స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

- ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రెండ‌వ భాగం

కార్ల్‌ మార్క్స్‌ (1818 - 1883)


రష్యన్‌ సాంఘిక శాస్త్రవేత్త, అర్ధ శాస్త్రవేత్త వి.వి.బెర్వి-ఫ్లెరోవ్‌స్కీ చనను మూల భాషలో చదివిన మార్క్స్‌ ఇలా రాసాడు : ʹʹఫ్లెరోవ్‌స్కీ పుస్తకం ʹరష్యాలో కార్మికవర్గ పరిస్థితిʹ ఒక ప్రముఖ రచన. నేనిప్పుడు నిఘంటువు సాయంతో దాన్ని తేలిగ్గా చదవగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ పుస్తకంలో రష్యా ఆర్థిక పరిస్థితి మొట్టమొదటి సాదిగా సమగ్రంగా చిత్రించబడింది. ఇది చిత్తశుద్ధితో చేసిన రచన. వాస్తవాలను అధ్యయనం చేసి, సంప్రదాయకంగా ప్రచలితంగా ఉన్న అసత్యాలను తూర్పారబట్టే ఏకైక లక్ష్యంతో పదిహేనేళ్ళ పాటు దేశంలో పశ్చిమ సరిహద్దుల నుంచి తూర్పు సైబీరియా దాకా, తెల్ల సముద్రం నుంచి కాస్పియన్‌ సముద్రం దాకా రచయిత పర్యటించాడు....ఆయన రచనను అధ్యయనం చేసిన తర్వాత సమీప భవిష్యత్తులో రష్యాలో మహా శక్తివంతమైన సాంఘిక విప్లవం అనివార్యమన్న దృఢ విశ్వాసం ఎవరికైనా కలిగి తీరుతుంది. సహజంగానే, అది మాస్కోవియా ప్రస్తుత అభివృద్ధి స్థాయికి అనురూపంగా ప్రాథమిక రూపాలో1 జరగవచ్చు. అది మంచి వార్త. ఈనాటి యూరోపియన్‌ వ్యవస్థకి రష్యా, బ్రిటన్‌లు రెండూ గొప్ప ఆధార స్తంభాలు. ఇతర దేశాలన్నీ - అందమైన ఫ్రాన్సు, పండిత జర్మనీ సైతం- ద్వితీయ ప్రాధాన్యం కలిగినవిʹʹ6.

గేర్‌త్సెన్‌, చెరిష్రేవ్‌స్కీ, బెర్వి-ఫ్లెరోవ్‌స్కీ, సల్తికోవ్‌-శ్చెద్రీన్‌, నెక్రాసొవ్‌, దొబ్రొల్యూబొవ్‌, పూష్కిన్‌ల రచనల నుంచి జన సామాన్యపు పరిస్థితులు, పోరాటాలను గురించీ, ప్రగతిశీల సామాజిక చింతన చరిత్రను గురించీ మార్క్స్‌ సమాచారాన్ని సేకరించాడు. రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటానికి అనుబంధితమైన విప్లవాత్మక పరిస్థితి కారణాలను మార్క్స్‌ శ్రద్ధగా అధ్యయనం చేసాడు.

1871లో లండనులో జరిగిన ఇంటర్నేషనల్‌ కాన్ఫురెన్సులో ప్రసంగిస్తూ మార్క్స్‌ రష్యన్‌ కార్మికవర్గంలో చాలా బలీయమైన అంతర్జాతీయతత్వ, సంఘీభావాలు ఉన్నాయని పేర్కొన్నాడు. పారిస్‌ కమ్యూన్‌ పదవ వార్షికోత్సవంలో మార్క్స్‌, ఎంగెల్సులు రష్యాలో అభివృద్ధి చెందుతున్న విప్లవోద్యమం రష్యన్‌ కమ్యూన్‌ స్థాపనకు అనివార్యంగా దారితీస్తుందని జోస్యం చెప్పారు.

మార్క్స్‌ ప్రవాస జీవిత క్లేశాలన్నింటినీ సహించవలసి వచ్చింది. బూర్జువా ప్రభుత్వాలు ఆయన్ని నిరంతరాయంగా వేధించాయి. ఆయన కుటుంబ సభ్యులకు నిత్య జీవితావసర వస్తువులు సైతం ఉండేవి కావు. ఆయన భార్యా, విశ్వసనీయమైన జీవిత సహచరీ అయిన జెన్నీ ఆయన కఠిన జీవితపు కష్టాలన్నింట్లోనూ- ఆయన దేశ సంచారాల్లో, పేదరికంలో, ఆయన గురి అయిన వేధింపులో-పాలుపంచుకొంది. మార్క్స్‌ దంపతుల ఏడుగురు బిడ్డల్లో జెన్నీ, లౌరా, ఎలియొనోర్‌ అనే ముగ్గురు కూతుళ్ళు మాత్రమే మిగిలారు. జెన్నీయే మార్క్స్‌కి అత్యంత సన్నిహిత సహాయకురాలు, సలహాదారు, ఆయన ʹʹభాగ్యదేవతʹʹ. రష్యానుంచి అమెరికా దాకా మార్క్స్‌ పేరు పోరాటమగ్నమైన ఒక నూతన ప్రపంచానికి సంకేతం అవడాన్ని తన జీవిత కాలంలో జెన్నీ చూసింది.

మార్క్స్‌ జీవితంలో జెన్నీ, ఎంగెల్సులు సాధారణ పాత్ర వహించారు.

జెన్నీ హాస్య ప్రవృత్తినీ, సున్నితమైన సౌందర్యగ్రహణ అభిరుచినీ, విస్తృత జ్ఞానాన్నీ మార్క్స్‌ ఎంతో మెచ్చుకునేవాడు. కుటుంబ జీవితపు బరువు బాధ్యతలు ఎన్ని ఉన్నప్పటికీ, జెన్నీ చాలా సంవత్సరాల పాటు మార్క్స్‌కి సెక్రటరీగా పనిచేసింది. ఆమె ఆయన రచనలన్నింటినీ సాపు ప్రతులు రాసింది, అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమ నాయకులు చాలామందితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది. ఆ ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రతిదాన్నీ మనస్సుకి పట్టించుకొంది.

మార్క్స్‌ సమకాలికులు చాలామంది ఆయన గొప్పతనాన్ని గ్రహించారు. ఆ మహా చింతనాపరుడితో సాహచర్యం నెరపే అవకాశం కలిగిన ప్రతి ఒరూ, దరిమిలా ఆయన ఉజ్వల మేధస్సు సర్వతోముఖ స్వభావాన్ని గురించీ, ఆయన బ్రహ్మాండమైన పాండిత్యం గురించీ, ఆయన మానసిక ప్రతిభావ్యత్పన్నతల మహత్తర పటిమ గురించీ, అచంచల చిత్త స్థైర్యం గురించీ రాసారు. మార్క్స్‌ రచనలతో పరిచయం ఆయన మేధా శక్తినీ, బహుముఖత్వాన్నీ చూపుతుంది. సమస్త చారిత్రకాభివృద్ధి క్రమమూ చర్చనీయాంశాలుగా ముంఉదకు తెచ్చిన ప్రశ్నలకు జవాబులు సమకూర్చడంలో ఉంది ఆయన ఘనత. ప్రకృతి, సమాజాలను గురించిన అభిప్రాయాల్లో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు.

ఆయన సమాకలికులు చాలామంది ఆయన అసాధారణమైన సౌజన్యం కలిగినవాడనీ, సులభ సాధ్యుడనీ, కలుపుగోలు వ్యక్తి అనీ పేర్కొన్నారు. ఆయన కూతురు జెన్నీ ఆయన్ని ఒకసారి తన తీరిక సమయంలో ఒక ప్రశ్నావళికి సమాధానాలు రాయమని కోరింది. ఈ ప్రశ్నావళి దరిమిలా ʹʹఒప్పుకోలుʹʹ పేరిట విస్తృత ప్రచారం పొందింది.

ప్రశ్న : మీకు అభిమానపాత్రమైన సద్గుణం ఏమిటి?
జవాబు : నిరాడంబరం

మార్క్స్‌ ఇతరుల్లో ఈ గుణాన్ని విలువైనదిగా పరిగణించడమే కాక, ఆయన స్వయంగా చాలా నిరాడంబరుడు, వినయశీలి. ఆయన ఇంటికి సైబీరియా నుంచి, అమెరికా నుంచి జనం వస్తూండేవాళ్ళు. మాంచెస్టర్‌ ఫాక్టరీల కార్మికులు, పారిస్‌ ప్రభువులు ఉండేవాళ్ళు. వారిలో ప్రతి ఒక్కరికీ అవసరమైన సలహా సహకారాలు లభించేవి. ఎవరైనా ʹʹఆరాధనʹʹ భావాన్ని లేశ మాత్రంగా ప్రదర్శించినా కూడా ఆయన ʹʹకయ్‌మనేవాడుʹʹ. ఒకసారి ఆయన తన పెద్ద కూతురు దగ్గరకి వెళ్ళినప్పుడు కచ్చితంగా తన రాక తేదీని గురంచీ, సమయాన్ని గురించీ పట్టించుకోవద్దనీ, తన సంకల్పాలను ఎవ్వరికీ తెలియనివ్వ వద్దనీ ప్రత్యేకించి ఒక ఉత్తరం రాసాడు. జనం తనకి రైల్వే స్టేషన్లో స్వాగతం చెప్పడమంతగా మరింకేదీ తనని గాభరా పెట్టదని మార్క్స్‌ వివరించాడు.

ప్రశ్న : పురుషుడిలో అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏ గుణానికి అత్యధికమైన విలువను ఇస్తారు?
జవాబు :బలం
ప్రశ్న : మీ విశిష్ఠ గుణాల్లో ముఖ్యమైనది ఏమిటి?
జవాబు : లక్ష్యం పట్ల ఏకాగ్రత
ప్రశ్న : మీ అభిప్రాయంలో సుఖం అంటే ఏమిటి?
జవాబు : పోరాటం

1880 ఆశకం మొదట్లో మార్క్స్‌ ఆరోగ్యం గమనీయంగా క్షీణఙంచింది. ఆయన భార్య జెన్నీ 1881 డిసెంబరులోనూ, పెద్ద కూతురు జెన్నీ 1883 జనవరిలోనూ మరణించారు. ఈ దురదృష్టకర ఘటనలు ఆ మహా చింతనాపరుడిలో మిగిలివున్న శక్తిని పీల్చేసాయి. 1883 మార్చి 14న ఆయన మరణించాడు.1883 మార్చి 17న లండన్‌లోని హైగేట్‌ శ్మశాన వాటకలో ఆయన సమాధి చెయ్యబడ్డాడు. అక్కడ ఎంగెల్స్‌ ʹʹఆయన పేరు చిరస్తాయిగా నిలుస్తుంది, ఆయన కృషి కూడా అంతేʹʹ7అన్న జోస్యప్రాయమైన మాటలు చెప్పాడు.

రష్యాలో 1917 అక్టోబరు విప్లవం పెట్టుబడిదారీ వ్యవస్థ పతనం అయ్యే యుగానికి, సమాజం సోషలిజానికీ, కమ్యూనిజానికీ పరివర్తన చెందే యుగానికి నాంది పలికింది. అంతర్జాతీయ రంగంలో దరిమిలా జరిగిన ఘటనలన్నీ-ప్రపంచ సోషలస్టు వ్యవస్థ ఏర్పడటం, విప్లవ క్రమం అపారంగా విస్తృతమవడం, ప్రగాఢమవడం, దీనిలో ఒక భాగంగా బృహత్తరమైన ప్రమాణంలో జాతీయ విముక్తి ఉద్యమం సాగడం- మార్క్స్‌ భావాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయి.

బూర్జువా సౌద్ధాంతికులకీ సైతం మార్క్సిజం అజేయ శక్తిన అంగీకరించిక తప్పలేదు.

ప్రముఖ అమెరికన్‌ గ్రంథకర్త ఎడ్మండ్‌ విల్సన్‌ ʹʹఫిన్లండ్‌ సేటషనుకి బాటʹʹ అనే తన పుస్తకంలో మార్క్స్‌ బోధన మరే ఇతర పూర్వ సిద్ధాంతం కంటే అధికంగా గతానికి చెందిన మరిన్ని రహస్యాలను ఆవిష్కరించన, వర్తమానంలో అధికతర సంక్లిష్ట సమస్యలను సృష్టకరించిన, భవిష్యత్తుకి మరింత ఆచరణాత్మక మార్గాన్ని తెరిచిన ఒక సంపూర్ణ, సుసంగత సిద్ధాంతం అని రాసాడు.

సందర్భవశాత్తూ, ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. మార్క్స్‌ బోదన కోట్లాది కార్మికుల ఉద్యమం ఎందుకైందో బూర్జువా రచయితలకూ, పండితులకూ ఈనాటటికీ ఎంతగా బుర్రలు బద్దలుకొట్టుకున్నా బోధపడటం లేదు. దీనికి ఉండగల సమాధానం ఒక్కటే. పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అభివృద్ధి సాంఘిక పరివర్తనలకూ, సోషలిస్టు విప్లవానికీ అనివార్యంగా దారితీస్తుందని నిర్ధారణ చేసాడు. మానవజాతి ఆలోచన సృష్టించినదానంతకీ ఆయన మెరుగుదిద్ది, దాన్ని విమర్శకి గురిచేసి, కార్మికవర్గ ఉద్యమపు ఆచరణలో దాన్ని పరీక్షించి బూర్జువా దురభప్రాయాల్లో, ఇరుక్కన్నవాళ్ళు చెయ్యలేని నిర్దారణలు చేసాడు.

No. of visitors : 1564
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి......
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 24.11.2016 09:43:08pm

లాసాల్‌ ‌చెప్పేదాని ప్రకారం, కార్మిక సంఘాలు ఉత్పత్తి నిర్వహణను క్రమంగా తమ చేతుల్లోకి తీసుకుంటాయి. సార్వజనిక ఓటు హక్కును ప్రవేశపెట్టిన ఫలితంగా రాజ్యం ʹʹ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...

  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •