స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

- ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

క్షుభిత సంద్రమువంటి చిత్తమ్ము గలవాడ
పూల పానుపు వంటి జీవితమ్మది వలదు
ఉత్తమోన్నతమైన లక్ష్యమ్ము కొరకు
కావాలి జీవితము పోరాటమగ్నమ్ము

. . . . . .

దూరమైనా భారమైనా కంటకావృతమ్మైనా
సాగాలి పయనం ముందుకే మున్ముందుకే
లక్ష్యరహితం కాంతిహీనం అయిన బ్రతుకేమి బ్రతుకది?
శక్తిహీనం, స్ఫూర్తి శూన్యం పాశవికమూ పరమ నీచం
అంధకారం పరీవృతమ్మూ అయిన బ్రతుకేల మనకది?
రోత బ్రతుకది, వలదు మనకది వలదు వలదు.

1836లో ఒక బెర్లిన్‌ సాహిత్య పత్రికలో ఈ గేయం వెలువడింది.

గేయ రచయిత యువ కార్ల్‌ మార్క్స్‌. ప్రపంచ సామాజిక పునర్నిర్మాణానికి సంబంధించిన తన శాస్త్రీయ సిద్ధాంతాన్ని మార్క్స్‌ స్థాపించిన నాటికీ ఈ గేయ రచన నాటికీ మధ్య సుదీర్ఘ కాల వ్యవధి ఉంది. అయితేనేం, అప్పటికే ఆయన తన విశ్లేషణాత్మకమైన మనస్సుతో, విజ్ఞాన సర్వస్వప్రాయమైన మెదడుతో, అవిశ్రాంతమైన శక్తితో, సాహసికమైన ఆలోచనతో తన చుట్టూ ఉన్నవారిని ఆశ్చర్య చకితులను చేసేవాడు. అన్యాయం అంటే ఏవగించుకొనేవాడు. జనం పట్ల-బెర్లిన్‌ నగరం మధ్య విశాలమూ, ఉన్నతమూ అయిన సౌధాల్లో నివసించేవారి పట్ల గాక, ప్రష్యన్‌ రాజధాని పొలిమేరల్లో ఇరుకు కొంపల్లో కిక్కిరిసి ఉండే జనం పట్ల-ప్రగాఢమైన అనుకంప చూపూవాడు. ఆయన మిత్రుల్లో అత్యధిక సంఖ్యాకులు ఈ భావం ఎరుగరు. ఇలాంటి విషయాలను గురించి ఎవరూ గాఢంగా ఆలోచించే వాళ్ళు కారు. అయినా, ఎవరైనా ఎందుకు ఆలోచించాలిట? దివాళా తీసిన రైతులను గురించా? ఫాక్టరీ గేట్లలోంచి బిలబిల మంటూ బయటకి వస్తున్న చింకి దుస్తుల కార్మికులను గురించా? బాగా గాలీ వెలుతురూ వచ్చే విశ్వవిద్యాలయపు గదుల్లో కూర్చొని ప్రపంచపు సార్వత్రిక సామరస్యం గురించి ఆచార్యుడు చేస్తున్న ప్రసంగాన్ని వినేవాళ్ళు ఆలోచించేందుకు ఇలాంటి వాళ్ళు అర్హులేనా?

మార్క్స్‌ తన పేరిట ప్రచలితమైన శాస్త్రీయ కమ్యూనిజం సిద్ధాంతాన్ని ఒక్కసారిగా సృజించలేదు. ఏళ్ళ తరబడి క్లిష్టమైన పోరాటం, సవరించరాని నష్టాలు, నిద్రలేని రాత్రులు, బ్రహ్మాండమైన కృషి అనంతరమూ అది సాధ్యమైంది.

కార్ల్‌ మార్క్స్‌ జర్మనీలో ఆర్థికంగా, రాజకీయంగా మిక్కిలి అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఒకటైన రైనిష్‌ ప్రష్యాలో ట్రీర్‌ నగరంలో 1818 మే 5న జన్మించాడు.

మార్క్స్‌ తండ్రి హైన్రిఖ్‌ మార్క్స్‌ ప్రతిభావంతుడు. తన కొడుకు పట్ల వాత్సల్య భావం కలిగిన హైన్రిఖ్‌, అతని మానసికాభివృద్ధి పట్ల నిరతరాయమైన శ్రద్ధ వహించాడు.

1830లో కార్ల్‌ మార్క్స్‌ ట్రీర్‌లోని ఒక హైస్కూల్లో చేరాడు. శ్రద్ధాళువైన విద్యార్థి కార్ల్‌ సృజనాత్మక స్వాతంత్య్రం, సజీవమైన ఊహాశక్తీ కలిగిన పాఠ్యాంశాల్లో ప్రత్యేకించి బాగా రాణించే వాడు. లాటిన్‌, గ్రీకు భాషల్లో చక్కటి జ్ఞానం సంపాదించుకున్న మార్క్స్‌ ప్రాచీన వాచకాలను తేలిగ్గా అవగాహన చేసుకునేవాడు. బహుశా ప్రాచీన భాషల పట్ల ఉన్న మమకారమే మార్క్స్‌ రచనలకి సజీవమూ, తార్కికమూ, దానితోడు వ్యంగ్యాత్మకమూ అయిన విశిష్ట శైలిని సంతరించి పెట్టి ఉంటుంది. గణితశాస్త్రంలో కూడా మార్క్స్‌ ప్రతిభావంతుడు. ఆ దశలో శిలీభూతమూ, అభివృద్ధి నిరోధకమూ అయిన ప్రతిదాని పట్లా ద్వేసంతో తొణికిసలాడే మార్క్స్‌ ప్రజాతంత్ర భావాలు రూపొందుతూ వచ్చాయి.

మార్క్స్‌ 1835 అక్టోబరులో బోన్‌ విశ్వవిద్యాలయంలో చేరి, తీవ్ర అధ్యయనానికి పూనుకొన్నాడు. సాంప్రదాయిక భావాలను పునర్విమర్శించుకొని, మార్క్స్‌ తన జీవిత పథాన్ని అన్వేషించిన దశ అది. ఒక ఏడిది గడిచాక మార్క్స్‌ బెర్లిన్‌ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్ర విభాచంలో చేరాడు. అప్పటికి ఆ విద్యాలయంలో మహా చింతనా పరుడైన హేగెల్‌ ప్రభావం ఇంకా ʹʹప్రచలితంగా ఉందిʹʹ.

న్యాయశాస్త్రం, రోమన్‌ న్యాయశాస్త్రం, చరిత్ర, మానుష శాస్త్రం, విదేశీ భాషలు అధ్యయనం చేసిన మార్క్స్‌ నానాటికీ తత్వశాస్త్రం పట్ల ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు. తత్వశాస్త్ర గ్రంథాలను, హేగెల్‌, ఆయన శిష్యుల్లో అధిక సంఖ్యాకుల రచనలను కూడా మార్క్స్‌ అధ్యయనం చేసాడు. అదే సమయంలో హేగెల్‌ అనుచరులైన యువ హేగెలియన్లకు మార్క్సు సన్నిహితుడయ్యాడు. పలు మత, తాత్విక ఛాందస అభిప్రాయాలను ధైర్యంగా విమర్శించే యువ హేగెలియన్ల పట్ల యువ చింతనాపరుడు ఆర్షింపబడ్డాడు.

1830 దశకం చివరి నాటినుంచి మార్క్స్‌ తన కాలాన్ని తత్వ శాస్త్ర అధ్యయనానికి పూర్తిగా అంకితం చేసాడు. 1841లో ʹʹడెమోక్రిటియన్‌, ఎపిక్యూరియన్‌ ప్రకృతి తత్వశాస్త్రాల మధ్య వ్యత్యాసంʹʹ అనే పరిశోధానా వ్యాసం సమర్పించి డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ పట్టా పొందాడు. మార్క్స్‌ అప్పటికింకా హేగెల్‌ బోధనను సమర్థిస్తూనే ఉన్నప్పటికీ, ఆయన తాత్కి అభివృద్ధి పథంలో ఈ పరిశోధనా వ్యాసం ఒక కొత్త అంగ అయింది. అందులో ఆయన వాస్తవికతకూ తత్వశాస్త్రానికీ మధ్య ఉన్న క్రియాశీల సంబంధ సూత్రాన్ని చాటి, తన నాస్తిక అభిప్రయాలను ప్రకటించాడు.

మార్క్స్‌ రాజకీయ కార్యకలాపాలు కూడా అదే కాలంలో మొదయ్యాయి. మార్క్స్‌ 1842 ఏప్రిల్‌లో ʹʹరైనిషె సైటుంగ్‌ʹʹ (ʹʹరైన్‌ పత్రికʹʹ) సంపాదక వర్గంలో చేరి, 1842 అక్టోబరులో దాని ప్రధాన సంపాదకుడు అయ్యాడు. విప్లవాత్మక, ప్రజాతంత్ర ఉత్సాహంతో నిండి ఉన్న మార్క్స్‌ వ్యాసాలు ఆ పత్రిక ధోరణిని నిర్ధరించాయి. ఫ్యూడల్‌-రాజరిక వ్యవస్థ పట్ల ఏహ్య భావం, ప్రజాతంత్ర స్వేచ్ఛల కోసం, విప్లవాత్మక పోరాటం కోసం విజ్ఞప్తులు ఆ వ్యాసాల్లో కనిపించేవి. సహజంగానే అలాంటి విజ్ఞప్తులు ప్రష్యన్‌ ప్రభుత్వాన్ని కలతపెట్టకుండా ఉండలేకపోయాయి. ఆ పత్రిక సంచికల్లో ప్రతి ఒకదాన్నీ సెన్సారు అధికారులు నిర్దాక్షిణ్యంగా విరూపం చేసారు. ʹʹస్వేచ్ఛ కోసమైనా సరే నీచమైన పనులు చెయ్యవలసి రావడం, దుడ్డు కర్రలతో కాక గుండు సూదులతో పోరాడవలసి రావడం దౌర్భాగ్యంʹʹ2 అని మార్క్స్‌ రాసాడు. 1843 మొదట్లో ʹʹరైనిషె సైటుంగ్‌ʹʹ పత్రిక మూసివెయ్యబడింది. ఆ ఏడాది జూన్‌ మాసంలో మార్క్సుకి జెన్నీ ఫన్‌ వెస్ట్‌ఫాలెన్‌తో వివాహం జరిగింది. జెన్నీ ఆయనకి విశ్వసనీయమైన జీవిత భాగస్వామీ, విప్లవ పోరాటంలో సహాయకురాలూ, సహచరీ అయింది. ఆ యువ దంపతులు మొదట క్రాయిజ్‌నాఖ్‌ నగరంలో నివసించి, దరిమిలా పారిస్‌కి మారారు.

పారిస్‌లో మార్క్సుకి పండిన ఆకుల సవ్వడులూ, శరత్‌ రుతు వర్షావీచికలూ స్వాగతం పలికాయి. ఫ్రెంచి రాజధానికి మార్క్సు ప్రథమ ఆగమనం అదే. దరిమిలా ఆయన రాకల్లోకెల్లా అత్యంత స్మరణీయమూ, ప్రముఖమూ అయినది కూడా అదే. పారిస్‌లోనే 1843-1844లో ఆయన విప్లవకర కమ్యూనిస్టు వైఖరి తీసుకున్నాడు. ఫ్రెడరిక్‌ ఎంగెల్సుతో ఆయన చిరకాల, ఆత్మీయ మైత్రి మొలకెత్తినది కూడా అక్కడే.

1844 ఫిబ్రవరిలో వెలువడిన ʹʹదోయిచ్‌-ఫ్రాన్‌జోజిషె యార్‌ బ్యూఖర్‌ʹʹ (ʹʹజర్మన్‌-ఫ్రెంచి ఐతిహాసిక వార్షిక సంచికలుʹʹ) అనే పత్రిక ఒకే ఒక్క సంచికలో మార్క్స్‌ మొట్టమొదటి సారిగా సమాజపు కమ్యూనిస్టు పరివర్తన మాత్రమే బూర్జువా విప్లవపు సంకుచితత్వాన్ని అధిగమించే, మానవాళిని దాని సామాజిక, జాతీయ, తదితర శృంఖలాల నుంచి విముక్తం చేసే అసలైన మార్గమన్న సూత్రీకరణను ప్రతిపాదించాడు. ఆయన ఈ పరివర్తనను తీసుకురాగల సామర్థ్యం కలిగిన సామాజిక శక్తిగా శ్రామికవర్గపు పాత్రను గురించి కూడా వక్కాణించి, శ్రామికవర్గ విప్లవకారుడుగా, కార్మికవర్గ సిద్ధాంతవేత్తగా ʹʹజనబాహుళ్యానికీ, శ్రామికవర్గానికీ ప్రబోధించాడుʹʹ.3

పారిస్‌లో జర్మన్‌ ప్రవాసుల కార్యకలాపాల్లో మార్క్స్‌ చురుకుగా పాల్గొన్నాడు. ʹʹఫొర్‌వార్ట్స్‌ʹʹ (ʹʹముందుకుʹʹ) పత్రికలో పనిచేసాడు. కాని 1845 జనవరిలో ఫ్రెంచి అధికారులు ప్రష్యన్‌ ప్రభుత్వపు మెరమెచ్చుల కోసం ఆ పత్రిక సంపాదకులనూ, సిబ్బందినీ దేశం నుంచి బహిష్కరించారు. దానితో మార్క్స్‌ సకుటుంబంగా బ్రస్సెల్సుకి తరలిపోవలసి వచ్చింది.

బ్రస్సెల్సులో మార్క్స్‌ కుటుంబానికి జీవనోపాధి కరువైంది. బ్రస్సెల్స్‌ పోలీసులు మార్క్స్‌ రచనలేవీ ప్రచురింపబడకుండా కట్టుదిట్టం చేసిన కారణంగా, మార్క్స్‌కి ఉన్న ఏకైక ఆదాయ మార్గం- సమకాలిక రాజకీయాలపై వ్యాసాలకు ప్రతిఫలం-బందైపోయింది. ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ ఆయన బాసటకి వచ్చాడు. రైన్‌లాండులో మార్క్స్‌ సమర్థకులనుంచీ, ఇవే మాదిరి అభిప్రాయాలు కలిగిన వాళ్ళనుంచీ విరాళాల పోగుచేతకి ఏర్పాటు చేసి, ఎంగెల్స్‌ స్వయంగా ʹʹఇంగ్లండులో కార్మికవర్గ పరిస్థితిʹʹ అనే తన పుస్తకానికి వచ్చిన ప్రతిఫలంలో సగం మొత్తం పంపాడు.

బ్రస్సెల్సులో మార్క్స్‌ తలమునకలుగా పనిలో నిమగ్నమయ్యాడు. ఎంగెల్సుతో కలిసి సుమారు ఆర్నెలల్లో ʹʹజర్మన్‌ భావజాలంʹʹ రాత ప్రతినీ, మరికొన్ని ఇతర రచనలనూ పూర్తి చేసాడు. అంతదాకా వర్గ పోరాటంలో వాళ్ళకి ఉన్న అనుభవాన్నీ, సైద్ధాంతిక విశ్లేషణనీ మార్క్స్‌, ఎంగెల్సులు ఆధారంగా చేసుకొని, విప్లవకర కార్మిక పార్టీ మాత్రమే పాత ప్రపంచాన్ని కూల్చివెయ్యడంలో కార్మికవర్గాన్ని జాగృతం చేసి, సంఘటితం చేసి, నడపగలదన్న నిర్ధారణకు చేరుకున్నారు. దానికితోడు, యూరప్‌లో బూర్జువా ప్రజాతంత్ర విప్లవాలు ముసురుకొచ్చాయి. వీటి ఆగమనం విస్పష్టంగా అనుభూతమయింది. మార్క్స్‌ అభిప్రాయాన్ని బట్టి కార్మికవర్గం పూర్తిగా సాయుధమై వాటకి స్వాగతం పలకాలి. ఇందుకోసం ఒక విప్లవకర పార్టీ అవసరం. 1846 మొదటి నాటికే మార్క్స్‌ బ్రస్సెల్స్‌ కమ్యూనిస్టు ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీని నెలకొల్పాడు. ఈ కమిటీ గ్రేట్‌ బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీలలోని కమిటీలతోనూ, బృందాలతోనూ సంబంధాలు కొనసాగిస్తూ, పెటీ బూర్జువా సోషలిజపు వివిధ ధోరణుల ప్రతినిధులకు వ్యతిరేకంగా పోరాటం నడిపింది. లండన్‌లో 1847 జూన్‌లో జరిగిన కమ్యూనిస్టు లీగు మొదటి మహాసభకి ఎంగెల్స్‌ హాజరయాడు.

మార్క్స్‌, ఎంగెల్సుల చేత పునర్వ్యవస్థీకరించబడిన కమ్యూనిస్టు లీగు విప్లవకర కార్మికోద్యపు తదుపరి చరిత్ర అంతటికీ పునాది వేసింది.

లండన్‌లో జరిగిన కమ్యూనిస్టు లీగు రెండవ మహాసభలో దాని కార్యక్రమ రచన బాధ్యత మార్క్స్‌, ఎంగెల్సులకు అప్పగించబడింది. 1848 ఫిబ్రవరిలో ʹʹకమ్యూనిస్టు పార్టీ ప్రణాళికʹʹ పేరిట ఈ కార్యక్రమం ప్రచురింపబడింది. ఈ ప్రణాళిక పరిణత మార్క్సిజపు తొలి రచనల్లో ఒకటి, శాస్త్రీయ కమ్యూనిజం ఆవిర్భవించిందనేందుకు ఇది రుజువు.

యూరప్‌లో 1848-1849 నాటి విప్లవాలు చరిత్రలో మార్క్సిజానికి ప్రథమ పరీక్ష అయ్యాయి.

పారిస్‌లో ʹʹబాంకర్ల రాజుʹʹ అయిన లూయూ ఫిలిప్‌ కూలదొయ్యబడిన వార్త బ్రస్సెల్సులో ప్రజల సంతోషాన్ని రేకెత్తించింది. మార్క్సూ, ఫిబ్రవరి ఘటనలకు కొంచెం ముందు ఫ్రాన్సు నుంచి బహిష్కరింపబడిన ఎంగెల్సూ ఈ సార్వత్రిక సంతోషంలో పాలుపంచుకున్నారు. వాళ్ళు చిరకాలంగా కలలు కంటూ వచ్చిన, దీర్ఘ కాలంగా నిరీక్షిస్తూ వచ్చిన రోజు, రాజరిక అధికార చిహ్నాలైన రోసిపోయిన కిరీటాలు జర్మన్‌ నగరాల వీధులో దొర్లాడబోయే రోజు ఆసన్నం కాసాగింది.

అయితే, అభివృద్ధి నిరోధకులు పోరాటం జరపకుండా లొంగిపోవాలని సంకల్సించలేదు. కార్మికులను అసన్నద్ధ కార్యాచరణకు రెచ్చగొట్టేందు కోసం బ్రస్సెల్సుకి సైనికులు రప్పించబడ్డారు. అంతకు కొంచెం ముందు వారసత్వ రీత్యా తనకు సంక్రమించిన సొమ్ములోంచి మార్క్స్‌ కొన్ని వేల ఫ్రాకులను కార్మికుల కోసం ఆయుధాలను కొనేందుకు విరాళంగా ఇచ్చాడు.

మార్క్స్‌ చురుకైన విప్లవకర కార్యకలాపాలు చూసి భయభీతులైన బెల్జియన్‌ పోలీసులు ఆయన్ని హడావిడిగా దేశం నుంచి బహిష్కరించారు. మార్చి 4న ʹʹపెట్టుబడిʹʹ భావి రచయిత బ్రస్సెల్సును వదిలి ఫ్రాన్సుకి వెళ్ళాడు. కానైతే, ఆయన భావాలన్నీ తన మాతృభూమి అయిన జర్మనీ పైనే కేంద్రీకృతమై ఉన్నాయి.

బెర్లిన్‌లో బారికేడ్ల సరసన జరిగిన మార్చి పోరాటాల తర్వాత, అభివృద్ధి నిరోధకుల తరఫున ప్రష్యా రాజు విల్‌హెల్మ్‌ విప్లవకర పోరాటంలో నేలకొరిగిన యోధుల మ్రోల అవనత శిరస్కుబై నిలబడవలసి వచ్చింది. అప్పుడు పారస్‌లోని జర్మన్‌ ప్రవాసులు స్వదేశానికి తిరిగి రాగలిగారు. మార్క్స్‌ 1848 ఏప్రిల్‌లో జర్మనీకి తిరిగి వచ్చాడు.

కోలోన్‌లో ఆయన ʹʹనోయె రైనిషె సైటుంగ్‌ʹʹ (ʹʹరైన్‌ కొత్త పత్రికʹʹ) పత్రికను నెలకొల్ప పూనుకొన్నాడు. అది తొట్టతొలి సంచిక నుంచీ విప్లవకర ప్రజాస్వామ్య ఉద్యమ వాణి అయింది. మార్క్స్‌, ఎంగెల్సులు దాని కార్యక్రమాన్ని-అభివృద్ధి నిరోధక వ్యవస్థలకు దుర్గాలైన ప్రష్యా, ఆస్ట్రియా రాజ్యాల రద్దు, ఒకే రిపబ్లికన్‌ జర్మనీని ఏర్పాటు చెయ్యడం-కచ్చితంగా నిర్ధరించారు. ʹʹనోయె రైనిషె సైటుంగ్‌ʹʹ విప్లవాన్ని ముమ్మరం చేసే విధానాన్ని సుసంగతంగా అనుసరించి, శ్రామిక వర్గ దృక్సథం నుంచి రాజకీయ పోరాట అభివృద్ధిని అంచనా వేసింది.

మార్క్స్‌ ఆ పత్రిక సంపాదక వర్గానికి జీవ శక్తి అయాడు. ఆయన పత్రిక వ్యూహత్మక పంథాను నిర్ధరించాడు. సిబ్బందికి పనులు కేటాయించాడు. బోలెడు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు, సంపాదకత్వం వహించాడు, ఆదాయ వ్యయాలను నిర్వహించాడు. ఆ పత్రిక ఆర్థిక సంక్షోభంలో పడ్డప్పుడు తన తండ్రి నుంచి తనకి వారసత్వంగా సంక్రమించిన సొమ్ములోంచి గణనీయమైన మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఆ ముప్పదేళ్ళ ప్రధాన సంపాదకుడికి ప్రతిభావంతులైన సహాయకులు లభించారు. ప్రగాఢమైన, శక్తివంతమైన వ్యాసాలు రాసిన ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌, సంపాదకవర్గానికి కార్యదర్శిగా, జర్నలిస్టుగా పని చేస్తూ వచ్చిన విల్‌హెల్మ్‌ వోల్ఫ్‌, కవి జార్జ్‌ వీర్త్‌, హైన్రిహ్‌ బ్యూర్గెర్స్‌, ఫెర్డినాండ్‌ వోల్ఫ్‌ తదితరులు. వాళ్ళ ప్రతిభ కారణంగా ʹʹనోయె రైనిషె సైటుంగ్‌ʹʹ నూతన సమర్థకులను సమకూర్చుకొంది. పాలక వర్గాల్లో ద్వేషాన్ని రేకెత్తించింది.

తన సంపాదక కార్యకలాపాలకి తోడు-వీటి కోసం ఆయన బోలెడు కాలమూ, శక్తీ వెచ్చించవలసి వచ్చేది-మార్క్స్‌ కొలోన్‌లోని డెమోక్రటిక్‌ సొసైటీకి చెందిన మూడు సంస్థల నాయకత్వంలో చేరి పని చేసాడు. ఆ సొసైటీ డెమోక్రట్ల జిల్లా కమిటీ విధులను తాత్కాలికంగా నిర్వహించింది. 1849 వసంతంలో కార్మిక సంఘాలను ఒక సామూహిక శ్రామికవర్గ పార్టీగా ఐక్యపరచేందుకు మార్క్స్‌ చర్యలు తీసుకున్నాడు. కాని అభివృద్ధి నిరోధకుల దాడి మూలంగా ఈ పథకాలు భగ్నమయ్యాయి. 1849 మేలో ప్రష్యన్‌ ప్రభుత్వం ఆ పత్రిక ప్రచురణను నిలిపెయ్యగలిగింది. ప్రచురణకర్తలు ʹʹనోయె రైనిషె సైటుంగ్‌ʹʹ చివరి సంచికను ఎర్ర సిరాతో ముద్రించాడు.

జూన్‌లో మార్క్స్‌ పారస్‌కి వెళ్ళాడు. కాని ఆగస్టులో ఆయన పారస్‌ నుంచి బ్రిటన్‌కి వెళ్ళిపోవలసి వచ్చింది. లండన్‌లో ఆయన శాస్త్రీయ కమ్యూనిజం సిద్ధాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసే కృషిలో నిమగ్నుడయాడు. శాస్త్రీయ, భౌతికవాద తత్వశాస్త్రాన్ని రూపొందించిన మార్క్స్‌ మేధాశక్తికి మానవాళి ఎంతైనా రుణపడి ఉంది. ఎంగెల్స్‌తో కలసి మార్క్స్‌ సృజించిన ఈ సిద్ధాంతం తాత్విక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ అభిప్రాయాల ఒక సుసమన్విత వ్యవస్థ. మార్క్సిజం అంతకు ముందు సామాజిక చింతన సాధించిన వాటన్నింటినీ సవిమర్శకంగా జీర్ణించుకొని, ఇతోధికంగా అభివృద్ధి చేసినదాని ఫలితం.

మార్క్స్‌ రచనల్లో భౌతికవాదం మొట్టమొదటి సారి మానవజాతి చరిత్రనందనీ ఆశ్లేషించే విధంగా విస్తరింపజేయబడింది. మొట్టమొదటి సారి గతితార్కిక పద్ధతి ప్రకృతి, సమాజ, ప్రజ్ఞానాల అభివృద్ధి నియమాల విశ్లేషణకు అన్వయింపబడింది. ఇది నిజంగానే ఒక విప్లవం అయింది. పీడకులకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజలు జరిపే పోరాటంలో వారికి శక్తివంతమైన సైద్ధాంతిక ఆయుధాన్ని అందించింది.

మనుషుల్ని దోపిడీ నుంచి విముక్తం చేయడాన్నీ, బూర్జువా ఉత్పత్తి విధానపు స్థానంలో నూతనమైన, మరింత ప్రగతిశీలమైన, కమ్యూనిస్టు ఉత్పత్తి విధానాన్ని ప్రవేశపెట్టడాన్నీ, ప్రపంచలో మౌలికమైన మార్పు తెచ్చేందుకు ఒక షరతుగా మార్క్స్‌ పరిగణించాడు. అలంటి మార్పు దానంతట అదే జరగడం సాధ్యం కాదు. శ్రామికవర్గం తన సొంత పార్టీ నాయకత్వాన భీషణమైన వర్గ పోరాటానికి పూనుకోవాలి. ఆ పోరాటం అనివార్యంగా సోషలిస్టు విప్లవానికీ, శ్రామికవర్గ నియంతృత్వాన్ని నెలకొల్పడానికీ దారి తీస్తుంది.

తమ బోధనలను శాశ్వతమైనవిగా, మార్చరానివిగా చాటిన వెనకటి అన్ని సిద్ధాంతాలకూ, మతాలకూ భిన్నంగా, శాస్త్రీయ కమ్యూనిజం ఒక సజీవమైన, సృజనాత్మకమైన బోధన.

ఈ కొత్త బోధన ప్రజల ఆచరణాత్మక కార్యకలాపాలతోనూ, కార్మికవర్గపు విప్లవకర పోరాటంతోనూ విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. ʹʹఫాయెర్‌బాఖ్‌ పై ఈ సూత్రీకరణలుʹʹ లో సమాజ జీవితంలోనూ, ప్రజ్ఞాన క్రమంలోనూ ఆచరణ నిర్ణయాత్మక ప్రాముఖ్యం గురించి మార్క్స్‌ వక్కాణించి చెప్పాడు. కమ్యూనిస్టు ప్రపంచ దృక్పథపు విప్లవాత్మక స్వభావం చివరి సూత్రీకరణలో ఇలా వ్యక్తం చెయ్యబడింది : ʹʹతత్వవేత్తలు ఇంతవరకూ ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. కాని అసలు విషయం దన్ని మార్చడంʹʹ.4

మార్క్సిజం మౌలిక సూత్రాలన్నీ ఒకేసారి రూపొందించబడలేదన్న మాట నిజమే. దానికి ఏళ్ళ తరబడి చేసిన. కష్టంతో కూడిన శ్రమ అవసరమైంది.

మార్క్స్‌ అతి ముఖ్య రచనల్లో ʹʹపెట్టుబడిʹʹ ఒకటి. పెట్టుబడిదారీ వ్యవస్థ విశిష్ట నియమాలను అర్థ చేసుకోవాలంటే పెట్టుబడిదారీ అర్థశాస్త్రాన్ని సవివరంగా అధ్యయనం చెయ్యడం అవసరమని భావించి, 1840 దశకం మధ్యలో మార్క్స్‌ అందుకు పూనుకున్నాడు. ఈ కృషికి తన శక్తినంతటినీ ఆయన వినియోగించవలసి వచ్చింది.

1859 జనవరిలో ఆర్థిక రాతప్రతి ప్రచురణకి సిద్ధం చెయ్యబడింది. నిజానికి దానిలో మొత్తం ఆరు పుస్తకాలకు- పెట్టుబడి గురించి, భూ ఆస్తి గురించి, వేతన శ్రమ గురించి, రాజ్యం గురించి, విదేశీ వర్తకం గురించి, ప్రపంచ మార్కెట్‌ గురించి-పథకం ఉంది.

కానైతే, ఈ రాతప్రతిని ప్రచురణకర్తకు పంపేందుకు మార్క్స్‌ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇదొక విడ్డూరమైన పరిస్థితి. పెట్టుబడిదారీ వ్యవస్థ అర్థశాస్త్రాన్ని తన పరిశోధనాంశంగా ఎంచుకున్న పండితుడికి, ఫైనాన్షియల్‌ సమస్యలపై అత్యంత ప్రముఖ సిద్ధాంతకర్తకు సొంతానికి డబ్బు లేదు. ఎప్పుడూ మాదిరిగానే అప్పుడు కూడా ఎంగెల్స్‌ ఆయన బాసటకి వచ్చాడు. ఆ రాతప్రతి ప్రచురణకర్తకు చేరి, త్వరలోనే ʹʹఅర్థశాస్త్ర విమర్శకు చేర్పు. భాగం ఒకటిʹʹ అనే శీర్షకతో ప్రచురింపబడింది. మార్క్స్‌ అతి ముఖ్య రచనల్లో అదొకటి. ఆ పుస్తకం ముందుమాట ప్రత్యేకించి విశేషమైన ప్రాచుర్యం పొందింది. దానిలో ఆయన నూతన చారిత్రక భౌతికవాద భానవకు సంబంధించిన మౌలిక సూత్రీకరణను మొట్టమొదటి సారిగా క్రమబద్ధమైన పద్ధతిలో ఇచ్చాడు.

అయితే మార్క్స్‌ తన ఈ రచనను ఈ అంశానికి ఉపోద్ఘాతంగా పరిగణించి, దీన్ని ఇతోధికంగా అభివృద్ధి చెయ్యవలసిన అవసరం ఉన్నట్లు భావించారు. ʹʹపెట్టుబడిʹʹ గ్రంథమే ఈ కొనసాగింపుగా పరిణమించింది. ʹʹపెట్టుబడిʹʹ రచనతో మార్క్స్‌ ʹʹఅర్థశాస్త్ర విమర్శకు చేర్పుʹʹ లో సూచించిన ఆరు పుస్తకాల పథకంలో ఒకదాన్ని పూర్తి చేసాడు.

మార్క్స్‌ ఈ రచనను తన తొలి ఆర్థిక పరిశోధన ప్రచురింపబడిన వెంటనే ప్రారంభించాడు. ఆయన బ్రిటిష్‌ మ్యూజియం రీడింగ్‌ రూములో ప్రతి రోజూ గంటల తరబడి గడిపి, తను చదివిన పుస్తకాల సవివర సారాంశాన్ని నోట్‌ పుస్తకాల్లో రాసుకునేవాడు. అయినప్పటికీ, మౌలిక సైద్ధాంతిక కృషి అంతా ఇంటి దగ్గర, నిరాడంబరమైన ఫర్నిచరు కలిగిన ఆయన స్టడీ రూములోని డెస్కు దగ్గర జరిగేది. ఆయన మిత్రుల స్మృతులను బట్టి ఆయన గది అంతర్భాగం ఇలా ఉండేది :ఓ పెద్ద కొయ్య కుర్చీ, రాతప్రతులు ఎత్తుగా పేర్చబడిన టేబుళ్ళు, పుస్తకాలతో, పత్రికలతో నిండిన షెల్ఫులు, నెగడి, దాని పైన ఉన్న మౌంటెల్‌ షెల్ఫు మీద ఆయన బంధువుల, అత్యంత సన్నిహిత మిత్రులైన ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌, విల్‌హెల్మ్‌ వోల్ఫ్‌ల ఫోటోలు. గది మధ్య రాత్రపూట ఎండతెగని పచార్ల రాపిడికి అరిగిపోయిన తివాసీ పీలిక. ప్రతీదీ సాదాగా ఉండటమే కాదు, ఊదగా కూడా ఉండేది. కానైతే సరిగా అక్కడి నుంచే మార్క్స్‌ వేలాది సూత్రాలతో కార్మిక వర్గ పోరాటంతో అనుబంధింపబడి ఉండేవాడు. సరిగా అక్కడే సుస్తకాల పుటల మీద వంగి. పంక్తులకూ, అంకెలకూ వెనుక నిజ జీవిత పరిస్థితులను అయన దర్శించాడు.

1867 మార్చి నెలాఖరుకి, దాదాపు పదేళ్ళ శ్రమ తర్వాత ʹʹపెట్టుబడిʹʹ మొదటి సంపుటం అచ్చుకి సిద్ధం చెయ్యబడి, అదే ఏడాది చివరకు ప్రచురించబడింది.

పెట్టుబడికీ శ్రమకీ మధ్యా, బూర్జువా వర్గానికీ శ్రామికవర్గానికీ మధ్యా సబంధాలు మార్క్స్‌ అధ్యయనంలో కేంద్రాంశాలు, పెట్టుబడి అంటే వేతన శ్రామికుల నుంచి సిగ్గుమాలి దొంగిలించి, నిర్దాక్షిణ్యంగా దోచుకోవడంపై ఆధారపడిన సామాజిక సంబంధాలే గాని, పొదుపరి అయిన పరిశ్రమదారుచేత సంచయనం చెయ్యబడిన వట్టి డబ్బు మొత్తం కాదు. సాంఘికార్థిక సంబంధాల వ్యవస్థలో పెట్టుబడి నిజ స్థానాన్ని నిర్థరించేందుకు గాను, మార్క్స్‌ పెట్టుబడిదారీ దోపిడి అసలు సారాంశాన్నే బహిర్గతం చేసాడు. బూర్జువా అర్థశాస్త్రవేత్తలు గాని, ఊహాజనిత సోషలిస్టులు గాని ఈ సమస్యను పరిష్కరించలేక పోయారు. మహా మేధావంతుడైన అర్థశాస్త్రవేత్త మార్క్స్‌ సరుకు ధర్మాల, వైరుథ్యాల విశ్లేషణలతో ప్రారంభించి, కార్మికుల శ్రమలో చెల్లింపబడని భాగాన్ని, అనగా అదనపు విలువను పెట్టుబడిదారులు సొంతపరుచుకోవడానికి సంబంధించిన నియమానికి చేరుకున్నాడు. అయితే మార్క్స్‌ తన అధ్యయనాలను ఈ ఒక్క నియమానికే పరిమితం చెయ్యలేదు. ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థ మైలిక వైరుధ్యపు అర్థాన్ని వెల్లడించి, ఆ వ్యవస్థ పతనపు, నూతన, కమ్యూనిస్టు వ్యవస్థ విజయపు అనివార్యతను నిరూపించాడు.

ʹʹపెట్టుబడిʹʹ గ్రంథం ధర్మమా అని, పెట్టుబడిదారీ సమాజపు పతనం ప్రారంభం కాక ముందే, దాని అచంచలత్వంలో నమ్మకం నిర్మూలింపబడింది. ఈ గ్రంథం శ్రామికవర్గం తన లక్ష్యాలను స్పష్టంగా కనుగొనేందకు తోడ్పడి, మానవుణ్ణి దోపిడీ నుంచి విమ్తుం చేసేందుకు జరిగే పోరాటంలో శక్తివంతమైన ఒక ఆయుధం అయింది. ʹʹపెట్టుబడిʹʹ మొదటి ముద్రణ సందర్భంగా ఎంగెల్స్‌ ఇలా రాసాడు: ʹʹభూమి మీద పెట్టుబడిదారులూ, కార్మికులూ ఉన్న ఈ కాలమంతట్లోనూ, కార్మికులకు మన ముందున్న ఈ పుస్తకమంత ముఖ్యమైన పుస్తకం మరొకటేదీ వెలువడలేదుʹʹ.5

ఈ పరిశోధనా కృషికి తోడు విప్లవోద్యమాన్ని సంఘటితం చెయ్యడంలో మార్క్స్‌ చురుకైన పాత్ర మహించడం కొనసాగించాడు. అంతర్జాతీయ కార్మిక సంఘం, అంటే మొదటి ఇంటర్నేషనల్‌ స్థాపనలో ఆయన నాయక పాత్ర వహించాడు. 1864 లో అది తన సంస్థాపక మహాసభను జరుపుకుంది. ఆయన దాని మార్గదర్శక విభాగానికి, అనగా జనరల్‌ కౌన్సిల్‌కి నాయకత్వం వహించాడు. మార్క్స్‌ తయారు చేసిన ʹʹఅంతర్జాతీయ కార్మిక సంఘ ప్రారంభ ప్రణాళికʹʹ, ʹʹసంఘపు తాత్కాలిక నియమావళిʹʹ అనే రెండు పత్రాల్లోనూ కార్యక్రమ సూత్రాలను వివరించాడు. వాటితో ఆయన ఇంటర్నేషల్‌ విప్లవ పంథాను నిర్ధరించి, శ్రామికవర్గ అంర్జాతీయవాద భావాలను అభివృద్ధి చేసాడు.

1870 వేసవి నుంచి మార్క్స్‌ ఫ్రాన్స్‌లోని రాజకీయ పరిస్థితిని సన్నిహితంగా పరిశీలిస్తూ వచ్చిడు. అప్పుడు ఫ్రాన్సు ఉత్తర ప్రాంతాల్ల ఫ్రాన్స్‌-ప్రష్యా యుద్ధపు భయంకర ఘటనలు-సెడాన్‌ దగ్గర మూడవ నెపోలియన్‌ సేనల లొంగుబాటు, రెండవ సామ్రాజ్య పాలనను తుద ముట్టించిన పారిస్‌లో సెప్టెంబరులో జరిగిన విప్లవం, రిపబ్లిక్‌ ప్రకటన-జరగనారంభించాయి.

బిస్మార్క్‌ పట్లా, ప్రష్యన్‌ జోక్యదారుల పట్లా కన్న తన సొంత ప్రజల పట్ల ఎక్కువ భయం కలిగిన కొత్త ప్రభుత్వం నేషనల్‌ గార్డులను నిరాయుధులను చేసేందుకు ప్రయత్నించింది. 1871, మార్చి 17వ తేదీ రాత్రి ప్రభుత్వానికి విధేయులైన సైనికులు నేషనల్‌ గార్డుల ఫిరంగులను తొలగించేందుకు గాను మాంమార్టర్‌కి తరలి వెళ్ళారు. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. క్రుద్ధులైన ప్రజలు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, మార్చి 26న పారిస్‌లో కమ్యూన్‌ని ప్రకటించారు.

మార్క్స్‌ ఈ ఘటనా క్రమ అభివృద్ధిని అత్యాంతాసక్తితో, ఆదుర్దాగా పరిశీలిస్తూ వచ్చాడు. పారిస్‌ కమ్యూన్‌కి సంబంధించిన ఏ వార్తా ఖండిక లభించినా ఆబగా దాన్ని పోగుచేస్తూ వచ్చాడు. కాని బూర్జువా పత్రికలు బుద్ధి పూర్వకంగా ఘటనలను వక్రీకరిస్తూ, కమ్యూనార్డులను అత్యంత ఘోరంగా చిత్రిస్తూ, కమ్యూనార్డుల ʹʹచట్టవిరుద్ధత, భీతావహంʹʹ గురించి కట్టుకథలు వ్యాపింపజేస్తూ వచ్చాయి. అయితే అసత్యాల వెల్లువలోంచి సైతం మార్క్స్‌ తృణకణాల వంటి కొన్ని సత్యాలను పట్టుకోగలిగేవాడు. అటు తర్వాత కొద్ది కాలానికి అంతర్జాతీయ కార్మిక సంఘపు పారిస్‌ శాఖతో సంబంధం నెలకొల్పుకోవడంలో మార్క్స్‌ సఫలుడయ్యాడు. బిస్మార్‌, త్యేర్‌ల మధ్య విప్లవ ప్రతీఘాత ఒడంబడిక కుదిరే అవకాశం గురించి కమ్యూనార్డులకు మార్క్స్‌ హెచ్చరిక చేసాడు. పారిస్‌వాసుల చర్యల్లో చాలావాటికా ఆయన స్వాగతం పలికాడు.

ఇదే సమయంలో పారిస్‌ కమ్యూన్‌ పట్ల సంఘీభావం ప్రదర్శించవలసిందిగా వివిధ దేశాల సోషల్‌ డెమోక్రట్లకు మార్క్స్‌ విజ్ఞప్తి చేసాడు. పారిస్‌ కమ్యూవార్డులకు తోడ్పాటుగా సామూహిక కార్యాచరణలకు పూనుకోవలసిందిగా బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రియా తదితర దేశాల కార్మికులను ఆయన కోరాడు.

ఈలోగా, పారస్‌ నుంచి నానాటికీ మరింత అధ్వానమైన వార్తలు రాసాగాయి. త్యేర్‌ భయభ్రాంతి నుంచి తేరుకొని, బిస్మార్క్‌ తోడ్పాటుతో కమ్యూన్‌ మీద దాడి జరిపాడు. మే నాటికి అప్పుడే నగరంలో పోరాటం ప్రారంభమైంది. వెర్సేల్స్‌ సైనికులు కమ్యూనార్డు ఖైదీలను ఎలాంటి విచారణా లేకుండా కాల్చివేస్తూ, పేట తర్వాత పేటని పట్టుకోనారంభించారు. విజయోన్మత్తమైన బూర్జువావర్గం సాగించిన అమానుషమైన పగ సాధింపు చర్యలను గురించి తెలుసుకున్న మార్క్స్‌ ఖిన్నుడయాడు. నిజానికి దానితో మార్క్స్‌ ఆరోగ్యం దెబ్బతించి, కొన్ని రోజుల పాటు ఆయన మంచం పట్టాడు.

1871 మే 30న కమ్యూనార్డులు పారిస్‌లోని చివరి బారికేడ్లను కాపాడుతున్నప్పుడు, జనరల్‌ కౌన్సిలుకి మార్క్సు ʹʹఫ్రాన్సులో అంతర్యుద్ధంʹʹ అనే శీర్షికతో తను రచించిన విజ్ఞప్తి పాఠాన్ని చదివి వినిపించాడు. అందులో ఆయన పారిస్‌ కమ్యూన్‌ని గురించిన ప్రగాఢమైన శాస్త్రీయ విశ్లేషణను ఇచ్చి, భవిష్యత్తులో కార్మికుల విప్లవకర కార్యాచరణల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని హెచ్చరిక చేసాడు. ఆ విజ్ఞప్తిలో మార్క్స్‌ పారిస్‌ కమ్యూన్‌ శ్రామికవర్గ నియంతృత్వపు తొలి అనుభవమని వక్కాణించాడు. కమ్యూన్‌ పాత రాజ్య యంత్రాన్ని తుత్తునియలు చేసి, శ్రామిక జనాభాలోని ఇతర విభాగాలతో ఐక్యం కావలసిన ఆవశ్యకతను నిరూపించిందని విజ్ఞప్తిలో చెప్పబడింది.

మార్క్స్‌ తన జీవితపు చివరి సంవత్సరాల్లో విప్లవ సిద్ధాంతాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేయడం పట్లా, విడి దేశాల్లో శ్రామికవర్గ పార్టీలను నెలకొల్పడం పట్లా, వాటి మధ్య సంబంధాలను పటిష్టం చెయ్యడం పట్లా విశేషమైన శ్రద్ధ చూపాడు.

రష్యా విషయంలో ఆయన ప్రగాభమైన ఆసక్తి వహించాడు. రష్యన్‌ విప్లవోద్యమ ప్రతినిధులతో ఆయన సంబంధాలు ఆయేటకాయేడు దృఢతరమవుతూ వచ్చాయి. రష్యన్‌ ప్రజాస్వామిక సాహిత్యం పట్ల ఆయనకి సమున్నత గౌరవం ఉండేది. ప్రపంచ విప్లవ క్రమంలో రష్యా ముఖ్య పాత్ర వహించగలదని ఆయన పరిగణించాడు. రష్యన్‌ భాష నేర్చుకోవాలని నిర్ణయించుకునే సరికి మార్క్సు వయస్సు యాభై రెండేళ్ళు. రష్యాలో భూమి స్వామ్యం మూలాధార సమాచారాన్ని అధ్యయనం చేస్తే గాని వ్యవసాయ సమస్యను అధ్యయనం చెయ్యడం అసాధ్యమని ఆయన భావించాడు.

(ఇంకా ఉంది)

No. of visitors : 1812
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 24.11.2016 09:43:08pm

లాసాల్‌ ‌చెప్పేదాని ప్రకారం, కార్మిక సంఘాలు ఉత్పత్తి నిర్వహణను క్రమంగా తమ చేతుల్లోకి తీసుకుంటాయి. సార్వజనిక ఓటు హక్కును ప్రవేశపెట్టిన ఫలితంగా రాజ్యం ʹʹ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  అరుణతార మార్చి - 2020
  ఉన్నావో సీత
  ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
  విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
  బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
  అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
  సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
  ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
  మూడో తరానికి...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •