దేశీయుడి కళ

| సాహిత్యం | క‌విత్వం

దేశీయుడి కళ

- మహమూద్ | 16.06.2020 09:26:55pm

వాడు
ముద్ద బంగారాన్ని తన
నరమంత నాజుకైనా
తీగెలాగా
లాగుతాడు

బతుకుగిన్నెలో ద్రావకాన్ని పోసి
స్వర్ణాన్ని కడిగి కాంతిమయం చేస్తాడు

వాడి వేళ్ళ మధ్య రాళ్ళు రాటుదేలి
వజ్రాల్లా మెరుస్తాయి
ఆభరణపు దేహమ్మీద నగీషీలౌతాయి

ఏ పూలతోటలోని దొరబుచ్చుకున్న
సుమభావాలో అతినివి
సూక్ష్మమైన చూపు ఉలితో తీక్షణమైన
దృష్టి సారించి తొలిచి తొలిచి చేసిన కళాఖండం
స్త్రీ మూర్తి ముక్కుకి ముక్కెరలా
మెడచుట్టూ చంద్రవంకలా
చెవిలోకి ఆధా హై చంద్రమా లోలకంలా
నడుముకి వడ్డాణపు హొయలుగా చేరిపోతుంది

వాడు అలంకరణకి కళని అన్వయిస్తాడు
కళలో తన ప్రాణం మేల్కోవడం నిదురించడం చూస్తాడు
అందానికి అదనంగా ఆనందాన్ని జత చేస్తాడు

ఆ నేర్పు
మట్టిపోయిలో నిప్పుని సృష్టించి
ఊపిరిపోతలో కాలాన్ని కరిగిస్తే అబ్బుతుంది
పనిఏళ్ళు కరిగే లోగా మోకాళ్ళ మధ్య నుంచి భూగోళం దూరిపోయేంత వక్రం పుడుతుంది

ఇక్కడ ఖాదర్ లూ చౌసేనులు
బాషాలు పాదుషాలు కాదు బాసింపట్టేసుకూర్చున్న కర్షకులు
అగ్రవర్ణ పెట్టుబడిదారులకు పనివాళ్ళు
ఇక్కడి సాయబులు స్వర్ణహృదయులు

ఇంత చేసీ, పసిడిపై దుమ్ము
ఆదాయంగా
మిగిలి
భాయీ ఛాతి మీద ఒక్క నగా మురవదు
కనీసం ఒక్క ఉంగరం వేలిలో మెరవదు
బీదరికం వాడి ఆభరణం....

కష్టం తోమొదలై కష్టంతో ముగిసే అతడి రోజూవారికి
ఒక్కోసారి లాక్డౌన్లు పరిహసిస్తాయి
మర్కజ్ ల అభాండాలు త్రిశూలాలై గుండెను చీలుస్తాయి

సముద్రం జీవితమైన జాలరి చేతిలోంచి గాలం లాక్కున్నట్టు కష్టంలో కష్టంలా బతికే సగటు జీవి
నోటి నుంచి కూడు లాక్కునే మత వైరస్లు
అతడి మూలంలోకి ఇంజెక్ట్ చేయబడతాయి

అక్కల పెళ్ళికో చెల్లెలి పెళ్ళికోసం కూడబెట్టింది సరపోక
దేశకాలాన్ని వొదిలి అరేబియా ఎడారికి ఆయుష్షు సమర్పించుకోడానికి వాడు చివరికి
వాలేది గల్ఫ్ నేల పై వలస విహంగమై వాలతాడు

నాలుగు రియాళ్ళతో సమానమైన
రూపాయలు స్వదేశంలో దొరకని నిత్యకరువులో

దేశీయుడి కళ పరదేశపు కలల పై కురిసేది పసిడివర్షమై

***ఇలాంటి ఒక కవిత రాయమని సలహా ఇచ్చిన స్కైబాబా కు
***ప్రొద్దుటూరు షరాఫు బజారు చుట్టూ అల్లుకున్న కర్షక బతుకుకు సలాములు





No. of visitors : 199
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    సాహ‌సోపేత జీవితం
    నలబై వసంతాల దండకారణ్యం
    అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
    తారకంగారంటే..
    సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
    అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
    హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
    అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
    దేశీయుడి కళ
    మీరొస్తారని
    బందీ
    ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •