ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ ʹనేను అభాగ్యుల పక్షాన నిలబడి నా శాయశక్తులా కలంతో పోరాటం కొనసాగిస్తున్నాను. ఆవిధంగా నాకు నేను సంజాయిషీ చెప్పుకోవలసి వస్తే తల దించుకోవలసిన అగత్యం ఏనాడూ కలగబోదుʹ
మహశ్వేతాదేవి (జనవరి 14, 1926- జులై 28, 2016) రచయితగా సమాజానికి అట్లా బాధ్యత పడి, సామాజిక కార్యకర్తగా కూడా ప్రజల పక్షాన, ప్రజా పోరాటాల పక్షాన జీవితమంతా దృఢంగా నిలిచారు. విప్లవ రచయితల సంఘం ఆమెకు వినమ్రంగా జోహార్లర్పిస్తున్నది. ముఖ్యంగా రైతుకూలీల, ఆదివాసుల పక్షాన ఆమె శక్తివంతమైన కలాన్ని నిలిపి వారి పోరాటాలకు మద్దతు తెలిపిన ఆమె ఆచరణను గొప్పగా గుర్తుచేసుకుంటున్నది. ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, పచ్చని పంట పొలాల్ని అన్నం పెట్టే రైతుల నుండి లాగేసుకుంటున్న విధానాన్ని ఆమె కడ వరకు నిరసించారు. ఇటీవలి ప్రజా సంచలనాలు సింగూరు, నందిగ్రామ్, లాల్ గఢ్ పోరాటాలకు బాసటగా నిలిచారు. రాజ్యహింసపై ఆగ్రహాన్ని ప్రకటించారు.
ఆమె అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, బహుశా ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ (తెలుగులోకి ఒక తల్లి పేరుతో అనువాదమైంది) ఒక కీలక మలుపు. అందులోని ప్రధాన ప్రాత్ర సుజాత మధ్యతరగతి సాంసారిక, సంకుచిత పరిధి నుండి విశాల సమాజం వైపు తలుపు తెరిస్తుంది. కలకత్తా వీధుల్లో విప్లవ విద్యార్థుల నెత్తురు ఏరులుగా పారిన డెబ్బైల రోజులవి. తన బిడ్డ ఎవరికోసమైతే ప్రణమిచ్చాడో ఆ పీడిత సమూహంలో ఒక వాస్తవిక జీవితాన్ని ఆ పాత్ర ఆవిష్కరించుకుంటుంది. మహాశ్వేతాదేవి పీడిత ప్రజల జీవితాల్లోకి, వారిని దోపిడి పీడనలకు, సకల అణచివేతలకు కారణమైన సామాజిక మూలాల్లోకి ప్రవేశించింది. ఆమె రచనా ప్రపంచం నిండా మహిళలు, దళితులు, ఆదివాసీలు అనేక విధాల బాధా సర్పద్రష్టులుంటారు. వారు పీడితులే కాదు, పోరాటకారులు. సమాజాన్ని మార్చే శక్తి వారికే ఉంది. ʹబషాయి టుడుʹ లాగా ఎన్ని సార్లు ʹఎన్ కౌంటర్ʹ చేసినా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఆ చరిత్ర నిర్మాతల వెంట ఉన్న సాహిత్య సాంస్కృతిక సంపదనే ఆమె తన రచనలకు స్ఫూర్తిగా తీసుకున్నది. అటు వంటి మూలవాసులది కాక ʹఎవరిదీ అడవిʹ అని ఆమెసూటిగా ప్రశ్నిస్తుంది. వివిధ సమూహాల అనేకానేక అణచివేతల దుఃఖం, ఆగ్రహం, సహానుభూతి, ఉద్యమ స్ఫూర్తిని నిండా నింపుకున్న ఆమె రచనలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆమె అమరత్వం నేడు ఆదివాసుల, దళితుల, మహిళలపై అమలవుతున్న వ్యవస్తీకృత హింస, ఆధిపత్య హిందూ మతోన్మాద హింస, సామ్రాజ్యవాద నిరంకుశ దళారీ దోపిడీ విధానాలు అమలుచేస్తున్న రాజ్యం ప్రజలపై చేసే యుద్ధం వీటన్నిటినీ ప్రశ్నించమని చెబుతున్నది. శక్తి ఉన్నంతవరకూ ఆమె ఆదివాసుల పక్షాన నిలిచి నిరసించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ ను వ్యతిరేకించడం నేడు రచయితల ముందున్న కర్తవ్యం. ఆ మహా రచయితకు మనమిచ్చే నివాళి. మహాశ్వేతాదేవికి అరుణారుణ జోహార్లు.
Type in English and Press Space to Convert in Telugu |
సోషలిజమే ప్రత్యామ్నాయం, నక్సల్బరీయే భారత విప్లవ పంథా20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణులన్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన లక్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ... |
నేనెందుకు రాస్తున్నాను?
బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక....... |
పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలుసంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విరసం సాహిత్య పాఠశాల కీనోట్)..... |
ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్... |
సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹమన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి ....... |
ఇది మనిషి మీద యుద్ధం సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి... |
మంద్రస్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్యదర్శి పి. వరలక్ష్మి కీనోట్... |
ఉనా స్వాతంత్ర నినాదంఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ... |
ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకైప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య... |
నల్లమలపై అణుబాంబుకృష్ణా, పెన్నా ఆదరువుతో బతుకుతున్న ప్రజానీకం మాత్రం నల్లమల చల్లని నీడలేకపోతే బతకడం కష్టం.మొట్టమొదట యురేనియం కృష్ణను కలుషితం చేస్తుంది.ఈ విధ్వంసం ఆమ్రాబాద్..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |