కార్మిక వర్గచైతన్యంతో కామ్రేడ్ గంటి ప్రసాదంగారిని స్మరించుకుందాం

| క‌ర‌ప‌త్రం

కార్మిక వర్గచైతన్యంతో కామ్రేడ్ గంటి ప్రసాదంగారిని స్మరించుకుందాం

- గంటి ప్ర‌సాదం స్మార‌క క‌మిటి | 01.07.2020 05:44:32pm

కామ్రేడ్ గంటి ప్రసాదం ఏడవ వర్ధంతి సభను విజయవంతం చేయండి!

కామ్రేడ్ గంటి ప్రసాదంగారి ఏడో వర్ధంతిని కార్మిక పోరాట చైతన్యంతో నిర్వహించుకుందాం. 2013 జూలై 4న నెల్లూరులో కిరాయి హంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. కత్తులతో నరికారు. ఆస్పత్రిలో చివరి క్షణాల్లో కూడా ఆయన... నన్ను చంపగలరు కానీ.. నా స్ఫూర్తిని చంపలేరని అన్నారు. ఈ ఆశావాదం, సాహసం, మృత్యువు పట్ల నిర్భీతి ఆయనకు మహత్తర శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం వల్ల వచ్చాయి. ఆయన బొబ్బిలి పట్టణంలో అనేక ప్రజా, కార్మికోద్యమాలు నిర్మించారు. ముఖ్యంగా కళాసీ కార్మిక సంఘాన్ని నిర్మించారు. ఆయన నేతృత్వంలో కార్మికులు దీర్ఘకాలంపాటు తమ సమస్యల పరిష్కారానికి పోరాడారు. ప్రసాదంగారు అజ్ఞాతంలో ఉన్న రోజుల్లో అరెస్టయినప్పుడుగాని, ఆ తర్వాత ఒకటికి రెండు సార్లు అరెస్టయినపుడుగాని బొబిలి కార్మికులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు.

తన సుదీర్ఘ విప్లవ జీవితంలో ఆయన అనేక రంగాల్లో పని చేశారు. వివిధ‌ రంగాల్లో పనిచేసే పోరాటకారులను, ప్రజాసంఘాల కార్యకర్తలను, రచయితలను, మేధావులను కలిపే కేంద్రంగా ఉండేవారు. శ్రీకాకుళ పోరాటం వెనుకడుగు వేశాక ఉత్తరాంధ్రలో తిరిగి ప్రజా ఉద్యమాల నిర్మాణంలో ఆయన పాత్ర విలువైనది. అందులో ఆయన నాయకుడు, కార్యకర్త, రాజకీయ సిద్ధాంతకర్త, తొలి రోజుల్లోనే ఒక బలమైన రాజకీయ పునాది నిర్మించుకొని దాని మీద తన జీవితాన్ని, విప్లవాచరణకు తీర్చిదిద్దుకున్నారు. అందుకే ఆయన జీవితకాలంలో ఉద్యమంలో, సమాజంలో ఎన్నో కల్లోలాలు, ఆటుపోట్లు ఎదురైనా దేనికీ ఆయన బెంబేలెత్తలేదు. విప్లవోద్యమ చైతన్యాన్ని కార్మిక వర్గానికి అందించడానికి నిరంతరం నిర్మాణాత్మక కృషి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను ముమ్మరం చేస్తున్న ఈ తరుణంలో ప్రసాదంగారి విప్లవ స్ఫూర్తిని మనం మరింతగా సొంతం చేసుకోవాలి, ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్రాహ్మణీయ ఫాసిస్టు శక్తిగా మారే క్రమంలో స్పష్టమైన దోపిడీ రాజకీయార్థిక విదానాలను బలోపేతం చేస్తోంది. కార్మికుల శ్రమ శక్తిని దోచుకోవడమే వీటి లక్ష్యం.

ప్రస్తుత కరోనా కాలాన్ని కూడా పాలక వర్గాలు దీనికి వాడుకుంటున్నాయి. లాక్డౌన్ వల్ల ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. కార్మికులు, పేదల జీవితాలు సంక్షోభం పడిపోయాయి. కోట్లాది మంది వలస కార్మికులు వేల కిలోమీటర్లు నడిచి తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు సడలించినా పేదల జీవితాలు కుదుటపడలేదు. ఈ విపత్తును నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం చర్యలు తీసుకోవడం లేదు. ప్రజలను ఆదుకోడానికి వైద్య‌ సదుపాయాలు కల్పించడం లేదు. ఈ సంక్షోబాన్ని కూడా తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. కొత్త కొత్త ప్రజా వ్యతిరేఖ‌ విధానాలు తీసుకొస్తున్నారు. లాక్డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందని, దాని ఆదుకోడానికని 20 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికి ఆత్మ నిర్బర్ భారత్ అనే పేరు పెట్టారు. ఈ లక్షల కోట్ల రూపాయలను చిన్న పరిశ్రమల దగ్గరి నుంచి కార్పొరేట్ సంస్థల దాకా ప్రభుత్వం పంచి పెడుతోంది. కానీ ఈ సంప‌ద‌ సృష్టి కర్తలైన కార్మికులకు, నిరు పేదలకు ఇందులో వాటా లేదు. వాళ్ల జీవన స్థిరత్వానికి కేటాయించలేదు. ఒక పక్క కరోనా వైరస్ విస్త‌రిస్తోంటే ఇంకో పక్క లాక్డౌన్ వల్ల జీవితం కుదేలై కార్మిక వర్గం తల్లడిల్లుతున్నది.

ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే సాకుతో 12 గంటల పని విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. చారిత్రాత్మక మే డే పోరాటం వల్ల ప్రపంచ కార్మికవరం 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నది. ఇప్పుడు తిరిగి అన్ని రకాల శ్రమల‌ కార్మికులు 10 గంటలు, 12 గంటలు పని చేస్తున్నారు. దీన్ని చట్టబద్ధం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇదొక్కటే కాదు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతక ముందు కంటే వేగంగా కార్మిక చట్టాలను సవరిస్తోంది. కొన్ని చట్టాలను రద్దు చేస్తోంది. నామ మాత్రంగా కాయితం మీద అయినా ఉన్న కార్మిక సంక్షేమ చట్టాలను ప్రభుత్వం సవరిస్తోంది. ప్రపంచ కార్మికులు, భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను, విజయాలను పాలకులు రద్దు చేస్తున్నారు.

ఈ సందర్బల్లో కార్మిక వర్గ పోరాటాలే ప్రపంచాన్ని మార్చుతాయనే సందేశాన్ని గంటి ప్రసాదంగారు ఇచ్చేవారు. పెట్టుబడికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బలమైన కార్మికవర్గ పోరాటాలు నిర్మించాలి అనేవారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రసాదంగారికి మనం ఇచ్చే నివాళి, ఈ జూలై 4న ఆయన ఏడో వర్ధంతి సందర్భంగా ఆ కామ్రేడ్ స్మరించుకుందాం. శ్రామికవర్గ ప్రాణత్యాగాల ఎర్రజెండాను ఎత్తిపడదాం. మన ప్రియతమ నేతకు జోహార్లు అర్పిద్దాం.

కార్యక్రమం: 4-7-2020, శనివారం ఉదయం 10 గంటలకు

స్థలం: గంటి ప్రసాదం స్మారక భవనం, అప్పయ్యపేటరోడ్, బొబిలి

సభాధ్యక్షులు: కా॥ తమటాల అప్పలనాయుడు, PKS బాద్యులు

వక్త‌లు : కా|| అన్నపూర్ణ, PKS రాష్ట్ర కమిటీ సభ్యులు

కా|| పి.రమణి, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు, కా॥ పి.కామేశ్వరరావు CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కా|| పి. శంకరరావు, CPM పట్టణ కార్యదర్శి, వేమిరెడ్డి లక్ష్మనాయుడు, రైతు సంక్షేమ సంఘ నాయకులు స్థానిక కార్మిక సంఘనాయకులు ప్రసంగింస్తారు. ప్రజాకళామండలి తూముల సింహాచలం బృందం విప్లవ గీతాలు ఉంటాయి.
- గంటి ప్ర‌సాదం స్మార‌క క‌మిటి.

No. of visitors : 204
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •