రెప్పని కప్పని నిద్దుర

| సాహిత్యం | క‌విత్వం

రెప్పని కప్పని నిద్దుర

- రివేరా | 16.08.2016 09:26:54am

ఒకే రాత్రిని కప్పుకొన్న మనకి
ఒక్క నిద్దుర చాలదా?
చుక్క కలని పొదువుకోడానికి
ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?

ఒక్క సంయోజనం కోసం
ఎన్ని దుప్పట్లు తడవాలి?
ఎంత నెత్తురు మరగాలి?
ఎంతెత్తు తూము కడితే
ఎంతగా టాము కొడితే
ఒకే ఒక్క అనుసంధానం?

ద్వంద్వ యుద్ధాలు, దొంగ వేషాలు
ఏకోముఖ దర్శనాలు కరగనీ..
నీకు నాకు అటూ ఇటూ
పిల్లాజెల్లా ప్రపంచాలు రద్దయిపోనీ..

కాసింతయినా,
చేతిలోని సిగరేట్టు కాలేంతవరకయినా,
నుసిని లోకానికి వదిలి
పొగ పాగాలు చుట్టుకొని
మనలో మనం కలుసుకొందామా?
కొంతయినా,
అరువు బంధాల ముడి వీడెంతవరకయినా,
బింబాల్ని బులబరించి
బిందువులోకి బుడుంగుమందామా?

నలుపో ఎరుపో
నీలమో నారింజో ఏమైనా..
మాయా నగరులను దోచేసి
మట్టి పెళ్ల అడుగున దాపేద్దాం.

అలుపో సొలుపో
రెండో పన్నెండో ఏదోకటి..
నదుల నీళ్లను దొంగించి
సముద్రానికి తోడి పోద్దాం.

అంతా బాగుందిగానీ
పిల్లలు తడిపిన పక్క మీదకు
రెప్పని కప్పని నిద్దుర కిందకు
మనం చేరుకోగానే
తలుపులు తెరుచుకోవడమే బాలేదు.
ఏ అపరాత్రో నీతో పరిచయం అవుతుండగానో
రేయి తొలికి తెల్లారయిపోవడం అస్సలు బాలేదు.





No. of visitors : 884
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న : రివేరా

రివేరా | 10.06.2016 01:10:40am

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న పై రివేరా ఉప‌న్యాసం.......
...ఇంకా చదవండి

చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..

రివేరా | 16.07.2016 11:50:45am

పుస్తకాల సంచిని గిరాటేసి రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు స్నేహితుల భుజాలపైనుంచి నవ్వుతూ చూడటమే చివరిచూపు.......
...ఇంకా చదవండి

ఏప్రిల్ పండు II రివేరా

రివేరా | 24.04.2016 11:08:03pm

పిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,...
...ఇంకా చదవండి

భ‌యం చుట్టూ భ‌యం..

ఎడార్డో గెల‌నో | 04.02.2017 01:18:19am

వీళ్లెక్క‌డ చంపుకుతింటారోన‌ని ఆడ‌వాళ్ల‌కు భ‌యం భ‌యంలేని ఆడ‌వాళ్లంటే మ‌గ‌వాళ్ల‌కు మ‌హా భ‌యం దొంగ‌లంటే భ‌యం, పోలీసుల‌న్నా మ‌రి భ‌య‌మే తాళాలు లేని త‌లుపులంటే భ...
...ఇంకా చదవండి

సాయంకాలం వాన‌!

రివేరా | 20.12.2016 11:48:01pm

దుప్ప‌టి కింద‌, దిండు అడుగున‌ పిల్ల‌లు చూడ‌కుంటా క‌ప్పెట్టుకొన్న వ‌ర‌ద‌గూడుని మెలిపెడ‌తావేమో...
...ఇంకా చదవండి

ఈ రాక్ష‌స గీతి వింటారా?

రివేరా | 02.11.2016 10:23:06am

మ‌నం నిల‌బ‌డిపోయిన చోట నుంచే మ‌న న‌డ‌క‌ల‌ను మోసుకెళుతున్నారు మ‌నం ఆపేసిన రాగాల‌నే తీగ‌లుగా సాగిపోతున్నారు మ‌న గొంతునీ, మ‌న వంతునీ మ‌న‌క్కిచ్చేసి వెళుతు...
...ఇంకా చదవండి

నో, ఐ డోన్ట్‌ లైక్‌ టమాట

రివేరా | 17.09.2016 10:14:09am

టమాట రంగు సరే, రసాలూరే సరస్సులేమీ.. కొంచెం కరిచిపట్టుకొన్న మిలమిలా మీనాలేమీ.. పైకి కిందకి మునకలేసే గత్తరబిత్తర గోళాలేమీ.......
...ఇంకా చదవండి

అద్గ‌దీ...

రివేరా | 20.10.2016 12:13:15am

అటో ఇటో వేటో పోటో ప‌డిపోవాల్సిందే! పాల‌కులంతా ప్ర‌జాస్వామిక‌వాదులై ప్రజ‌లేమో నియంత‌లైతే ఏమి చేస్తాం?...
...ఇంకా చదవండి

సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరా

మహమూద్ | 04.05.2017 10:49:39am

విప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే.......
...ఇంకా చదవండి

యంత్ర భూతమైన ప్రేమలు పత్ర హరితాలు కావాలని..

రివేరా | 02.11.2016 11:01:00am

సామాన్యులను అసామాన్య కథానాయకులను చేస్తున్న కాలం ఇది. ఇరాక్‌, నికరుగువా, పాలస్థీనాల్లో పాల ఫ్యాక్టరీలపై బాంబులు వేస్తున్నవాడినీ, మన గిన్నెల్లో విష క్షీరాలన...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
    అరుణతార జూన్ 2019
    మహాభారతం - చారిత్రక వాస్తవాలు
    జల వనరుల సాధనకు స్ఫూర్తి
    వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
    నల్లని పద్యం
    పేకమేడలు
    Democratized Poetry
    ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
    ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
    Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
    ఆచ‌ర‌ణే గీటురాయి

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •