చదివిన వారిని ʹపాల్గుణʹ ఆవహిస్తాడు!

| సాహిత్యం | స‌మీక్ష‌లు

చదివిన వారిని ʹపాల్గుణʹ ఆవహిస్తాడు!

- మిసిమి | 16.07.2016 12:56:55pm

ʹపాల్గుణʹ రాజ్యం మాయం చేసిన విప్లవకారుడి కథ. ʹఇది కథ కాదు. గుండెను పిండే వాస్తవం. ఇట్లాంటి వాస్తవాలను ఇట్లా రాయడం ఎంత కష్టం?ʹ అని కా.అల్లం రాజయ్య అంటారు. కడుపులోనుండి దుఃఖం పైకి పొంగకుండా బహుశా పాల్గుణను ఎవరూ పూర్తిచేయలేరు. పాల్గుణ సహచరి మణి, బిడ్డ మేఘన కోసమే కాదు, మన చుట్టూ కలియతిరిగి, హృదయాలను స్పర్శించి మాయమయిపోయిన పాల్గుణ వంటి అధ్బుత మానవులను తలచుకోకుండా ఉండలేరు. ఎన్ కౌంటర్లలో అమరులైన విప్లవకారుల శవాలను స్వాధీనం చేసుకుని, పోలీసు నిర్బంధాన్ని ధిక్కరిస్తూ వారికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ, వారి ఆశయాలను నిర్భీతిగా, గర్వంగా ఎలుగెత్తే అమరుల బంధుమిత్రుల సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో దశాబ్దం పైగా కత్తి అంచు మీద ఆచరణలో ఉన్నది. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి పద్మకుమారి ఈ నవలికను రాశారు.

సరికొత్త లోతులను తడుముతున్న విప్లవ సాహిత్యం తానే సృజిస్తున్న కొత్తకొత్త రూపాల్లో విప్లవ గాధలను, అమరత్వ స్ఫూర్తినే కాదు, సుడులు తిరిగే దుఃఖపు జడిని, పడిపోతూ లేస్తున్న అమరత్వపు జండాను, దానిని ఒడిసి పట్టుకుంటున్న ఆప్తులను ఆవిష్కరిస్తున్నది. విప్లవ సాహిత్యం అంటే తుపాకి చేతపట్టి తూర్పు దిక్కు తరలిపోయే దృశ్యాన్ని ఊహించుకుని ఒక్క పేజీనైనా చదవకుండానే సాహిత్య పరిశీలకుల పరిమిత దృష్టి నిర్దారణ చేసి పడేస్తుంది. విప్లవమంటే వెంటనే గుర్తొచ్చే ఇమేజ్ వంటిదే ఇది కూడా. వర్గపోరాటం ద్వారా ఒక కొత్త మానవ సమాజాన్ని రూపొందించే క్రమంలో మనుషులు వేలాది పనులు చేస్తారు. శతాబ్దాల నుండి పేరుకుపోయిన వ్యవస్థ తాలూకు మకిలిని తొలగించి మనిషిని మనిషిగా తీర్చే సుదీర్ఘ ప్రక్రియ దోపిడి పాలకులను కూల దోసి కార్మిక వర్గం అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగితుంది. ఈ మానవ ఆచరణలో భాగంగా విప్లవాన్ని అర్థం చేసుకుని విప్లవ సాహిత్య, సాంస్కృతిక రంగాన్ని ఆ వైపు నుండి చూడగల దృష్టి అలవడుతుంది.

అట్లా చూస్తే తెలుగు సాహిత్యంలో విప్లవ కథ ఎప్పటికప్పుడు తన పాత్ర పోషిస్తూ వచ్చింది. ఇప్పుడు, ఈ కాలానికి దండకారణ్య కథలు ఒక ఆచరణలో రూపొందుతున్న విప్లవ మానవులను, వర్గపోరాటంలో సుసాధ్యం చేస్తున్న సామాజిక మార్పును అనేక కోణాల్లో ఆవిష్కరిస్తున్నాయి. మరో అంచు నుండి పద్మకుమారి కథలు ఒక ఉద్విగ్న సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాయి. పద్మకుమారి విప్లవ సాహిత్యంలో సరికొత్త స్వరం. అరుణతార పాఠకులకు అదిప్పటికే పరిచితం. ఆమె ఎంచుకునే ఇతివృత్తానికి సరిగ్గా అమరే ప్రక్రియను ఎంచుకుని ప్రయోగాలు చేయడం విశేషం. యాభై, అరవై పేజీల్లో కొత్త తరం పాఠకులకు చేరువయ్యే ప్రక్రియగా నవలికను ఎంచుకుని ఇప్పటికే రెండు పుస్తకాలు ప్రచురించారు. వీటిలో మొదటిది కాంత పున్నం వెన్నెల. రెండోది పాల్గుణ.

పాల్గుణ మట్టివేళ్ళ నుండి రూపొందిన విప్లవకారుడు. సింగరేణి గని కార్మికుడిగా అత్యంత సహజంగా కార్మికోద్యమానికి దగ్గరై, కార్మికవర్గ రాజకీయాలను సొంతం చేసుకున్నవాడు పాల్గుణ. ఎనిమిదో తరగతి చదివే బుజ్జికి ఆర్గనైజర్ గా ఎట్లా పరిచయమయ్యాడో అంతకన్నా కుటుంబసభ్యుడి వలె ఆప్తుడిగా దగ్గరైన మానవ సంబంధం, ఆయన భార్య మణి స్నేహం, నిర్భంధం, రాజ్యహింస విరుచుకుపడినప్పుడు పంచుకున్న ఆందోళనా, దుఃఖమూ ఇవన్నీ ఇరవై ఎనిమిదేళ్ళ తర్వాత మనకు చెప్తుంది. ఇట్లా చెప్పడం మొదలు పెట్టడానికి ప్రేరేపించిన సందర్భం చాలా విచిత్రమైనది. నిజానికి ఈ కథలోని బలం అదే.
1984 చివరి నుండి బహుశా 90 దాకా పాల్గుణ వంటి కార్యకర్తలను ఎంతో మందిని ఇళ్ల నుండి, కార్యక్షేత్రం నుండి కనిపించిన వారిని కనిపించినట్లుగా ఎత్తుకుపోయి పోలీసులు మాయం చేశారు. అరెస్టా, ఎన్ కౌంటరా... ఏ వార్తా తెలియదు. ఆనాటి కల్లోలాన్ని ఇన్నేళ్ల తర్వాత ఇట్లా మనముందు పెట్టడానికి రచయిత పని చేస్తున్న కార్యరంగమే కారణం కావొచ్చు. ఒక విప్లవకారుడి అమరత్వం చుట్టూ పేగు బంధాల, ఆత్మీయ సంబంధాల ఉద్వేగాన్నంతా రాజ్యం చేసే అమానవీయ హింస సాక్షిగా ఆమె, ఆమె సంఘం ప్రపంచానికి చాటుతున్నారు. మృతదేహాలను కుళ్లబెట్టి మాంసపు ముద్దలుగా కుటుంబ సభ్యులకు అందజేయడమో, ఒక్కోసారి శవాలను కూడా అప్పగించకుండా కాల్చి బూడిద చేయడమో – ఇటువంటి రాజ్యదుర్మార్గంతో చేసే దుస్సహమైన పోరాటం అది. ఇట్లా మాయమై చివరి చూపు కూడా దక్కని ఆత్మీయుల దుఃఖం ఎన్నడు తీరేను?

పోలీసులు మాయం చేసి చంపేన పాల్గుణ అందరి దృష్టిలో ఒక జ్ఞాపకం మాత్రమే. అది అమరత్వపు వెలుగే కావొచ్చు. అయితే అతన్ని అమితంగా ప్రేమించిన సహచరికి మాత్రం మెదడు లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకం మాత్రమే కాదు. ఏనాటికైనా తిరిగొస్తాడనే తీరని ఆశ. జ్ఞాపకమై మిగిలిపోయిన పాల్గుణ ఒకానొక ఉద్విగ్న సందర్భానికి లేచివస్తాడు. ఆమెతో మాట్లాడతాడు. నేను పాల్గుణతో మాట్లాడానక్కా అంటూ రచయితకు తన్మయంతో చెప్తుంది మణి. అక్కడే మొదలవుతుంది కథ. ఎంత గొప్ప ఎత్తుగడ? అక్కడి నుండి జ్ఞాపకాలు.

చివరి భాగం ఒక విస్పోటనం. పాల్గుణ చనిపోయిన ఎన్నో ఏళ్ల తర్వాత ఆయనతో ఆయన సహచరి ఎట్లా మాట్లాడిందో చెప్తుంది రచయిత. ఇరవై ఎనిమిది సంవత్సరాల నిరీక్షణకు అంతం పలకడానికి పాల్గుణ తన అన్న కొడుకు అనిల్ శరీరం ద్వారా మాట్లాడతాడు. చివరి చూపు దక్కకుండా ఆ కుటుంబం మొత్తం ఉగ్గబట్టుకున్న దుఃఖం అన్నేళ్ళ తర్వాత పెల్లుబుకుతుంది. మణి నిరీక్షణ అంతమై సాంత్వన చేకూరుతుంది.

ఈ రూపంలో కాకుండా ఇంకా ఎట్లా చెప్పినా ఆ ఉద్వేగం మనకు తాకదు.

ʹఆ ఎముకలు పాల్గుణవి కాదని, తను తిరిగి వస్తాడని ఇంతకాలం అనుకోవడంలో సంతృప్తిని, శక్తిని పొందిన మణికి ఇప్పుడు ఆ సమాధి పాల్గుణదే అనుకోవడం వల్ల కూడా ఏదో శక్తి పొందినట్టుంది. ఎందుకంటే ఆ మాట ఇప్పుడు పాల్గుణే వచ్చి చెప్పాడని ఆమె నమ్మకం. ఇన్నేళ్ళ పాటు ఉండిపోయిన ప్రశ్నకు, ఎదురుచూపుకు ఇప్పటికీ ఆమెకు ఒక సమాధానం దొరికింది. ఈ వయసులో ఇది ఆమెకు అవసరం. ఆ సంగతి ఆమె కూడా గుర్తించినట్లుంది. ఇప్పుడామెకు తనదంటూ బిడ్డా, అల్లుడు, మానమరాలు.. ఒక కుటుంబం ఉంది. రక్షణ ఉంది. పాల్గుణ ఉన్నాడని, వస్తాడని ఇంకా ఆమె ఎందుకు ఎదురు చూడాలి? అవునూ-కాదూ అనే సందిగ్ధంలో ఇంకా ఆమె ఎందుకు ఎదురుచూడాలి? అవునూ-కాదూ అనే సందిగ్ధతలో ఎంత నలిగిపోయిందో. బహుశా ఈ మొత్తానికి ఇక తెరపడినట్లే.ʹ

పాఠకులు ఎక్కడ ఇరుక్కుంటారోనని అన్ని చిక్కులూ ఇలా విప్పింది రచయిత. ఆమె పాత్రల్లా, ఆమె పాఠకులూ ఆమెకు అర్థమవుతారు. ఇంటలిజెంట్ పాఠకులనబడే వారికి ఈ చివరి వివరణ అవసరం లేకపోవచ్చు.

ఈ నవలిక చదివిన వారికి లాటిన్ అమెరికన్ నవల ʹవిడోస్ʹ (ఏరియల్ డార్ఫ్ మెన్ రచన) గుర్తుకు రాక మానదు. పాల్గుణ తెలుగులో అంత గొప్ప నవల కాగలదు. సాధారణ పాఠకుల కోసమే దీనిని నవలికగా రూపొందించారు కావొచ్చు. అయినప్పటికీ తెలుగు సాహిత్యంలో ఈ కాలపు విలువైన రచనల్లో ఇది ఒకటి.

No. of visitors : 900
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ

-మాయా పలిత్ | 02.01.2017 11:54:34pm

ʹCaste, Conflict and Dress Changeʹ అనే అధ్యాయాన్ని 9వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుండి తొలగిస్తున్నట్లు సి.బి.ఎస్.ఇ (ఉన్నత పాఠశాల కేంద్రీయ విద్యా ...
...ఇంకా చదవండి

తెలుగువారి ముంగిట్లోకి ప్రపంచం

మిసిమి | 17.06.2016 11:09:21am

విశ్వ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన మనిషి గురించి, ఆ మనిషి సృష్టించుకున్న ప్రపంచం గురించి ఆలోచించినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, కవిగా శ్రీశ్రీ పొందిన ఉద్వేగా...
...ఇంకా చదవండి

దేవతా - దెయ్యమూ

మిసిమి | 03.09.2016 12:53:20am

ఆ అమ్మాయి పదిహేనేళ్ల వయసులో చాలా అందంగా ఉండేదట. ఆ ఊరి భూస్వామి ఆమె మీద మోజుపడి, కుట్రపన్ని ఆమె తండ్రిని హత్య చేసి ఆమెను చేరదీసి చేసి ఇంట్లో బంధించి........
...ఇంకా చదవండి

మాయమైన నజీబ్ మాట్లాడే సంగతులు

మిసిమి | 05.04.2017 09:43:48pm

దేశంలో అసహనం (ఉన్మాదం అనవలసినదాన్ని) గురించి రచయితలు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు మూకుమ్మడి నిరసన తెలిపినప్పుడు మన ప్రభుత్వం వెటకారం చేసిన విషయం ఎంత.......
...ఇంకా చదవండి

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన

| 01.10.2018 10:37:48pm

సమాజంలో బలహీనవర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులపై రాజ్యం తీవ్రవాద వ్యతిరేక చట్టాలను సరైన ఆధారం లేకుండా ప్రయేగించేటప్పుడు అది కూడా ఒక రకమైన టెర్రర్... ...
...ఇంకా చదవండి

చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ

రాహుల్ మాగంటి | 22.09.2018 11:48:04pm

ఆంధ్రప్రదేశ్ లోని ఆ తీర ప్రాంత గ్రామంలో పారిశ్రామిక కాలుష్యం చేపల్ని చంపేసాక మత్యకారులు ఏమయ్యారు? సముద్రమంత గతానికి అనిశ్చిత భవిష్యత్తుకు మధ్య పెనుగులాడు.....
...ఇంకా చదవండి

మానవహక్కులను వెటకారం చేసే ద్వేషభక్తులు అర్థం చేసుకోలేనిది.

మిసిమి | 17.03.2019 09:38:24am

జెనీవా ఒప్పందం గురించి ఎంత ప్రచారం జరిగింది! పట్టుబడిన యుద్ధ ఖైదీని, అది సివిల్ వార్ అయినా సరే మానసిక శారీరక హింసకు గురిచేయకుండా ఎట్లా చూసుకోవాలో సోషల్ మీ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •