ఇప్పుడంటే శ్రీశైలం జలాశయంలో 875 అడుగుల దాకా నీళ్లున్నాయి కాని జూన్ 30 నాటికి కేవలం 35 అడుగులే ఉండేవి. వాటిలో కూడా 10 టీఎంసీలు ప్రకాశం, గుంటూరు జిల్లాలకు మంచినీళ్ల కోసం ఇవ్వాలని ప్రభుత్వం ఆ నెల 27వ తేదీన ఒక జీవో విడుదల చేసింది. ఆ రోజుల్లో నిజంగానే ఆ ప్రాంతంలో మంచి నీళ్ల సమస్య ఉన్నది. వాళ్లకు సాగర్ నుంచి తప్ప మరో అవకాశం లేదు. హడావిడిగా జలాశయంలోని ఆ కాసిని నీళ్లలో 10 టీఎంసీలు ప్రభుత్వం కిందికి తీసుకపోయింది. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ అయితే ఈ శ్రద్ధ అన్ని ప్రాంతాల మీద సమానంగా ఉండాలి. దాన్ని ఎల్లవేళలా చూపాలి. ప్రభుత్వం అట్లా లేదు. మిగతా కరువు ప్రాంతాలపట్ల శ్రద్ధ ఉన్నట్లు మోమాటానికి కూడా వ్యవహరించదు.
అందువల్ల ఎగువన ఉన్న రాయలసీమ వాళ్లకు ఈ జీవో చాలా ఆగ్రహం తెప్పించింది. 27న జీవో వస్తే 30వ తేదీనాడే కర్నూలు కలెక్టరేట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున గుంపై ధర్నా చేశారు. ఆ రోజు ఉదయం నుంచి వాన జల్లు కురుస్తూనే ఉంది. పైగా వ్యవసాయ పనులు జరిగే కాలం. అయినా ప్రభుత్వ వ్యవహారంపై నిరసనగా రైతులు వచ్చారు. ధర్నా అయిపోతుండగా మళ్లీ మరో వాన జల్లు. ఆందోళన ముగించి ఇండ్లకు పోతుండగా ఒక రైతు ʹఇట్లగిన వానలు పడుతా ఉంటే ఈ లిగాడే లేకపోవు..ʹ అన్నాడు.
ఆ మాట విని నేను చాలా ఆశ్చర్యపోయాను.
నీటి పంపకాల గురించి కొద్ది కాలంగా అక్కడి రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కృష్ణా నది నీళ్ల మీద తమకు హక్కులు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని ఖాతర్ చేయడం లేదని, తమను అన్యాయం చేస్తోందని మాట్లాడుతున్నాయి.
అలాంటి సమస్య మీద ఆందోళనకు వచ్చిన రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. నీళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం రైతు అనుకోగలడా? మా రిజర్వాయర్లకు నీళ్లు ఎన్ని వదిలారు? అవి మా పొలాలకు ఎప్పుడు చేరుతాయి? పంట కాలువలు ఎప్పుడు పారుతాయి? అనే ఆలోచిస్తాడు. ఇది సహజం.
బహుశా పైన నేను చెప్పిన రైతుది మెట్ట ప్రాంత మనస్తత్వం. వాన కోసం ఎదురు చూస్తూ, నాలుగు చినుకులు పడగానే గడెం కట్టుకొని పోయి విత్తనాలు చల్లి వచ్చే ప్రాంతాల్లో ఇలాగే ఆలోచిస్తారు కావచ్చు. అట్లని ఒక్కో ప్రాంతంలోని రైతులందరికీ, మనుషులందరికీ ఒకే తరహా మనసత్త్వం ఉంటుందనే సిద్ధాంతం తయారు చేయడం కుదరదు. వాటి వల్ల అంతులేని చిక్కులు ఉంటాయి. ఎందుకంటే మానవ మనస్తత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. కొన్ని భూగోళాలకు, పర్యావరణాలకు, వ్యవసాయ పద్ధతులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. వాటికి సంబంధించిన లక్షణాలు ఆ ప్రాంతంలో ఏ ఒక్కరిలో కనిపించినా సహజంగానే ఉన్నట్లనిపిస్తాయి.
అట్లా నాకు ఆయన మాటలో సగటు రాయలసీమ రైతు మనస్తత్వం కనిపించింది. అది సామాజిక మనస్త్తత్వం. వెనుకబడ్డ ప్రాంతాల జనాలు తమకు ఏం అవసరమో గుర్తించడానికి ఇది ఒక్కోసారి ఆటంకం కావచ్చు. అభివృద్ధి చెందిన ప్రాంతాల నుంచి విరజిమ్మే వెలుగులో తమ ప్రాంతాలకు ఏం కావాలో తెలుసుకోడానికి ఇబ్బంది పడవచ్చు. నిత్యం బతుకుతెరువు కోసం ఆరాటం తప్ప మరే విషయమూ ఆలోచించలేని స్థితి దానికదే ప్రత్యేకం. ఆ ఆరాటం చుట్టూ ఉండే విషయాలు తప్ప మరేవీ సన్నిహితం కాలేదు. వాళ్ల ఆలోచనల్లో భాగం కాలేదు. వాటిని జీవితంలో భాగం చేసుకోడానికి దోహదపడే పనుల్లో ఆ జనాలు భాగం కాలేరు. ఏవో అదృశ్యంగా అడ్డుకుంటూ ఉంటాయి.
రాయలసీమలో స్థానీయ సమస్యలపై జరిగిన పోరాటాల్లోగాని, ఇతర ప్రజాస్వామిక పోరాటాల్లోగాని ప్రజల భాగస్వామ్యం గురించి ఆలోచించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య తేడాల గురించి చెప్పుకోడానికి ఎన్నో ఉంటాయి. పండగలు, పబ్బాలు, యాస, వంటవార్పుల్లో తేడాలు, సొంత పద్యాలు పాటలు.. ఇలా ఇంకొన్ని చెప్పుకుంటూ పోయి వీటన్నిటినీ సాంస్కృతిక తేడాలని అంటారు. నిజానికి ఇలాంటి తేడాల గురించి ఇంకో వైపు నుంచి అధ్యయనం చేస్తూపోతే సారూప్యతలు కనిపిస్తాయి. అసలు అలాంటి తేడాలన్నీ కరిగిపోయి ఒక సాధారణ సంస్కృతి అనబడేది తయారవుతూ ఉంటుంది. అదే బలపడుతూ ఉంటుంది. తేడాలనుకునేవి ఉన్నా అవి కనుమరుగైపోయేంత బలహీనంగా రివటలా కొట్టుకుంటున్నట్లు మనకు అనుభవంలోనే తెలుస్తూ ఉంటుంది. పైగా ఆ ప్రాంతీయ ప్రత్యేకతలని అనబడేవి చాలా అరుదైన సందర్భాల్లో వ్యక్తమవుతూ ఉన్నాయని, మిగితా జీవిత ప్రపంచంలో అవి ఎల్లవేళలా కనిపించడం లేదని అనుభవమే మనకు చెబుతూ ఉంటుంది. కాబట్టి తేడాలను ఈ తలం నుంచి ఇంకొంచెం పై స్థాయిలో చర్చించాల్సి ఉంటుందేమో.
అట్లాగే ఒక్కో ప్రాంతానికి ఉన్న ఆలోచనా సంప్రదాయం, పోరాట సంప్రదాయం గురించి కూడా మాట్లాడుతూ వీటిలోని ప్రత్యేకతలు ఆ ప్రాంతానికి చెందినవని అంటూ ఉంటాం. వాస్తవానికి ఆ సంప్రదాయానికి భిన్నమైనవేగాక, వాటిని మొత్తంగా అడ్డుకొనే ధోరణులు ఆ సమాజ గర్భం నుంచే పుట్టుకొస్తాయి. ఆ ధోరణులు ఆ ప్రాంతానికి చెందినవే కానవసరం లేదు. చాలా సాధారణంగా వ్యవస్థ మొత్తానికి సంబంధించినవి తీకావచ్చు. కాబట్టి గత సంప్రదాయంలో మూలాలు వెతకడం కూడా సూటి ప్రయాణం కాజాలదు. సరళమైన అన్వేషణ కాబోదు.
ఇలా ఇంకొన్ని చెప్పవచ్చు. అవన్నీ ప్రాంతాల మధ్య ప్రత్యేకతలు లేవని చెప్పడానికి వ్యూహాత్మకంగా ముందుకు తెచ్చినట్లు ఉంటుంది. కానీ తేడాలు ఉన్నాయని చెప్పడానికి కూడా ఏ సిద్ధాంత చర్చ అక్కర్లేదు. అది కూడా అనుభవమే చెబుతూ ఉంటుంది. వాటిని ఏ తలంలో చర్చించాలి? అనేదే ప్రశ్న. అది దేనికోసమంటే పాండిత్య ప్రదర్శన కోసమైదే కాదు. నిజమైన తేడాలు ఏమిటి? ఎందుకు అలా ఉన్నాయి? వాటిలో ఏదైనా మార్పు రావాలా? మనకు ఇష్టం ఉన్నా లేకున్నా వ్యవస్థ తన పద్ధతిలో తాను మార్చుతూ పోతుంటుంది కాబట్టి, ప్రగతిదాయకమైన మార్పుల కోసం మన జోక్యం ఎలా ఉండాలి? అనే పూర్తి ఆచరణ సంబంధమైన వ్యవహారం కదా ఇది.
Type in English and Press Space to Convert in Telugu |
వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల...... |
ఈ తీసివేతలు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా......... |
ఆజాదీ కశ్మీర్ : చల్లారని ప్రజల ఆకాంక్షకాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........ |
జీవిత కవిత్వం విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్ పద్ధతులకు వ... |
వివేక్ స్మృతిలో...వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు....... |
భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమేఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి...... |
కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్ దేశస్థుల స్వేచ్ఛ గు... |
మానవ హననంగా మారిన రాజ్యహింస ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం....... |
నాగపూర్ వర్సెస్ దండకారణ్యందండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ... |
ఏది సత్యం ? ఏది అసత్యం ?విరసం ఆచరణలో లోటుపాట్లు ఉన్నాయని శరత్ చంద్ర అనుకుంటే, తాను విప్లవాభిమాని అయితే వాటిని సంస్థకు తెలియజేయవచ్చు. విరసం నిరంతరం అలాంటి సూచనలను గౌరవంగా స్వీకరి...... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |