అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ

| సాహిత్యం | క‌థ‌లు

అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ

- పలమనేరు బాలాజీ | 17.06.2020 08:09:00pm

మంచి కథ యొక్క ఒక ముఖ్య లక్షణం క్లుప్తత అని విమర్శకులు అంటారు. ఎంత చెప్పాలో అంతే చెప్పటం, ఎక్కడ ఆపాలో అక్కడే అప్పడం మంచి కథ లక్షణాలు. కథలో చెప్పిన విషయం కంటే సూచించిన విషయం ద్వారానే పాఠకులు ఆలోచిస్తారు, కొన్ని విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. సామాజిక సంక్షోభాన్ని, జీవితంలోని సంఘర్షణను "కుక్క" అనే చిన్నకథలో ప్రతిభావంతంగా చూపించారు పి .వరలక్ష్మి గారు.

కథకులకు నిరంతరం వర్క్ షాప్స్ నిర్వహించడం ద్వారా ,కథకుల సందేహాలను పోగొట్టి కథా రచనలోని మెళకువలను వారికి తెలియజేసి కథను తిరగ రాయించి కథను మంచి కథగా మలచటం విరసం వారు క్రమం తప్పకుండా చేస్తున్న ఒక మంచి కార్యక్రమం.

"కథల పంట 3" కథా సంకలనం (2015) లోని పంతొమ్మిది కథల్లో పి.వరలక్ష్మి గారి కథ ప్రత్యేకమైనది. యధాలాపంగా జరిగిన ఒక సంఘటనను చిత్రీకరిస్తున్నట్లు కనిపిస్తూనే ఒక చిన్న సంఘటనను తీసుకొని సమాజం మొత్తాన్ని అందులో చూపించటం ,వర్తమాన వ్యక్తిగత సామాజిక సంఘర్షణలను చిత్రీకరించడం ఈ కథలో చేసిన ప్రయోగం.

కథ చదువుతున్నప్పుడు చాలా మామూలు కథగానే అనిపిస్తుంది‌. కథ చివర్లోకి వచ్చేసరికి పాఠకులు ఉలిక్కిపడతారు. తమలోకి తాము తొంగి చూసుకుంటారు.కథ మొత్తం కుక్క గురించి చెప్పినట్లే అనిపించినప్పటికీ ఈ కథ నిజానికి కుక్క గురించి కాదు. మనిషి గురించి, మానవ సంబంధాల గురించి ,మానవ హక్కుల గురించి అని కథ చివర్లో తెలుస్తుంది. గొప్ప జీవిత సత్యాన్ని ఇంత చిన్న కథలో చూపించడం శిల్ప పరిణితికి నిదర్శనం.

***

ఒక ఆదివారం ఉదయం తుప్పల్లో పడి, బాగా గాయపడి, రక్తం కారుతున్న కుక్కను వీధిలో ఆడుకుంటున్న పిల్లలు గమనిస్తారు.నిజానికి అది కుక్క పిల్ల కాదు కుక్కే ,దాని వయసు కుక్క పిల్లకు కుక్కకు మధ్యలో ఉంటుంది అంటుంది రచయిత్రి.వీధిలో అక్కడక్కడా మిగిలిపోయిన అన్నం తిని ఎదిగిన కుక్క తను తిన్న అన్నానికి విశ్వాసం చూపించడం మొదలుపెడుతుంది. కొత్త వాళ్ళను చూస్తే మొరగడం వెంటపడడం చేస్తుంది.

"గంట క్రితం తన అధికారి వద్ద అ కుక్క లాగే నిలుచున్న అతనికి తోక లేదు కానీ, తోక ఊపుతున్నట్లే నిలుచున్నాడు. అధికారి గలీజు మాటలకు అతని మీదికి దూకాలని ఉన్నా తమాయించుకున్నాడు. ఆరోజు ఇవ్వాల్సిన కాగితాలు ఇచ్చేసి బైక్ లో ఇంటికి వచ్చేశాడు. సలసల కాలుతున్న మనసును సేద తీర్చుకోవడానికి కాలుతున్న కడుపులోకి ఏవేవో పోసుకున్నా పెద్దగా లాభం లేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో అతనికి ఎదురు ఎదురు పడిన కుక్కను బూట్ కాలితో తన్ని పడేసాడు. చిన్నగా మూలిగింది కుక్క . అది అతనికి ధిక్కారంగా కనిపిస్తుందని దానికి తెలీదు. ఆ మనిషి దాని తోక పట్టుకొని ఆరడుగులు పైకి లేపాడు.ఇద్దరి ముఖాలు ఇప్పుడు ఎదురెదురుగా ఉన్నాయి. అది కొట్టుకులాడింది. మళ్ళీ మొరిగింది, ఈసారి నరాలు బిగపెట్టినట్లు బాధగా. అతడు నవ్వాడు .గట్టిగా నవ్వాడు‌ తృప్తిగా నవ్వాడు.దాని తోక అలాగే పట్టుకొని గిరగిరా తిప్పి వదిలేశాడు.ఇక అది కనిపించలేదు అతడు దర్భంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు."

పిల్లల అరుపులతో అటుగా వెళుతున్న ఒక పెద్దాయన కుక్క దగ్గరకు పోతాడు. రెండు చేతులతో దాన్ని దగ్గరకు తీసుకుంటాడు. నీళ్లు తాగిస్తాడు. మందు తెప్పించి గాయాలను శుభ్రం చేసి మందు రాస్తాడు.అటుగా స్కూటర్ పై వెళ్తున్న అతన్ని చూపించి పిల్లలు చెబుతారు అతనే నిన్న దీన్ని కొట్టింది అని. అతడు పని చేస్తున్న పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి కుక్కని కొట్టిన పోలీస్ ఆఫీసర్ పై కేసు రాయమంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు వింతగా చూస్తారు ఆ పెద్దాయనను.నవ్వుతారు కుక్కను కొడ్తే కేసా ?ఇంత లావు మనుషులకే దిక్కు లేదు కానీ అని అంటారు. జంతువులను హింసించడం నేరమని ఏ ఏ చట్టాలు చెబుతాయో కూడా అతడు చెప్పాడు. హింస నేరం కాదా? దేన్నయినా కొట్టే హక్కు ఎవరిచ్చారు? అడిగేవాడు లేడని కుక్క అయితే మాత్రం చంపేస్తారా? అతని ప్రశ్నకు సమాధానం ఉండదు. న్యూసెన్స్ భరించలేక అతన్ని బయటకు తోసేస్తారు.

పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డుపై కూర్చున్నాడు. తోడుగా పిల్లల గుంపు. విషయం తెలుసుకున్న జంతు హక్కుల సంఘాల వాళ్ళు అక్కడికి చేరుకున్నారు.పిల్లల అరుపులు మీడియా హడావిడి తోడయ్యి ఆ ప్రాంతమంతా సందడిగా తయారయ్యింది.

ఇక కథ ముగింపు చూడండి..

ʹఫలానా ఆఫీసర్ పై కేసు నమోదు చేయాలిʹ.ʹఫలానా ఆఫీసర్ బయటికి రావాలి ʹ అంటూ నినాదాలు మొదలయ్యాయి. రోడ్డుమీద చోద్యం చూస్తూ నిలబడటమో, చూపు ఇటు తిప్పివేగం తగ్గించి నెమ్మదిగా పోవటమో చేస్తున్నారు.ఎవరోగానీ విచారించి విషయం తెలుసుకోవడం లేదు.తెలుసుకున్న వాళ్ళు నోళ్లు వెళ్ళ బెడుతున్నారు.

దూరం నుండే చూపు లగ్నం చేసి వస్తున్న ఒకామె నేరుగా పెద్దాయన దగ్గరికే పోయింది. వయసు ముప్పై అయిదు, నలభై మధ్యలో ఉంటుంది. మధ్యతరగతి వాలకం.సన్నగా పాలిపోయిన రంగులో ఉంది. ఏం జరిగిందని అడిగింది. కుక్కను చూపించి విషయం చెప్పాడాయన.దానికి చేసిన సపర్యల వల్ల అప్పటికది కాస్త తేరుకుంది.బతికి బైట పడినట్లే. పెద్దాయన చెప్పేది ఆమె ప్రశాంతంగా విన్నది. పెద్దగా ఆశ్చర్యపోలేదు. పైగా ఇలాంటిదేదో జరగవలసిందే అన్నట్టుగా ఉన్నాయి ఆమె భావాలు.సాంతం విని, ʹనిజమే పెద్దాయనా, నువ్వు చెప్పేది రైటే.కుక్కయితే మాత్రం ఇంత దారుణంగా కొడతాడా?అడిగేటోళ్ళు లేరని!"

"నువ్వు బాగా బాగా అర్థం చేసుకున్నావమ్మా. ఇట్లాంటివి చూస్తా ఊరుకో కూడదు"

పెద్దాయన పక్కనున్న ఒక పెద్దమనిషి కళ్ళు పెద్దవి చేసి తల కిందికి పైకి ఊపుతూ అన్నాడు. ఆమె అతనివైపు ఒకసారి చూసి అవునన్నట్టు తలూపి మళ్ళీ పెద్దాయన
వైపు తిరిగింది.

"కుక్కను కొడ్తే ఇంత కొడ్లాడ్తన్నారు. గదా... నన్నయితే మా ఆయన రోజూ కుక్కను కొట్టినట్లే కొడ్తడు. నా బాధ ఎవరికి జెప్పన్లే పెద్దాయనా... !" నిట్టూర్పు విడిచింది.

ఆమె కళ్ళలోకి ఆదరంగా చూశాడాయన .ʹఎవరుమ్మా నువ్వు? యాడ ఉంటావు ?చెప్పు నీ భర్త ఎవరు? ఏం చేస్తంటాడు? చెప్పమ్మా."

ఆమె మౌనం పాటించింది. ఆయన వదల్లేదు. కుక్కను కొట్టడం తప్పంటన్నాం. మనిషిని, అందునా ఆడమనిషిని కొట్టడం ఇంకెంత తప్పు అన్నాడు. ఓర్పు కూడా తప్పుల్ని ప్రోత్సహిస్తుందన్నాడు. ఆమె నోరు విప్పేవరకూ ఆయన వదల్లేదు

"ఏం చెప్తానయ్యా! ఈ కుక్కను కొట్టినోడే రోజూ నన్ను కొట్టేది....!"

ʹఆ .. !!!" "అయితే నువ్వు గూడా వచ్చి కూర్చోమ్మా."

వెంటనే తేరుకొని ఎటువంటి తడబాటూ లేకుండా అన్నాడు పెద్దాయన.

అదీ కథ.!

***
యధాలాపంగా చదివినప్పుడు చాలా మామూలు కథగా అనిపించవచ్చు కానీ కథను శ్రద్ధగా చదివినప్పుడు ఈ కథ కుక్క గురించి మాత్రమే కాదని మనిషి గురించి, సమాజం గురించి, అనేక హింసల గురించి, మానవ ప్రవృత్తి గురించి, ఆర్థిక సంబంధాల గురించి, మానవ సంబంధాల గురించి, మానవ హక్కుల గురించి అని అర్థమవుతుంది.

కథ మొత్తం కుక్క గురించి ఆలోచిస్తున్న పాఠకులు కథ చివరకు వచ్చేసరికి మనిషి గురించి ఆలోచించడం మొదలు పెడతారు. కుక్క గురించి ఇంత ఆలోచించిన మనం మనిషి గురించి ఆలోచిస్తున్నామా? నిజానికి సాటి మనిషికి చేయాల్సిన ఉపకారం చేస్తున్నామా? కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాన్ని మనం ప్రశ్నిస్తున్నామా? కట్టేసి కొడితే కుక్క కూడా తిరగబడుతుందని అంటారు. అయితే నిత్యం అవమానాలకు హింసకు గురవుతున్న మనిషి తిరగబడుతున్నాడా లేదా?

ఇక్కడ హింస ఒకరికే పరిమితం కాదు, కుక్కను కొట్టిన పోలీసు అధికారికే పరిమితం కాదు, ఆ పోలీస్ అధికారి చేతిలో రోజూ దెబ్బలు తింటున్న అతడి భార్య కే పరిమితం కాదు. ఇంటికి వీధికి సమాజానికే పరిమితం కాదు. మానవ ప్రవృత్తికి, సమాజంలోని అసమానతలకి, స్వేచ్ఛారాహిత్యానికి సంబంధించినది.ఇక్కడ హింస కనపడదు. హింస స్పష్టంగా ఉండదు.హింస చుట్టూ, హింస లోపల , హింసకు ముందు, హింస తర్వాత ఉన్న అనేక హింసల గురించి వ్యంగ్యంగా, సునిశితంగా చెప్పిన కథ ఇది.

మన చుట్టూ నిత్యం అనేక రకాల అనేక రూపాలలో జరుగుతున్న హింసలను మనం పట్టించుకుంటున్నామా. హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్తలకు లేదా సామాజిక కార్యకర్తలకు అందరూ ఆసరగా తుది వరకు నిలబడుతున్నారా? . జంతువుల రక్షణ కోసం, జంతువులను రక్షించడం కోసం పోరాడే మనుషులు, జంతు ప్రేమికులు ఉన్నారు. సంఘాలు ఉన్నాయి,చట్టాలు ఉన్నాయి. పత్రికలు ఉన్నాయి. మీడియా ఉంది. మానవులను హింస నుండి , అణచివేత నుండి దుర్మార్గం నుండి రక్షించడానికి సంఘాలు ఉన్నాయా ,పోరాటాలు జరుగుతున్నాయా? కుక్కను కొట్టిన వాడి గురించి కుక్కను హింసించిన వాడి గురించి కుక్కను గాయపరచిన వాడి గురించి ఆందోళన చెంది పోరాటం చేసే మనుషులకు పిల్లలు ఆసరాగా నిలబడతారు. ప్రేమించే గుణం పుష్కలంగా ఉన్న పిల్లలు గాయపడిన కుక్క గురించి బాధ పడతారు. వారికి కుక్కకు ఎలాంటి అనుబంధం లేదు. అయినా కుక్క గురించి వాళ్ళు ఆలోచిస్తారు, బాధపడతారు చేయాల్సిందంతా చేస్తారు. తుదివరకు కుక్క కోసం నిలబడతారు. మరి మనిషి కోసం మనిషి ఆలోచిస్తున్నాడా పోరాడుతున్నాడా? తుదివరకు నిలబడగలుగుతున్నాడా?

హింసకు కారణం ఏమిటి? కుక్కను కొట్టాలనే ఆలోచన అతడికి ఏ ఉద్రేకం నుంచి, ఏ పరాభవం నుంచి వచ్చింది, ఏ హింస నుండి వచ్చింది? అతను ఎక్కడ ఓడిపోయాడు? ఎక్కడ పరాభవించబడ్డాడు? ఎక్కడ అతడు అతను కాకుండా పోయాడు? ఆమె ఎందుకు మౌనంగా హింసను భరిస్తూ వస్తున్నది? ఆమెలో చైతన్యం ఎందుకు కలగలేదు? ఇప్పుడైనా ఆమెలో చైతన్యం వచ్చిందా? ఎందుకిలా జరుగుతోంది? ఈ అమానవీయతకు, అసమానతలకు, హింసకు కారణం ఏమిటి? మనిషిని మనిషిని కాకుండా చేస్తున్న అంశాలు ఏమిటి ?సమాజంలో ఏ పెట్టుబడిదారీ శక్తులు మనిషిని పరాయీకరణకు గురిచేస్తున్నాయి? మానవ సంబంధాల్లో ఈ సంఘర్షణలకు కారణం ఏమిటి? కథ చదివాక ఎన్నో ప్రశ్నలు పాఠకులకు ఎదురవుతాయి.

స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం వల్ల నిత్యం ఆమె మగవాడి దురాగతానికి ఎలా బలవుతున్నదో, స్త్రీ పురుషులకు సమాన హక్కులు లేకపోతే జీవితం సమాజం ఎంత దుర్మార్గంగా తయారవుతుందో ఈ కథలో పాఠకులు తెలుసుకుంటారు. పాఠకులలో ఆలోచనలు రేకెత్తించి, చాలా ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించమంటుంది కాబట్టే ఈ కథ మంచి కథ.!

No. of visitors : 354
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

కథల గూటి లోని ఒక మంచి కథ నల్లూరి రుక్మిణి గారి "ఎవరిది బాధ్యత"

పలమనేరు బాలాజీ | 02.12.2019 11:35:29pm

థను శ్రద్ధగా చదివే వాళ్ళకి మానవ మనస్తత్వం లోని వైరుధ్యాలను, సంఘర్షణలను రాజీతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంపద పట్ల.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •