నేనొక అర‌ణ్య స్వ‌ప్నం

| సాహిత్యం | క‌విత్వం

నేనొక అర‌ణ్య స్వ‌ప్నం

- గీతాంజ‌లి | 16.08.2016 09:11:44am

నువ్వంటే ఎందుకంత ఆశ నాకు?
నిదుర‌లోని స్వ‌ప్నాల్లో
మెల‌కువ‌లోని సంభాష‌ణ‌ల్లో
నాచూపుల‌కందే దృశ్యాల‌లో
నా శ్వాస‌కు చేరే ప‌రిమ‌ళాల్లో
ఒక్క నువ్వే అందుతావు ఎందుకు ?

నీకోసం రోదిస్తున్న‌ప్పుడు
రాత్రినీ - ప‌గ‌లునీ నాకోసం ఆపేస్తావు క‌దా?
ఈ చీక‌టి గ‌దులు న‌న్ను బంధించిన‌
సంకెళ్ల నుండి కూడా చిగురిస్తావు క‌దా?
ఇరుకు దారుల్లో న‌డ‌వ‌లేని
నా పాదాల‌కింద ప‌చ్చిక వై
నీ హృద‌యంలోకి తీసుకెళ‌తావు క‌దా ?
నాగొంతు ప‌ల‌క‌లేని మాట‌ల‌ని అందుకుని
క‌విత్వ‌మై కొమ్మ కొమ్మ‌కూ ప‌ల్ల‌విస్తావు క‌దా ?

యుగాలుగా
ఊపిరాడ‌ని ఉక్కిరి బిక్కిరి గాలుల్లో
వ‌ర్ణ‌ర‌హిత‌మై పాలి పోయిన
నా దేహ కాంతిని
నీలోని ప‌త్ర‌హ‌రితాలు - మోదుగు పూల‌
కొత్త రంగుల‌లో చిత్రించుకుంటూనే ఉంటావు క‌దా?
నేను కూడా ఒక యుద్ధాన్నే అని తెలుసుకున్న‌ది నువ్వే క‌దా?

నా అడ‌వీ...
న‌న్ను మానవిని చేసేది నీవే!
నా దండ‌కార‌ణ్య‌మా..
నిన్ను మ‌రిచిందెక్క‌డ‌?
నువ్వు మ‌ర‌వ‌నిచ్చిందెప్ప‌డు ?
నీ కోస‌మే నా ప్ర‌యాణం
నువ్వే నా శ‌ర‌ణ్యం
న‌న్ను నీలో క‌లుపుకో
నీ లోంచి నేనొక అర‌ణ్య పుష్పాన్నై
ప‌రిమ‌ళిస్తాను
నేనూ ఒక అర‌ణ్య‌మైపోతాను

No. of visitors : 1157
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఎవరు అశుద్ధులు

గీతాంజ‌లి | 04.10.2016 11:12:24pm

అమ్మ గ‌ర్భంలోని ప‌రిమళ స‌ర‌స్సులో మునిగి న‌న్ను నేను శుద్ధి చేసుకునే పుట్టాను పుట్టిన‌ప్ప‌ట్నించీ నిన్ను శుద్ధి చేస్తూనే వ‌చ్చాను...
...ఇంకా చదవండి

క‌విత్వం రాయడానికి ఓ రోజు కావాలా?

గీతాంజలి | 22.03.2018 12:45:25am

ఎవరో కడలి అట ఎంత బాగా రాస్తుందో ప్రేమ గురించి ముఖ పుస్తకంలో ...!! ఇప్పుడిప్పుడే, దేహంలో- మనసులో వసంతాలు విచ్చుకుంటున్న అమ్మాయి! ఇక ఒక్క క్షణం కూడా నటించను...
...ఇంకా చదవండి

పడవలైపోదాం

గీతాంజ‌లి | 04.03.2017 09:28:58am

నది ధుఃఖాన్ని ఈడ్చుకెళ్తున్న పడవలను లేదా నదిని మోస్తున్న పడవలను ఎన్నడు తీరం చేరని తనాన్ని నదిని వీడలేని తనాన్ని నది మధ్యలొ నిలిచిపోయి నదుల సామూహిక...
...ఇంకా చదవండి

గోడ ఒక ఆయుధం

గీతాంజ‌లి | 04.04.2018 06:21:40pm

గోడ నువ్వు కత్తిరిస్తున్న నా రెక్కల చప్పుడు వినే శ్రోత!! నువ్వు నొక్కేస్తున్న నా నగారా పిలుపుని వెలివాడల నుంచీ అరణ్యాల దాకా ప్రతిధ్వనించే గుంపు ...
...ఇంకా చదవండి

అమ్మ ఒక పని మనిషా?

గీతాంజలి | 19.05.2018 03:54:37pm

నీకు రేపొచ్చే ఇరవై ఆరెళ్లకి.. నీవు కూడా అమ్మ అనే పని యంత్రంలా మారక ముందే.. నా స్థితి ఇంకా అధ్వాన్నం కాక ముందే.. నేనో నువ్వో.. ఇద్దరి లో ఎవరిమో.. మరి ఇద్దర ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
  అరుణ‌తార - జూన్ 2018 సంచిక‌
  కందికట్కూరు దళితుల దారుణహత్యను నిరసిద్దాం
  కామ్రేడ్ వరవరరావుపై కుట్ర ఆరోపణలను ఖండిస్తున్నాం
  న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు
  ఈ తీర్పు సారాంశమేమిటి?
  ఆధిప‌త్యంపై అలుపెర‌గ‌ని పోరాటం
  సీమేన్ - వ్యక్తి , ప్రకృతుల నిజదర్శనం
  ఈ దేశం మాకు యుద్ధాన్ని బాకీపడింది
  ఔను... వాళ్లు చామన ఛాయే!
  మునిపటికన్నా విప్లవాత్మకంగా కార్ల్ మార్క్స్
  గాలి కోసం, నీరు కోసం, ఈ భూమ్మీద బతుకు కోసం...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •