ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.

- విరసం | 16.07.2020 11:31:49pm

ఏదైతే భయపడుతున్నామో అదే జరిగింది. అనేక అనారోగ్య సమస్యలతో పాటు వరవరరావుకిప్పుడు కరోనా పాజిటివ్ కూడా తేలింది.

లాక్ డౌన్ కాలం నుండి సుప్రీం కోర్టు ఆదేశాన్ని అనుసరించి రాజకీయఖైదీలను బెయిల్ పై గాని, పెరోల్ పై గాని విడుదల చేయాలని, వాళ్లను కరోనాకు బలిచేయవద్దని అడుగుతూనే ఉన్నాం. ముఖ్యంగా ఎనభై ఏళ్ల వరవరరావు ఆరోగ్యం గురించి పదేపదే ఆందోళన వ్యక్తం చేసినా, నెలన్నరగా ఆయన పరిస్థితి క్షీనిస్తున్నదని తెలుస్తున్నా ప్రభుత్వం, ఎన్ఐఏ., న్యాయస్థానాలు కూడా నేరపూరిత నిర్లక్ష్యం వహించాయి.

ఒక్కసారి ఆయన్ని చూడనివ్వండని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేసినా అనుమతించలేదు. చివరికి నిన్న జెజె హాస్పిటల్ లో తీవ్ర ఆందోళనకర స్థితిలో ఆయన్ని కుటుంబసభ్యులు చూడవలసి వచ్చింది. ఒక పోలీసు తప్ప ఆయన బాగోగులు చూసుకునే వైద్యసిబ్బంది ఎవరూ అక్కడ లేరు. మనుషుల్ని కూడా వెంటనే గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయారాయన. ఈరోజు ఆయనకు కరోనా పాజిటివ్ కూడా తేలింది.

కరోనా ఆంక్షలను ఉపయోగించుకొని, లాయర్లతో సహా ఎవర్నీ ఆయనవద్దకు అనుమతించకుండా, ఆయన ఆరోగ్య స్థితి గురించి కోర్టుకు అబద్ధాలు చెబుతూ బెయిల్ రాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) అడ్డుకుంటున్నది. రాజకీయ ఖైదీలను చిత్రహింసలు పెట్టడానికే ప్రభుత్వం ఎన్ఐఏ అనే రాజ్యాంగ అతీత శక్తిని, ఊపా వంటి అప్రజాస్వామిక చట్టాన్ని ఉపయోగించుకుంటున్నది.

వరవరరావు తన భావాలను, రాజకీయ విశ్వాసాలు ఎన్నడూ దాచుకోలేదు. సూటిగా, స్పష్టంగా మాట్లాడ్డం తప్ప ఆయన కుట్రలు చేసే వ్యక్తి కాదు. కవి ఎన్నటికీ కుట్రలు చేయడు. యాభై ఏళ్లుగా ఆయన మీద ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నీ ఎప్పటికప్పుడు తేలిపోయాయి. ఇప్పుడీ భీమాకోరేగాం కేసు కూడా అలాగే తేలిపోతుంది. కానీ విచారణే శిక్షగా మార్చి దేశంలోనే ప్రముఖ బుద్ధిజీవుల మీద కక్షసాధిస్తోంది ప్రభుత్వం.

వరవరరావును ఈ స్థితిలోకి నేట్టివేయడంలో తెలంగాణ ప్రభుత్వపాత్ర కూడా ఉంది. హైదరాబాద్ నుండే, ఆయన్ని మహారాష్ట్ర పోలీసులు తీసుకెళ్ళారు. తెలంగాణ కోసం, దేశ ప్రజల కోసం జీవితమంతా వెచ్చించిన కవి, మేధావిని కాపాడేందుకు జోక్యం చేసుకొమ్మని తెలంగాణ ప్రభుత్వానికి ఎంతమంది విజ్ఞప్తి చేసినా ఏ మాత్రం చలనం లేకపోవడం దాని స్వభావాన్ని తెలియజేస్తోంది. మనందరి కోసం మాట్లాడిన కవిని అచ్చంగా మనమే కాపాడుకోవాలి. వీలైన అన్ని పద్దతుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

No. of visitors : 243
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి

రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

వరవరరావు | 11.09.2016 10:16:25am

అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్‌ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్‌ ధబాడే.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •