కూలీల‌ను కాల్చిచంపి.. మావోయిస్టుల ముద్ర‌వేశారు

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

కూలీల‌ను కాల్చిచంపి.. మావోయిస్టుల ముద్ర‌వేశారు

- గుముడుమహా ఎన్‌కౌంటర్‌ పై clc నిజ నిర్దారణ | 20.07.2016 06:43:38pm

గుముడుమహా ఎన్‌కౌంటర్‌ పై నిజ నిర్దారణ కమిటి నివేదిక


పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటి మరియు పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్‌ కమిటీలు జూలై 8,2016న జరిగిన గుముడుమహా ఎన్‌కౌంటర్‌ పై వాస్తవాలు సేకరించడానికై ఉమ్మడిగా నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రొఫెసర్‌ లక్ష్మన్‌ గడ్డం, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్‌.నారాయణరావు రాష్ట్రప్రధాన కార్యధర్శి, మాదన కుమారస్వామి సంయుక్త కార్యదర్శి మరియు ఆంద్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వి. చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌, సంయుక్త కార్యదర్శి శ్రీమన్నారాయణలు పాల్గొన్నారు. ఈ కమిటీ తేది. 14-07-2016న ఒరిస్సా రాష్ట్రంలోని కందమాల్‌ జిల్లా గుముడుమహా గ్రామాన్ని సందర్శించి ఘటనా స్థలాన్ని పరిశీలించి, గ్రామస్థులతో, భాదిత కుటుంబ సభ్యులతో విచారించి సేకరించిన వివరాలు...

గ్రామీణ ఉపాధిహామి పథకం కింద పని చేస్తున్న దాదాపు 12 మంది గుముడుమహా గ్రామానికి చెందిన ఆదివాసీ కూలీలు తమకు రావాల్సిన కూలీ డబ్బులు తెచ్చుకోవాడానికి 40 కీ.మీ దూరంలో ఉన్న బెల్లిగూడకు జూలై 8, 2016 న వెళ్ళారు. ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కల్గడం వలన బ్యాంకులో చెల్లింపులకు చాలా ఆలస్యం జరిగినది. ఎట్టకేలకు డబ్బులు తీసుకుని కాంట్రాక్టర్‌ ఏర్పాటు చేసిన ఆటోలో తిరిగి ఇంటికి బయలు దేరారు. ఊరికి దగ్గరలో సమీస్తుండగా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆటో బురదలో ఇరుక్కుపోయింది. ఆటో డ్రైవరు జహాన్‌ మజ్జి ఆటోను తోయమనడంతో కూలీలు అందరు దిగి ఆటోను బురదలో నుంచి బయటికి తోశారు. ఆటో కొంచెం ముందుకు సాగి ఆపి వేశాడు డ్రైవర్‌. నీళ్ళలో బురద కడుక్కున్న తర్వాత ఆటోను సమీపించి ఎక్కబోతుండగా రోడ్డుకు ఎడమ ప్రక్క చెట్ల పొదల్లో మాటు వేసి కూర్చున్న పోలీసు బలగాలు ఒక్కసారిగా వారి మీదకు కాల్పులు జరిపారు. 5 మంది కూలీలు ఒక్క క్షణంలో అక్కడికక్కడే చనిపోయారు. మరో 5 గురికి తీవ్ర బుల్లెట్‌ గాయాలై కుప్పకూలారు. డ్రైవర్‌ తో సహా మరికొంత మంది తప్పించుకోగలిగారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. వీరి పేర్లు వరుసగా బింబులి మాలిక్‌ (30సం) (మహిళ), క్రిమేలి మాలిక్‌ (35సం) (మహిళ), మిడియాలి మాలిక్‌ (36 సం) (మహిళ), కుకల్‌ డిగాల్‌ (40సం) (పురుషుడు) మరియు గెహెజ డిగాల్‌ (2సం) (బాలుడు) ఉన్నారు. ఈ బాలుడు తల్లి వడిలో ఉన్నపుడు బుల్లెట్‌ వచ్చి తగిలి చనిపోయాడు. తల్లి సునితా డిగాల్‌, తండ్రి లుట్టో డిగాల్‌ తీవ్రంగా బుల్లెట్‌ గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతుండడం వలన కొడుకు గెహెజ డిగాల్‌ అంత్యక్రియలకు కూడా రాలేకపోయారు.

ఈ దారుణమైన ఘటనలో తప్పించుకున్న వాళ్ళు ఊరిలో కెళ్ళి గ్రామస్థులందరిని ఘటనా స్థలానికి తీసుకువచ్చారు. కాని పోలీసు బలగాలు చనిపోయిన వారిని గాయపడ్డవారిని చూడనివ్వకుండా దూరంగా ఆపివేసారు. ఊరిలోకి తరిమేసారు. పోలీసులు కర్కశంగా, అమానవీయంగా ప్రవర్తించి శవాలను, గాయపడ్డవారిని రక్తం మడుగులో ఆ రాత్రంతా అక్కడే వుంచి మరుసటి రోజు మద్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శవాలను బెరహంపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గాయపడ్డవారిని వేర్వేరు హాస్పిటల్‌లో చేర్పించారు. పోస్టుమార్టం తర్వాత శవాలను కుటింబీకులకు అప్పజెప్పారు. గాయపడ్డ వారు ఇంకా చికిత్స పొందుతున్నారు.

అమాయకపు ఆదీవాసీలను కిరాతకంగా చంపి మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతుండగా ఈ అటో మధ్యలోకి రావడం వలన తూటాలు తగిలి గ్రామస్థులు చనిపోయారని పోలీసులు కట్టుకథ అల్లారు. ఈ కథనం శుద్ధ అసత్యం. నిజానికి రోడ్డుకు ఎడమవైపు అతి దగ్గరలో మాటు కాచి కూచున్న పోలీసులు ఆటో బురదలో దిగబడింది చూసారు. కూలీలు నీళ్ళలో బురద కడుక్కున్నది చూసారు. కొద్ది దూరం నడిచి ఆటో చేరుకుంటున్నది చూసారు. వారు గ్రామస్థులని, కూలీలని, అమాయకపు ఆదివాసీలని తెలిసికూడ పాశవికంగా కాల్చిపడేసారు. నక్సలైట్లు దొరక్కపోవడంతో రక్తపు దాహంతో ఉడికిపోతున్న పోలీసులు నిస్పృహతో సాధారణ ప్రజలను కాల్చేసారు. పోలీసులు రోడ్డుకు ఎడమ వైపునుండి చెట్ల పోదల్లో కూచొని కాల్పులు జరపడంతో కుడివైపున ఉన్న చెట్టుపై బుల్లెట్లు తగిలిన గుర్తులు చాలా ఉన్నాయి. పైగా ఆ కూలీలు తెచ్చుకున్న ఆటోకు కూడా ఒక వైపు నుండే బుల్లెట్లు తగిలిన గుర్తులు ఉన్నాయి. కనుక ఇది ఖచ్చితంగా పోలీసులు జరిపిన ఏక పక్ష కాల్పులని నిర్ధారణ అవుతుంది. రెండు వైపుల జరిగిన కాల్పులు ఏ మాత్రం కాదు.

ఒక పథకం ప్రకారం, ఉద్ధేశ్యపూర్వకంగా పోలీసులు అమాయకపు ఆదీవాసీలను కాల్చిచంపారని, హత్య చేసారని నిర్ధారణ జరిగింది. మావోయిస్టులకు ఆదీవాసీలు సహాకరిస్తున్నారనే నెపంతో పోలీసులు అమాయకపు ఆదీ వాసీలను లక్ష్యంగా చేసుకొని కాల్చి చంపుతున్నారు. ʹʹఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ʹʹ పథకంలో బాగంగా మహిళలను అత్యాచారం చేసి హత్య చేస్తున్నారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా కాల్చేస్తున్నారు. ఆది వాసీ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తే ఆదీవాసీలు అడవి వదిలి వెళ్ళిపోతారని అడవి ఖాళీ అవుతుందని తదనంతరం బహుళజాతి సంస్థలకు అడవిని, ఖనిజ సంపదను సులువుగా అమ్మివేయొచ్చని భారత ప్రభుత్వం కలలు కంటున్నది. అందుకోసం రాజ్యమే ʹʹటెర్రరిస్టుʹʹగా మారుతుంది.

ఒడిస్సా ప్రజలకు జీవించే వనరులు కల్పించడం లేదు కాని పనికి ఆహారపథకం కింద పని చేసిన కూలీలను మాత్రం చంపేస్తున్నది. ఆదీవాసీ గ్రామాలలో స్కూళ్ళు, హాస్పిటళ్ళు, రోడ్లు, విధ్యుత్‌చ్చక్తి లాంటి పౌరసౌకర్యాలను కల్పించడం లేదు. దాదాపు 40కి.మీ నడిచివెళ్ళి నిత్యావసర వస్తువులు తీసుకురావాల్సి వస్తుంది. గర్బిణి స్త్రీలు మరింత దూరం వెళ్ళాల్సి వస్తుంది. రాజ్యం సంక్షేమరాజ్య లక్ష్యం నుంచి వైదొలుగుతుంది. కాని చట్ట విరుద్దమైన వివిద పేర్లతో పోలీసు బలగాలను ఏర్పాటు చేసి మావోయిస్టులను మట్టు బెట్టాలన్న ఆకాంక్షతో అమాయకులను కూడ చంపేస్తున్నది.


 1. గుముడుమహాలో ఆదివాసీలను కాల్చిచంపిన పోలీసులపై సెక్షన్‌ 302 కింద హత్యానేరం మోపి ప్రాసెక్యూట్‌ చేయాలి.
 2. చనిపోయిన వారికి రూ. 50 లక్షలు, గాయపడిన వారికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
 3. కాల్పుల్లో గాయపడిన వారికి మెరుగైన చికిత్సనందించాలి.
 4. ఆదివాసీలు నివసించే అడవిలో మోహరించిన పోలీసుల క్యాంపులను వెంటనే ఎత్తివేయాలి.
 5. ఎస్‌.సి., ఎస్టీ చట్టం కింద పోలీసులపై కేసులు నమోదు చేయాలి.
 6. సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత న్యాయవిచారణ జరిపించాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్‌ చేస్తున్నది.

పౌర హ‌క్కుల సంఘం,
తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్


No. of visitors : 4525
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పొలం ప‌ని చేసుకుంటున్నోళ్ల‌ను కాల్చిచంపారు

పావురిగూడెం ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ నివేదిక | 15.08.2016 10:53:46pm

పొలం పనులు ముగించుకుని పక్కనే పారుతున్న వాగులోకి స్నానానికి బయలుదేరి పోతున్న న‌లుగురు యువ‌కులను ఉన్న‌ప‌ళంగా చుట్టుముట్టిన పోలీసులు వారిని నిర్థాక్షిణ్యంగా.....
...ఇంకా చదవండి

నిషేదాలు, నిర్భందానికి వ్య‌తిరేకంగా ఢిల్లీలో స‌ద‌స్సు

| 09.09.2016 09:38:48am

రాజ‌కీయ, సామాజిక‌, సాంస్కృతిక నిషేదాల‌కు వ్య‌తిరేకంగా; హ‌క్కులు, స్వేచ్ఛా న్యాయాలు క‌లిగిన ప్ర‌జాస్వామ్య పున‌రుద్ధ‌ర‌ణ‌కై ఢిల్లీలో ధ‌ర్నా, స‌ద‌స్సు.........
...ఇంకా చదవండి

చంద్ర‌బాబుకు బహిరంగ‌లేఖ‌

పౌర హ‌క్కుల సంఘం | 02.11.2016 09:45:50am

అసలు ప్రభుత్వం టార్గెట్ ఎంత? ఇందులో మావోయిస్టులతో పాటు ఎంతమంది సాధారణ ఆదివాసీలను చంపాలనుకుంటున్నారు. న‌క్స‌లైట్ ఉద్య‌మం కారణంగా మన రాష్ట్రంలోకి .......
...ఇంకా చదవండి

పౌర ప్రజాస్వామిక హక్కుల అమలుకై రాజకీయనాయకులను నిలదీయండి

పౌరహక్కుల సంఘం | 06.12.2018 12:20:39am

ఈ విధమైన భయానక వాతావరణంలో, పోలీసుల డేగకన్నుల పహారాలో మహిళలు పోలింగు బూతులవరకు నడవడం ఎట్లా? క్యూలో గంటల తరబడి ఎందుకు నిలబడాలి? ఈ యుద్ద వాతావరణాన్ని తలపించే.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •