యాభయ్యో ఆవిర్భావ దినం సందర్భంగా జూలై 4, 5 తేదీల్లో ఆన్ లైన్ సభను విజయవంతం చేయండి
ఈ జూలై 4 విరసం యాభయ్యో పుట్టిన రోజు. ఈ ఐదు వసంతాల చరిత్ర పోరాట ప్రజల మధ్య, జైలు గోడల మధ్య నిర్మాణమైంది. అనంతమైన భావజాల సంఘర్షణల మధ్య రూపొందింది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో మార్నిజం, లెనినిజం, మావోయిజాన్ని తాత్విక దృక్పథంగా ఆచరించే, అన్వయించే చరిత్రగా విస్తరిస్తోంది. వర్గపోరాటమనే పునాది మీద వ్యవస్థ మార్పు, ఈ యాభై వసంతాల చారిత్రక సందర్భాన్ని సృజనాత్మక ధిక్కారంగా జనవరిలో 27వ మహా సభలతో ప్రారంభించింది. సభలైపోయిన వారానికే విరసం కార్యదర్శి కా. కాశీంను తెలంగాణ ప్రభుత్వం ఆరెస్టు చేసింది. మే 20న బెయిలు మీద తను విడుదలయ్యారు. ఇప్పటికి 20 నెలలుగా వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు పూణా, ముంబై జెలు నిర్బంధంలో ఉన్నారు. మరో సీనియర్ సభ్యుడు జిఎన్ సాయిబాబా యావజ్జీవ ఖైదీగా నాగపూర్ జైల్లో ఉంటున్నారు. దేశమంతా సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుల వందలాది మంది ఉపాలాంటి అక్రమ కేసుల్లో జైళ్లలో ఉన్నారు.
ఈ వర్తమాన నిర్బంధ, సంక్షోభ కాలంలో, కరోనా విపత్తులో విరసం యాభయ్యో ఆవిర్భావ దినాన్ని ఆన్లైన్ లో నిర్వహించుకోవాల్సి వస్తోంది. ప్రతి సామాజిక కల్లోలమూ విరసం ప్రాపంచిక దృక్పథాన్ని పదును పెట్టింది. ప్రజా జీవితంలోంచి పెల్లుబుకుతున్న నిరసనలు, ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనా రీతులు విరసం తాత్విక చింతనను వర్గపోరాట భూమిక మీద తీర్చిదిద్దుతున్నాయి. అందువల్లనే సాహిత్య రంగంలోని అనేక తాత్విక రాజకీయ సంక్షోభాలకు విరసం తన విప్లవోద్యమ చైతన్యంతో పరిష్కారాలను అన్వేషించగలుగుతోంది.
ఈ నిరంతరాయ కృషి వల్లనే విరసమంటే మూడు తరాల నవ యవ్వనమని రుజువైంది. ఇది యాభయ్యేళ్ల సృజనాత్మక ధిక్కారం. నిరంతర సృజనాత్మక ప్రయోగం. అనేక కల్లోలాలను నుంచి, నిర్బంధపు రాపిడి నుంచి పదునెక్కిన సృజనాత్మకత విరసం సొంతం. పోరాట ప్రజల విముక్తి కాంక్ష నుంచి, గెలుపు ఓటములెన్ని ఎదురైనా వ్యవస్థతో రాజీపడని వర్గపోరాటం నుంచి రాటుదేలిన ధిక్కారం విరసం ప్రాణం. అందువల్లనే విరసం నిరంతర ప్రయోగశీలి. ఇదే దాని ప్రాసంగికతలోని బహిరాంతర రహస్యం.
సాహిత్యమంటే మానవ చైతన్యం, మానవ ఆచరణ. మానవుల సాంస్కృతిక వ్యక్తీకరణ. రాజకీయార్థిక వ్యవస్థల సంక్షోభానికీ, వాటిలోని వైరుధ్యాలను పరిష్కరించే వర్గపోరాటానికి కళాత్మక రూపం. దీనికి అట్టడుగు ప్రజల జీవితమే వనరు. ఆ ప్రజలు దారుణమైన దోపిడీకి గురవుతున్నారు. పితృస్వామ్య హింసను అనుభవిస్తున్నారు. కుల పీడనకు బలైపోతున్నారు. మైనారిటీ జాతులు, మతాలు, తెగలు మెజారిటీ ఆధిక్యానికి అణగారిపోతున్నారు. అనుమానితులవుతున్నారు. వీటికి వ్యతిరేకంగా తరతరాలుగా పోరాటాలు కూడా చేస్తున్నారు. ప్రత్యామ్నాయ భావజాల ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు.
దండకారణ్యంలో, దేశంలోని అనేక ప్రాంతాల్లో విప్లవోద్యమ నాయకత్వంలో పీడిత ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయార్థిక సాంస్కృతిక వ్యవస్థలను నిర్మించి నిర్వహిస్తున్నారు. ఫాసిజంగా మారిపోయిన బూర్జువా ప్రజాస్వామ్యానికి పోటీగా విప్లవ ప్రజాస్వామాన్ని, స్వావలంబనను, కింది నుంచి ప్రజాస్వామ్యాన్ని ఆచరిస్తున్నారు. లక్షలాది సైనిక బలగాలతో పోరాడుతూ విప్లవమే ప్రత్యామ్నాయమనే సందేహాన్ని ప్రపంచ కార్మికవర్గానికి అందిస్తున్నారు.
ఈ వేర్వేరు రూపాల్లోని ప్రజా ఆచరణకు విరసం సాహిత్య కళా వ్యక్తీకరణ వేదిక. అనేక జీవిత పార్శ్వాల, ధిక్కారాల, ఆత్మగౌరవ ఆకాంక్షల, భవిష్యదాశల సృజన కూడలి విరసం. ఈ పని యాభై ఏళ్లుగా సాగడానికి విరసం సృజనాత్మకత, విమర్శనాత్మకతే కారణం. దేన్నయినా విమర్శనాత్మకంగా చూడటమే మార్నిజంలోని శాస్త్రీయత. తనను తాను కూడా నిశితమైన స్వీయ విమర్శకు గురి చేసుకోగల సాహసం ఉన్నందు వల్లే విమర్శించవలసిన దేన్నయినా సునిశితంగా విశ్లేషించగలుగుతోంది. తనను, ఇతరులనూ ఆచరణ గీటురాయి మీదే అంచనా వేయగలుగుతోంది. యాభై ఏళ్ల ప్రయాణానికి ఇదే ఇరుసు.
ఈ ఆవిర్భావ దినం సందర్భంగా సమకాలీక సాహిత్య, సామాజిక విషయాల మీద రెండు రోజులు సభలు జరపాలని చాలా ముందే అనుకున్నాం. కానీ కరోనా కాలం దేన్నీ అనుమతించడం లేదు. కానీ ఈ కాలంలో పాలకవర్గం తన పనులన్నీ ఎప్పటికంటే మరింత చురుగ్గా చక్కబెట్టుకుంటోంది. కరోనాతో మరింత సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ కూరుకపోతున్న తరుణాన్ని వాడుకొని కార్పొరేట్లకు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు దోచి పెట్టింది. తరతరాల పోరాట ఫలితమైన కార్మిక చట్టాలను రద్దు చేసింది. ప్రజా మేధావులను, సీఏఏ వ్యతిరేక ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేసింది. లాక్ డౌన్ లో కూడా ఎన్ కౌంటర్ హత్యలకు పాల్పడుతోంది. హిందుత్వ ఫాసిస్టు విధానాలను యథేచ్ఛగా అమలు చేస్తోంది. కరోనా విపత్తు నుంచి ప్రజల మనసు మళ్లించడానికి చైనా వివాదాన్ని వాడుకుంటున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న విరసం ఆవిర్భావ సభకు హాజరు కావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
-విప్లవ రచయితల సంఘం
Type in English and Press Space to Convert in Telugu |
దండకారణ్యంలో... నక్సల్బరీ 50 వసంతాల వేడుకలునక్సల్బరీ వారసులైన దండకారణ్య మావోయిస్టు విప్లవ కారులు జనతన సర్కార్ నేపథ్యంలో తమకు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్రజలకూ, ప్రపంచ..... |
యాభై వసంతాల అజేయశక్తి నక్సల్బరీఏప్రిల్ 22న శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో విరసం బహిరంగసభ. కామ్రేడ్స్ వరవరరావు, పాణి, కాశీం వక్తలు. ... |
International Seminar on Nationality QuestionAIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky... |
విరసం సాహిత్య పాఠశాలరాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య... |
నోట్ల రద్దు ప్రగతి వ్యతిరేకమైనది : ప్రసాద్విరసం సాహిత్య పాఠశాల (11, 12 ఫిబ్రవరి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల రద్దుపై ఐఎఫ్టీయూ ప్రసాద్ ప్రసంగం... |
సాయిబాబా అనారోగ్యం - బెయిల్ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూకేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్ పిటీషన్ వేయడంలో చాల రిస్క్ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్గా, పొలిటికల... |
సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాంమానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్ విప్లవం. ఈ నవంబర్ 7 నుంచి రష్యన్ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ... |
ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండిఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ... |
Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 1When we look at the lives of these women martyrs many things strike us as extremely significant.The NDR in India is led by the Working class and peasantry..... |
నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమంనక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |