సాహ‌సోపేత జీవితం

| సంభాషణ

సాహ‌సోపేత జీవితం

- పాణి | 08.07.2020 07:25:35pm

నరసన్న ఫోన్ చేసి నాలుగు రోజులు కూడా కాలేదు.

ఈలోగా మరణవార్త.

అమరుల బంధు మిత్రుల సంఘం సన్నాహక కాలంలో ఆయన పరిచయమయ్యాడు. అప్పటికి ఇంకా ఆ పేరు ఖరారు కాలేదు. ఎట్లా పని చేయాలో స్పష్టత లేదు. అంతక ముందటి ఎన్‌కౌంటర్ మృతదేహాల స్వాధీన కమిటీ అనుభవాలు మాత్రమే ఉన్నాయి. గద్దర్ మీద కాల్పులతో ఇక అది పని చేయలేని స్థితి ఏర్పడింది. కానీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విచ్చలవిడిగా ఎన్ కౌంటర్ హత్యలు. దారుణమైన నిర్బంధం. భయం రాజ్యమేలుతున్న రోజులు.

ప్రతి నిర్బంధ దశకూ దానిదైన ప్రత్యేకత ఉంటుంది. ఊపిరాడని కాలాన్ని తొలుచుకొని కొత్త వ్యక్తీకరణ పరిచయం అవుతుంది. కొత్త పొలికేక బైటికి వస్తుంది. అట్లా అమరుల బంధుమిత్రుల సంఘంలాంటి ఒక నిర్మాణానికి కాలం పురుటినొప్పులు పడుతోంది. తెల్లారి లేస్తే ఎన్ కౌంటర్ వార్తలు. అనాథ శవాలుగా విప్లవకారులు. నేలపై ఒరిగిపోతున్న వారి భౌతికకాయాన్ని అందుకొనే చేతులు కావాలి. ఆ హత్యాకాండను ప్రశ్నించే పిడికిళ్లు కావాలి. ఒక కొత్త గొంతు పలకాలి. దశాబ్దాలుగా లోలోపల సుడులు తిరుగుతున్న మూలుగు ఒక మహా నినాదమయ్యేందుకు వాహిక కావాలి.

అలాంటి రోజుల్లో జరిగిన ప్రయత్నాలవి. 2002 జులై 18న ఆ సన్నాహమంతా బిడ్డల యాది అనే ఒక సభ జరగడానికి కారణమైంది. అదొక గొప్ప మానవీయ వేదిక అయింది. అంత వరకు పౌర ప్రజాస్వామిక హక్కులు, సకల హక్కులకు వెన్నెముకలాంటి జీవించే హక్కు అనే ప్రాతిపదికల నుంచి మనం ఎన్ కౌంటర్ హత్యలను ప్రశ్నిస్తూ వచ్చాం. అదొక ఖండన, నిరసన, ప్రశ్న మాత్రమే కాదు. అన్నీ కలగలసిన విలువ. కానీ ఈ కొత్త సన్నాహం ఈ విలువకు కన్నీటిని చేర్చింది. దు:ఖమే ఒక నినాదంగా మార్చింది. కడుపుకోత వ్యక్తీకరణే పోరాటమయ్యేలా చేసింది. కొంగుతో కన్నీరు తుడుచుకుంటూ పిడికెలెత్తి నిలిచిన తల్లులు అవధులు లేని విప్లవోత్తేజాన్ని అందించారు. అలాంటి ఒక చిన్న సమావేశం అమరుల బంధుమిత్రుల సంఘం ఆవిర్భావ సభ అయింది. అక్కడ నర్సన్నను తొలిసారి చూశాను. ఉప్పు క్రిష్ణ కన్వీనర్, కొడకంచి నర్సన్న కో కన్వీనర్.

దానికి అప్పటికి నిర్మాణం లేదు. ప్రణాళిక లేదు. ఏం చేయాలో లక్ష్య ప్రకటన కూడా స్పష్టంగా లేదు. కాలిన పేగు వాసనతో తిరుగాడుతున్న తల్లులు, తండ్రులు, కుటుంబసభ్యులు, వారి మిత్రులు కలవాలి. అంతే. ఆ తర్వాత ఇంకేమైనా చేయాలి. నర్సన్న కొడుకు రావణ బహుశా ఏడాదిన్నర కింద అమరుడయ్యాడు. రావణ అనే పేరే ఎవరినైనా ఆకర్షిస్తుంది. మను ధర్మాన్ని కాపాడిన రాముడి పేరు కాదని, ద్రవిడ సాంస్కృతిక ప్రతీక అయిన రావణుడి పేరు కొడుక్కు పెట్టుకున్నాడు నర్సన్న. రావణ సిటీ ఉద్యమంలో పని చేస్తూ అమరుడయ్యాడు.

నర్సన్న అమరుల బంధుమిత్రుల సంఘంలోకి ఏ నేపథ్యంలో వచ్చాడో తెలిస్తే ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకోవడం తేలిక. ఒక సంక్షోభ కాలంలో, ఎక్కడ నిలబడ్డా పాదాల కింద నెత్తురు పారుతున్నదేమో అనే భయానుభవం కలుగుతున్న రోజుల్లో, కొడుకు చితి మండిన నేల వేడి చల్లారక ముందే నర్సన్న ఒక మహత్తర బాధ్యతల్లోకి వచ్చాడు. అది అత్యంత దుఃఖకరమైన పని. శవాలను మోసే పని. మనిషి ఎన్ని అద్భుతమైన ఆలోచనలు చేసినా, ఎంత మానవీయమైన ఆచరణ కొనసాగించినా, నెత్తురు మండించే సాహసాలను కొనసాగించినా మరణం తర్వాత మృతదేహమే. ఆ మనిషి చుట్టూ మన జ్ఞాపకాల విద్యుత్ ప్రవాహం సాగుతున్నా, కళ్లెదుట ఉండేది మాత్రం మంచు గడ్డ లాంటి నిశ్చల భౌతిక కాయమే. అదీ దారుణ హింసల్లో ఛిద్రమైపోయిన, పురుగులు పట్టి సగం మిగిలిన దేహం. అలాంటి మృతదేహం ఎక్కడ ఉంటే అక్కడికి పరుగులు తీయడం, ఆ శవాలను అపురూపంగా చేతుల్లోకి తీసుకోవలసి రావడం దుర్బరం.

నర్సన్న అంత ముందు విప్లవ, ప్రజా ఉద్యమాల్లో ఏ ఏ పనులు చేశాడో గాని, అక్కడ సంతరించుకున్న విలువలన్నీ ఇదిగో ఈ శవాల చుట్టూ తిరిగే పనిలోకి ఆయన్ను తీసుకొచ్చాయి. ఇక సుమారు ఒకటిన్నర దశాబ్దం పాటు ఈ రంగంలో అలసట లేకుండా పని చేశాడు. అమరుల బంధు మిత్రుల సంఘం ఒక ప్రణాళిక, నిర్మాణ రూపం సంతరించుకోడానికి ముందు నుంచే శవ స్వాధీనం, అమరులకు గౌరవ ప్రదమైన అంత్యక్రియలు, సంస్మరణ సభలు జరపడం ఒక పోరాట రూపమయ్యాయి. వీటన్నిటిలో నర్సన్న ఉన్నాడు. తానే ముందుండి అన్ని నడిపి ఉండకపోవచ్చు. చాలా మందికి ముందు ముందు నిలిచాడు. ఒక్కడే ఎక్కడికైనా అలా వెళ్లిపోయేవాడు. అట్లాంటప్పుడు తన వెనుక, వెంట ఎవరైనా ఉన్నారా? లేదా అని తిరిగి చూసుకోనవసరం లేని వ్యక్తిత్వం ఆయనది. ఆ పని అవసరమైతే, అది ఎలాంటి ప్రమాదకరమైన పని అయినా సరే, తాను చేయగలిగింది అయితే అలా వెళ్లడం నర్సన్న నైజం. ఈ స్వభావం ఆయన చైతన్యవంతంగా ఎంచుకున్న అమరుల బంధు మిత్రుల సంఘానికి ఎంతగానో కలసి వచ్చింది.

మరణమే ఒక పెద్ద విపత్తు, పెను విషాదం. ఇక వెనకడుగు ఎందుకు వేయాలి? అంతగా ఆయన విప్లవకారుల అమరత్వంతో మమేకమయ్యాడు. మనుషులే నేరాలిపోయాక ఇక ముందు వెనుకల ఎందుకు చూసుకోవాలి? ఇది నర్సన్న మనస్తత్వంలోని తర్కం. ఇదే ఆయన తెగింపుకు కూడా కారణం.

అది తన కొడుకు వంటి అనేక మంది విప్లవకారులను సొంతం చేసుకోవడం వల్లనే సాధ్యమైంది. అంతక ముందు వాళ్లెవరూ తనకు తెలిసి ఉండకపోవచ్చు. మరణంతోనే ఒక అనుబంధం మొదలవుతుంది. అమరుడైన విప్లవకారుల్లో తన బిడ్డను చూసుకోగల దృష్టి లేకుంటే ఈ తెగువ సాధ్యమేనా? ఈ మరణానంతర సంబంధంలో విప్లవం అందించిన జీవన విలువ లేకుంటే పదిహేనేళ్లకు పైగా నర్సన్న ఇన్ని శవాల కోసం అడవుల్లోకి, ఆస్పత్రుల మార్చురీల్లోకీ తిరిగి ఉండేవాడా? ఆ విలులే ఆయన నిబద్ధతకు, సంసిద్ధతకు గీటురాయి.

విప్లవంలో భాగంగా ఆయన సాహసోపేతమైన రంగాన్ని ఎన్నుకున్నాడు. విషాదకరమైన బాధ్యతలు నెత్తిన ఎత్తుకున్నాడు. ఇలాంటి పని అని తెలిసీ దాన్ని నిర్వహించేందుకు ఆరోజు ముందుకు వచ్చాడు. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఈ పని చేసే క్రమంలో తనకు ఏమవుతుందనే సందేహానికి గురికాలేదు. సాహసం, దీక్ష అత్యవసరమైన ఈ సంక్షోభకాలంలో దృఢంగా నిలబడ్డాడు. పెద్దగా మాట్లాడే అలవాటు లేని మనిషి. అలాంటి వాళ్లకు ఆచరణే అతి గొప్ప వ్యక్తీకరణ. అన్ని సమయ సందర్భాల్లో అది నిలువెత్తుగా ఉంటుంది. ఇలా అర్థాంతరంగా వెళ్లిపోయాక తిరిగి చూసుకుంటే.. అక్కడ తలవంచని సాహసం కనిపిస్తుంది. పట్టు సడలని విప్లవ నిబద్ధత కనిపిస్తుంది. తడబాటు లేని పాదముద్రలు కనిపిస్తాయి.

నర్సన్న అవి మిగిల్చుకొని వెళ్లిపోయాడు.

వందలాది విప్లవకారుల మృతదేహాలను మోసిన ఆ చేతులు నిశ్చలనమైపోయాయి. చలనశీలమైన చరిత్ర కదలికల్లో ఆయన స్ఫూర్తి రవరవలాడుతూ ఉంటుంది. అచ్చమైన మట్టి మనిషి నర్సన్నకు లాల్ సలాం.

No. of visitors : 372
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ కు నివాళి
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •