ప్రియమైన అమ్మా
నువ్వు నన్ను చూడడానికి వచ్చినపుడు
ఫైబర్ గాజు కిటికీలో నుంచి
నీ ముఖం నేను చూడలేకపోయాను
నువ్వు నా వైకల్య దేహాన్ని
చూడగలిగి ఉంటే
నేనింకా బతికే ఉన్నానని
నువ్వు నిజంగా నమ్మి ఉండే దానివి
అమ్మా నేను నీ దగ్గర లేనందుకు
దు : ఖించకు
నేను ఇంట్లో ఉన్నపుడు
బయట ప్రపంచంలో
నాకు చాలా మంది మిత్రులున్నారు
నేనీ జైల్లో అండా సెల్ లో
బంధించబడినాక
విశ్వమంతటా నాకింకెంతో మంది
నేస్తాలు లభించారు
అమ్మా క్షీణిస్తున్న నా ఆరోగ్యం గురించి
దిగులుపడకు
నా బాల్యంలో నాకొక కప్పు పాలు కూడ
నువ్వు సమకూర్చలేనపుడు
నువ్వు నీ శక్తితో, ధైర్యంతో కూడిన
మాటలతో నన్ను కుడిపావు
ఇప్పుడీ బాధలో వేదనలో
నువ్విచ్చిన ఆశ్వాసంతోనే
నేను మరింత శక్తివంతుణ్నవుతున్నాను
అమ్మా నీ ఆశల్ని వదులుకోకు
జైలు నాకు మరణం కాదు
పునర్ జననమని
అమ్మ వెళ్లిపోయింది
కొడుకును విడుదల చేయమని ఏండ్ల తరబడి
నేను అర్థం చేసుకున్నాను
నేను ఇంటికి తిరిగివస్తాను
నాకు ఆశను, ధైర్యాన్ని యిచ్చి
పోషించిన నీ ఒడిలోకి
అమ్మా
నా స్వేచ్చ గురుంచి భయపడకు
నేను పోగొట్టుకున్న స్వేచ్ఛ
ఎంతో మంది పొందిన స్వేచ్ఛ
అభాగ్యజీవులకు అండగా
నాతో పాటు నిలబడడానికి వస్తున్న
ప్రతి ఒక్కరిలో
నేను నా స్వేచ్ఛను పొందుతున్నాను
నవంబర్ 14, 2017
(నీవు ములాఖత్ లో వచ్చి జైలు కిటికీ దగ్గర నిలబడిపోయాక)
నీ కోసం ఇది ఎవరైనా అనువదిస్తారని ఆశిస్తాను. అమ్మా, నువు అర్థం చేసుకోలేని విదేశీ భాషలో రాస్తున్నందుకు క్షమించు. నన్నేం చేయమంటావు? నా శిశు త్వంలో నీ ఒడిలో నాకు నువ్వు నేర్పిన తియ్యనిభాషలో రాయడానికి నాకు ఇక్కడ అనుమతి లేదు.
ప్రేమతో
నీ శిశువు.
తెలుగు: వి.వి
Type in English and Press Space to Convert in Telugu |
శిథిల ప్రజాస్వామ్యానికి ప్రతీక : నాగపూర్ జైల్లో చావుబతుకుల మధ్య ప్రొఫెసర్ సాయిబాబాతన పరిస్థితి గురించి స్వయంగా సాయిబాబా మార్చి 19న జైలు నుండి ఒక లేఖ రాసాడు. వేగంగా క్షీణిస్తున్న తన ఆరోగ్యం, మరిన్ని క్లిష్ట సమస్యలు వచ్చి పడుతున్న స్థితి.. ... |
ఓ ఆదివాసీ అమ్మ కథఈ అమ్మను చూడగానే మహాశ్వేతదేవి ʹఒక తల్లి కథʹ కళ్ళముందు కదిలింది ఆ ఆదివాసీ అమ్మ పేరు ʹరిజో టిర్కిʹ. వయస్సు 55 సం.లు ఉంటుంది. అమె కొడుకే ʹవిజయ్ టిర్కిʹ దేశ వ్య... |
నాదయిన మంచు గురించినేనెన్నో భ్రమల్ని పుట్టిస్తూ ఉంటా
పుట్టించే ముందు వాటిని శ్రద్దగా చంపుతూ ఉంటా
నావెనక రాజ్యం నడుస్తుందో
రాజ్యం వెనక నేను నడుస్తున్నానో
నాలో రాజ్యం ఉందో నేను ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |