలన్నారీ
ఫాసిస్ట్ రివాజులు
చెరసాలలు ఉరికొయ్యలు
ఉద్యమాలను ఆపలేవు
నిజం నిజం నిజం నిజం
నినదించెను ఈ సమాజం
మీరు మేము
నిత్యం సంభాషిస్తున్నాం
రాజ్య క్రూరత్వాన్ని
ఖండిస్తున్నాం
నమ్ముతున్నాం
దృఢంగా
మీరొస్తారని
మా కోసం
( న్యాయం కై పోరాడుతూ నిర్బంధించబడిన అందరి విడుదలకై)
#RELEASE ALL POLITICAL PRISIONERS#
Type in English and Press Space to Convert in Telugu |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |