గాలింపు, స్థూపాల కూల్చివేత

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

గాలింపు, స్థూపాల కూల్చివేత

- పాణి | 21.07.2020 05:50:45pm


మాట్లాడేవాళ్లను చెరసాలలోకి తోసేశారు. కొందరి నోళ్లు బయటే నొక్కేశారు. మరి కొందరిని భయంలోకి తోసేశారు. ఇంకేముంది? అంతా ప్రశాంతం. ఒక పక్క పండిత చర్చలే చర్చలు. ఇంకో పక్క సకలం విధ్వంసం. అందులో భాగమే అంతులేని గాలింపులు. స్థూప నిర్మూలనం.

ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో నిత్యం కూంబింగ్ నడుస్తోంది. వేలాది సంఖ్యలో పోలీసులు పల్లెలను గాలిస్తున్నారు. ఆదివాసీ గ్రామాలపై దాడులు చేస్తున్నారు. అడవులు పోలీసుల పదఘట్టల కింద నలిగిపోతున్నాయి. మబ్బుపట్టి, వానలు మురిసే వేళ కూంబింగ్ మేఘాలు నెత్తురు వర్షించేలా ఉన్నాయి. ఊళ్ల బాటలు, అడవి దారులు చిత్తడైపోతున్నాయి. యథాలాపంగా కాదు. హత్యోన్మాదంతో సాగుతున్న వేట ఇది. కొద్ది రోజులుగా సాగుతోంది. ఆంధ్రా పాలక రాజకీయాల వికృత క్రీడ మాత్రమే చూడగలిగే వారికి కనిపించని వేట ఇది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వైసీపీ వర్సెస్ టీడీపీ తప్ప మరే దృశ్యమూ లేదని అనిపించవచ్చు. పత్రికలు, టీవీలు వాళ్ల వాళ్ల ప్రభువుల లీలా వినోదాల వేదికలుగా మారిపోయి ఉండవచ్చు. చూపరులకు ఇది తప్ప ఇంకేమీ లేదనిపించవచ్చు. కానీ ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో ముమ్మర వేట సాగుతోంది. ఎన్ని శవాలు రాలేదీ లెక్క పెట్టడమే తమ పని అన్నట్లు పత్రికలు ఉన్నాయి.

మనుషులనడానికి రుజువు మెదడుతో ఆలోచించడం, హృదయంతో స్పందించడం, నోరు తెరిచి మాట్లాడటం. ఇవేవీ పని చేయలేని, చేయనవసరం లేని స్థితికి రాజ్యం తీసికెళ్లింది. సాంకేతికత ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిందని వర్ణించేవాళ్లు కూడా దిగ్ర్భాంతికి గురయ్యేలా మన పక్కనే ఉత్తరాంధ్ర సరిహద్దుల్లోని వందల పల్లెల్లో, విస్తారమైన అడవిలోని ఆదివాసీ గూడేల్లో ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు. మనుషుల్ని వెతికి చంపడం ఈ వేట లక్ష్యం. రోజుల తరబడి ఇలా గాలించడం ఏమిటని అడిగే వాళ్లు లేకపోవడమే మన ప్రజాస్వామ్య సుగుణం. అదే దాని సారం. ఈ పనులన్నీ రాజ్యాంగబద్దంగానే చేస్తున్నారు. ఇదీ మన ప్రజాస్వామ్య వైభవం.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతంలో అంతక ముందుకంటే కూంబింగ్ ముమ్మరమైంది. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ నీడల్లో అక్కడ అనేక ఘోరాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లో పెద్దబయలు ప్రాంతంలో రెండుసార్లు ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. జి. మాడుగుల, ముంచంగిపుట్టు, చింతపల్లి, జీకే వీధి మండలాల్లోని గ్రామాల్లో తీవ్రస్థాయిలో గాలింపు జరుగుతోంది. లాక్ డౌన్ మొదలయ్యాక మావోయిస్టుల వైపు నుంచి ఎలాంటి చర్యలు జరిగినట్లు పత్రికల్లో రాలేదు. కానీ మావోయిస్టులే లక్ష్యంగా బలగాలు లోతట్టు ప్రాంతాల్లోకి సాగిపోతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు గాయపడ్డారని పోలీసులు ప్రకటించారు. గాయపడ్డ వాళ్లు మరణించే అవకాశం ఉందని, వాళ్లు లొంగిపోతే వైద్యం చేయిస్తామని పాడేరు డీఎస్పీ రాజ్ కమర్ అన్నాడు. పోలీసుల నోట ఎబ్బెట్టు అనిపించే మాట ఇది. హంతక దాడులు చేసేవాళ్లకు మానవ ప్రాణంపట్ల పట్టింపు ఏమిటి? దాన్ని చాటుకోవాలంటే అవతలివాళ్లు లొంగిపోలన్నమాట. జైళ్లలో రాజకీయ ఖైదీలకే ప్రభుత్వం వైద్యం చేయించడం లేదు. ఇవాళ అది దేశవ్యాప్త ప్రశ్న. దానికి సమాధానం లేదు. కానీ గాయపడ్డ మావోయిస్టులకు వైద్యం చేయిస్తానని అంటోంది. ఔదార్యం ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి.

ఈ నెల 16వ తేదీ మల్కాన్‌గిరి జిల్లా బలిమెల ప్రాంతంలో కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఏవోబీ అంతటా ఇలాగే ఉంది. తెలంగాణ - దండకారణ్య సరిహద్దు ప్రాంతాల్లో వారం రోజుల నుంచి భారీ ఎత్తున కూంబింగ్ నడుస్తోంది. తెలంగాణ సరిహద్దులో వెయ్యి మందికి పైగా కూంబింగ్ దళాలు గోదావరి సరిహద్దు ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులకు అన్నం పెట్టారన్న నెపంతో ఉపా కేసు పెట్టి జైల్లో పెడుతున్న పోలీసులు గ్రామస్తుల ఇళ్లల్లోనే వంట చేసుకుని తింటూ దాడులు కొనసాగిస్తున్నారు. దీనికి ఆపరేషన్ భాస్కర్ అనే పేరు పెట్టారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. తెలంగాణలోకి మావోయిస్టులను అడుగు పెట్టకుండా చూడటమే తన లక్ష్యం అని తెలంగాణ డిజిపి ప్రకటిస్తున్నాడు. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు బలగాలను తరలించే పనిని ఆయన దగ్గరుంచి పర్యవేక్షిస్తున్నాడు.

ఈ సరిహద్దులోని దండకారణ్యంలో నాలుగేళ్లుగా ఆపరేషన్ ప్రహార్ కొనసాగుతున్నది. ఈ లాక్ డౌన్ కాలంలో ఇక్కడ 40 మందిని ఎన్ కౌంటర్లలో కాల్చి చంపారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు(తూర్పు మధ్య భారతం) ఒక ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అణచివేత కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్ సమాధాన్ మొదలయ్యాక ఈ చర్యలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా గత వారంలో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం జరిగింది. ఇందులో ఆంధ్ర- ఒడిశా ప్రాంతంలో, తెలంగాణాలో, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ట్రై జక్షన్ ప్రాంతాలలోని విప్లవోద్యమ అణచివేతకు పరస్పర సహకారం గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

దీని ప్రకారం.. ఇప్పటి దాకా ఉన్న తూర్పు మధ్య భారత దేశంలో అమలవుతున్న అణచివేత వ్యూహం ఇక దక్షిణ భరత దేశంలోని కేరళ, తమిళనాడులోకి కూడా వస్తుంది. దండకారణ్య అటవీ ప్రాంతాల్లో సాగిన సైనిక దాడులు ఈ ప్రాంతానికి విస్తరిస్తాయి.

దంతెవాడలో కూంబింగ్ బలగాలు సోమవారం ఓ స్థూపాన్ని కూలగొట్టాయి. అక్కడ గుడ్డి అనే ఆదివాసీ విప్లకారుడి అమరత్వానికి గుర్తుగా స్థానికులు ఎప్పుడో ఒక స్థూపం కట్టుకున్నారు. అది కూంబింగ్ బలగాల కంటపడింది. జూలై 28 దగ్గర పడుతోంటే పోలీసులకు స్థూపాలను కూలగొట్టాలనిపిస్తుంది. అమర వీరుల వారోత్సవాలను సాకు చేసుకొని కూంబింగ్ తీవ్రత పెంచడంలో భాగమే ఈ విధ్వంస చర్య. స్థూపాలను కూల్చేస్తే అమరవీరుల జ్ఞాపకాలు తుడిచిపెట్టుకపోతాయా? వాళ్లను ప్రజలు స్మరించుకోవడం మానేస్తారా? ఇవేవీ రాజ్యానికి పట్టదు. పోలీసులు ఇవేవీ ఆలోచించరు. స్థూపం ఒక సంకేతం. చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసేదే కాదు. స్థూపం ఒక భావజాల ప్రతీక. పోరాట చిహ్నం. రాజ్యానికి అవంటే కంగటింపు. ద్వేషం. కాబట్టి పోలీసులు కూల్చేస్తారు. ఇదేదో తుంటరి పని కాదు. స్థూపం వెనుక ఉన్న భావజాలాన్ని ఎదుర్కోవడమే లక్ష్యం. అందుకే ఇలాంటి పని చేస్తారు.

విప్లవోద్యమాన్ని ఎదుర్కోడానికి పాలకులు చేపట్టిన ఆపరేషన్ సమాధాలో ఇవన్నీ భాగం. ప్రజల మిలిటెన్సీ పెంచే పోరాటాల పట్ల ప్రభుత్వాలు ఇంత కచ్చితంగా ఉంటాయి. ఇంత స్పష్టంగా ఉంటాయి. ఎంత దూరమైనా వెళతాయి. ఉద్యమ నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తుంటాయి. ఇది రాజ్య స్వభావం. మేధావులు ఈ సంగతి తెలుసుకోలేకపోతున్నారు. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు. కొందరికి అమాయకత్వం ఉండొచ్చు. మరి కొందరు కావాల్సి విస్మరించవచ్చు. భారత రాజ్యం మాత్రం తన మనుగడ సమస్యగా భావించి యుద్ధానికి తెగపడుతోంది. ఇది మాత్రం చాలా ఉద్దేశపూర్వకంగా చేస్తోంది. దీన్ని ప్రశ్నిస్తామా? లేదా? అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న.

No. of visitors : 1358
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •