వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.

- | 22.07.2020 08:48:40pm

తేదీ: 22-07-2020
గౌరవనీయులు శ్రీ శరద్ అరవింద్ బొబ్డే
భారత ప్రధాన న్యాయమూర్తి గారికి

గౌరవనీయులు శ్రీ ఉద్ధవ్ థాకరే,
ముఖ్యమంత్రి,
మహారాష్ట్ర గారికి

గౌరవనీయులు
శ్రీ దీపాంకర్ దత్తా,
ప్రధాన న్యాయమూర్తి,
బాంబే హైకోర్టు గారికి


విషయం: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు, జి.ఎన్.సాయిబాబాల ప్రాణాలు కాపాడేందుకు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని వినతి

భీమా కొరేగావ్ కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, గత 22 నెలలుగా నవీ ముంబయి జైలులో ఉన్న విప్లవ కవి 80 ఏళ్ల వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తుండగా ఆయనకు కరోనా కూడా రావడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు సమాజంలోనే కాదు, భారతదేశంలోనే సుప్రసిద్ధులైన రచయిత, సామాజిక కార్యకర్త వరవరరావు సుమారు అరవై ఏళ్లుగా సాహిత్య, సామాజిక రంగాల్లో ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఆయన రచనలు సుమారుగా అన్ని భారతీయ భాషల్లోకే కాక, ఇంగ్లీషు, ఇటాలియన్, స్పానిష్, ఫ్రెంచ్ వంటి వివిధ దేశాల భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయన తెలుగు సమాజానికి, భారతదేశానికి చెందిన అద్భుత సాంస్కృతిక సంపద. అటువంటి వ్యక్తి సుమారు రెండేళ్లుగా విచారణ ఖైదీగా దుర్భర జైలు జీవితం గడుపుతూ ఈరోజు మాటలు కూడదీసుకోలేని స్థితికి రావడం తీవ్రంగా విచారించవలసిన విషయం. తన పనులు తాను సొంతంగా చేసుకోలేని స్థితిలో కూడా ఆయన్ని నిర్బంధంలో ఉంచడం అమానవీయం. ఆయన కేసు విచారణ ఇప్పటికీ ఏమాత్రం ముందుకుపోలేదు గానీ బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూనే ఉన్నారు. ఏ సదుపాయాలు లేని కిక్కిరిసిన జైల్లో కోవిడ్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అనుసరించి ఆయన్ని విడుదల చేయాలని ఇప్పటికే ప్రజాస్వామికవాదులు, రచయితలు పలుమార్లు విజ్ఞప్తులు, ఆందోళనలు చేశారు. మేం ఆందోళన చెందినట్లుగానే ఆయనకు కరోనా కూడా సోకింది. తమ కస్టడీలో ఉన్న మనిషి పట్ల ఇంతటి నిర్లక్ష్యం ఎంతమాత్రమూ చట్టబద్ధం, నైతికం కాదు. NHRC ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆయనకు మంచి వైద్యం అందించడంతో పాటు వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. చట్టప్రకారం బెయిల్ పొందడం ఆయన హక్కు కూడా. మానవీయ దృష్టితో ఆలోచించినా ఆ వయసులో, అంతటి అనారోగ్యంలో ఆయనకు కుటుంబసభ్యులతోడు, సంరక్షణ చాలా అవసరం. కాబట్టి ఆయన్ని వెంటనే విడుదల చేయాలి.

ఇదే సమయంలో నాగపూర్ అండా సెల్లో 90 శాతం అంగవైకల్యంతో, 19 రకాల ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడుతున్న మరొక కవి, రచయిత, మేధావి, సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబాను కూడా వెంటనే పెరోల్ మీద గాని బెయిల్ పై గాని విడుదల చేయాలని, వారి జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత న్యాయవస్థ మీద, ప్రభుత్వం మీద ఉందని గుర్తుచేస్తున్నాం. అలాగే కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాజకీయ ఖైదీలుగా ఉన్న ప్రజాస్వామికవాదులందర్నీ విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

మొత్తం 520 మంది కవులు, రచయితలు, కళాకారులు సంతకాలు చేశారు.తెలుగు ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు

Click here

for english statement please click on the link below

Click here

No. of visitors : 649
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

Save the life of the Indian writer and activist Varavara Rao!

| 02.08.2020 08:29:01pm

His condition reveals the absolute neglect of his health by the prison authorities. We join our voices with academics from all over the world, intellectuals...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •