మహాశ్వేతాదేవి ఓ విలక్షణమైన రచయిత్రి.ఆమె బెంగాలిలో నవలలు కథానికలే కాదు వ్యాసాలు కూడా రచించారు.ఇంగ్లీష్ లోను వ్యాసాలు రాసారు.అంతేగాదు ఆమె ఆదివాసీల కోసం ఒక గ్రామీణ పత్రిక కూడా నడిపారు.అందులో దళితులు ఆదివాసీలు తమ తమ జీవితాల గురించి చెప్పే విషయాలను ఎటువoటి ఎడిటింగ్ లేకుండా అచ్చు వేసేవారు.
ఆమె రాసిన నవలలు ʹఎవరిదీ అడవిʹ,ʹరాకాశి కోరʹ,ʹబాషయిటుడుʹ,ʹఝాన్సీ లక్ష్మి బాయిʹ,ʹఒక తల్లిʹ...వంటివి సుప్రసిద్ధ నవలలే.కాని ఆమె రాసిన అన్ని నవలలకు ఒక తల్లి నవలకి ఒక మౌలిక భేదo కనబడుతున్నది.తక్కిన నవలల్లో పీడకులు,పీడితుల మద్యన జరిగిన ఘర్షణను చిత్రీకరిస్తే ʹఒక తల్లిʹ నవలలో మాత్రం,కొడుకును పోగొట్టుకున్న ఓ కన్న తల్లి మానసిక సంఘర్షణను గొప్పగా ఎత్తి పడుతుంది.
ఈ నవలను గోవింద్ నిహలాని గారు ʹహజార్ చౌరాసియా మాʹగా హిందీ లో సినిమా గా తీసాడు.అది సినిమా పరంగా సరిగ్గా ఆడక పోయినా నవలగా మాత్రం సాహితి ప్రపంచంలో స్థిర స్థాయిగా ఉండిపోయింది.దీన్ని నాటకంగా కూడా వేసారు.
ఈ నవల కథా కాలం అంతా ఒక రోజు.అది జనవరి 17.అది వ్రతి పుట్టినరోజు కూడ.చిన్న కొడుకు వ్రతి పురిటి నాటి జ్ఞ్హాపకలతో ప్రారంభమై ఆ కొడుకు దుర్మరణానికి కారణాలు వెతుకుంటూ, తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చి,ఇంట్లో జోరుగా పార్టీ జరుగుతున్న సమయం లో అపెండిసైటిస్ పగిలి ప్రాణాలు విడుస్తుంది.
ఇంతకు ఎవరీ తల్లి..ఆమె సుజాత.సుసంపన్న కుటుంబానికి చెందిన మనిషి.బ్యాంకు లో ఉద్యోగం చేస్తుంటది.ఆమెకు నలుగురు పిల్లలున్నా చిన్న వాడైన వ్రతి అంటేనే ప్రాణం.వ్రతికి కూడ తల్లి అంటే ప్రాణం.తన మనసును తల్లితోనే విప్పుకోగలడు.వాడు 10వ క్లాసు లో ʹనీకు అత్యంత ప్రీతి గూర్చే వస్తువుʹగురించి వ్యాసం రాయమంటే ʹమా అమ్మʹ అని రాసాడు.
మెల్ల మెల్లగా 20 ఏళ్ళు వచ్చే నాటికి వ్రతిలో ఎదో మార్పును కనిపెట్టసాగింది. ʹఎదో అర్ధం కాకుండా పోతున్నడనిపించేది..పరాయివాడు అయిపోతున్నాడని, దూరమైపోతున్నాడని తోచే సరికి దుఃఖం తన్నుకోచ్చేదిʹ
కాలేజీ పూర్తయ్యాక అమెరికా పంపించాలనుకున్నారు.కాని వాడు ఇంకెక్కడికో పోతున్నాడు.కొత్త కొత్త స్నేహాలు…ఇంటి పట్టున ఉండడంలేదు.
తల్లి గుర్తుపట్టలేనంతగా కొడుకు మారిపోతున్నడoటే,ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ వాడికి అందరితోను సంబధాలు విచ్చిన్నమైపోతున్నయంటే,దీని ఫలితoగా ఎదో పెనుముప్పు రాబోతున్నదని ఆ తల్లి ఊహించలేకపోయింది.
చివరకు 20వ ఏట అతిదారుణంగా చంపబడ్డాడు.ఆ చావును కప్పిపుచ్చడానికి ఆ కుటుంబం చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు.వ్రతి శవాన్ని కూడ చూడాలని ఒక్క సుజాతకి తప్ప మరెవరికి అనిపించక పోవడం ఒక షాక్..వార్తను పేపర్ లో రాకుండా మాత్రం జాగ్రతపడ్డారు..ఆ భద్రజీవులు.
ఇక ఆ రోజు నుంచే సుజాత చైతన్యంలో ఒక్కొక్కరుగా తమ కుటుంబ సభ్యులు దూరం కాసాగారు.తాను ఆ కుటుంబంలో ఒక యంత్రం లాగ బతికిందే తప్ప తన ధ్యాసంత తన కొడుకు వ్రతి జ్ఞాపకాలతోనే.
వ్రతి చనిపోయి జనవరి17 నాటికి ఏడాది కావొచ్చింది.ఆ రోజు అతని పుట్టిన రోజు,చనిపోయిన రోజు కూడ.కాని వ్రతి జ్ఞాపకాలను సమూలంగా తూడ్చిపెట్టేయాలనుకున్న ఆ కుటుంబం అదే రోజు చిన్న కుమార్తె తులి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తారు.
కొడుకును గురించిన అన్వేషణలో సుజాత అతని మిత్రులు నివసించే పేటకు బయలుదేరుతుంది.అక్కడ అతని మిత్రుడు ʹసమూʹ తల్లిని కలుస్తుంది.వాళ్ళది చాల నిరుపేద కుటుంబం. సమూ ను అక్కడి మూకలు పోలీసులు పోట్టనబెట్టుకున్నాక మిగిలిన ఇద్దరు ఆడపిల్లలు అనేక సంఘర్షణలతో నానా అవస్థలు పడుతుoటారు.తన తమ్ముడిని చంపిన వారు తమ కళ్ళముందే తిరగడం తమని వెక్కిరించడం వాళ్ళకి జీర్ణం కాలేదు.
సమూ తల్లి ద్వార వ్రతిని గురించి చాల విషయాలు తెలుసుకుంది.అతడు హక్కుల కోసం పోరాడే దళం లో చేరాడని,అతను అందుకోసమే పేటకు వెళ్తూ ఉండేవాడని తెలుసుకొని ఆశ్చర్యపోయింది.విచిత్రం ఏమంటే అంత పెద్ద మేడలో వ్రతికి దొరకని ఆనందం, సంతృప్తి ఆ చిన్ని గుడిసేలో దొరికింది.అక్కడే చిరిగిన చాప మీద కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు.వ్రతి అక్కడుంటే ఎంత హాయిగానో నవ్వేవాడట.ʹఎంత అందమైన నవ్వు.ఎంత తీయని నవ్వు.బంగారం కాంతులు వేదజల్లుతున్నట్టే ఉండేదమ్మʹ అనేది సమూ తల్లి.
అతనికి లాల్టు,విజిత్,పార్థ,సమూ లాంటి స్నేహితులుండేవారు. వాళ్ళంతా ఏకమై ఆ పేటలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూసేవారు.ఎవరు నోరేత్తినా,అల్లరి చేసినా ఊరుకునేవారు కాదు.
ఉద్యమమే అతని ప్రపంచం అయిపోయింది.ఒక్కసారి ఉద్యమంలోకి ప్రవేశించాక అతనిలో ఊహించని మార్పు కనబడసాగింది.ʹఆ మార్పు గూడ,ఏవో పుస్తకాలు చదివితే,నినాదాలు వింటే వచ్చింది కాదు. దీనులు, దరిద్రులు, దురదృష్టవంతులు అయినవాళ్ళ హృదయాలలో రేగే అగ్ని జ్వాలల చూసి అదంతా రక్త మాoసాలలో ఇంకడం తో వచ్చిందది.ʹ
చిన్నప్పుడు ప్రతిదానికి విపరీతంగా భయపడిపోయేవాడు వ్రతి.ʹరాత్రి వేళ శవ యాత్రికులను చూసి భయపడేవాడు.పగటి పూట వీధి భాగవతులు బందిపోటు దొంగల వేషాలు వేసుకొని వచ్చి ఇంటి ముందు తమాషాగా అల్లరి చేస్తే బెదిరి పోయేవాడు.అలా ఉండి ఉండి ఒక రోజున అన్ని భయాలకు అతీతుడయ్యాడు.ʹఅంటుంది రచయిత్రి.
వ్రతి పేటవాసులతో కలిసి పనిచేసాడని అతనికి జీవితము, ఆనందమూ అక్కడే అని తెలిసాక ఉన్నత కుటుంబికురాలైన సుజాతకి అట్టడుగు వర్గాలతో అనుబంధం ఏర్పడింది.
శవ దహనాల రోజున,అక్కడ చేరి ఏడుస్తున్న వాళ్ళకి తనకి ఒకానొక అనుబంధం ఉందన్న సంగతి ఆనాడు తన మృత్యువుతో వ్రతి రుజువు చేసాడు.మౌన దుఃఖం లో సుజాతని ఒంటరిగా విడిచిపెట్టకుండా మరికొందరు ఆత్మీయుల్ని ఆమె కోసం విడిచి వెళ్ళాడు.
వ్రతి పెళ్లాడదలచుకున్న అమ్మాయి ʹనందినిʹని కలుస్తుంది సుజాత.ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం తర్వాత వ్రతి దారుణ హత్యకు గురయ్యాడని తెలుసుకుంటుంది.వ్రతి తన కుటుంబం గురించి నందిని తో అన్ని విషయాలు చెప్పేవాడని,అతనికి తల్లి అంటే వీపరితమైన ప్రేమ అని,అదే తల్లిని కుటుంబం అంతా మానసిక క్షోభకి గురి చేసేవారని.అందుకే వ్రతి తన కుటుంబంలో ఇముడ లేకపోయేవాడని చెప్పుకొస్తుంది.
సుజాత నందిని నుండి సెలవు తీసుకోని బయలుదేరుతుంది.ʹఇక ముందు సుజాతకి లోకం అంతా మారిపోతుంది,ఆ రోజు వ్రతి నీలి రంగు షర్టు వేసుకొని బయటికేందుకు వెళ్ళాడో,వెయ్యిన్నొక్క నెంబర్ ఎందుకైపోయాడో ఆ వివరాలు ఆరోజు తిరిగి ముక్క ముక్క సమాచారం సేకరించుకుంది.ఇక బతికినంత కాలo ఆ ముక్కలన్నిoటిని పోగు చేసి కలబోసుకొని అసలు కథంత తెలుసుకోవడానికి జీవితమంతా గడుపోచ్చు.ʹఅంటుంది రచయిత్రి.
మెల్ల మెల్ల గా కలకత్తా అన్ని మరిచిపోయి ఏమి జరగనట్టే నటించేస్తుంది.ఇప్పుడు ʹకలకత్తా నిమ్మలంగ ఉంది.మునుపటి లాగ నల్ల వ్యానులు హెల్మెట్లు పెట్టుకున్న పోలీసులు ట్రక్కులు,పరుగులు తుపాకులు ఎత్తి పట్టే సిపాయిలు యువకుల ఆర్తనాదాలు వినబడవు.వ్యాన్ చక్రాలకు గొలుసులతో కట్టి,సగం చచ్చిన మానవ దేహాలను నేలపై ఈడ్చుకుంటూ పోయే ద్రుశ్యాలుoడవ్.రోడ్ల పై రక్తపు కొల్లులు కనపడవు.తల్లుల దీన శోకాలుండవు.గోడలపై రాతలు కూడా మాసిపోయాయి.ʹ నందిని అసహించుకున్నది,సుజాత ఆశ్చర్యపడ్డది ఈ స్తితినే.
అన్యాయాల మీద గగ్గోలు పెట్టె కవులు మేధావులు ఈ విషయంలో మాత్రం జాగ్రతపడ్డారు.
అనేక జ్ఞాపకాలు మోసుకుంటూ సుజాత ఇంటికొస్తుంది.ఆ రోజు తులి ఎంగేజ్మెంట్ దినం.ఇల్లంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంటది.ఆ రోజు వ్రతి పుట్టిన రోజు,మరణించిన రోజు అన్నది అందరు హాయిగామర్చిపోయారు.
ఫంక్షన్ కి వొచ్చిన ఉన్నత కుటుంబాల వాళ్ళు తమ తమ కుక్కల గురించి,స్వామీజీల గురించి చర్చించుకుంటారు.పనిలో పనిగా వ్రతి అనే వాడు పక్క దారి పట్టిన యువకుడని,ఇట్లాంటి యువకులని అంతం చేసాకనే కలకత్తా ప్రశాంతంగా ఉందని కితాబులిస్తారు.
అర్ధనగ్న శరీరాలతో,బీరు సీసాలతో,కుళ్ళు జోకులతో వాళ్ళంతా నడుస్తున్న శవాల్లాగా కనిపిస్తారు సుజాతకి.ʹఅనేకుల కష్టాలను తమ లాభంగా మార్చుకొని రాజ భోగాలు సమకూర్చే సమాజాన్ని రూపుమాపాలనుకున్నారు వ్రతి వాళ్ళు.ʹఅంటుంది రచయిత్రి. క్రమంగా కడుపు నొప్పి ఎక్కువవుతుంది.అంతా మబ్బులు కమ్మినట్టవుతుంది.
ఇంతలో ఎవరో స్పెషల్ గెస్ట్ వచ్చాడని అతడిని రిసీవ్ చేసుకోవడానికి కిందకి పరిగేడతారు ఆమె బిడ్డరిద్దరూ.రోడ్డు మీద గేటు కు ఎదురుగ్గా నల్లని పోలీసు వ్యాను ఉంటుంది.దాని ఇంజను కూడ ఆపలేదు.దానిలో ఉన్న అధికారి సరోజ్ పాల్ ఎవరో కాదు...వ్రతిని పొట్టన పెట్టుకున్న నరహంతకుడు.ఒక్క వ్రతినే కాదు ఆనాడు కలకత్తాలో అనేక మంది యువకులను పోట్టనపెట్టుకోవడానికి కారణం ఇతడే.
వ్రతిని చంపిన మనిషిని వ్రతి ఇంటికే విశిష్ట అతిధిగా ఆహ్వానించడం పతనానికి పరాకాష్ట.
ఆమెకంతా అసహ్యంగా ఉంటుoది.ఎదురుగ్గా మనుషులు శవాలుగా కుళ్ళి గబ్బుకంపు కొడుతున్నారు.ʹవీళ్ళు ఈ బోగాలు అనుభవించడానికేనా వ్రతి చచ్చిపోయింది?ʹతీవ్ర ఆవేదనలో అపెండిసైటిస్ పగిలి ʹవ్రతీʹ అంటూ కుప్పగూలుతుంది సుజాత.ʹఅది దీర్ఘ ఆర్తనాదం..సుజాత గుండెల్ని చిల్చుకువచ్చిన ఆర్తనాదం.కలకత్తాలో వీధి,వీధినా ఇంటింటా హృదయాలలో ప్రతిధ్వనించిన ఆర్తనాదం.అది గాలిలో కలిసి రాజ్యమంతటా వ్యాపిస్తుంది.ఆ ఆర్తనాదంలో నెత్తురు,వాసన,ప్రశ్న,నిష్టురం.ʹఅంటూ గొప్పగా ముగిస్తుంది రచయిత్రి.
• ఇక్కడ రచయిత్రి శైలిని గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. ఆమెకు విషయం మీద శైలి మీద పట్టుఉండడం తో ఎక్కడా బిగి సడలకుండా చివరికంటా కథను ఉత్కంఠతో నడిపిస్తారు.అతి పెద్ద విషయాన్నీ ఒక్క వాక్యంలో తేల్చేస్తారు.అప్పటి నిర్బందకాండ ను గురించి చెబుతూ,ʹమార్చురికి వ్యానులు వస్తున్నాయి,పోతున్నాయి.మార్గ్ లో శవాలని పడేస్తున్నాయి.ఆ రోజుల్లో వ్యానులు రాత్రిపగలు అదే పనిగా తిరిగాయిʹఅంటుంది.సున్నితమైన వ్రతిని ఎంత చిత్రహింసలు పెట్టారో చెప్పడానికి,ʹవేళ్ళతో నిమరాలంటే ఒక్క అంగుళమైన చర్మం మిగలలేదు.అంత మాంసం ముద్ద.ʹఅంటూ నిర్వేదంగా చెప్తుంది.ఇట్లాంటివి చాల చెప్పొచు.
ఎప్పుడు పీడితుల వైపు నుండి చెప్పే రచయిత్రి ఈ సారి ఉన్నత వర్గాల వైపు నుండి చెప్పడం,వాళ్ళ ఆలోచనలు వికృతాలు నమ్మకాలు వగైరాలు చెప్పడం కొత్తకోణం. మనం తుమ్మేటి ʹచావు విందుʹలో ఈ కోణాన్ని చూస్తాం
ఆమె రచన కాలo పాతదే ఐన దాని ప్రాసంగికత ఇప్పటికి ఉంది.సుజాత లాంటి తల్లులు మరింత మంది ఘోషిస్టూనే ఉన్నారు.వాళ్ళు మన చుట్టూ ఉన్నారు ఎటొచ్చి వాళ్ళ ఆవేదనను ఎత్తిపట్టడంలో సాహిత్య లోకం వెనకబడే ఉంది.
Type in English and Press Space to Convert in Telugu |
మాబిడ్డల్ని మానుంచి గుంజుకున్నరుఏప్రిల్ 24 నాడు, గ్రామస్తులు వెళ్లి తమ పిల్లలు కనబడకుండా పోయారని గడ్చిరోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమీ తెలియనట్టుగా నటించి, అన్ని వివర..... |
భావోద్వేగాలుశాంతి అంటూ ఒకటుంటదా
ఉంటది
కాకపోతే
వాళ్ళకు
యుద్ధం
తర్వాత
శాంతి... |
ముఖద్వారంఅడివిప్పుడి పెనుగాయం
రాయని రాయకూడని గాయం
లోలోపలసుళ్ళుతిరిగి
పేగులకోస్తున్నగాయం
దాపులేనిపచ్చిగాయం... |
నా సోదరి; నా ఆత్మబంధువుగౌరి మూగబోవడమా!!
హాహా!! పెద్దజోకు!!
ఆమె పొద్దుతిరుగుడు పూవులా పగిలి
ఎటు తిరిగితె
అటు విత్తనాలజల్లి
స్థలకాలాల దాటి
ఖండాంతరాల చేరింది...... |
కవలలుపాలస్లీనా కాశ్మీర్ !
కాశ్మీర్ పాలస్తీనా !
ఒకతల్లికి పుట్టిన కవలల్ని
స్వాతంత్ర్య మాత
చరిత్ర ఊయలలొ ఊపుతున్నది... |
అల్లరి విద్యార్థులుకార్ల్ మార్క్స్ ..
ఎప్పుడూ అసహనంగా కదుల్తుంటాడు
విరామమెరుగని కాలంమీద
ధనికులపై విప్లవ సంతకం చేయమంటాడు
మదర్ థెరెసా నాకొ అర్థంగానిప్రశ్న
టైము దొర్కితెచాలు
ప్ర... |
ఎదురుచూపులుఅదేమిటొగాని
నిన్నటిదాంక నిర్లిప్తంగా ఉన్న ప్రకృతి.. ప్రపంచమూ
నేడామె పక్కన నిలబడ్డవి
ఆమె గుండె లయకు ప్రతిధ్వనిస్తూ
పడవరాక కోసం పరితపిస్తున్నవి... |
ఆ...ఏడురోజులుబూటుపాదంకింద
నలిగిన అక్షరం
ఆర్తనాదమై
చెంపమీద ఫెడేల్మని కొట్టినట్టుంటది...... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |