వరవరరావును జైలులో చంపవద్దు

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

వరవరరావును జైలులో చంపవద్దు

- వివి కుటుంబ సభ్యులు | 16.07.2020 11:07:12pm

జులై 12, 2020న ఆయన కుటుంబ సభ్యులు విడుదల చేసిన పత్రికా ప్రకటన

నవీ ముంబైలోని తలోజ జైలులో నిర్బంధంలో వున్న ప్రపంచ ప్రసిద్ధుడైన తెలుగు విప్లవకవి, ప్రజా మేధావి వరవరరావు కుటుంబసభ్యులమైన మేం, క్షీణిస్తున్న ఆయన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాం . 28 మే 2020నాడు ఆయనను జైలు నుండి జె.జె. ఆసుపత్రికి అపస్మారక స్థితిలో మార్చినప్పటి నుండి ఆయన ఆరోగ్యస్థితి పట్ల మాకు భయాందోళనలున్నాయి. మూడు రోజుల తరవాత ఆయనను ఆసుపత్రి నుండి విడుదల చేసి జైలుకు తిప్పి పంపిన తరవాత కూడా ఆయన ఆరోగ్యంలో మెరుగుదల లేదు. ఇప్పుడు కూడా ఆయనకు అత్యవసర వైద్య సదుపాయం అవసరం.

ఆదివారం సాయంత్రం ఎప్పటిలాగే ఆయన నుండి మాకు అందిన ఫోన్ కాల్ మాలో తక్షణ ఆందోళనను రేకెత్తిచింది. జూన్ 24న, జులై 2న ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన మాటలు బలహీనంగా వినిపించాయి. మాటల తీరు అసంబద్దంగా వుంది. తెలుగులో మాట్లాడుతూ అకస్మాత్తుగా హిందీలో మాట్లాడడం ప్రారంభించారు. గత ఐదు శతాబ్దాలుగా రచయితగా, ఉపన్యాసకుడుగా, నాలుగు దశాబ్దాలపాటు తెలుగు అధ్యాపకుడిగా, ఆయన జ్ఞాపకశక్తి, వాగ్దాటి అందరికీ సుపరిచితమే. ఇప్పుడు మాటలు తడబడడం, అసంబద్ధత,జ్ఞాపకశక్తి కోల్పోవడం మాకు భయాన్ని కలిగిస్తున్నాయి.

అంతకంటే మాకు ఎక్కువ ఆందోళనాకరమైన స్థితి జులై 11న ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు కలిగింది. ఆయన ఆరోగ్యం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ఒకరకమైన అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా, చిత్త భ్రాంతికి గురైనట్లుగా మాట్లాడారు. ఏడు దశాబ్దాల క్రితం చనిపోయిన తన తండ్రి, నాలుగు దశాబ్దాల క్రితం చనిపోయిన తన తల్లి దహన సంస్కారాల గురించి మాట్లాడారు. ఆ స్థితిలో ఆయన సహ ముద్దాయి ఆ ఫోను తీసుకుని, ఆయన నడవలేకపోతున్నారని, తన పళ్ళు తాను తోముకోలేకపోతున్నారని చెప్పారు. తాను జైలు నుండి విడుదలవుతున్నాను కాబట్టి తన కుటుంబసభ్యులమైన మేం జైలు గేటు దగ్గర ఆయనను కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నామని ఆయన తరచూ మాట్లాడుతున్నారని చెప్పారు. కేవలం శారీరక రుగ్మతలేకాక నరాల సంబంధ సమస్యలకు కూడా ఆయనకు తక్షణం వైద్య సహాయం కావాలని ఆ సహ ముద్దాయి చెప్పారు. జ్ఞాపకశక్తి లోపించడం, గందరగోళం , అసంబద్ధత - ఆయన శరీరంలో ఎలక్ట్రోలైట్లు వుండాల్సిన స్థాయిలో వుండకపోవడం, సోడియం, పొటాషియంలు తగ్గిపోవడం కారణంగా ఏర్పడ్డాయి. అవి ఆయన మెదడును దెబ్బతీస్తాయి. ఇది ప్రాణాంతకం కూడా. ఇలాంటి తీవ్రమైన వ్యాధిని చికిత్స చేయడానికి అవసరమైన నిపుణులుగానీ, సాధనాలుగానీ జైలు ఆసుపత్రిలో లేనేలేవు. అందుచేత ఆయన ప్రాణాలు కాపాడడానికి ఆయనను అన్ని సౌకర్యాలున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించడం తప్పనిసరి.

ప్రస్తుత స్థితిలో ఆయనపై మోపిన కేసు కుట్రపూరితమా, కాదా అనే విషయాన్ని మేం లేవనెత్తదలచుకోలేదు. ఆయన విచారణలో వున్న ఖైదీగా 22 నెలలపాటు జైలులో వున్నారు. దానికదే శిక్షగా మారింది. కనీసం ఐదుసార్లు ఆయన బెయిల్ పిటీషన్లను తిరస్కరించారు. ఆయన వయసును , అనారోగ్యాన్ని, కోవిద కు గురయే అవకాశాన్ని ఉదహరిస్తూ వేచిన బెయిల్ పిటిషన్లను కూడా నిరాకరించారు. ఆయన జీవించడం ప్రస్తుతం మా అందరి దృష్టిలో ప్రధాన సమస్య. ఆయన ప్రాణాలు కాపాడాలన్నది మా ప్రస్తుత డిమాండ్. ఆయనను ప్రభుత్వం మంచి ఆసుపత్రికి తరలించాలని, తగిన వైద్య సౌకర్యాన్ని అందించడానికి మాకు అనుమతినివ్వాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఏ వ్యక్తికైనా ప్రాణరక్షణ హక్కును తిరస్కరించే అధికారం, అందులోనూ విచారణలో వున్న ఖైదీ ప్రాణరక్షణ హక్కును తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి లేదని విజ్ఞప్తి చేస్తున్నాం.

- పి. హేమలత, సహచరి - పి. సహజ, పి. అనల, పి. పవన- కుమార్తెలు


No. of visitors : 386
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

Save the life of the Indian writer and activist Varavara Rao!

| 02.08.2020 08:29:01pm

His condition reveals the absolute neglect of his health by the prison authorities. We join our voices with academics from all over the world, intellectuals...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •