ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలలోని 59 కులాలకు సమానంగా పంపిణీ చేయాలని గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ పోరాడుతున్నది. మాదిగ ఉప కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని విప్లవ రచయితల సంఘం(విరసం) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. వేల సంవత్సరాల అంటరానితనం, అణిచివేత వల్ల దళితులు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలకు దూరమయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థ రూపొందాలంటే సామాజిక న్యాయం ఒక షరతుగా ఉండాలని డా. బిఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. అందుకే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ి పొందుపర్చారు. దీని కోసం ఆయన ఆరోజుల్లో ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. కాని అగ్రకుల, దోపిడీ పాలకులు రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం లేదు.
భారత దేశంలోని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ దళితులలో కూడా అంతరాలను ఏర్పరిచింది. ఫలితంగా కొన్ని కులాలు రిజర్వేషన్ ఫలాలను అందుకొని ముందుకుపోగా.. మరి కొన్ని వెనుకబడిపోయాయి. ఈ అరవై అయిదేళ్ల కాలంలో ఎస్సీ రిజర్వేషన్లను దళితుల్లోని ఒకటి రెండు కులాలే అధికంగా ఉపయోగించుకున్నాయి. మిగతా చాలా కులాలు విద్యా, ఉద్యోగాలకు ఆమడదూరంలో ఉన్నాయి. అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు. రిజర్వేషన్లో ఉన్న ఈ అసమాన పంపిణీ పోవాలంటే ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరించి జనాభా దామాషా ప్రకారం కేటాయించాలి.
వర్గీకరణ సాధన కోసం మాదిగ, మాదిగ ఉపకులాలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనది. ప్రజాస్వామికమైనది. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశాలలోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించాలని ఢిల్లీలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలు జూలై 19న ఆందోళన ప్రారంభించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే ఆగస్టు 12 దాకా ఈ ఉద్యమం నడుస్తుంది. మాదిగ ఉపకులాల్లోని అన్ని జన సముదాయాలు, మేధావులు, ప్రజాసంఘాలు పాల్గొంటున్న ఈ ప్రజాస్వామిక ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి, దానికి చట్ట బద్ధత కల్పించాలని విప్లవ రచయితల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఈ పోరాటానికి మిగతా పీడిత, దళిత కులాలల్లోని మేధావులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు, మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నది.
తేది : 9. 8. 2016
Type in English and Press Space to Convert in Telugu |
ఉనా ఉద్యమం - దళిత, ముస్లిం ప్రగతివాద రాడికల్ ఎజెండాఇది గుజరాత్లో వచ్చిన పటీదార్ ఉద్యమం వంటిది కాదు. అది విప్లవ ప్రతీఘాతుకమైనది. మాది ప్రగతిశీలమైన రాడికల్ ఉద్యమం. అది భూమి కొరకు పోరాటం. ఇంటి మహిళ పేరు ...... |
హిందూ మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా సదస్సుహిందూ మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2వ తేది తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేయాలని హిందూ....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |