ఆడుకొనే మైదానాలు
అమ్మ వొడులు అవుతున్నాయి
కొట్టిన బంతి జాడ వెతుక్కొంటూ వెళ్లిన
పిల్లల రాకని పాడుకొంటున్నాయి
చుట్టూ వేసిన కంచెల్లోంచి
చూపుని సూటిగా విసురుతున్నాయి
ఆ చేత్తో మూడు, ఈ చేత్తో మూడు కర్రపుల్లలు
ఒకందుకు వాళ్లు నాటిపోయారు
ఇప్పుడవే జ్ఞాపకాలయ్యాయి
ఏ బిడ్డని ఎక్కడ పాతేసుకొన్నదీ
ఏ పేగుని ఏ గాలిఅరల్లో దాచేసుకొన్నదీ
తల్లులకు అవే ఊత కర్రలయ్యాయి
పుస్తకాల సంచిని గిరాటేసి
రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం
వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు
స్నేహితుల భుజాలపైనుంచి
నవ్వుతూ చూడటమే చివరిచూపు
ఎక్కడెక్కడని వెతకాలి?
క్యాంపుల్లో కమిలిన రహస్య
చర్మాల అడుగున చూశారు..లేరు
వచ్చిపడే పచ్చిశరీరాల లెక్క తేలక
మతితప్పిన నదీ తావుల్లో గాలించారు..లేరు
తిరిగీ తిరిగీ మళ్లీ ఈ మైదానంలోకే..
ఇక్కడైతే బాల్యంలో అడుగుపెట్టినవాళ్లు
తిరిగి ఆ బాల్యంతోనే కంటపడతారని ఆశ
నూనూగు మీసాలతో కనిపించినవాళ్లు
ఇప్పటికీ ఆ మిసమిసలతోనే తిరిగొస్తారని భరోసా
ఇప్పుడు మైదానమూ, తల్లులూ పక్కపక్కనే
ఎవరైనా వచ్చి ఈ అడ్డుకంచె తీసేస్తే బాగుణ్ణు!
12 -07-16
Type in English and Press Space to Convert in Telugu |
మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన : రివేరా9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధం - ప్రజా ప్రతిఘటన పై రివేరా ఉపన్యాసం....... |
ఏప్రిల్ పండు II రివేరాపిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,... |
సాయంకాలం వాన!దుప్పటి కింద, దిండు అడుగున
పిల్లలు చూడకుంటా కప్పెట్టుకొన్న
వరదగూడుని మెలిపెడతావేమో... |
సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరావిప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే....... |
ఈ రాక్షస గీతి వింటారా?మనం నిలబడిపోయిన చోట నుంచే
మన నడకలను మోసుకెళుతున్నారు
మనం ఆపేసిన రాగాలనే
తీగలుగా సాగిపోతున్నారు
మన గొంతునీ, మన వంతునీ
మనక్కిచ్చేసి వెళుతు... |
రెప్పని కప్పని నిద్దురఒకే రాత్రిని కప్పుకొన్న మనకి
ఒక్క నిద్దుర చాలదా?
చుక్క కలని పొదువుకోడానికి
ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?... |
భయం చుట్టూ భయం..వీళ్లెక్కడ చంపుకుతింటారోనని ఆడవాళ్లకు భయం
భయంలేని ఆడవాళ్లంటే మగవాళ్లకు మహా భయం
దొంగలంటే భయం, పోలీసులన్నా మరి భయమే
తాళాలు లేని తలుపులంటే భ... |
నో, ఐ డోన్ట్ లైక్ టమాటటమాట రంగు సరే,
రసాలూరే సరస్సులేమీ..
కొంచెం కరిచిపట్టుకొన్న
మిలమిలా మీనాలేమీ..
పైకి కిందకి మునకలేసే
గత్తరబిత్తర గోళాలేమీ....... |
అద్గదీ...అటో ఇటో వేటో పోటో పడిపోవాల్సిందే!
పాలకులంతా ప్రజాస్వామికవాదులై
ప్రజలేమో నియంతలైతే ఏమి చేస్తాం?... |
యంత్ర భూతమైన ప్రేమలు పత్ర హరితాలు కావాలని..సామాన్యులను అసామాన్య కథానాయకులను చేస్తున్న కాలం ఇది. ఇరాక్, నికరుగువా, పాలస్థీనాల్లో పాల ఫ్యాక్టరీలపై బాంబులు వేస్తున్నవాడినీ, మన గిన్నెల్లో విష క్షీరాలన... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |