కశ్మీర్ అనగానే ఇండియన్లలో పూనకం వస్తుంది . భారతీయులందరు కశ్మీర్ ను రాగ ద్వేషాలలోంచే చూస్తున్నారు . గతంలోను నేను కశ్మీర్ గురించి ఇండియాలో మాట్లాడాను . ఈ క్రమంలో నాకు ఆశ్రయం ఇచ్చిన వారికి వారాల తరబడి పోలీసుల రక్షణ అవసరమైంది . ప్రస్తుత కశ్మీర్ పరిస్థితి నన్ను దిగ్బ్రాంతికి గురిచేస్తున్నది . సమస్య పరిష్కారం అవ్వాలంటే భారత సైన్యాలు మొదట కశ్మీర్ ను వీడాలి . కశ్మీర్ కు తనదయిన విలువైన చారిత్రక నేపథ్యం ఉన్నది . 1980 లో అక్కడ జరిగిన బూటకపు ఎన్నికల తంతు తరువాత పరిస్థితి మరింత దిగజారింది . అక్కడి ప్రజలపై అంతులేని హింస దౌర్జ్యన్యాలు కొనసాగుతున్నాయి . పాలస్తీనా విషయంలో అమెరికాకు అనేక ప్రయోజనాలున్నాయి . కాబట్టి పాలస్తీనాను పట్టించుకుంది . కానీ కశ్మీర్ విషయంలో అమెరికాకు ఆసక్తి లేదు . ఎందుకంటే .. కశ్మీరుతో అమెరికా ప్రయోజనాలు ఏమి ముడిపడి లేవు . ఇదే కశ్మీర్ చేసుకున్న పాపం . కశ్మీరులో భారత సైన్యం చేస్తున్న కార్యకలాపాలన్ని బయటి శక్తుల పనిగానే అక్కడి ప్రజలు భావిస్తున్నారు . కశ్మీర్ సమస్యకు పరిష్కారం అంటే ... భారత్, పాకిస్థాన్ ఉమ్మడి సహకారం, అంగీకారం తో అక్కడ ఓ ఫెడరల్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలి . ఇరు దేశాలు పర్సపర విశ్వాసంతో కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి .
(TwoCircles.net సౌజన్యంతో..)
Type in English and Press Space to Convert in Telugu |
కశ్మీర్ దుస్థితి - పౌర హక్కులుపౌర సమాజం మౌనం వీడాల్సిన సందర్భం ఇది. ఈ నేపథ్యంలో కశ్మీర్ ʹదుస్థితి - పౌర హక్కులుʹ అనే అంశంపై లామకాన్ ఆగస్టు 2వ తేదీన చర్చా కార్యక్రమం.......... |
కశ్మీర్ పిల్లలు ఇండియా గురించి ఏమనుకుంటున్నారు?కశ్మీర్లోని బాలికలను భారత్ చంపుతున్నది. నేను అనేక ఘటనలను టీవీలో చూశాను. నేను బయటకే వెళ్లడం లేదు. బయటకు వెళ్తే.. పిల్లెట్స్ తగులుతాయేమోనని భయం......... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |