ఈ వేళల్లో..

| సాహిత్యం | క‌విత్వం

ఈ వేళల్లో..

- మహమూద్ | 16.07.2020 09:14:46pm

1.
ఇపుడు
నువ్వూ
రేపు
నేనూ

2
సున్నితమైన భావాలను మోసే
పదాలను కవిత్వంగా అల్లుకోవడం తప్ప
వేరే వ్యాపకం ఏముంది? నీకైనా నాకైనా??

3
బైరాగీల్లాగా ఎక్కడ పడితే అక్కడ, మనుషులు మనుషులౌతున్న సమూహాల మధ్య, పని జాతీయం గాబడుతున్న కార్ఖానాల మధ్య , ఉత్పత్తి శక్తులని అభివృధ్ధి పరిచే శ్రమచెట్ల నీడల మధ్య, మొలకల్లాంటో లాంటి భావనలనో, రుతుపవనంలాంటి పాటనో, మార్పుకు చెందిన మాటనో, గుండెని హృదయం చేసే పనినో, హృదయాన్ని నదిచేసి ఇంకొన్ని మదుల నదులతో సంయోగించో, కొంత సంభ్రమమో, ఇంకొంత దుఃఖమో, కొన్ని గాయాలో, ఇంకొంత చికిత్సో, మౌనాన్ని బద్దలు కొట్టే శబ్దాలనో, శబ్దానికి భావం నేర్పే ప్రయోగాలనో, మనుజుల లోపల రసాయనిక చర్యలకు బదులు ఉద్వేగ చర్యలకు ఉద్దీపనను కలిగించో, సంభాషణల బదిలీకి ప్రాణమిచ్చో, భాషకు పడ్డ బేడీలను తొలిగించి స్వేఛ్ఛ తొడిగే కార్యాలనో, కొన్ని నవ్వులూ ఆపై నవ్వులను తూచే కన్నీళ్ళు రాల్చుకునో, కన్నీళ్ళను మోసే నిట్టూర్పులను ఒదులుకొనో, అన్నింటికి మించి బతుకుని ధిక్కార పతాకం చేసి చౌరస్తాలలో నిలబెట్టో, జనంలో మనంలా కలిసిపోయో, వెలివేతల పై ప్రశ్నలు సంధించో, అసమానతపై ఆగ్రహం ప్రకటించో, ఆత్మన్యూనతను ఆత్మవిశ్వాసంగా పరిణమించడానికి తిన్న ఆటుపోట్లని సమీక్షించుకునో, మానవ మనుగడకు అడ్డుగా నిలబెట్టబడుతున్న గోడలను రిక్తహస్తాలతో కూలగొడుతూనో, కూలగొట్టడానికి అవసరమైన పనిముట్లని సమకూర్చుకుంటూనో నిన్ను నీలోంచి నాలోకి, నన్ను నాలోంచి నీలోకి ప్రవహించుకుంటూ, ఇంకొన్ని ప్రవాహాలని మనలోకి ఆహ్వానిస్తూ, ప్రవహించడాన్ని జీవితం చేసుకున్నాం కదా ఒక చోట కుదురుగా నిలబడం కదా, కదలడమే కర్తవ్యంగా పెట్టుకున్నాం కదా బండలలోంచి సైతం స్పందనా జలాన్ని పిండూకుంటున్నాం కదా

4.
అక్షరం,పాట,కవిత్వం, అచరణ, సమస్త సృజనలని సానబెడుతూ నేర్చుకునే నెత్తుటికళని అవపోసన పడుతూన్న వేళలలా, కాలపు గమనంలో చలనంగా సమస్త చపల చిత్తాలనీ వొదిలేసి వేళల్లో, వాడు వేలాడదిస్తున్న ఉరికొయ్యలని నిరసిస్తూ, వాటిని వేలాడుతున్న కంఠాల నొప్పులను అమరగానంగా ఆలాపిస్తున్న వేళల్లో

5.
నడక నడత వాడి పాలిట విస్ఫోటక పదార్థాలైతే
వాడ్ని నగ్నంగా నిలబెట్టే సాధనాలైతే
ఆ నేరం మనది కాదు

వాడు చూపులో ప్రాపంచిక దృక్ఫధాన్ని నింపుకున్న ప్రతి మనిషిని
నేరస్తుడిగానే చూస్తాడు

కదలిక సృష్టించే ప్రతి కావ్యాన్ని ఆయుధమనే అంటాడు
వాడి కుట్రలను నిలదీసే ప్రతి పనిని
దేశద్రోహమనే అంటాడు..

నిజానికి వాడే ప్రజా ద్రోహి

నేరమూ పంజరమూ వాడివే
అక్షరాలు మాత్రం మనివి
జనానికి మనమూ మనకూ జనమూ
ఒకరికొకరం అనే భావంలోంచి పుట్టిన ప్రతి పనినివాడు రాజ్యకుట్ర అనే అంటాడు

ఏంచేస్తాం సామాన్యులం కదా
మనకు రాజ్యం పై కుట్రలు చేయడం మాత్రమే తెలుసు..
ఇంకేమీ తెలియని వాళ్ళం..

కామ్రేడ్ క్రాంతికి.

No. of visitors : 97
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తలపుల తోవలోకి స్వాగతం

మహమూద్ | 03.01.2017 12:14:11am

ఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన. ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితం...
...ఇంకా చదవండి

అలుగు నేత్రం

మహమూద్ | 03.07.2016 01:40:43am

ఒకరి కన్నుల తడి ఇంకొకరి కన్ను మోస్తున్న ఈ దివ్య సందర్భం కంటున్న కల ఒకటి కావడం ఎంత కాకతాళీయం...
...ఇంకా చదవండి

డ్రాక్యులా నీడ

మహమూద్ | 20.10.2016 02:01:40am

దశాబ్దాల దాహపు రెక్కలు విచ్చుకొని ఎడారి దేహం ఒయాసిస్సుల తడి కోసం వెదుకులాడుతుంది ఇసుక పరదాల మధ్య స్వప్న కళేబరాల విస్ఫోటన ఉక్కపోతలో జీవితం ఉడికిపోతుంది...
...ఇంకా చదవండి

వారిద్దరూ

మహమూద్ | 01.06.2016 11:40:00am

కాలాన్ని మండించాలి లేదా మనమే మంటలమవ్వాలి...
...ఇంకా చదవండి

సజీవ జ్ఞాపకమై…

మహమూద్ | 17.04.2017 11:25:45am

వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన గాలి...
...ఇంకా చదవండి

డెన్ ఆఫ్ లైఫ్

మహమూద్ | 15.10.2019 05:58:03pm

వాళ్ళ పాటల్నీ మాటల్నీ నృత్యాల్నీ అడవినీ అడవి జీవితాన్నీ ప్రేమించడం నేర్చుకోవాలి కార్చిచ్చులకు ఆజ్యం పోస్తున్న రాజ్యాన్నీ రాజ శాసనాల్ని అదే కార్చిచ్చులకు కాన...
...ఇంకా చదవండి

చూపులు

మహమూద్ | 20.01.2018 01:04:56am

ఒక సామూహికత ఎర్రజెండాల ఎగరేసుకొని ఒకవిప్లవాన్ని నా చూపు కలగా ధరించింది ...
...ఇంకా చదవండి

పరిమళభరిత తావుల్లోంచి

మహమూద్ | 01.05.2020 02:17:11am

నీకోసం నేను ఎదురుచూసేది ఓ కొత్త యుధ్ధ వ్యూహం కోసమే కాదు కొత్త జ్ఞానం పొందడం కోసమే కాదు సహచరీ! నీ నవీన జీవన ఆవిష్కరణల్లో నన్ను నేను భాగం చేసుకుందామని....
...ఇంకా చదవండి

ఇంతెహా ఇంతెజార్ కీ..

మహమూద్ | 02.12.2019 11:30:43pm

నింగి మీద పొడిచిన ఆ నెలవంక వంపులో ఏదో వెలుతురు కబురు అతడు పంపాడేమో లేకుంటే ఎందుకలా వెన్నెల ఆమె కప్పుకున్న చాదర్లా ఆమె పలికే దువాలా ఇలపై వర్షిస్తుంది...
...ఇంకా చదవండి

బందిష్

మహమూద్ | 16.08.2019 08:51:51pm

ప్రతిఘటన ఊపిరిగా నిలబడిన కాశ్మీరంలో నిషేదాజ్ఞల మధ్యే నినాదాలు పదునెక్కుతాయి మంచుకోనల్లోంచి లావాలు పెల్లుబుకుతాయి ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ కు నివాళి
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •