బీజేపీ నమూనా.. అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ : రానా అయుబ్

| సంభాషణ

బీజేపీ నమూనా.. అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ : రానా అయుబ్

- ఇంటర్వ్యూ : అరుణాంక్ | 16.07.2016 01:13:23pm

రానా అయూబ్.. తన పేరును, గుర్తింపును, మతాన్నిమార్చుకొని, ʹమైథిలీ త్యాగీʹగా 8 నెలల పాటు గుజరాత్లో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. 2010లో ʹతెహల్కాʹ జర్నలిస్టుగా ఈ మిషన్ను నిర్వహించిన రానా గుజరాత్ పోలీసు శాఖలో కీలక అధికారులను, బ్యురాక్రట్లను, మాజీ మంత్రి మాయా కోడ్నానీని, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని సైతం కలుసుకొని వారి సంభాషణలన్నింటినీ రహస్య కెమెరాల్లో రికార్డు చేశారు. 2002 గుజరాత్ అల్లర్లు, సోహ్రాబుద్దీన్, ఇష్రత్ జహాన్ తదితరుల ఎన్కౌంటర్లు, గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్య వంటి సంఘటనల వెనుక రాజకీయ కుట్రలున్నాయనీ, రాజ్యం పాత్ర ఉందనీ, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న హిందూత్వ శక్తుల కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగాయనీ ఈ స్టింగ్ ద్వారా రానా రుజువు చేశారు. ప్రమాదం అంచున పయనిస్తూ చేసిన స్టింగ్ ఆపరేషన్ ఫలితాలను వెలుగు చూడకుండా పత్రిక సంపాదకులే అడ్డుకున్నారు. కానీ.. ఇప్పుడామె పుస్తకం ʹగుజరాత్ ఫైల్స్ - అనాటమీ అఫ్ ఎ కవరప్ʹ దేశంలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో జరిగిన పుస్తకావిష్కరణ సందర్భంగా రానా అయుబ్ విరసం ఆన్‌లైన్‌ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో... పలు విషయాలను పంచుకున్నారు.

రానా మీరు గుజరాత్ లో స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గుజరాత్ అభివృద్ధి నమూనాను దేశమంతా అమలు చేస్తా అనే అంబానీ, ఆదానీ కార్పోరేట్ ప్రచారంతో ప్రధానమంత్రి అయ్యాడు . ఇంతకీ గుజరాత్ అభివృద్ధి నమూనా అంటే ఏమిటి ? ఇప్పుడు దేశమంతా అదే నమూనా అమలవుతోందా?


రానా: గుజరాత్ నమూనాని అందరూ కమ్యూనల్ అంటున్నారు . నేను అవినీతికరమైనదని అంటాను. అందులో సెజ్ ల ఉల్లంఘనలకు పాల్పడ్డ అదానీలాంటి క్రోని కాపిటిలిస్టులున్నారు. వారికి ప్రభుత్వం నుండి మద్దతుంది. అక్కడ సాఫ్ట్ హిందుత్వ కలిగలిసిన నమూనా అమలు జరిగింది. పెట్టుబడిదారీ విధానం, క్రోనీ కాపిటిలిజం దేశవ్యాప్తంగా అమలు జరిగింది. దానిని నేను కాదనట్లేదు. వాడుకొని వదిలేయటం అనే నమూన గుజరాత్ లో అమలు చేయబడ్డది. ఈ విషయాన్ని గురించి ʹగుజరాత్ ఫైల్స్ʹ లో సైతం రాశాను. సుబ్రమణ్య స్వామిని రఘురాజన్ కి వ్యతిరేకంగా మాట్లాడించి ప్రయోజనం నెరవేరగానే స్వామి అలా మాట్లాడి ఉండాలిసింది కాదాని మోదీ అంటున్నాడు. సరిగ్గా ఇదే గుజరాత్ లో అమలు జరిగింది. గుజరాత్ నమూన దేశం మొత్తం అమలవుతుందో లేదో చెప్పలేను కానీ.. దిల్లీ లో ఆ నమూన స్వల్పంగా కనపడుతుంది. బి.జె.పి అనుకూలురుగా చెప్పుకునే వాళ్లంతా జర్నలిస్టులును తిడుతున్నారు. మొన్నటివరకు ఎక్కడో ఉన్నవాళ్ళు నేడు ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారు. బి.జె.పి ఎంపి యోగి ఆదిత్యనాథ్ పార్లమెంట్లో మతహింస నిరోధక బిల్లును ప్రవేశపెట్టాడు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే యోగి ఆదిత్య నాద్ ఎలా ʹ కమ్యూనల్ వయిలెన్స్ బిల్ ʹ పెడతాడు . దిల్లీ లో జరుగుతున్నది గుజరాత్ నమూన కొనసాగింపు .

గుజరాత్ అల్లర్లకు నాయకత్వం వహించిన వారిలో చాలా మందికి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ నిరంతరం కొనసాగుతూ వస్తోంది ?


రానా : వాళ్ళు తమకు అనుకూలమైన అధికారుల పదవీ కాలనీ పొడిగిస్తూ... లేదా అనుకూలమైన అధికారులను నియమిస్తూ వస్తున్నారు. పి.బి.పాండేని గుజరాత్ హైకోర్టు పరారీలో ఉన్న వ్యక్తిగా పేర్కొన్నది. నేడు అతను డైరక్టర్ జనరల్. పరారీలో ఉన్న వ్యక్తికి బెయిల్ వచ్చి క్లీన్ చిట్ ఇవ్వడం భారతదేశ చరిత్రలో మొదటిది. ఈ విధంగా చాలా మంది అధికారులను , ఎన్నో హత్యలకు కారణమైన వారిని వదిలేయడం తిరిగి వాళ్ళకే అధికారాన్ని కట్టబెట్టడం తప్పుడు సంకేతాలని ఇస్తుంది.

మాయ బెన్ కొద్నానికి బెయిల్ అనేక సార్లు పొడిగించారు. కాని ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కుంటున్న ముస్లింలకు, ఆదివాసులకు బెయిల్ రావట్లేదు దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?


రానా : 1992ముంబై బాంబ్ పేలుళ్ళు కేసులో 82 ఏండ్ల ముసలావిడపై ఉగ్రవాద సంబంధాల కేసు పెట్టారు. ముంబై పేలుళ్లలో వాడిన వాహనాల్లో ఒకటి ఆమె కుటుంబానికి చెందినది అనేది ఆరోపణ. తనకి నేటి వరకు బెయిల్ రాలేదు. మాయ బెన్ కొద్నానిపై అంతకన్నా తీవ్రమైన కేసులున్నాయి. మహారాష్ట్రలో ఆదివాసులపై రాజద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక కేసులు పెట్టారు. వారు అంబేద్కర్, భగత్ సింగ్ సాహిత్యాన్ని పంచడం నేరమవుతుంది. ఈ కేసులను మాయ బెన్ కొద్నానిపై ఉన్న కేసులను పోల్చి చూడండి. ఇది న్యాయం కాదు. ఇది కావాలని చేస్తున్నది. మాయ బెన్ కొద్నాని లాంటి వాళ్ళు వదిలేయబడుతున్నారు . గుల్బర్గాలో కుట్రదారులను వదిలేసి అనుచరులను పట్టుకున్నారు. అసలు కుట్రదారులు ఎవరో అందరికీ తెలుసు. కాని పట్టుకునేది మాత్రం అనుచరులనే. ఈ విషయంలో కనీసం మీడియా కూడా మాట్లాడలేదు .

మీ పుస్తకంలో షాహిద్ అజ్మీ గురుంచి రాశారు. షాహిద్ అజ్మీ లాగే హక్కుల కోసం పోరాడినందుకు ఆరుగురు పౌరహక్కుల ఉద్యమకారులు రాజ్యం చేత హత్య చేయబడ్డారు. మోదీ అధికారంలోకి వచ్చాక పన్సారే, దభోల్కర్, కల్బుర్గి హత్య చేయబడ్డారు. వీటన్నిటిని ఎలా చూడాలి ?


రానా: మోదీ కానీ, మోదీ పార్టీగాని పన్సారే, దభోల్కర్, కల్బుర్గిని చంపించింది అని నేను అనను. కానీ వారి నుంచి ఖండన ఎందుకు లేదు అని అడుగుతున్నాను. సనాతన సంస్థ అనే సంఘం ఎందుకు నిషేధింపబడలేదు? వాళ్లు పేలుళ్లు చేశారని, పన్సారే, దభోల్కర్ హత్యలకు కారకులని సరిపోయే ఆధారాలన్నీ ఉన్నాఎందుకు ఆ సంస్థలను నిషేధించట్లేదు? బ్యాడ్మింటన్ ఆటగాళ్లను అభినందించిన మోది అదే ట్విట్టర్లో హేతువాదుల హత్యలను ఖండించడం కానీ, సనాతన సంస్థ పై వ్యాఖ్యానించడానికి ఎంత సమయం తీసుకుంటుంది ? హంతకులకు వ్యతిరేకంగా కానీ అనుకూలంగా గాని మోది మాట్లాడకుండా పన్సారే, దభోల్కర్, కల్బుర్గిని హత్య చేసిన వాళ్ళ మైండ్ సెట్ ను ప్రోత్సహిస్తున్నాడు.

అట్టడుగు ప్రజలపై, ముస్లింలపై జరుగుతున్న హిందుత్వ ఫాసిస్ట్ దాడిని, ఆదివాసులపై జరుగుతున్న గ్రీన్ హంట్ ని ఎలా చూస్తారు ?


రానా: హిందుత్వ హంట్, గ్రీన్ హంట్ అనేవి కేవలం పేర్లు మాత్రమే. వీటన్నిటిని ఒకే గొడుగు కిందకి తెచ్చి ʹవిచ్ హంట్ ʹ అందాం . చిదంబరం హోం మంత్రిగా ఉన్నప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరు మీద ఏం జరిగిందో అందరికి తెలుసు. సల్వాజుడుం పేరు మీద ఎం జరిగిందో అందరికి తెలిసిందే. గ్రీన్ హంట్ అనేది అశ్రిత పెట్టుబడి దారి వాదం . నక్సలైట్ల అణిచివేత అనేది ముసుగు మాత్రమే. అధికారం లేని ప్రజల నేలను లాక్కునేందుకు చేస్తున్నదే గ్రీన్ హంట్. ఆ నేలను పెట్టుబడిదారులకు ఇవ్వడానికి చేస్తున్నదే గ్రీన్ హంట్ . ఇది బి.జె.పి తోనో , హిందుత్వతోనో ముడిపడివున్న సమస్య కాదు . ఇది అధికారం, పెట్టుబడైదారిదారివాదంతో ముడిబడి ఉన్న సమస్య . దీనిపై మనం పోరాడాలి . ఇవి కొనసాగుతూనే ఉంటాయి . ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలూ ఈ సమస్య గురించి మాట్లాడవు . అధికారంలో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా ఇదే విధానాలు కొనసాగుతాయి . లౌకికవాద జెండా మేమే మోస్తున్నాం అని చెప్పే కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఎం చేసింది ? ధబోల్కర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న మహారాష్ట్ర లో చంపబడితే సనాతన సంస్థ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు ?

కాంగ్రెస్ పెట్టుబడిదారి పార్టీ , బి.జె.పి హిందుత్వ మతవాద పార్టీ , కానీ బి.జె.పి అధికారంలోకి పెట్టుబడిదారుల వల్ల వచ్చింది . దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?


రానా: బి.జె.పి నమూనా అశ్రిత పెట్టుబడిదారి విధానంతో కలగలిసిన సాఫ్ట్ హిందుత్వ . బి.జె.పి పైకి హిందుత్వగా కనపడుతున్న కాంగ్రెస్ కన్నా పెట్టుబడి అనుకూల వైఖరీ ఉన్న పార్టీ . ముందు FDI ని వ్యతిరేకించి నేడు అమలు చేస్తున్నది. ఇది RSS అయినా లేక కాంగ్రెస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు . RSS కూడా బి.జె.పి విధానాల పట్ల సానుకూలంగానే ఉన్నది . అశ్రిత పెట్టుబడిదారీ వాదాన్ని మచ్చిక చేసుకునేందుకు రఘురామ్ రాజన్ ని తొలగించారు .

మీ పుస్తకావిష్కరణలో అరుంధతి రాయ్ , రాజ్ దీప్ సర్దేశాయి పాల్గొన్నప్పటికీ ఒక్కరు కూడా మీ పుస్తకం గురుంచి రాయలేదు ఎందుకని?


రానా: అది నేను వాళ్ళకే వదిలేస్తాను. నా పుస్తకానికి సంఘీభావంగా వాళ్ళు రావడం నాకు చాలా సంతోషం . అరుంధతి రాయ్ నా పుస్తకం గురుంచి అంతర్జాతీయ ఎడిషన్ బ్లాగ్ కి రాసింది కూడా.

గుజరాత్ లో దళిత ,పౌరహక్కుల కోసం పోరాడిన వారు చంపబడ్డారు . మీ పుస్తకంలో దళితుడైన పోలీస్ ఉన్నతాధికారి వివక్షతని ఎదురుకున్నాడని రాశారు . దళితుల పట్ల వివక్షత నేడు యూనివర్సిటీల్లో మనం చూస్తున్నాం . వ్యవస్థీకృత హత్యగా అంటున్న రోహిత్ బలవన్మరణానికి అటువంటి వివక్షే కారణం. దానిని ఎలా అర్ధం చేసుకోవాలి ?


రానా: దళిత సమస్య కేవలం గుజరాత్ లో ఆగేది కాదు . అది దేశమంతా ఉంది .దళితులు , ముస్లింలు తీవ్రమైన వివక్షతను ఎదుర్కుంటున్నారు . వీరి కోసం మాట్లాడే రాజకీయ గొంతుకలు లేవు .దళితులకు ప్రాతినిధ్యం వహించే BSP .RPP ఏం చేస్తున్నాయి? ఉదిత్ రాజ్ ఇప్పుడు BJP తో ఉన్నాడు. అర్ధవాత బి.జె.పి ప్రభుత్వంతో ఉన్నాడు ఎందుకని రోహిత్ వేముల గురుంచి మాట్లాడటం లేదు . దళితులకున్న సమస్య ఇప్పుడు ముస్లింలకు ఉంది. వాళ్ళ నాయకులకు లేదు . రోహిత్ వేముల ఒక ఉదాహరణ మాత్రమే . వేలాది మంది రోహిత్ లు చనిపోయినా ఈ విషయాలు మారవు . మార్పు కావాలనుకునే దళిత నాయకులున్నారు . వారు రాజీ పడనందుకు పక్కన పెట్టారు . ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ అధికారంతో ʹరాజీʹ పడటం అవసరం .

కేసు నుండి నిర్దోషిగా విడుదుల కాబోతున్న వికారుద్దీన్ తో పాటు మరో ముగ్గురిని, ఇష్రాత్ జహాన్ , సోహ్రాబుద్దీన్ లాగే బూటకపు ఎంకౌంటర్లో చంపేశారు . ఇటువంటి వాటిని ఎలా చూస్తాం ?


రానా : మనం వీటిని బూటకపు ఎంకౌంటర్లలనడం మానేసి హత్యలు అనాలి . ఇవి బూటకపు ఎంకౌంటర్లు కాదు . న్యాయ వ్యవస్థ ఆవల జరిగిన హత్యలు . చర్చ కోసమైనా సోహ్రాబుద్దీన్ నిందితుడు అనుకుంటే ఎందుకని విచారణ జరిపించలేదు . ఎందుకని న్యాయబద్ధంగా విచారించలేదు . సమర్ధించుకునేందుకు అతను టెర్రరిస్ట్ అనడం కాదు ఎన్ కౌంటర్ బూటకమా ? సరైనదా ? కాదా ? అనేది చర్చ కాదు . పంతొమ్మిదేళ్ళ అమ్మాయి ఎలా జుడిషియల్ హత్య గావించబడ్డది అని నేను అడుగుతున్నాను . మనమందరం కూడా అదే అడగాలి . చంపింది తెలంగాణ ఉద్యమ కారుడినైనా , గుజరాత్ లో RTI కార్యకర్తనైనా అడగాల్సిన ప్రశ్న అది . సరైన ఎన్ కౌంటరా ? బూటకమా అనేది కాదు . అది న్యాయ వ్యవస్థ వెలుపల జరిగిన హత్య .ఇది మీడియా అడగాల్సిన ప్రశ్న.

రోహిత్ వేముల ఉద్యమాన్ని అణిచివేసేందుకు / పక్క దారి పట్టించేందుకే JNU ఘటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి , దేశ భక్తి ,జాతీయవాదంపై చర్చ చేశారా ?


రానా: దీనికి మోది ఏడ్చాడనుకుంటా కదా !( అరుణాంక్ : భారత మాత తన బిడ్డను కోల్పోయింది అన్నాడు . కాశ్మీర్లో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు భరతమాత బిడ్డలు కాదా ?) ఒకానొక సమయంలో ఆ ఏడుపు దళితుల ఓట్లను సాధించడానికి దోహదం చేస్తుంది . ప్రధానమంత్రి ఏడుపు నిజమైందే అని ఆశిస్తున్నా . కానీ రోహిత్ వేముల కోసం కార్చిన కన్నీళ్లు నిజమైనవే అయితే రోహిత్ వేముల మృతికి కారణమైన వాళ్ళని శిక్షించి న్యాయం చేయాలి కదా ! ఆ కన్నీళ్లు నిజమైనవే అయితే దళిత విద్యార్థుల పట్ల కొనసాగిస్తున్న వివక్షతను వెంటనే ఆపివేయాలి .

యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలగడానికి రెఫరెండం పెడితే అనుకూలంగా వచ్చింది . అది ఈ దేశం నుండి స్వాతంత్రం కోరుతున్న కాశ్మీరీలకు , ఈశాన్య ప్రజల ఆకాంక్షకు ఏమైనా బలం చేకూరుస్తుందా ?


రానా : అది నా గ్రహణ శక్తికి కన్నా చాలా ఎక్కువ, దాని మీద మాట్లాడటానికి చాలా మంది మేధావులున్నారు . బ్రిగ్జెట్ అయినా , కాశ్మీర్ అయినా ఇంకేదైనా నాకు తెలియదు . ఈ విషయాలు నేను మాట్లాడలేను . ఈ విషయాలు మాట్లాడాలి అంటే తెలిసుంటేనే మాట్లాడాలి .

మీరు రావడానికి రెండు రోజులు ముందు ఐసిస్ ఆరోపణలతో పదకొండు మంది ముస్లింలను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. వారికి ఐసిస్ తో కానీ , ఉగ్రవాద సంస్థలతో కాని సంబంధాలు లేవని వారి తల్లితండ్రులు అంటున్నారు . ఎక్కడ ఎన్నికలు జరిగినా , అల్లర్లు జరిగినా పాతబస్తీ ముస్లింలను అదుపులోకి తీసుకొని అక్రమ కేసులు బనాయిస్తుంటారు. ఇది ముస్లింలపై రాజ్య స్వభావానికి ఈ చర్యలు నిదర్శనమనుకోవచ్చా?


రానా : ఈ విషయంపై నాకు పూర్తిగా తెలియదు . ఒక వేళ వాళ్ళు నిరపరాధులు అని తేలితే ప్రభుత్వం భాద్యత వహిస్తుందా ? ఇంతక ముందు మక్కా మసీదు పేలుళ్ల విషయంలో అదే జరిగింది . వాళ్ళు నిరపరాధులు అని తెలిసిన వారు ఉగ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిగానే ముద్ర ఉంటుంది . దాన్ని చెరిపేయలేం . భారత ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి .నేనైతే వాటి చేతులు రక్తసిక్తమైవుంటాయి అంటాను .

యూనివర్సిటీలపై జరుగుతున్న విచ్ హంట్ ని ఎలా చూస్తారు ?


రానా : నేడు యూనివర్సిటీలను రాజకీయ ఆడ్డలుగా తయారు చేస్తున్నారు . అది దురదృష్టకరం . యూనివర్సిటీల మీద రాజకీయ ప్రకటనలు , యూనివర్సిటీ ల ముఖ్య ఉద్దేశాలను కాలరాస్తున్నాయి . విద్యార్థులు చేసే ఆలోచనలు దేశాన్ని ముందుకు తీసుకుపోయేవి . రోహిత్ విషయంలో HRD మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రకటనలు చాలా దురదృష్టకరమైనవి, తిరస్కరించదగినవి . ప్రధానమంత్రి కన్నీరు కార్చే బదులు ముందుగానే నష్ట నివారణ చేస్తే రోహిత్ వేముల బతికేవాడు . ఇది కేవలం HCU లో జరుగుతున్నది కాదు దేశ వ్యాప్తంగా జరుగుతున్నది . మతోన్మాద మూకలు దేన్ని పెంచి పోషిస్తున్నాయి . ప్రధానమంత్రి GDP కన్నా విద్య సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలి .

రోహిత్ వేముల కేసులో బండారు దత్తాత్రేయ ,స్మృతి ఇరానీ లపై SC,ST అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు అయింది . HRD మంత్రిత్వ శాఖ రోహిత్ వేముల దళితుడు కాదు OBC అని ప్రకటించింది . గుంటూరు జిల్లా కలెక్టర్ రోహిత్ దళితుడే అని చెప్పి , రెండు రోజుల తరువాత ఈ కేసులో కేంద్ర మంత్రులున్నారు కనుక మళ్లీ విచారణ చేస్తా అన్నాడు . భారత రాజ్యాంగం ముందు అందరూ సమానులే అంటుంది కదా ?


రానా: సమానత్వం అనేది నేడు ఏమీ లేదు .మనం సమానత్వం ఉన్న దేశంలో బతుకుతున్నాం అంటే నేను ఒప్పుకోను . నా తల తీసేసినా సరే మనం అసమాన దేశంలో బతుకుతున్నాం అంటాను .దానికి నేను కట్టుబడి ఉన్నా. ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా నేడు బి.జె.పి పాలన అయినా దేశ వ్యాప్తంగా వేరువేరు పా ర్టీల పాలన అయినా మనం అసమానంగా ఉన్నాం . మనం ఉన్న ప్రజాస్వామ్యంలో కొన్ని సెక్షన్లు అధికారాన్ని అనుభవిస్తాయి . అదే సెక్షన్లు మంచి విద్యను పొందుతాయి . టాక్స్ సబ్సిడీ పొందుతారు .ఋణాలు పొందుతారు. మనం అసమానంగా ఉన్నాం . మనం విశ్రాంతి గదుల్లో సేద తీరుతూ ప్రశ్నించడం ఆపేశాం . ప్రశ్నించడం ఆపకూడదు . నేను HCU ,JNU విద్యార్థులు సమానత్వం కోసం ప్రశ్నించడం పట్ల సంతోషంగా ఉన్నాను . నాకు ఆజాది అనేది దేశం నుండి కాదు అసమానత్వం నుండి . నిజానికి అది పెద్ద యుద్ధం .

మీ నుండి మరో పుస్తకాన్ని ఆశించవచ్చా ?


రానా: 2018 లో కొత్త పుస్తకంతో మళ్ళీ వస్తాను .అది అసమానత ,పెట్టుబడిదారీ వాదంపై సాగుతుంది

మీ రెండో పుస్తకాన్నైనా ప్రచురణ సంస్థలు ప్రచురిస్తాయి అని ఆశిస్తున్నారా ?


రానా: నాకైతే ఎటువంటి ఆశలు లేవు .ఒకవేళ వారు ప్రచురిస్తే నా సలాం . లేకపోతే నేనే ప్రచురించుకుంటాను.

No. of visitors : 1709
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఉదాస్ మౌస‌మ్ కే ఖిలాఫ్

అరుణాంక్, డిఎస్‌యూ | 23.03.2017 09:19:39am

భ‌గ‌త్‌సింగ్, పాష్‌ల ప్రాసంగిక‌త ఇవాల్టికీ ఉంది. పాష్ మాట‌ల్లోనే చెప్పాలంటే ʹహ‌మ్ లడేంగే సాథీ ఉదాస్ మౌస‌మ్ కే కిలాఫ్ʹ అంటూ క‌ద‌లాల్సిందే. ...
...ఇంకా చదవండి

అడవిని కాస్తున్న వెన్నెల

అరుణాంక్ | 04.09.2017 09:51:34am

పాట దూరమైంది. పాట పాడే గొంతు దూరమైంది. వినపడనంత. కనపడనంతదూర వెళ్ళారు వాళ్ళు. మదిలో, మస్తిష్కంలోవెన్నెల చెప్పిన మాటలే. వెన్నెలని ఎంత అద్భుతంగా చెప్పింది. వెన...
...ఇంకా చదవండి

న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు

అరుణాంక్ లత | 07.06.2018 09:07:57am

హిందు ఫాసిజం ఇటు దళితులకు అటు కమ్యూనిస్టు శిబిరానికి ఉమ్మడి శత్రువు. రాజ్యంలో ఉన్న హిందూ ఫాసిజం ఇద్దరిపై రక్తపువేటను కొనసాగిస్తున్నది. మిత్ర వైరుధ్యాన్ని తమ...
...ఇంకా చదవండి

అలసెంద్రవంక

అరుణాంక్‌ | 05.05.2017 01:06:18pm

నా ʹఅలʹలో ఎంత మార్పు. ʹమాటీగరిʹ ఇచ్చి చదవమన్నప్పుడు తెలుగు చదవడం కష్టంగా ఉంది అన్న అల ʹఅంటరాని వసంతంʹ గురించి మాట్లాడుతు ʹరేయ్ నాకు అటువంటి జీవితం లేదుʹ అన...
...ఇంకా చదవండి

ముసాఫిర్

అరుణాంక్ లత | 19.11.2018 03:39:50pm

ఒక నడక అతడి వెనకాల నడుస్తుంటే ఏమో అర్థం కానీ పదాలు వల్లే వేస్తూ పోతుంటాడు. నడుస్తూ, నడుస్తూ ఏదో దృశ్యాన్ని చూసి గున్ గునాయిస్తాడు. "ఇస్ దునియామే గమ్, నఫ్రత...
...ఇంకా చదవండి

యుద్ధానంతర యుద్ధగీతం

అరుణాంక్ | 06.09.2018 11:50:31pm

ప్రశ్నించిన ప్రతివాడు నక్సలైటే ఓ నా తెలంగాణ నేల నీకు గుర్తుందా! నీ మీదుగా దండకారణ్యానికి ఉద్యమమే కాదు ఇప్పుడు నిర్బంధమూ విస్తరించింది కాకపోతే రూరల్ పేద .....
...ఇంకా చదవండి

విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.

అరుణాంక్ లత | 04.02.2020 03:23:47pm

కాశీం అరెస్టుకు సంబంధించి కోర్టు అడిగిన ప్రశ్నలోనే ʹఅతడు ప్రొఫెసర్, దళిత, విప్లవ సాహిత్యాలను భోదిస్తున్నాడు. అవి విషయపరంగా షెడ్యూల్ కులాల ప్రజలపై జరుగుతు.....
...ఇంకా చదవండి

నెలవంక సందేశం

అరుణాంక్ | 16.06.2018 12:36:48am

ప్రశ్నించిన చోటల్లా బందీ కాబడుతున్న వాళ్ల సాక్షిగా దేశ ముఖచిత్రాన్ని మార్చే ఒక్క వాక్యం రాద్దాం ఒక్క కవాతు చేద్దాం ... ...
...ఇంకా చదవండి

కడలి

అరుణాంక్‌ | 05.03.2018 08:26:10am

రెండు సరిహద్దులను కలిపే వంతెనై కడలి సరిహద్దును పహారా కాసే నిగాహ్ నేత్రమైన సెంట్రీ కడలి జనమై కడలి జనసందోహమై కడలి...
...ఇంకా చదవండి

అల అడిగిన కథ

అరుణాంక్ | 18.08.2017 10:00:25am

ఎండిన చేపలు కాదు అవి. ఎండిన డొక్కలకు ఆహారమైన చేపలు. బతుకనీకి భరోసానిచ్చిన చేపలు....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నేను దీపాలు ఆర్పను.. కొవ్వొత్తులు వెలిగించను.. ఏం చేస్తావ్?
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  ఆ కన్నీటిని ఈ శిక్ష తుడిచేయగలదా?
  మీరెప్పుడూ అర్బన్‌ మావోయిస్టులనే మాట వాడలేదా?
  మనుషులకే అర్థమయ్యేదీ, పంచుకునేదీ దుఃఖమే అంటున్న పద్మకుమారి కథలు
  The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  Students and the Revolution
  గోడలమనుషులు
  దగ్ధహృదయమా !
  మూడో కన్ను

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •