ఆల్ హేపీస్!

| సాహిత్యం | క‌థ‌లు

ఆల్ హేపీస్!

- బమ్మిడి జగదీశ్వరరావు | 16.08.2016 12:46:29am

మనదేశంలో వున్న యిరవై తొమ్మిది రాష్ట్రాలూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలలోని ఆరువందల తొమ్మిది మంది మంత్రుల ఆదాయం, ఆస్తులు మీద అధ్యయ‌నం చేసింది ʹఅసోసియేషన్ ఫర్ డెమోక్రసీʹ సంస్థ. ఊహించని ఫలితాలను వెల్లడించింది. దాంతో కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలంతా కలిసి వుమ్మడిగా ఆల్ పార్టీస్ ప్రెస్ మీట్ పెట్టారు.

ప్రశ్న: దేశంలోని అందరు మంత్రులలోకి టాప్ వన్ ఆస్తిపరునిగా వున్న ఏపీ మున్సిపల్ మంత్రి పి. నారాయణ నెంబర్ వన్ గా రికార్డు సొంతం చేసుకున్నారు. ఆయనకు మీడియా తరుపున అభినందనలు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ స్పందన?

చంద్రబాబు: రాష్ట్రం విడిపోయింది. మేము లోటు బడ్జెట్లో వున్నాం. మాకు ప్రపంచస్థాయి రాజధాని లేదు. ప్రత్యేక హోదా లేదు. జీతాలు యివ్వడానికే మాదగ్గర డబ్బులు లేవు. పుష్కరాలు జరుపుకుంటున్న పుణ్యమో యేమో గాని మా మంత్రి నారాయణ నాలుగువందల తొంభైయ్యారు కోట్లు కలిగి వుండడం నాకెంతో గర్వంగా కూడా వుంది. ఆయనకు నా అభినందనలు మనస్పూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మా నారాయణ మరిన్ని కోట్లు సంపాదించి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అందరికన్నా ముందుండాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న: మీకు మరో గుడ్ న్యూస్.. మీ మంత్రివర్గంలో మరో యిరవై మంది మంత్రులు ఆదాయం, ఆస్తులు కలిగి వుండడంలో దేశంలోని మంత్రులకన్నా ముందున్నారు.. వారి ఆదాయం నలభై అయిదు కోట్ల నలభై తొమ్మిది లక్షలు..

చంద్రబాబు: ఆవిధంగా ముందుకు పోవడంలో నాకెంతో ఆనందంగా వుంది. మా మంత్రులు పోటీ పడి సంపాదిస్తున్నారు. మా స్టేట్ కు రిచ్ స్టేటస్ లేకపోవచ్చు. కాని మాది రిచ్ క్యాబినెట్. మా ప్రతిపక్షనాయకుడుకి కూడా దేశంలోని యే ప్రతిపక్షనాయకుడికి లేనన్ని ఆస్తులూ కేసులూ వున్నాయి. 2020 అనుకున్నాం. కాలేదు. 2050 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ముందుంటాం.

ప్రశ్న: కర్నాటక కాంగ్రెస్ మంత్రి డి.కె. శివకుమార్ రెండవస్థానంలో వున్నారు.. దీన్ని మీరు యెలా భావిస్తున్నారు?

రాహుల్ గాంధీ: మేం కేంద్రంలో అధికారంలో లేం. ఆమాటకొస్తే చాలా రాష్ట్రాల్లో మేం అధికారాన్ని కోల్పోయాం. ప్రస్తుత బీజేపీ పాలన చూస్తుంటే దిక్కులేక ప్రజలు మళ్ళీ మాకే పట్టం కడతారని అమ్మ చెప్పింది. ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో కూడా మా మంత్రి శివకుమార్ దేశంలో రెండవ స్థానాన్ని సంపాదించుకోవడం అభినందనీయం! వారే మా పార్టీ నేతలకు భవిష్యత్తు ఆదర్శం!

ప్రశ్న: ప్రధానిగా మీరూ మీ పార్టీ వెనుకబడి వుందని భావిస్తున్నారా?

మోడీ: లేదు, ఆరువందల యిరవై మంది మంత్రులలో ఆరువందల తొమ్మిది మంది మంత్రుల మీద సర్వే చేసారు. అయినప్పటికీ డబ్బైయ్యారు శాతం మంది.. అంటే నాలుగువందల అరవైరెండు మంది మంత్రులు కోటీశ్వరులే. మా మంత్రుల తరుపున దేశ ప్రధానిగా నేనెంతో గర్విస్తున్నాను. అంతే కాదు, ముప్పై నాలుగు శాతం మంది మంత్రులు క్రిమినల్సే! చిన్న చిన్న కేసులు కాదు, కేషుల కొద్దీ కేసులు.. మర్డర్స్, మానభంగంస్, కిడ్నేప్స్.. నూటా పదమూడు మంది డెకాయిట్స్.. తీవ్రమైన నేరస్తులున్నారు. మంత్రుల సంఖ్యను చూస్తే- మహారాష్ట్ర పద్దెనిమిది మంది, బీహారు పదకుండు, తెలంగాణ తొమ్మిది, జార్ఖండ్ తొమ్మిది..

కేసీఆర్: కొత్తగా యేర్పడిన యిరవై తొమ్మిదో రాష్ట్రం మాది. రెండేళ్ళే అయితాంది. అగ్గువచేసి అలుకగా చేసి చూడొద్దు తమ్మీ.. క్రిమినల్ మంత్రులను మేము ఎంకరేజు గట్లా చేస్తున్నం. మాకు మూడోస్థానం వొట్టిగ రాలే. మస్తుగా కష్టపడినం. అన్ని పార్టీలవోల్లనే గాదు, అన్ని కేసులు వున్న వాళ్ళని గిట్ల ప్రభుత్వంల చేర్చుకున్నం..

ప్రశ్న: పెద్దల సభయిన రాజ్యసభలో- లోక్ సభలో- యమ్పీలుగా గా వున్న కేంద్ర మంత్రులు డబ్బై యెనిమిది మందిలో పద్నాలుగు మంది సీరియస్ నేరాలు చేసిన వాళ్ళే.. మీకు సిగ్గుగా లేదా?

మోడీ: దిస్ ఈజ్ డెమోక్రసీ.. సో అందరూ వుంటారు. అందరూ వుండాలి. మా మంత్రివర్గంలో శ్రీమంతులూ డెకాయిట్సూ కూడా వున్నారు. వుంటారు. అందరికీ సమాన అవకాశాలు వున్నప్పుడే అది నిజమైన డెమోక్రసీ.. పైగా మేము బ్లాక్ మనీని రప్పిస్తామని తెప్పిస్తామని అన్నాము. అది మా అభివృద్ధికి విఘాతమని గ్రహించి వెనక్కు తీసుకున్నాము. మాకు అన్ని రాష్ట్రాల మంత్రుల అభివృద్ధి ముఖ్యం. అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, పుదుచ్చేరిల మంత్రులు అపర కోటీశ్వరులు కాగా రాజస్థాన్, మేఘాలయా, గోవా, చత్తీస్ గడ్ మంత్రులు తొంభైరెండు శాతం మంది కోట్లకు కోట్ల ఆస్తిపరులు. మనమంత్రుల సగటు ఆదాయం ప్రజల ఆదాయంతో పోల్చి చూసుకున్నప్పుడు హస్త మశకాంతర వ్యత్యాసం వుంది. దేశ వ్యాప్తంగా మంత్రుల సగటు ఆదాయం యెనిమిది కోట్ల యాభైతొమ్మిది లక్షలు.. మంత్రుల గ్రోత్ సాధ్యం కాకుండా ప్రజల గ్రోత్ సాధ్యం కాదు!

ప్రశ్న: మహిళలు కూడా వెనుకబడి లేకుండా వుండడం పట్ల యేమంటారు?

జయలలిత: యాభైయ్యొక్క మహిళా మంత్రులలో మా తమిళనాడు, మధ్యప్రదేశ్ మహిళా మంత్రులే అధికంగా వుండడం మాకు గర్వకారణం. నేను ఈ విషయమై గతంలో న్యాయస్థానాలలో పోరాడాను. నా మహిళా సోదరీమణులైన మంత్రులకు నా అభినందనలు. మహిళా మంత్రులు వెనుకబడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

ప్రశ్న: కమ్యూనిస్టులు యిక్కడ కూడా వెనుకబడ్డారన్న విమర్శకు మీరేమంటారు?

మాణిక్ సర్కార్: త్రిపుర ముఖ్యమంత్రిగానే కాదు, భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తరుపున చెప్పేది వొక్కటే, మేమూ ఆస్తిపరుల ఆదాయవర్గాల నేరస్తుల జాబితాలో చోటు సంపాదించుకున్నందుకు గర్వపడుతున్నాం. మా మంత్రుల సగటు ఆస్తి ముప్పై లక్షల అరవయ్యేడు వేలే కావచ్చు, యిది సగటు మంత్రుల ఆదాయంతో పోల్చినప్పుడు చాలా తక్కువ కావొచ్చు. బట్ భవిషత్తులో మనమూ ముందుంటామని పార్టీ కేడర్ని మరింత ప్రోత్సహిస్తామని ప్రజలకు మాటిస్తున్నాం!

No. of visitors : 994
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ప్లీజ్.. ʹనోట్ʹ దిస్ స్టోరీ!

బమ్మిడి జగదీశ్వరరావు | 07.12.2016 11:38:55am

ʹమేం దొంగలం కాదు..ʹ అని నిరూపించుకోవడానికి మా దగ్గరున్న ʹఆధార్ʹలన్నీ చూపించాం. గుడ్డా గోచీ విప్పి మొలతాడు తెంపి దిసమొలలతో నిల్చున్నాం. మా పుట్టుమచ్చలు సయితం...
...ఇంకా చదవండి

పిట్ట కథ!

బమ్మిడి జగదీశ్వరరావు | 02.08.2017 01:12:03pm

ఇంతలో ఆకులు రాలాయి!? లేదు.. అవి ఆకులు కావు! పిట్టలు! పిట్టల్లా రాలుతున్నాయి! అతడు వొక పిట్టని చేతుల్లోకి తీసుకున్నాడు. సిద్ధార్థుడిలా నిమిరాడు. పైకి యెగరేసా...
...ఇంకా చదవండి

గణిత గుణింతము!

బమ్మిడి జగదీశ్వరరావు | 18.01.2017 11:16:33pm

ʹపవర్లో వుండి సంపాదించుకోకపోతే సంపాదించుకోవడం రాని యెధవ అని అనేస్తారు. చేతకాని దద్దమ్మ.. చవట అని కూడా అనేస్తారు. నాకు మాట పడడం అస్సలు యిష్టం లేదు. సరే, ఈ ల్...
...ఇంకా చదవండి

సమాన స్వాతంత్ర్యం!

బమ్మిడి జగదీశ్వరరావు | 18.08.2017 12:42:15pm

అన్నిప్రాంతాలకీ సమాన ప్రాతినిధ్యం యివ్వడమంటే స్వాతంత్ర దినాలు జరపడం కాదు, పోలీసు మిలటరీ కవాతులు జరపడం కాదు, తుపాకీలు తిప్పడం కాదు, బూట్ల కాళ్ళని నేలకు తన్నడ...
...ఇంకా చదవండి

నిలబడిన జాతి గీతం!

బమ్మిడి జగదీశ్వరరావు | 04.09.2017 09:29:38am

పౌరుల్లో దేశభక్తి యింకా ప్రబలాలి! ప్రబలిపోవాలి! నార నరాన నాటుకు పోవాలి! అసలు పుట్టగానే వేసే టీకాతో కూడా మన దేశభక్తిని చాటుకోవచ్చు! టీకాగా అశోకచక్రం కలిగిన మ...
...ఇంకా చదవండి

కాశ్మీరు మనది!

బమ్మిడి జగదీశ్వరరావు | 02.10.2019 10:13:24am

ʹమేం కాశ్మీరుని చూడలేదు, కాశ్మీరు గురించి మాకు తెలీదు...ʹ చెప్పబోతే- ప్రధాన వుపాధ్యాయులవారు కల్పించుకొని ʹమీరు కాశ్మీరుని చూడకపోయినా పర్లేదు, కాశ్మీరు గురిం...
...ఇంకా చదవండి

పడగ కింద పండు వెన్నెల!

బమ్మిడి జగదీశ్వరరావు | 15.10.2019 05:41:11pm

చెదిరిన చీమలు పాముల్ని కరవబోయాయి! అంతే... ఫిరంగులు పేలాయి! మట్టి రేగింది! మూడురంగులుగా ముచ్చటగా! రాజు యెగరేసిన పావురం కత్తిరించిన రెక్కలతో యెగరలేక ఫల్టీకొట్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •