అసమానత నుండి విప్లవం దాకా..

| సాహిత్యం | స‌మీక్ష‌లు

అసమానత నుండి విప్లవం దాకా..

- అరసవిల్లి కృష్ణ | 16.07.2020 11:41:15pm

కవిని అంచనా వేయడమెట్లా? రెండు దశాబ్దాల కాలయవనికపై జీవన రాపిడికి గురి అవుతున్న సమూహపు గాయాల్ని స్పృశించిన కవిని, అందునా నిర్బంధంలో వున్న కవిని ఎలా అంచనా వేయగలం? కవిత్వం దారి కవిత్వానిదే, తన దారి తనదే అని ఊహా ప్రపంచపు చల్లదనాల కీర్తి కండూతిల కూడలిలో కనీస జీవితం అందకుండా అదృశ్యమవుతున్నప్పుడు, గాలి తెరలు కమ్మేస్తున్నప్పుడు, అన్ని రకాల పీడనలు సాలె గూడులా అల్లుకున్నప్పుడు.. బహుశా అతను కవి అవుతాడు. ఉద్యమ కవిగా అధోజగతి మనుషుల వెలుగు దారిపై వెలుతురు కణాలను వెదజల్లి పోతాడు.

కాశీం కవిత్వాన్ని తొలి దశ నుంచి ఇవాల్టి దాకా, ఆయన కవిగా ఎదిగిన క్రమాన్ని వస్తువు, రూపం, నిర్మాణం అనే మూడింటి సమ్మేళనంలో అంచనా వేయాలి. కవిగా కాశీంను అంచనా వేయడానికి వాచకాన్ని చదవడం, కవిని దూరంగా వుండి గమనించడం మాత్రమే సరిపోదు. కవిని దగ్గరగా చూడాలి. కవి హృదయంలోకి దారి చేసుకొని వెళ్ళగలగాలి. కవి హృదయానికి దగ్గర కావడమంటే కవిత్వాన్ని అన్ని ఛాయల్లోను గమనించడం. నిజాయితీ అనే పరికరంతో అత్యంత జాగరూకతతో కవి లోపలి ప్రపంచాన్ని చూడటం. ఇవన్నీ చూడగల చూపు విమర్శకుల దగ్గర ఉ ండాలి. దానికి తగినట్లు చూపును విశాలం చేసుకోవాలి.

ఈ రచనలో పాణి ఆ పని చేయగలిగాడు.

సుదీర్ఘ కాలంగా పాణి, కాశీం ఉద్యమ సహచరులు. ఇది మాత్రమే కొలమానం కాదు. పరిచయం, స్నేహం, దగ్గరితనం కవిత్వాన్ని అర్ధం చేసుకోవడానికి, విశ్లేషించడానికి వాహిక అవుతుంది. కాని అది అభినందన సందేశంగా మిగలకూడదు. కవిగా కాశీం పరిణితిని, పరిణామక్రమాన్ని, సామాజిక దొంతర్లలో పీడనకు గురి అవుతున్న సమూహాలను కవి ఎలా స్వీకరిస్తున్నాడో నిశితంగా గమనించక పోతే విమర్శలో కవితా న్యాయం దక్కదు.

పాణి విమర్శకునిగా తన విశాలతను ఇక్కడ ప్రదర్శించాడు. కవిగా కాశీంను అంచనా వేయడంలో సమతుల్యతను సాధించాడు. విప్లవ కవిత్వ విమర్శ పరిణతిని కూడా తన విశ్లేషణలో చూపించాడు. కాశీంలోని అనేక పార్శ్వాలను తడమ గలిగాడు. కాశీం కవితా రచన విస్త్రతమయనది. ప్రాపంచిక దృక్పధమున్నది. అదే సమయంలో కవిలో అస్తిత్వపు ఎరుక వున్నది. మార్కిస్టు అవగాహనతో లేదా విప్లవోద్యమ ప్రభావంతో, కవిగా రూపు దిద్దుకునే క్రమంలో, కవిగా విస్తరిస్తున్న దశలో తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించిన అస్తిత్వ ధోరణలు, మతం, మార్కెట్ మానవీయ సంబంధాలలో వచ్చిన మార్పులు మొదలైనవి ఆయనను విశాలం చేశాయి. అస్తిత్వ ధోరణుల ప్రవాహ దశ నుండి తన దయిన విప్లవ ముద్రను కొనసాగించడం, దానికి తగిన నిమగ్నతను కలిగి ఉండటం విప్లవ కవిగా కాశీంలో భాగం. స్పష్టమయిన రాజకీయ విశ్వాశాల కొలిమిపై వెల్లువలా వస్తున్న అస్తిత్వ ధోరణల నుండి తనదైన కవితా మార్గం వేసుకున్నాడు. కవిగా కాశీం ముందట అనేక అస్తిత్వ ఎరుకలున్నాయి. నూతన మానవులు ఆవిష్కృతమవుతున్న కాలంలో కవిగా అత్యంత వెనుకబడిన ప్రాంతం పాలమూరి బిడ్డగా, అణగారిన కులం నుంచి వచ్చిన ఏ సృజనకారుడయినా వీటిని ఎట్లా తప్పించు కుంటాడు. ఈ ధోరణలు తను విశ్వసించిన మార్క్సిస్టు అవగాహనలో భాగం అవుతాయా? విప్లవ కవిగా వర్గ దృక్పథంతో వున్నాడా? అస్తిత్వ స్పృహ ఎలా వ్యక్తమవుతున్నది? అనేవి జాగరూకతతో పరిశీలించి సాహిత్య అంచనా ఇవ్వాలి. విమర్శకునికి ఇది కేంద్ర స్థానం. కవిని అంచనా వేయడంలో, అందునా నిర్బంధంలో రాజకీయ ఖైదిగా వున్న కవిని గమనించడంలో విమర్శకునిగా పాణి ఈ పని చేసినప్పుడే కాశీం కవిత్వానికి, రాజకీయ భావజాలానికి న్యాయం చేసినట్లు.

భిన్న అస్తిత్వాల వ్యక్తీకరణల కవి గానా, విప్లవోద్యమ రాజకీయ భావజాల కవిగానా.. ఏది కాశీంలో ప్రధానమైన విషయం అని అని అంచనా వేయకపోతే, అలాంటి సమగ్రత లేకుంటే కవిగా కాశీంను ఒక పరిమితిలో కుదించినట్లవుతుంది. కాశీం కవిగా రూపు దిద్దుకున్న సామాజికావరణను పూర్తిగా విశ్లేషించి, మార్క్సిజం వెలుగులో కాశీం ఎలా కుదురుకున్నాడో పాణి స్పష్టంగా గుర్తించాడు. కాశీం కవిత్వంలో వస్తు విస్తృతి, అస్తిత్వ ముద్రలను కూడా చూస్తునే విప్లవ కవిగా అస్తిత్వాలను చూడటాన్ని కూడా పాణి అంచనా వేశాడు. వర్గ దృక్పథంతో కాశీం తన చుట్టూ ఆవరించిన వెలుగును అంతర్లీనం చేసుకున్నాడు.

కాశీం తెలంగాణ మాండలికాన్ని, ఇంటి భాషను, పురాతన మానవ సంస్కృతిలో నిబిడీకృతమైన తన వారసత్వ మాటలను కవిత్వపరిభాషగా అంతర్లీనం చేసుకున్నాడు. ఏ కవికయినా నైసర్గిక ప్రభావాలుంటాయి. సముద్రం కవిని ఉత్తేజితుడ్ని చేయవచ్చు.

ఎండిన నది కవి హృదయ గతం కావొచ్చు. కవిగా సజీవంగా వుండేందుకు సామాజిక జీవన నేపథ్యం మాత్రమే కాదు, ఆయా సమూహాల జీవన రాపిడి కవిని అంటి పెట్టుకొని ఉండవచ్చు. కవి చుట్టూ అలుముకున్న అనేక సంక్లిష్టతలకు, వైరుధ్యాలకు, అసమానతలకు కవి పరిష్కారం.

నడిచి వచ్చిన దారి అనేక ఘర్షణలతో నిండిన తెలంగాణ సమాజం, అక్కడి మనుషులు, వారి స్వభావం, అణచివేత కాలం కవికి కాపలా కాసాయి. ఈ పూర్వ రంగాన్ని సంపూర్ణంగా ప్రణాళికాబద్ధంగా పాణి విశ్లేషించాడు. అందువల్ల కాశీం కవిత్వంలోని పొరలను, ఆ పొరలు వెనుక దాగిన వస్తు, శిల్ప పరమయిన వ్యక్తీకరణలను, కవి దార్శినికతను విమర్శకునిగా చూడ గలిగాడు. రాజద్రోహం, కుట్ర కేసులు, జైలు జీవితం.. వీటన్నిటి వెనుక కవిత్వం మాత్రమే ఉన్నది. విప్లవ కవిగా అమరత్వపు జెండాను అవనతం చేయకుండా అమరత్వాన్ని గానం చేసిన కవి సమయాన్ని గుర్తించాడు. కాశీం దీర్ఘ కవితలు రాయడం వెనుక విప్లవ ఆకాంక్ష, భావోద్వేగం, ఆ రాపిడి నుండి కవిత్వం చేసిన మెలకువలను పాణి మార్క్సిస్టు విమర్శ పద్ధతిని పాటిస్తూనే హృదయంతో అంచనా వేశాడు. ఒక సందర్భంలో దేవిప్రియ అన్నట్లు ఇందులో అకడమిక్ పద్దతి కొంత ఉన్నా రాజకీయ సామాజిక అంశాల ప్రాతిపదికపై మార్క్సిజం వెలుగులో కాశీం కవిత్వాన్ని పాణి అంచనా వేసాడు. ఒక సృజనాత్మక వ్యక్తీకరణగా ఈ కవిత్వాన్ని విశ్లేషించాడు. కవిత్వం, జీవితం, ఆచరణ ఈ మూడు కలగలిసిన కాశీం నూతన ప్రజాస్వామిక విప్లవంలో ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఈ వాహిక దగ్గరికి చేసుకున్నాడు. ఆ దారి రాజ్యానికి ధిక్కారంగా కనబడింది. అణిచివేతలను ధిక్కరించేదే కవిత్వం. జైలు నోరు తెరిచినా ఆ ఉధృతి ఆగదు. ఆగకూడదు.

No. of visitors : 905
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


రెక్కల గూడు

అరసవిల్లికృష్ణ | 19.05.2018 08:44:01am

ఏమయినావు పావురాయి నీడల్ని- జాడల్ని మరిచిన మనుషులు కి తూర్పు దిక్కున ఎర్రని కాగడా వుందని నీ కళ్ళతో చెప్పలేక పోయావా- పొలికేక వినబడుతుందని.....
...ఇంకా చదవండి

ఒకరు వెనుక ఒకరు

అరసవిల్లి కృష్ణ | 18.02.2020 03:12:45pm

నాదగ్గర నాదేశ మూలవాసుల దగ్గర ఏ ధృవీకరణ పత్రం లేదు...
...ఇంకా చదవండి

రంగుల రాట్నం హఠాత్తుగా ఆగితే..

అరసవిల్లి కృష్ణ | 01.05.2020 12:27:46am

మార్చి 20న భారత ప్రధాని నరేంద్ర మోది మార్చి 22 ఆదివారం జనతా కర్ప్యూ అని ప్రకటించాడు. రేపటి తమ ఉపాధి ఏమిటి అనే ఆలోచించుకునే ప్రజలు సోమవారం తమ పనులకు ఆటంకం.....
...ఇంకా చదవండి

మనకు తెలియని మేరువు

అరసవిల్లి కృష్ణ | 02.06.2020 10:36:37pm

మేరువు నవల మనకు తెలియని స్త్రీల చరిత్రకు సంబంధించినది. అనేక ముద్రల మధ్య విలువలను స్త్రీలు మాత్రమే కాపాడాలి....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •