భావప్రకటనా స్వేచ్ఛను గ్యారంటీ చేసే భారత గణతంత్రం, తననితాను సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థగా చెప్పుకొనే భారత గణతంత్రం ఆయన రాజకీయ విశ్వాసాల కారణంగానే కవి వరవరరావును నిర్బంధంలో వుంచిందన్నది వాస్తవం. వాళ్ళ జీవనస్థితిగతుల పట్ల ఆయన చూపించే సహానుభూతి కారణంగా పేదలు, దళితులు, ఆదివాసీలు ఆయన్ని అర్థం చేసుకున్నారు. క్రమక్రమంగా రాజ్యం మరింత పాశవికంగా మారుతోన్న కాలంలో తమ మానవత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన వాళ్లకి మార్గాన్ని చూపించారు.
వరవరరావు జీవితం, రాజకీయాలు తెరిచిన పుస్తకంలాంటివి. ఆయన విప్లవ రాజకీయాలను బహిరంగంగానే సమర్ధించారు. ధైర్యంతో విప్లవ సాహిత్యోద్యమాన్ని ముందుండి నడిపించారు. ఇదేమీ రహస్యం కాదు. పిరికివాళ్ళే కుట్రలు పన్నుతారు. కాని సాహసోపేతుడైన అలాంటి కవి కుట్రలు పన్నాల్సిన అవసరం లేదు. ఆయన జైలు జీవితం ఆయన్ను మరింత శక్తివంతుడిని చేసింది. ఈ పర్యాయం ఆయన నిర్బంధం రాజ్య నిజ స్వభావాన్ని బట్టబయలు చేసింది.
మానవ హక్కుల కార్యకర్తలపై హత్యలకు సంబంధించిన కుట్రకేసులను పెట్టటం భద్రతాదళాల కాల్పనితకు పరాకాష్ట. న్యాయస్థానాలు కూడా పథకం ప్రకారం నిశ్శబ్దంగా వుండిపోయాయి. భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పాలనకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన ఈ దశలో, తీవ్రమైన నిర్బంధపూరిత వాతావరణంలో కూడా మానవహక్కుల కార్యకర్తలు రాజ్యాంగ విలువల నైతిక చట్రంలో ఐచ్ఛికంగా పనిచేస్తున్నారు. హక్కుల కార్యకర్తలను జైళ్ళలో పెట్టటం రాజ్యాంగబద్ధ పాలనకు మచ్చ. న్యాయస్థానాలు దీన్ని నిరోధించి వుండాల్సింది. న్యాయబద్ధ పాలనను తీవ్రంగా కించపరిచే చర్యలు ప్రజాస్వామిక పాలన పునాదులను హరించివేస్తాయి.
వరవరరావును, సహ నిందితులను బేషరతుగా విడుదల చేయాలి. మానవతావాద దృక్పథంతో కాక, వాళ్లమీద చేసిన ఆరోపణలు నిరాధారమైనవి కాబట్టి, న్యాయం గాడి తప్పింది కాబట్టి వాళ్ళను బేషరతుగా విడుదల చేయాలి.
Type in English and Press Space to Convert in Telugu |
సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్ టాస్క్ఫోర్స్ జిల్లా రిజర్వ్ గార్డ్లు చేసిన లైంగిక అత్యాచారం, హ........ |
నిజమైన వీరులు నేల నుంచి వస్తారు1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్ జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది....... |
చరిత్ర - చర్చభగత్సింగ్ ఇంక్విలాబ్కు ` వందేమాతరమ్, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్ బాంబ్ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ... |
ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణంఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్ను స్మరించుకున్న దేశద్రోహి,... |
దండకారణ్య ఆదివాసీల స్వప్నాన్ని కాపాడుకుందాం : వరవరరావు18 జూలై 2016, అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ సభ సందర్భంగా వరవరరావు ఉపన్యాసం...... |
నోటీసుకు జవాబుగా చాటింపునిన్నటి దాకా ఊరు ఉంది వాడ ఉంది/
వాడ అంటే వెలివాడనే/
అంటరాని వాళ్లు ఉండేవాడ/
అంటరాని తనం పాటించే బ్రాహ్మణ్యం ఉండేది/
ఇప్పుడది ఇంతింతై ... |
రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?అరుంధతీ రాయ్ మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల...... |
రచయితలేం చేయగలరు?1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్ 370 మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ....... |
వాగ్ధాటి కాశీపతి1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండపల్లి....
... |
Save the life of the Indian writer and activist Varavara Rao!His condition reveals the absolute neglect of his health by the prison authorities. We join our voices with academics from all over the world, intellectuals... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |