సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

- పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

2017 నవంబర్‌ నాటికి బోల్షివిక్‌ విప్లవ విజయానికి వందేళ్ళు పూర్తవుతాయి. అదే ఏడాది మే నాటికి నక్స‌ల్బ‌రీకి యాభై ఏళ్ళు. 2018 నాటికి మార్క్స్‌ 200వ జయంతి. 2019 అక్టోబర్‌ నాటికి చైనా విప్లవానికి డెబ్భై ఏళ్లు. వందేళ్లకు, యాభై ఏళ్లకు, జయంతుల‌కు ఏ ప్రత్యేకతా లేదు. మనం గుర్తించుకునే సందమార్భాలు మాత్రమే. ప్రస్తుత సంక్షుభిత వాతావరణంలో, బూర్జువా ప్రజాస్వామ్యం పూర్తిగా విఫల‌మైపోయి ఫాసిస్టు రూపు తీసుకుంటున్న దశలో ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తించుకునే సందర్భాలు వస్తున్నాయి. ʹఎప్పటి సోవియట్‌ విప్లవం గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయిʹ వంటి మాటలు చాలా విన్నాం, వింటున్నాం. సోవియట్‌ ఒక విఫల‌ ప్రయోగమని, ఏకపార్టీ నియతృత్వమనీ, వ్యక్తి స్వేచ్ఛను అణగదొక్కేదనీ, బూర్జువా ప్రజాస్వామ్యానికి ప్రత్యమ్నాయం లేదని ఎన్నో వ్యాఖ్యానాలు, వాదనలు సరే సరి.

ఒక వైపు దేశం తర్వాత దేశం సామ్రాజ్యవాద మార్కెట్‌ సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. సామ్రాజ్యవాదుల‌ దురాక్రమణ యుద్ధాల్లోనో, అవి ప్రేరేపిస్తున్న అంతర్యుద్ధాల్లోనో నెత్తురోడుతున్నాయి ఫాసిజం, ఫండమెంటలిజం మానవజాతిని దారుణ తిరోగమనం వైపు తోసేస్తూ ఉంది. మరోవైపు ఈ దుర్మార్గమైన వ్యవస్థకు ప్రత్యామ్నాయమే లేదని చెప్పే సామ్రాజ్యవాద పెట్టుబడి, ప్రత్యామ్నాయ ప్రయత్నాల‌ను, స్వావ‌లంబన ఆర్థిక విధానాల‌ను హింసాత్మకంగా నిర్మూలించేదుకు తెగబడుతున్నది. బూర్జువా ప్రజాస్వామ్యం మానవాళికిచ్చిన హామీలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం హాస్యస్పదంగా తయారైనాయి. విప్లవాల‌కు ఎంత పరిపక్వమైన పరిస్థితులున్నా ప్రస్తుత దశలో సోషలిస్టు విప్లవ శక్తుల బలం తగినంతగా లేని మాట కూడా వాస్తవం. అయితే శక్తివంతమైన కార్మికవర్గ విప్లవాలు కనిపించనప్పటికీ సామ్రాజ్యవాద మార్కెట్‌ అత్యాశకు, విపరీతమైన సంపద కేంద్రీకరణకు, తీవ్రతరమవుతున్న అసమానతల‌కు వ్యతిరేక ధోరణి బల‌పడుతున్నది. ఇదంతా ప్రపంచ సోషలిస్టు క్రమంలో భాగంగా చూడవచ్చు.

ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న గత శతాబ్దపు విప్లవ వెల్లువకు సంబంధించిన మహాద్భుత ఘట్టాల‌ను ఈ కాలానికి, ఈ తరానికి పరిచయం చేయడమే కాక వర్తమాన అవసరాలు తీర్చేలా వాటిని విశ్లేషించవసిన అవసరం ఉంది. సోవియట్‌ సోషలిస్టు విప్లవానికి కొనసాగింపుగా జరిగిన అనేక విప్లవాలు, సాధించిన విజయాలు, పొందిన వైఫల్యాలు, అవి నేర్పిన గుణపాఠాలు కొనసాగుతున్న విప్లవోద్యమాల‌కు, సాహిత్యసాంస్కృతికోద్యమాల‌కు కూడా అధ్యయన పాఠాలే. సామ్రాజ్యవాదం విప్లవోద్యమాల‌ను పూర్తిగా నిర్మూలించాల‌నే ల‌క్ష్యంలో భాగంగా ఆల్‌అవుట్‌ వార్‌తో పాటు మానసిక, భావజాల‌ యుద్ధం తీవ్రతరం చేసింది. మార్క్సిజానికి, వర్గపోరాటానికి, సోషలిజానికి కాలం చెల్లిపోయిందని ఆధునికాంతర అశాస్త్రీయ సిద్ధాంతాల‌తో పాల‌కవర్గ అనుకూల‌ భావజాలం ఊదరగొడుతున్నది. 20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచవ్యాప్తంగా బురదజల్లే చ‌ర్చ‌ల‌కు (లెనిన్‌కు, స్టాలిన్‌కు పోటీ పెట్టడం, మావోయిస్టు వ్యతిరేకత, ట్రాస్కీవాదం వగైరా) ఉంటున్నాయి.

ఈ పరిస్థితుల్లో మార్క్సిజం పక్షాన, వర్గపోరాటం పక్షాన, పీడిత ప్రజ పక్షాన శక్తివంతంగా సైద్ధాంతిక పోరాటం చేయవసిన అవసరాన్ని విరసం గుర్తిస్తున్నది. పైన చెప్పిన చారిత్రక ఘట్టాల‌ను వర్తమాన సన్నివేశం వద్దకు తీసుకొచ్చి వచ్చే నాలుగేళ్లలో విస్తృతంగా మార్క్సిజంపైన సోషలిస్టు ప్రత్యామ్నాయంపైన అధ్యయనం, చర్చ, సాహిత్య ప్రచురణ చేపట్టాల‌ని జూన్‌ 7న జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో విప్లవ రచయిత సంఘం తీర్మానించింది. ʹసోషలిజమే ప్రత్యమ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథాʹ అనే నినాదంతో సైద్ధాంతిక, భావజాలం రంగంలో నిర్దిష్ట కార్యాచరణతో పనిచేయాల‌ని నిర్ణయించింది. సైద్ధాంతిక రంగంలో వర్గపోరాట ఆచరణతో ʹవ్యవస్థను అర్థం చేసుకోవాల‌న్నా, మార్చాల‌న్నా మార్క్సిజమే మార్గంʹ అన్న సత్యాన్ని ఎలుగెత్తి చాటాల‌ని, ఈ పనిలో భావసారూప్యత ఉన్న సంస్థల‌తో, వ్యక్తుల‌తో కలిసి పనిచేయాల‌ని నిర్ణయించింది. ఈ విషయంలో మిత్రుల సూచ‌న‌ల‌ను విరసం ఆహ్వానిస్తున్నది.

ఇటీవలి కాలంలో విప్లవ రచయిత సంఘం విస్తృత స్థాయిలో మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టు సైద్ధాంతిక గ్రంధాల‌ను వెలువ‌రిస్తున్న సంగతి మిత్రుల‌కు తెలిసే ఉంటుంది. అట్లాగే రానున్న నాలుగేళ్లలో సైద్ధాంతిక అవగాహన, చర్చను పెంపొందించే ల‌క్ష్యంతో మరిన్ని పుస్తకాల‌ను పాఠకుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని విరసం అనుకుంటున్నది. వాటిలో కొన్ని: 1.జర్మన్‌ ఐడియాజీ, 2.పారీస్‌ కమ్యూన్‌, 3.బోల్షివిక్‌ విప్లవ చరిత్ర, 4.లెనిన్‌ జీవితం, పోరాటం, 5.స్పెయిన్‌ అంతర్యుద్ధం`బుద్ధిజీవులు, 6.ఎర్రమందారాలు (నవల‌), 7.కొడుకు, కూతుళ్లు (నవల‌), 8.ఉదయగీతిక (నవల‌), 9.కవుల‌కు, కళాకారుల‌కు లెనిన్‌ ఇచ్చిన పిలుపు, 10.అపరిచిత (నవల‌), 11.డెవల‌ప్‌మెంట్‌ ఆఫ్‌ కాపిటలిజం ఇన్‌ రష్యా (అనువాదం), 12.మార్క్స్‌ మెథర్డ్‌, 13. మార్క్స్‌ ఆన్‌ జెండర్‌ (అనువాదం), 14.మార్క్స్‌ ఆన్‌ ఎకాల‌జీ (అనువాదం) 15.మార్క్స్‌ ఆన్‌ లిటరేచర్‌ (అనువాదం), 16.సాంస్కృతిక విప్లవం, 17.1857 తిరుగుబాటుపై మార్క్స్‌, 18.సహచర (నవల‌), 19.మేడే, 20. నక్స‌ల్బ‌రీ ఉద్య‌మ చ‌రిత్ర.

ఉద్యమాభివందనాతో...


పి.వరల‌క్ష్మి, కార్యదర్శి
విరసం

No. of visitors : 2800
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి

ఉద్దేశం మంచిదే అంటున్నారు, ఏమిటా ఉద్దేశం?

పి.వరలక్ష్మి | 18.11.2016 10:43:33am

జనం డబ్బు మొత్తం బ్యాంకుల్లో పోగేసి ఏం చేయబోతున్నారు? పరిమితి విధించడం ద్వారా కొద్ది రోజులపాటు డబ్బు తీసుకోను కూడా వీలుకాని దిగ్బంధనం విధించి మరీ ఏం చేయబోతు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్
  ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •