కశ్మీర్ పిల్లలు ఇండియా గురించి ఏమనుకుంటున్నారు?

| సంభాషణ

కశ్మీర్ పిల్లలు ఇండియా గురించి ఏమనుకుంటున్నారు?

- | 01.08.2016 10:52:45pm

కశ్మీర్ లోయలోని బజార్లన్నీ ఏళ్ల తరబడి మనుషుల ఆనవాళ్లు లేక పడువబడ్డట్టు బోసిపోయి. వీధులన్నీ భీతిగొలిపే నిశ్చబ్దంలో మునిగి ఉన్నాయి. అప్పుడప్పుడు సీఆర్‌పీఎఫ్ దళాల కాల్పుల చప్పుడు, నిరసనకారుల నినాదాలు ఎక్కడో దూరంనుంచి లీలగా వినిపిస్తున్నాయి. స్కూళ్లు లేవు. కరెంటు లేదు. ఇంటర్నెట్ లేదు. న్యూస్ పేపర్ కూడా లేదు. ఇద్దరు పెద్దవారు తమ ఇంటి కిటికీ సందులోంచి.. భయం భయంగా బయటకు తొంగి చూస్తున్నారు. భయంతో గడ్డకట్టిన కశ్మీర్‌లో.. ఇది మరో రోజు...

భయంతో ఓ మూల నక్కి కూర్చున్నట్లుగా మరో రూములో ఓ పదమూడేళ్ల పిల్లవాడు కూర్చొని ఉన్నాడు. అతని తల్లిదండ్రులు ఇంట్లో ఇలాగే పడి ఉండమని గద్ధించినట్లున్నా రు. వారికి కర్ఫ్యూ అలవాటైపోయింది. స్కూలు ఎప్పుడు తెరుస్తరో, ఎప్పుడు మూస్తరో తెలియని స్థితిలో పాఠశాల అంటే ఇలాగే ఉంటుందేమో అన్నంతగా అలవాటై పోయా డు ఆపిల్లవాడు. నిత్యమూ కళ్లముందు జరుగుతున్న హింసతో.. హింసకూడా వారికి జీవితంలో భాగమై పోయింది. సహజంగా ఆడిపాడే పరిస్థితులు ఎన్నడూ ఆ పసి బాలుడు చూసి ఎరుగడు. చిన్న పిల్లలు ఏపరిస్థితులైతే చూడగూడదో.. సరిగ్గా ఆ పరిస్థితుల్లోనే ఆ పిల్లవాడు పుట్టి పెరుగుతున్నాడు.

దూరంనుంచి వినిపిస్తున్న నిరసనకారుల నినాదాలను కళ్లుమూసుకుని వింటున్నాడు. తుపాకీ కాల్పుల శబ్ధాలు.. నిశ్శబ్దం.. ఇవన్నీ అతనిలో భయాన్ని నింపడంలేదు. బహుషా తన చుట్టూరా ఉన్న అందరిలో కోపమే ఆవరించి ఉండటం వల్ల కావచ్చు..! అసహనం కోపం ముంచుకొస్తుంది. ఆ పిల్లవాడు తన రూంలోనే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడేమీ అతను చేయలేక పోవచ్చు. కానీ కొంత వయస్సు వచ్చి పెరిగి పెద్దయిన తర్వాత.. అతడూ ఏదో చేసేంత శక్తిని కూడగట్టుకుంటాడు కదా. ఏమీ చేయలేక పోయినా.. భారత పాలనకు వ్యతిరేకంగా నిరసనోద్యమంలో భాగమైన పిల్లలను చూస్తే.. కశ్మీర్ పిల్లలు ఏం పోగొట్టుకున్నారో అర్థం అవుతుంది. వారి కలలకు ఎంత దూరంలో ఉన్నారో చూసినట్లవుతుంది.

ఈ క్రమంలోనే.. క‌శ్మీర్ పిల్ల‌ల్ని ప‌ల‌క‌రిస్తే... వారి మనోభావాలు.. భారత్ పట్ల వారికున్న భావనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు...

ఇండియా అంటే పిల్లలను కొట్టే పోలీస్. ఇండియా అంటే అసహ్యం. నా తల్లిదండ్రు లు నన్ను బయటికి వెళ్లనివ్వరు. మాకు బయటకు వెళ్లాలంటేనే భయం. నా అమ్మానా న్నలంటారు.. బయటకెళితే చంపేస్తరని. నేను ఆడుకోవడానికి స్వేచ్ఛలేదు. నేను గత పదిరోజులుగా ఆడుకోలేదు. కనీసం పుస్తకాలను ఇప్పి చదివే పరిస్థితిలేదు. మేం భయ పడుతున్నాం. మాకు స్వేచ్ఛ(ఆజాదీ)కావాలి. నాకు బయటకు వెళ్లి నిరసనోద్యమంలో పాల్గొనాలని ఉంది. కానీ అమ్మానాన్నలు నన్ను రూంలోవేసి తాళం వేశారు. నేను నినాదాలు మాత్రమే వింటున్నాను.
-సఫన్ నిస్సార్, 13 ఏళ్లు

భారత్ పెద్ద మోసకారి. మమ్ములను చంపుతున్నది, మాయం చేస్తున్నది. నేను స్వేచ్ఛా యుత కశ్మీర్‌ను కోరుకుంటున్నాను. నేను ఇండియాతోగానీ, పాకిస్థాన్‌తో గానీ ఉండాల ని కోరుకోవడం లేదు. బయటకి వెళ్లాలంటేనే భయం వేస్తున్నది. కాలు బయట పెడితే పోలీసులు ఏమైనా చేయొచ్చు. వారిని నమ్మలేను. వారు నన్ను చంపేయవచ్చు. ఈ పరిస్థితుల్లో నేను పుస్తకం ముట్టడంలేదు. ఆడుకునే పరిస్థితీలేదు. బజార్లనిండా అంతా భారత సైనికులే ఉంటే.. ఎవరితో ఆడుకోను?
-మువావిన్ తస్నీం,12 ఏళ్లు

ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే.. మా పేరెంట్స్ పాకిస్థాన్‌కు మద్ధతు పలికేవారు. నేను ఎప్పుడూ అలా ఎందుకు చేస్తున్నారని అడగలేదు. కానీ నేను పెరిగి పెద్దగవుతున్న కొద్దీ.. పరిస్థితులు అర్థమవుతున్నాయి. నా తోటి విద్యార్థులూ, సోపతిగాళ్లూ.. కశ్మీర్‌పై ఇండియా చేస్తున్న అణచివేత గురించి చెప్పారు. ఆ తర్వాత కాలక్రమంలో భారత్‌గురించి చాలా చాలా తెలిసివస్తున్నది.
-మహసిన్ వనీ, 13 ఏళ్లు

ఇండియా మోసకారి దేశం. వారు మమ్మల్ని అణచివేస్తున్నారు. ఒక వేళ భారత్ మా దేశమే అయితే.. తన ప్రజలనే ఇంత మందిని ఎందుకు చంపుతుంది. ఈ పరిస్థితుల్లో మేం ఇండియాతో ఉండలేం.
-డానిష్, 12 ఏళ్లు

కశ్మీర్‌లోని బాలికలను భారత్ చంపుతున్నది. నేను అనేక ఘటనలను టీవీలో చూశాను. నేను బయటకే వెళ్లడం లేదు. బయటకు వెళ్తే.. పిల్లెట్స్ తగులుతాయేమోనని భయం. అవి గుడ్డివాళ్లను చేయొచ్చు. నాకు భారత్ అంటే అసహ్యం. ఇండియా ఇక్కడ అందరినీ చంపుతున్నది. ప్రతిఒక్కరిలో భయం నింపుతున్నది. ఇక్కడ మాకు ఏమాత్రం భద్రత ఉన్నట్లు అనిపించడం లేదు. పార్లమెంటులో మాత్రం ఎంపీలు కశ్మీర్ విషయంలో వాదులాడుకుంటారు. కానీ కశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు మాత్రం చెప్పరు. బీజేపీని కాంగ్రెస్ దోషి అంటుంది. బీజేపీ కాంగ్రెస్‌ను దోషి అంటుంది. ఇద్దరూ కలిసి ఒకే గొంతుకతో పాకిస్థాన్‌ను తప్పుపడతారు. ఈ బ్లేమ్ గేమ్‌లో.. కశ్మీర్ పిల్లలు తమ బాల్యాన్నీ, భవిష్యత్తునూ కోల్పోతున్నారు.
-మెహ్రీన్, 14 ఏళ్లు

(www.scoopwhoop.com సౌజ‌న్యంతో...)





No. of visitors : 1862
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


క‌శ్మీర్ దుస్థితి - పౌర హ‌క్కులు

| 28.07.2016 11:40:12am

పౌర స‌మాజం మౌనం వీడాల్సిన సంద‌ర్భం ఇది. ఈ నేప‌థ్యంలో క‌శ్మీర్ ʹదుస్థితి - పౌర హ‌క్కులుʹ అనే అంశంపై లామ‌కాన్ ఆగ‌స్టు 2వ తేదీన చ‌ర్చా కార్య‌క్ర‌మం..........
...ఇంకా చదవండి

భారత సైన్యాలు కశ్మీర్ ను వీడాలి

నోమ్ చామ్‌స్కీ | 01.08.2016 04:06:00am

ప్రస్తుత కశ్మీర్ పరిస్థితి నన్ను దిగ్బ్రాంతికి గురిచేస్తున్నది . సమస్య పరిష్కారం అవ్వాలంటే భారత సైన్యాలు మొదట కశ్మీర్ ను వీడాలి . కశ్మీర్ కు తనదయిన.........
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జులై - 2020
    వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
    గాలింపు, స్థూపాల కూల్చివేత
    కవి కాశీం కవిత్వ విశ్లేషణ
    అసమానత నుండి విప్లవం దాకా..
    ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
    తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
    కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
    వరవరరావును జైలులో చంపవద్దు
    మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
    "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
    అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •