కశ్మీర్.. తుపాకీ బయోనెట్ నీడన నలిగిపోతున్న నేల. భద్రతా దళల ప్రత్యేకాధికారాల చట్టం అక్కడి ప్రజల పాలిట శాపంగా మారింది. ఉగ్రవాదం బూచిని చూపెట్టి అక్కడ అమాయకులపై జరుగుతున్న అకృత్యాలు అన్నిఇన్నీ కావు. వేలాది బిడ్డల్ని కోల్పోయిన తల్లుల నిరీక్షణకు అంతులేకుండా పోయింది. గత నెల రోజులుగా కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు దాదాపు 50 మందికి పైగా ప్రజల్ని బలితీసుకున్నాయి. తమ నేల మీద తాము స్వేచ్ఛగా జీవించలేని స్థితిలో కశ్మీర్ ప్రజలు.. అధికారం కోసం కశ్మీర్‌ని నిత్య యుద్ధరంగంగా మార్చుతున్న పాలకులు. నామ్ చామ్స్కీ, ఆమర్త్యసేన్ వంటి ప్రముఖుఔలు సైతం కశ్మీర్ ప్రజల ఆకాంక్షల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పడు పౌర సమాజం మౌనం వీడాల్సిన సందర్భం ఇది. ఈ నేపథ్యంలో కశ్మీర్ ʹదుస్థితి - పౌర హక్కులుʹ అనే అంశంపై లామకాన్ ఆగస్టు 2వ తేదీన చర్చా కార్యక్రమం నిర్వహిస్తోంది.
వక్తలు: ప్రొఫెసర్ హరగోపాల్
వి.రఘునాథ్, సీఎల్సీ
సంజయ్కక్, ఫిల్మ్‌మేకర్ (స్కైప్‌లో మాట్లాడతారు)
Type in English and Press Space to Convert in Telugu |
కశ్మీర్ పిల్లలు ఇండియా గురించి ఏమనుకుంటున్నారు?కశ్మీర్‌లోని బాలికలను భారత్ చంపుతున్నది. నేను అనేక ఘటనలను టీవీలో చూశాను. నేను బయటకే వెళ్లడం లేదు. బయటకు వెళ్తే.. పిల్లెట్స్ తగులుతాయేమోనని భయం......... |
భారత సైన్యాలు కశ్మీర్ ను వీడాలిప్రస్తుత కశ్మీర్ పరిస్థితి నన్ను దిగ్బ్రాంతికి గురిచేస్తున్నది . సమస్య పరిష్కారం అవ్వాలంటే భారత సైన్యాలు మొదట కశ్మీర్ ను వీడాలి . కశ్మీర్ కు తనదయిన......... |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |