స్థూపం చెప్పిన విజయగాథ

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

స్థూపం చెప్పిన విజయగాథ

- విర‌సం | 16.07.2016 03:00:12pm

వ్యవస్థల పుట్టుక, పని తీరును- మానవ క‌ర్తృత్వాన్ని మార్క్స్‌, ఏం‌గెల్స్ ‌గతితర్క పద్ధతిలో చూశారు. అందుకే ప్రజలే చరిత్ర నిర్మాతలని అన్నారు. శాస్త్రీయ సిద్ధాంతం వెలుగులో సాగే ప్రజా ఆచరణ వ్యవస్థల్లో మార్పులు తీసుకొని వస్తుంది. ఆ ఆచరణ క్రమమే సిద్ధాంతాన్ని మరింత పుటం పెడుతుంది. ప్రజా పోరాటాల్లో అమరత్వం అత్యున్నతమైనది. దాన్ని పదిలపరుచుకోవడం, స్మరించుకోవడం భవిష్యత్‌ ‌చరిత్రకు అత్యవసరం.

మన దగ్గరో వేలాది మంది ప్రజా వీరులు నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం అనేక రంగాల్లో పని చేస్తూ అమరులయ్యారు. తెలుగు నేల అంతటా ఎన్నో ఎరెర్రని స్థూపాలు కనిపిస్తాయి. అవి కేవలం పోరాటంలో నేలకొరిగిన వాళ్ల జ్ఞాపక చిహ్నాలే కాదు. ప్రతి స్థూపం మనకు చెప్పే చరిత్ర ఎంతో ఉన్నది.

స్థూపాలపై పేర్లు అనే రష్యన్‌ అనువాద పుస్తకాన్ని విప్లవ శిబిరంలో తప్పక అందరూ చదివే ఉంటారు. మన దగ్గర కూడా అలాంటి పుస్తకం వస్తే బావుండని ఎవరికైనా అనిపిస్తుంది. స్థూపాలపై పేర్లు అనే ఈ పుస్తకాన్ని ద్మీత్రి వలొవొయ్‌ ‌రాశాడు. ఆయన రాజకీయ అర్థశాస్త్రవేత్త. 1980లో దీన్ని రాశాడు. మాస్కోలోని అలెకాంద్రొవ్‌స్కీ ఉద్యానవంలో ఈ స్థూపం ఉండింది. విప్లవానంతరం దీన్ని ఏర్పాటు చేశారు. మార్క్స్‌, ఏం‌గెల్స్ ‌దగ్గరి నుంచి కార్మికవర్గ సిద్ధాంతరంగంలో, రష్యన్‌ ‌విప్లవ తొలి దశలో విశేష కృషి చేసిన ప్లహనోవ్‌లాంటి వారి దాకా 19 మంది మార్క్సిస్టు సిద్ధాంతకారులు, పోరాటకారుల పేర్లు దానిపై ఉంటాయి. వాళ్ల జీవితాలు, సిద్ధాంతాలు, పోరాటాలు చాలా విభిన్నమైనవి. అయితే మానవజాతి చరిత్రలో తొలి కార్మిక వర్గ విప్లవం విజయవంతం కావడంలో అలాంటి వాళ్ల పాత్ర ఉన్నది. ఆ వ్యక్తుల జీవితం, ఆలోచనలు ప్రపంచ కార్మిక వర్గ ఉద్యమాల చరిత్రలో అంతర్భాగం. కార్మికవర్గ విజయగాథను ఈ స్థూపం వినిపించింది. దీన్ని అక్టోబర్‌ ‌విప్లవ తొలి వార్షికోత్సవం నాడు ఆవిష్కరించారు. ఈ స్థూపం మీద పేర్లు ఉన్న వ్యక్తుల గురించి ఈ పుస్తకం క్లుప్తంగానే అయినా చాలా గాఢంగా, లోతుగా వివరిస్తుంది.

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని మరోసారి చదవడం అవసరం. అందుకని విరసం ఆన్‌లైన్ మ్యాగ‌జైన్‌లో దీన్ని ధారావాహికగా ప్రచురిస్తున్నాం. వ‌చ్చేసంచిక నుంచి ఆరంభం.

www.virasam.org

No. of visitors : 1494
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఔగుస్ట్ ‌బేబెల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 27.12.2016 10:24:05pm

19వ శతాబ్ది చివర్లోనూ, 20వ శతాబ్ది మొదట్లోనూ కార్మికవర్గ ఉద్యమం వెల్లువలా సాగుతున్న పరిస్థితుల్లో, సామూహిక రాజకీయ సమ్మెల...... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్
  ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •