నేరానికి వ్యక్తిని బాధ్యుడ్ని చేయడం సులభం. న్యాయా న్యాయా విచక్షణకు అది దగ్గరి దారి. ఒక మనిషి ఏ ఏ నేరాలు ఎలా నేరం చేశాడో అరిటిపండు ఒలిచి పెట్టినట్లు వివరించవచ్చు. వ్యవస్థను నేరమయం చేస్తున్న రాజ్యం గురించి, దాని అంగాల గురించి పట్టించుకోకుండా ఎంత మాట్లాడుకుంటే ఏం ఫలం?
నేరానికి రాజ్యానికి, హింసకు రాజ్యానికి ఉండే సంబంధం దగ్గరికి ఈ ప్రశ్న నేరుగా చేరుకుంటుంది. ఒకడు దుర్మార్గమైన నేరాలు చేస్తాడు. మానవత బెదిరిపోయే అకృత్యాలకు పాల్పడతాడు. వాడి నేర సామ్రాజ్య సంహాసనం కింద కాలమే బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తుంది. సున్నితమైన పువ్వుల్లాంటి సుగంధ భరిత మానవులెందరో విలవిలలాడుతూ అలా నేలరాలిపోతుంటారు. భయమూ, కన్నీరూ తప్ప ఏ ఆలంబన లేని వేల రాత్రులూ, పగళ్లూ ఆవరిస్తే మనిషన్నవాడికి ఎలా ఉంటుంది? అచ్చం ఇలాగే ఉంటుంది. తట్టుకోవడం కష్టం కదా?
హింస, నేరం, భయం ఇంత విధ్వంసక, వినాశక దశకు చేరుకోవడం ఎలా సాధ్యమైంది? శిక్షా స్మృతి నేరాన్ని వ్యక్తికి ఆపాదిస్తుంది. ఇప్పుడు మనం దాన్ని రాజ్యానికి ఆపాదిద్దాం. రాజ్యం ఈ వ్యవస్థను నేరమయం చేసి బతుకుతోంది. మనుషులందరినీ భయంలో ముంచేసి పబ్బం గడుపుతోంది. హింస అనే నాలుగు కాళ్ల సింహాసనంపై రక్తోన్మాద విలాసంతో చిందులేస్తోంది. నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా ఉండవచ్చు. మౌలికంగా ఇది దోపిడీ వ్యవస్థ కాబట్టి హింస, నేరం దాని రెండు కోరలు. రాజ్యం వాటిని సాచి జనాన్ని భయపెడుతోంది. ఆ కోరలు సానపట్టడానికి, వాటి నుంచి విషం కురిపించడానికి వ్యక్తులను నేరస్థులుగా మార్చుకుంటుంది. చోటా మోటా నేరస్తులను భయానక నేరస్తులుగా తయారు చేస్తుంది. వాళ్లను చేరదీసి సమాజం మీదికి హింసాస్త్రంగా ప్రయోగిస్తుంది. తానే దగ్గరుండి ఒక నేర ప్రపంచాన్ని నిర్మిస్తుంది. ఏ ఏ నేరాలు చేయాలో శిక్షణ ఇచ్చి, ఎలా చేయాలో నేర్పిస్తుంది. నేరం, హింస అనే తన లక్షణాలకు మనిషి రూపాన్ని ఇస్తుంది. ఆ మనిషితో తన పనులన్నీ చేయించుకుంటుంది. మొత్తం మీద నేరాన్ని, హింసను పెంచి పోషించడానికి దానికి వ్యక్తులు కావాలి.
పాత రాజ్యానికి ధర్మకర్తృత్వ లక్షణం, ఆధునిక రాజ్యానికి సంక్షేమ లక్షణం ఉంటాయని అంటారు. ఆ చర్చ ఇప్పుడు వద్దుకాని.., అప్పుడూ ఇప్పుడూ రాజ్యమంటే భయం అనే లక్షణం మాత్రం కామన్ పాయింట్. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓట్ల కోసం ఓ మారు మూల దళిత వాడకు నాయకుడు నడుచుకుంటూ వచ్చి పేదవాడి భుజం మీద చేయి వేయవచ్చు. అన్ని చట్టాలు, చట్ట సభల ప్రొసీడింగ్స్ ఆన్లైన్లో తక్షణమే దొరకవచ్చు. అంతా ఫ్రెండ్లీ గవర్నెన్స్ కావచ్చు. కాదనడానికే లేదు. కానీ అసమ సమాజంలో రాజ్యానికి జనాన్ని భయపెట్టే లక్షణం కూడా తప్పక ఉంటుంది. అనుక్షణం జనాన్ని భయపెట్టే మనిషిని తయారు చేసి ఊరి మీదికి అచ్చోసిన ఆంబోతులా వదిలిపెడుతుంది. ఊళ్లో పోలీసు పెరేడ్ జరుగుతూ ఉంటే చదువుకున్న వాళ్లు కూడా ఆ వైపుకు వెళ్లలేరు. భయం. పోలీసుల ఉద్దేశమే జనాన్ని భయపెట్టడం. చట్టం ప్రకారం రాజ్యమూ, పౌరులూ నడుచుకోవవాలనే సూక్తి మీద రాజ్యానికే నమ్మకం ఉండదు. అందుకని జనాన్ని ఎంతో కొంత భయపెట్టకపోతే లాభం లేదని అనుకుంటుంది. ఇదేదో దుర్మార్గమైన అధికారుల బుర్రల్లో తొలిచే ఆలోచన కాదు. చాలా సహజంగానే జనాన్ని కాస్త భయపెడదాం ఏం పోయింది? అని రాజ్యం అనుకుంటుంది. అది తన రోజువారీ పనిగా చేస్తుంది.
ఇంతకూ చెప్పొచ్చేదేమంటే.. మనది చాలా పాలిష్డ్, స్మూత్ స్టేట్ అనుకునే వాళ్లూ ఉండవచ్చు. కానీ ఇది నేరం మీద ఆధాపడిన రాజ్యం. ఇది హింస మీద ఆధారపడిన రాజ్యం. మొత్తం మీద జనాన్ని భయపెట్టి బతికే వ్యవస్థ.
హింస, నేరం చేయడానికి రాజ్యం తగిన మనుషులను నిరంతరం తయారు చేసుకుంటుంది. ఊళ్లో చిల్లరమల్లర దొంగతనాలు చేసే వాళ్లను కానిస్టేబుల్ సహితం ఎలా తయారు చేసుకుంటాడో మనం సాహిత్యంలో చదువుకున్నవాళ్లమే. తన పై అధికారి ముందు తలెత్తి చూడలేని కానిస్టేబులే నేరస్థులను తయారు చేస్తూ ఉంటాడు. ఒకడు పోతే మరొకడు.. ఒకడు సరిగా పని చేయకపోతే ఇంకా బాగా పని చేసేవాడు.. ఒకడు తను చెప్పినట్లు వినకుండా తలనెప్పిగా తయారైపోతే వాడ్ని ఏదోలాగా పక్కన పెట్టి, బైటికి రాకుండా జెయిల్లో తోసేసి ఇంకోడు.. ఇలా నేరస్థులను తయారు చేస్తూనే ఉంటాడు.
ఇది అతని నేరం కాదు. రాజ్యం అతని చేతిలో ఆ పని పెట్టింది. మౌలికంగా ఇది నేరాన్ని ఉత్పత్తి చేసి, మానిటరింగ్ చేసి, ప్రతిఫలం పొందుతూ బతికే వ్యవస్థ. దాని రాజకీయార్థిక ప్రతినిధి రాజ్యం. మామూలు మాటల్లో ప్రభుత్వాలు, పోలీసులు, కోర్టులు.
అలాంటి రాజ్యమే నేరస్థుడ్ని తయారు చేస్తే, లేదా చేరదీస్తే...? ఇక వాడికి అడ్డూ ఆపూ ఉంటుందా? వాడి నేర ప్రపంచానికి పునాదులు వేసి, గోడలు కట్టే ఇంజనీరింగ్ వర్క్ అంతా రాజ్యమే చేస్తుంది. హింసా స్థలిని నిర్మించి నేరస్థుడ్ని ఇష్టాʹరాజ్యంʹగా ఆడుకోమని చెబుతుంది. ఈ సోషల్, ఎకనమిక్ ఇంజనీరింగ్ తెలియకపోతే మనమే అమాయకులం.
పాత రోజుల్లో రాజ్యం తాను ఏం చేయాలనుకుంటే అది చేసేసి దానికి ధర్మమని పేరు పెట్టేది. దాన్ని కీర్తించేందుకు రాజు దగ్గర ఆయన పెట్టిన పెరుగన్నం తిన్న కవులు ఉండేవాళ్లు. ఇప్పుడు రాజ్యం నేరాన్ని, భయాన్ని, హింసను తానే స్పాన్సర్ చేసుకోవాల్సి వస్తోంది. ఒక పక్క రాజ్యాంగబద్ధ పాలన, మరో పక్క అండర్ గ్రౌండ్ నేర ప్రపంచ పాలన ..ఈ రెండూ చేయాలి. నేర ప్రపంచంలో రాజ్యాంగంతో పని లేదు కాని, రాజ్యాంగ బద్ధ పాలనలో నేరం అవసరం ఉంటుంది. అదీ వచ్చిన చిక్కు. నేరాన్ని, హింసనూ ఆశ్రయించకుండా పాలన చేయలేని అశక్తత వర్గ సమాజంలోని రాజ్యానికి సహజ లక్షణం.
ఎంత అండర్ గ్రౌండ్ వరల్డ్ అయినా టోటల్ వరల్డ్‌లో భాగం కదా. అందుకని నేరస్థుడు మొత్తం ప్రపంచాన్ని కబళించాలని చూస్తాడు. ʹరాజ్యాంగ బద్ధʹ ప్రపంచానికి, అండర్ గ్రౌండ్ ప్రపంచానికి ఉన్న సరిహద్దులు దాటి బయటికి వస్తాడు. అప్పుడు రాజ్యానికి నేరస్థుడు తలనెప్పి అయిపోతాడు. నేరం కాదు, నేరస్థుడు మాత్రమే. రెండు ప్రపంచాలనూ సజావుగా నడిపినంత కాలం ఫర్వాలేదు. ఎక్కడో ఇలాంటి పేచీ వస్తుంది. అప్పుడు మనం ఎన్కౌంటర్ వార్త వినాల్సి వస్తుంది.
మరీ ఇంత దుర్మార్గుడు కాబట్టి పోన్లే ఓ పనైపోయిందనని కొందరు తేలికపడొచ్చు. మామూలు జనాలు, బాధితులు అయితే తారాజువ్వలు కాల్చి ఆనందించవచ్చు. వాళ్ల స్పందనలో వాళ్లదైన హేతుబద్ధత ఉన్నట్లే. కానీ రాజ్యమే నేరాన్ని, హింసను నిరంతరంగా స్పాన్సర్ చేస్తున్నదని, ఇవాళ వీడి అవసరం తీరిపోవడంతో కాల్చేసిందని అనుకోవడంతో మనం సరిపెట్టుకోగలమా? ఇలా కాల్చేయడం కూడా రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా? తానే తయారు చేసుకున్న నేరస్థుడ్ని ఇంత సునాయాశంగా తీసేసిన రాజ్యం ఇంకెంత ప్రమాదకరం? నేరస్థులను తీసేసినంత తేలిగ్గా నేరమయ రాజ్యాన్ని తీసేయడం సాధ్యమేనా?
Type in English and Press Space to Convert in Telugu |
వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల...... |
ఆజాదీ కశ్మీర్ : చల్లారని ప్రజల ఆకాంక్షకాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........ |
రైతు - నీళ్లురైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం...... |
వివేక్ స్మృతిలో...వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు....... |
భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమేఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి...... |
జీవిత కవిత్వం విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్ పద్ధతులకు వ... |
కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్ దేశస్థుల స్వేచ్ఛ గు... |
మానవ హననంగా మారిన రాజ్యహింస ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం....... |
నాగపూర్ వర్సెస్ దండకారణ్యందండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ... |
రోహిత్.. ఉప్పొంగే నినాదం
రోహిత్ మరణం తర్వాత సంఘపరివార్ భావజాలం మన సమాజంలో ఎన్నెన్ని రూపాల్లో, ఎక్కెడెక్కడ ఎలా వ్యాప్తిలోకి వస్తుందో, ఉనికిలో ఉంటుందో తెలుసుకోవడంపట్ల అందర్నీ అప్ర... |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |