మేధావుల్లారా, ప్ర‌జాస్వామికవాదులారా... మా వైపు చూడండి

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

మేధావుల్లారా, ప్ర‌జాస్వామికవాదులారా... మా వైపు చూడండి

- ఆదివాసీల విజ్ఞ‌ప్తి | 01.08.2016 12:14:44am

జ‌ల్, జంగ‌ల్‌, జ‌మీన్ తో పాటు మేం పుట్టి పెరిగాం. బ‌స్త‌ర్‌లో ఏం జ‌రుగుతోందో ఆ వాస్త‌వాల్ని మీకు తెలియ‌జెప్ప‌డానికి మేం ఇక్క‌డికి వ‌చ్చాం. టీవీలు, రేడియోలు, వార్తా ప‌త్రిక‌ల ద్వారా మీరు తెలుసుకుంటున్న దాని క‌న్నా బ‌స్త‌ర్‌లో ఇంకా భ‌యంక‌ర‌మైన, దారుణమైన ప‌రిస్థితులు ఉన్నాయి.

ఈ రోజు బ‌స్త‌ర్‌లో జ‌రుగుతున్న యుద్ధం భార‌త ప్ర‌భుత్వం, బ‌డా కంపెనీలు క‌లిసి సంయుక్తంగా జ‌రుపుతున్న‌ది, బ‌స్త‌ర్ ఆదివాసుల‌పై బీభ‌త్సమైన దాడి జ‌రుగుతున్న‌ది. ఈ యుద్ధం కేవ‌లం జ‌ల్ జంగ‌ల్ జ‌మీన్ కోస‌మే కాదు.. రాజ్యానికి స‌మాంత‌రంగా జ‌రుగుతున్న జ‌న‌త‌న‌స‌ర్కార్‌పై యుద్ధం.

జ‌న‌త‌న స‌ర్కార్ మాకు జీవించే మార్గాన్ని చూపెట్టింది. ఆదివాసి మ‌హిళ‌లు గౌర‌వంగా జీవించ‌డం నేర్చింది. మూడ విశ్వాసాల‌ను రూపు మాపి శాస్రీయ ఆలోచ‌న‌ల‌ను పెంపొందించింది.ప‌ట్వారీ , తహసిల్దార్ , పోలీస్ వంటి అధికారుల దోపిడీల‌ నుండి ర‌క్షించ‌డ‌మే కాకుండా , మ‌హిళలకు పోరాటాన్ని కూడా నేర్పింది.

దండ‌కార‌ణ్య గ్రామాల‌లో మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు కొన‌సాగుతున్నాయి. గ్రామస్థుల‌ను మావొయిస్టుల‌ని చెప్పి జైళ్ల‌లో పెడుతున్నారు. ఈ అక్ర‌మాల‌పై మేము పోలీసు , కోర్టుల వ‌ద్ద‌కు వెళ్లినా ఎవ‌రూ గోడు వినిపించుకొవ‌డంలేదు పైగా మ‌మ్మ‌ల్ని బెదిరించి వెళ్ల‌గొడుతున్నారు. హిడ్మీ అనే ఆదివాసీ మహిళ ఉదంతం మీ అందరికి తెలిసే ఉంటుంది . ఈ సంఘటన పై జులై 16 నాడు బస్తర్ బంద్ జరిగింది . తమ సొంత సోదరులపై యుద్ధం చేయడానికి ఆదివాసి యువ‌కులకు డ‌బ్బు ఆశ చూపెడుతున్నారు. కోర్టు చ‌ట్టాల‌తో మాకు ఏమాత్రం సంభందంలేదు . ఎందుకంటే అవి మా మ‌హిళ‌ల‌కు ఎలాంటి న్యాయాన్ని అందించడం లేదు. ఇక్క‌డ చ‌ట్టాలు , కోర్టులు ,ప్ర‌భుత్వం అన్ని క‌ల‌సి బ‌డా కంపెనీల ప్ర‌యోజ‌నాల‌ను రక్షించడానికే ఉన్నాయి . ఈ విష‌యాలు అర్థం చేసుకోవ‌డానికి మాకు పెద్ద పెద్ద పుస్త‌కాలు చ‌ద‌వాల్సిన అవ‌స‌రం లేదు.

మావోయిస్టుల పేరు మీద పోలీసులు అరెస్టు చేసి జైళ్ల‌లో పెట్టిన వాళ్ల పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లో చ‌దువుకోవ‌డానికి అనుమ‌తులివ్వడం లేదు. వాళ్లు చ‌దువుకోని వారిగా మిగిలిపోవాల్సి వ‌స్తుంది. మ‌మ్మ‌ల్ని మా జిల్ జంగ‌ల్ జ‌మీన్ నండి బేదాకల్ చేస్తున్నారు. ఇక్క‌డి జిల్ జంగ‌ల్ జ‌మీన్‌పై మాదే అధికార‌మ‌ని మేం అంటే అందుకు సంబందించిన ప‌ట్టా చూపెట్టామ‌ని అడుగుతున్నారు . ప‌ట్టా ఇవ్వాల్సిన తహసిల్దారే ప్ర‌భుత్వ అధికారి అయిన‌ప్పుడు మాకు ప‌ట్టాలు ఎక్క‌డి నుండి వ‌స్తాయి .

మ‌మ్మ‌ల్ని ప్ర‌భుత్వం మూల వాసులుగానే గుర్తించ‌డం లేదు. మాకు ప్ర‌భుత్వం క‌ల్పించే సౌక‌ర్యాల‌లో కొంచం కూడా లభించ‌డం లేదు. స్మార్ట్ కార్డ్ ల పేరుతో 30,000 రూపాయ‌ల వ‌ర‌కూ వైద్యం ల‌భించే ఏర్పాటు చేసిన‌ట్టుగా ఈ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించుకోంటున్న‌ది, బ‌య‌టికి ప్ర‌చారం చేస్తున్న‌ది . కానీ ఈ స్మార్ట్ కార్డు తీసుకోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి పోతే రక్తం ఎక్కించుకోవ‌డానికి కూడా మేమే డ‌బ్బులు చెల్లించాల్సి వ‌స్తున్న‌ది , ఒక్క రూపాయి మందు కూడా ఆసుప‌త్రులో మాకు ల‌భించ‌డంలేదు. గ‌ర్భ‌వ‌తి అయిన మ‌హిళ‌ల‌ కోసం 108 అంబులెన్స్ ఉంద‌ని చెప్తున్నారు, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఆదివాసీ మ‌హిళ‌కు కూడా ఇది ఉప‌యోగ‌ప‌డ‌లేదు.

గ్రామీణ ఉఫాది ప‌థ‌కంలో రోజుకు 150 రూపాయ‌ల కూలీ ఇస్తామ‌ని అంటున్నారు. కానీ ఆరు నెల‌ల వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌డం లేదు. ప్ర‌భుత్వం చెప్తున్న ఈ ప‌థ‌కాలు కేవ‌లం కాగితాల‌కే ప‌రిమితం. అబ‌ద్ధాల‌తో కూడుకున్న‌వి. టీవీలు, ప‌త్రిక‌ల ద్వారా వీటిని ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప్ర‌భుత్వం ఆదివాసుల‌ ప్ర‌యోజ‌నాల‌కై ప‌నిచేస్తుంద‌ని బ‌య‌టి ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. వాస్త‌వాలు తెలుసుకోవ‌డానికి ఎటువంటి ప్ర‌య‌త్నం చే్య‌కుండానే టీవి, ప‌త్రికలు ప్ర‌భుత్వం ఏం చెబితే దానినే ప్ర‌చారం చేస్తాయి. కాని కొంత మంది నిజాయితిగల విలేక‌రులు బ‌స్త‌ర్ దాకా వ‌స్తున్నారు.

మా జ‌ల్ , జంగ‌ల్ జ‌మీన్ ల‌ను ఈ ప్ర‌భుత్వం బ‌డా కంపెనీల‌కు ధారాద‌త్తం చేసింది, మీరు బ‌స్త‌ర్‌కు వ‌స్తే అనేక కంపెనీల బోర్డులు క‌నిపిస్తాయి ఒక చోట టాటాకు చెందిన ప్లాంటు ఉంటే మ‌రో చోట అదానిది, ఇంకోచోట MNDC కంపెనీది. MNDC బైల‌దిల్లాలో బొగ్గు గ‌నులు త‌వ్వుతున్న‌ది ఆదివాసుల భూమిలోనే,తూపాకీల‌తో బెదిరించి స్వాదీనం చేసుకున్న‌ది . మేం ఈ భూస్వాదీనం పై నిర‌సన తెలిపితే ఆ నిరసన‌ని లేకుండా చేయ‌డానికి ఆదివాసుల‌కే ఆ కంపెనీల‌లో చ‌ప్రాసీ ఉద్యోగాల‌నిస్తున్నారు. గ‌నుల కోసం భూమిని త‌వ్వే చిన్న చిన్న‌ప‌నులు మాత్రం ఇస్తున్నారు.

మా భూమిని గుంజుకుని స్థాపించిన కంపెనీల‌లో మాకు ఉద్యోగం కావాలంటే అయిదు అక్ష‌ల రూపాయ‌లు చెల్లిచాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇంకో వైపుప్ర‌భుత్వం ఈ కంపెనీల ర‌క్ష‌ణ కోసం ఆదివాసి యువ‌కుల‌నే పోలీసు అర్ధ సైనిక బ‌ల‌గాల లో భ‌ర్తి చేసి మా పై దాడికి ఉసిగొల్పుతుంది .

సర్పంచులుగా మాకు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల వర‌కు గ్రామం కోసం ఖ‌ర్చు పెట్టే అధికారం ఉంది , కానీ ప్ర‌భుత్వం ఒక పైసా కూడా ఇవ్వ‌దు. మేం కేవ‌లం చేప్పుకోవ‌డానికే సర్పంచులం, మా అధికారాన్ని పట్వారి , తహసిల్దార్లల వ‌ద్ద తాక‌ట్టు పెట్టిన‌ట్టు ఉన్నాయి . మావైన భూమిలోకి వ‌చ్చి తహసిల్దార్ రుజువులు అడుగుతున్నారు. ఈ రుజువులు ప్ర‌భుత్వ రికార్డులోనే లేవు . అయితే ఈ జల్ ,జంగల్ ,జ‌మీన్‌ల‌తో క‌లిసే మేము పుట్టిపెరిగి ఉన్నాము. మేం ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ప్ర‌భుత్వం ముందూ చెయ్యి చాచ‌లేదు , ఈ అడ‌వుల ఆస‌రాతోనే మేం గౌర‌వంగ బతుకుతున్నాము.

కానీ ప‌రిస్థ‌తి ఇప్పుడు అట్లా లేదు . కాలంతో పాటు మేం కూడా మారాం. మేం కూడా పోరాటాన్ని నేర్చుకున్నాం. మేం ఈరోజు ఈ పోలీసు పారామిలట‌రీ తహసిల్దారు పట్వారీల‌ను మా భూముల నుండి త‌రిమి కొడుతున్నామంటే దాని వెన‌క వివ‌ప్ల‌వొద్య‌మం ఉంది. ఈ ఉద్య‌మం కార‌ణంగానే మేం గౌర‌వంగా జీవిస్తున్నాం. మా మహిళ‌లు అర్థ‌రాత్రి కూడా అడ‌విలో స్వాతంత్రంగా తిరుగుతున్నారు.

ఈ విప్ల‌వ‌మే దండ‌కార‌ణ్యానికి కొత్త గుర్తింపునిచ్చింది . ఈ రోజు మాద‌గ్గ‌ర భూమిఉంది, నీళ్లు ఉన్నాయి, వ్య‌వ‌సాయం ఉంది. విప్ల‌వకారులు అనుదినం మా సుఖ‌, ధుఃఖాల‌లో మాతోపాటు తోడుగా ఉన్నారు. మూడ‌విశ్వాసాల‌ను ఖ‌తం చేసి మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ‌నిచ్చారు. బ‌య‌ట ప్ర‌పంచంలో కూడా ఇట్లాంటి స్వేచ్ఛ మ‌హిళ‌ల‌కు ఉండ‌డం లేదు.

బ‌య‌టి ప్రపంచంలో జీవిస్తున్న మేధావులు, ప్ర‌జ‌లు, విలేక‌రులు, సామ‌జిక కార్య‌క‌ర్తల‌కు మేం విన్న‌వించుకునేది ఏమంటే ఇది కేవ‌లం మా ఆదివాసుల పోరాటం మాత్ర‌మే కాదు, మన అంద‌రిది. మ‌నం అందరం క‌లిసి మ‌న జ‌ల్, జంగ‌ల్, జ‌మీన్ ల‌ను ర‌క్షించుకోవాలి. అప్పుడే మ‌నం బ‌త‌క‌గలుగుతాం. భావిత‌రాల‌కు కూడా ఏమ‌న్న ఇవ్వ‌గ‌లుగుతాం

అమ‌రుల బంధు మిత్రుల సంఘం 14వ ఆవిర్భావ స‌భ‌లో పాల్గొన్న బ‌స్త‌ర్ ఆదివాసీల (అమ‌రుల కుటుంబ స‌భ్యుల‌) సందేశం

No. of visitors : 1829
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
  అరుణతార సెప్టెంబర్ - 2018
  యాంటి నేషనల్
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
  ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
  అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
  కుట్ర
  ఇప్పటికైనా అర్ధమయిందా....?
  యుద్ధానంతర యుద్ధగీతం
  పోలీసుల నీడలో రాపూరు
  అర్హత

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •