వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే...మావోయిస్టులు కాదు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే...మావోయిస్టులు కాదు

- జార్ఖండ్ జనాధికర్ మహాసభ | 12.08.2020 10:27:21am

జూన్ 15 న, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని ఖుంటపాని బ్లాక్ పరిధిలోని చిరియాబేడా (అంజెడ్‌బెడా) గ్రామానికి చెందిన 20 మందిని సిఆర్‌పిఎఫ్ సిబ్బంది కొట్టారు, వారిలో 11 మంది తీవ్రంగా కొట్టారు, వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనను వార్తా పత్రికలు జూన్ 17న ʹసాయుధ మావోయిస్టులుʹ దాడి చేసి తీవ్రంగా కొట్టారని, చాలా మంది గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నాయి.

ʹజార్ఖండ్ జనాధికర్ మహాసభʹ ఈ ఘటన నిజనిర్థారణ కోసం వెళ్లింది. ఈ వేదికలో ʹఆదివాసీ ఉమెన్స్ నెట్‌వర్క్ʹ, ʹఆదివాసి అధికార్ మంచ్ʹ, ʹబగైచాʹ, ʹసేవ్ భూమి కోఆర్డినేషన్ ఫోరంʹ, ʹకొల్హాన్ʹ, ʹహ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్ʹ, ʹజోహార్ʹ, ʹకొల్హాన్ ఆదివాసి యువ స్టార్ ఏక్తాʹ ʹʹమా భూమి మా జీవితంʹ ప్రతినిధులు వున్నారు.

చిరిబెడా (జార్ఖండ్) ఆదివాసీలను దారుణంగా కొట్టడం, భద్రతా దళాల ఆదివాసీ వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేసే తన నిజ నిర్థారణ నివేదికను జార్ఖండ్ జనాధికర్ మహాసభ 2020 29 జూలైన విడుదల చేసింది.

ఈ వేదిక బృందానికి లభించిన సమాచారం, వార్తాపత్రికలలో వచ్చిన సమాచారం పైన అనేక సందేహాలను లేవనెత్తుతుంది. దాడి చేసింది మావోయిస్టులు కాదనీ సిఆర్‌పిఎఫ్ సిబ్బంది అనీ గ్రామస్తులు చెప్పారు. కొంతమంది గ్రామస్తులు తమ గుడిసెల పైకప్పులను బాగుచేసుకుంటున్నప్పుడు ఈ దాడి జరిగింది.

చిరియాబెడాలోని బోంజ్ సురిన్ గుడిసెలో 2020 జూన్ 15 న సుమారు 20 మంది వ్యక్తులు పైకప్పు మరమ్మతు పనుల్లో నిమగ్నమై వుండగా మధ్యాహ్నం 12:30 గంటలకు, అడవి నుండి డజనుకు పైగా సిఆర్పిఎఫ్ సిబ్బంది, సాయుధ పోలీసు బలగాలు గ్రామానికి వచ్చి బోంజ్ ఇంటిని చుట్టుముట్టాయి. క్రమంగా ఆ సంఖ్య 150-200కి పెరిగింది.

చిరియాబెడా (అంజెడ్‌బెడా) గ్రామంలో ఎక్కువ మంది ప్రజలు ʹహోʹ సముదాయానికి చెందినవారు. వీరు షెడ్యూల్డ్ తెగకు చెందినవారు, ʹహోʹ భాషలో మాట్లాడుతారు. సిఆర్‌పిఎఫ్ సిబ్బంది గ్రామస్తులను హిందీలో మాట్లాడమని ఒత్తిడి చేసి, వారు హిందీ మాట్లాడలేమని చెప్పినప్పుడు, కొట్టడం ప్రారంభించారు. అతి క్రూరంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.

సిఆర్‌పిఎఫ్ జవాన్లు పైకప్పుపై పనిచేస్తున్న గ్రామస్తులకు కిందకి దిగమన్నారు. చాలా మంది గ్రామస్తులకు హిందీ అర్థం కాదు, మాట్లాడటం లేరు కాబట్టి, ఏమి చెప్తున్నారో అర్థం కాలేదు. కానీ జవాన్ల అరుపులు, హావభావాలతో తమను పిలుస్తున్నట్లుగా అర్థం చేసుకున్నారు. జవాన్లు హిందీలో నక్సలైట్ల ఆచూకీ ఏమైనా తెలుసా అని అడిగారు. పదాలను కొంత వరకు అర్థం చేసుకున్నవారు తమ భాషలో నక్సలైట్ల సమాహారం తమకు ఏమీ తెలియదని సమాధానం ఇచ్చారు.

గ్రామస్తులు హిందీలో సమాధానం చెప్పకపోవడంతో, సిఆర్‌పిఎఫ్ జవాన్లు కోపంతో రెచ్చిపోయి తిట్టడం మొదలుపెట్టి అంతటితో తృప్తిపడక కొట్టడం ప్రారంభించారు. 20 మందిని ఒక్కొక్కరిని చేసి దారుణంగా కొట్టారు. సిఆర్‌పిఎఫ్ సిబ్బంది గ్రామస్తులను లాఠీలతో, రైఫిల్ బట్‌లతో కొట్టారు. బూట్లతో తన్నారు. జవాన్లు కొడుతున్నప్పుడు బాధతో అరిచిన అరుపులు ఆ ప్రాంతమంతా మారుమోగాయని పలువురు బాధితులు, గ్రామస్తులు నిజనిర్థారణ కమిటీ బృందానికి చెప్పారు.

ఒక బాధితుడు రామ్ సురిన్ ఇంట్లో సామాన్లనున సిఆర్‌పిఎఫ్ ధ్వంసం చేసింది. ఇంట్లో వున్న పెట్టెలు పగులగొట్టారు, సంచులు చింపేశారు. ఇంట్లో ఉంచిన రేషన్, వరి, బియ్యం, పప్పుధాన్యాలు, బఠానీలు అన్నింటినీ ఇల్లంతా వెదజల్లి నాశనం చేశారు. పెట్టెల్లో ఉంచిన పత్రాలు, ఖటౌని (భూమి పత్రాలు), సరుకుల రశీదులు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను కాల్చేశారు. ఈ కుటుంబం ఇటీవల గేదె, మేకలను అమ్మి దాచుకున్న 35,000 రూపాయలు ఈ దాడిలో మాయమైపోయాయి. సిఆర్పిఎఫ్ ఈ ఇంటి నుంచి లేదా బాధితుల యిళ్ల నుంచి మావోయిస్టులకు సంబంధించిన ఏ పత్రాలు దొరకలేదు. ఎలాంటి పత్రాలను తీసుకెళ్ళలేదు కూడా.

సిఆర్‌పిఎఫ్ వారు తమను కొట్టినట్లు బాధితులు పోలీసులకు స్పష్టంగా చెప్పినప్పటికీ, పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ (నం. 20/2020 తేదీ 17 జూన్ 2020, గోయిల్‌కెరా పోలీస్ స్టేషన్) లో ఏమీ రాయలేదు. సిఆర్‌పిఎఫ్ చేసిన హింసాత్మక చర్యను పట్టించుకోలేదు.. సిఆర్‌పిఎఫ్ గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించకుండా, బాధితులను అజ్ఞాత నేరస్తులు కొట్టారని ఎఫ్‌ఐఆర్‌లో రాసారు. సిఆర్‌పిఎఫ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవద్దని, హింసలో వారి పాత్ర గురించి ప్రస్తావించవద్దని పోలీసులు ఆసుపత్రిలో బాధితులపై ఒత్తిడి తీసుకువచ్చారు.

ఈ ఘటన, పోలీసుల తీవ్ర అభ్యంతరకరమైన ప్రతిస్పందన, జార్ఖండ్‌లో సిఆర్‌పిఎఫ్, పోలీసులు చేస్తున్న ఆదివాసీల హక్కుల ఉల్లంఘనను మరోసారి బహిర్గతం చేసింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన సూచనలు (ట్విట్టర్ ద్వారా) ఇచ్చినప్పటికీ స్థానిక పోలీసులు దర్యాప్తును తప్పు దిశలో నడిపించేట్లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, హింసకు కారణమైన సిఆర్‌పిఎఫ్ సిబ్బంది నిర్దోషులుగా తప్పించుకు పోతారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఈ సంఘటనకు సంబంధించి నిజ నిర్థారణ కమిటీ బృందం వెస్ట్ సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్, పోలీసు సూపరింటెండెంట్‌లను కలిసింది. కొంతమంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది బాధితులను కొట్టారని పోలీసు సూపరింటెండెంట్ అంగీకరించారు, కాని వారు సిఆర్‌పిఎఫ్ ప్రవర్తనను "సరిగా వ్యవహరించలేదనీ (మిస్‌హ్యాండ్లింగ్)" అని "తమ వృత్తికి తగినట్లుగా లేదనీ (అన్ ప్రొఫెషనల్)" అని పదేపదే అన్నారు. హింసలో సిఆర్‌పిఎఫ్ పాత్రపై ఎటువంటి సందేహం లేదని డిప్యూటీ కమిషనర్ స్పష్టంగా పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ను సరిదిద్దుతామని, బాధితుల వాంగ్మూలాలు మళ్లీ నమోదు చేస్తామని ఇద్దరూ హామీ ఇచ్చారు. ఈ కేసులో బాధితులకు న్యాయం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

జార్ఖండ్ జనాధికర్ మహాసభ డిమాండ్లు:

• పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (20/2020 డిటిడి 17 జూన్ 2020, గోయిల్‌కెరా పోలీస్ స్టేషన్) లో వెంటనే సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని దోషులుగా నమోదు చేయాలి! బాధితుల సాక్ష్యాలను ఎటువంటి మార్పు లేకుండా సరిగ్గా నమోదు చేయాలి, తప్పుడు వాంగ్మూలాలను నమోదు చేసినందుకు స్థానిక పోలీసులపై కూడా దర్యాఫ్తు జరపాలి. నివేదికలో సూచించిన ఐపిసి, ఎస్సీ-ఎస్టీ చట్టానికి సంబంధించిన సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలి. హింసకు కారణమైన సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని వెంటనే అరెస్టు చేయాలి!

• ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టాలి, నియమిత కాలంలో దర్యాప్తు పూర్తిచేసి నివేదికను బహిరంగపరచాలి. ఈ హింసకు కారణమైన ప్రభుత్వ, పోలీసు, సిఆర్‌పిఎఫ్ సిబ్బందిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.

• బాధితులందరికీ జరిగిన శారీరక హింస, మానసిక వేధింపులు, ఆస్తి నష్టం కోసం తగిన పరిహారం చెల్లించాలి.

• చిరియాబేడ గ్రామంలో ప్రజల అటవీ హక్కులకు సంబంధించి పరిష్కరించని దరఖాస్తులను వెంటనే ఆమోదించాలి. అన్ని ప్రాథమిక సౌకర్యాలు (విద్య, తాగునీరు మొదలైనవి) అన్ని కుటుంబాల ప్రాథమిక హక్కులు (రేషన్, పెన్షన్, మన్‌రేగా ఉపాధి, అంగన్‌వాడీ సేవలు మొదలైనవి) గ్రామంలో ఉండేలా చూడాలి.

• ప్రజలను, ముఖ్యంగా ఆదివాసీలను ఏ విధంగానూ దోపిడీ చేయవద్దని స్థానిక ప్రభుత్వ సిబ్బందికి, భద్రతా దళాలకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలన్నింటినీ సత్వరం పరిష్కరించాలి. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల ముసుగులో భద్రతా దళాలు ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు.స్థానిక ప్రభుత్వ సిబ్బందికి, భద్రతా దళాలకు ఆదివాసీ భాష, సంస్కృతి, వారి జీవన విధానానికి సంబంధించి శిక్షణ ఇవ్వాలి, సున్నితంగా వ్యవహరించేలా చూడాలి.

No. of visitors : 493
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

యాభై వ‌సంతాల అజేయ‌శ‌క్తి న‌క్స‌ల్బ‌రీ

విర‌సం | 19.04.2017 12:26:24pm

ఏప్రిల్ 22న శ్రీకాకుళం జిల్లా బొడ్డ‌పాడులో విర‌సం బ‌హిరంగ‌స‌భ‌. కామ్రేడ్స్ వ‌ర‌వ‌ర‌రావు, పాణి, కాశీం వ‌క్త‌లు. ...
...ఇంకా చదవండి

International Seminar on Nationality Question

AIPRF | 20.11.2018 11:30:05pm

AIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky...
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 1

| 08.05.2017 09:37:50pm

When we look at the lives of these women martyrs many things strike us as extremely significant.The NDR in India is led by the Working class and peasantry.....
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •