నడక నేర్పిన
ఆ మట్టి గోడలూ..
ఎత్తుకుని దించిన అలికిపూసిన ఆ మెట్లూ..
పరుగునేర్చే వయసొచ్చేదాక
మునికాళ్ళపై ఎగిరినా
ఎదహత్తుకోని
మసిబారిన ఆ దీపపు గూడూ..
ఇప్పుడెక్కడా...
నలిగి చిదిగిన
నడిబజారు విస్తరైన
ఈ బాల్యం చుట్టూ..
యెదలోతు
మొలసిన ముళ్ల
కంచె చెర దించినా..
మృతి లేని
నా స్మ్రుతి సందెట్లో తప్ప...!
కొమ్మ వాల్చి కొంగు పరిచి
కడుపు నింపిన మామహృదయపు
మా జామ చెట్టూ..
వరిదేలా వీధికంతా పరిమళాల శ్వాసనింపి
విరగకాసి వెలుగు పరిచి
సత్యసాయి టాకీసుదాకా
దండ సాగిన
మా మల్లె పాదూ..
కాంతి కళల సందడి
గలగలల ఆ ఇంట..
ప్రేమ చిహ్నపు
వొట్టి ప్రమిదను
వొదిలి పోయిన అమ్మ కోసం..
ఆ వెలుగు కోసం..
ఆ స్పర్శ కోసం..
ఎడారి ఎదురు చూపుల
అలసటెరుగని చెలిమలు..
నా ఊహల ఊటల్లో తప్ప...!!
ఎక్కడని వెతకను...?? !!
Type in English and Press Space to Convert in Telugu |
కార్పోరేట్ వ్యవసాయం - రైతుల ఆత్మహత్యలుఇక్బాల్ | 9, 10 జనవరి 2016 తేదీల్లో విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో ʹకార్పోరేట్ వ్యవసాయం - రైతుల ఆత్మహత్యలుʹ అంశంపై కామ్రేడ్ ఇక్బాల్ ఉపన్యాసం....... |
వొస్తాడు..అతనొస్తాడు..విశ్వమంతా అల్లుకుపోయిన
ప్రతిఘటనోద్యమాల వెల్లువై..
అతడొస్తాడు.. అతడొస్తాడు..... |
కన్ ఫామ్... !బుసకొట్టకుండానే
భుజంమీదచెయ్యేసి
పారాడే పాములు చేసే
నాలుకల రెపరెపల
పరిచర్యలూ
తట్టుకోలేకపోయిందీ మనస్సు..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |