స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

| సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

- ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 17.08.2016 10:19:52am

ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్
(1820 - 1895)

నాలుగుదశాబ్దాల పాటు కొనసాగిన పరిచయం

1844 ఆగస్టులో ఇంగ్లండు నుంచి జర్మనీకి తన తిరుగు ప్రయాణంలో కార్ల్‌మార్క్స్‌ మరింత సన్నిహిత పరిచయం పెట్టుకునేందుకుగాను ఎంగెల్స్ ‌పారిస్‌కి వెళ్ళాడు. ఆ ఇద్దరిలో ప్రతిఒకరూ రెండవ వారిని గురించి బోలెడు వినడమే కాకుండా, ʹʹరైనిషె సైటుంగ్‌ʹʹ ‌పత్రిక సంపాదక కార్యాలయంలో కొద్ది క్షణాల పాటు యాదృచ్ఛికంగా ఒకర్ని మరొకరు చూసుకున్నారు కూడా. అందేగాని వారి మధ్య సన్నిహిత వ్యక్తిగత సంబంధాలు లేకపోయయి. అయితే ఇప్పుడు ఈసారి ఎంగెల్స్ ‌పారిస్‌లో వన్నో వీధిలోని డాక్టర్‌ ‌కార్ల్ ‌మార్క్స్‌ ‌సాదా ఫ్లాట్‌లో రాత్రి బాగా పొద్దపోయే దాకా ఆయనతో అంతులేని సంభాషణలో గడిపాడు. వాళ్ళిద్దరూ తాము ఏకమనస్కులమని, తామిద్దరూ అంకితులైన ఉమ్మడి కార్యంలో మాత్రమే కాకుండా, మనస్తత్వం, ఆసక్తులు వగైరాల్లో కూడా తాము ఏక మనస్కులమని వాళ్ళు గ్రహించారు. స్నేహంలోకి పరిణతిచెందే ఒకరి పట్ల మరొకరికి ఉన్న అవ్యక్తమైన అభిమానాన్ని వాళ్ళు అనుభూతి చెందారు. పారిస్‌లో గడిపిన ఆ పది రోజులూ పది క్షణాల్లా గడిచిపోయాయి. విడిపోయేటప్పుడు ఈ పరిచయం నాలుగు దశాబ్దాల పాటు కొనసాగే పరిచయం అవబోతూందన్న విషయం వాళ్ళకి తెలియదు.

ʹʹపురాతన గాథలలో స్నేహాన్ని గురించి మనస్సును కరిగించే దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. మానవ మైత్రిని గురించిన ప్రాచీన సాహిత్యంలోని అత్యంత మనోద్వేగజనక గాధలను మించిన స్నేహబంధం గల ఇద్దరు పండితులూ, యోధులూ తన శాస్త్రాన్నీ సృష్టించారని యూరపియన్‌ ‌శ్రామికవర్గం సగర్వంగా చెప్పుకోవచ్చుʹʹ1 అని రాసాడు లెనిన్‌.

‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్ 1820, ‌నవంబరు 28న ప్రష్యా రాజ్యంలోని రైన్‌లాండ్‌ ‌రాష్ట్రంలో బార్మెన్‌ ‌నగరంలో జన్మించాడు. ఆయన తండ్రి ఒక కార్ఖానా యజమాని. 1834లో ఆయన ఎల్బర్‌ఫెల్డ్‌లో హైస్కూల్లో చేరాడు. కాని ఆయన తండ్రి తన పెద్ద కొడుకు వ్యాపారంలో చేరాలని నిర్ణయించాడు. అందుకని, ఎంగెల్స్ ‌తన హైస్కూలు విద్య ముగిసేందుకు ఒక ఏడాదికి ముందే చదువుకి స్వస్తి చెప్పి, వ్యాపారంలో ప్రవేశించవలసి వచ్చింది. అయిన్పటికీ తన విరామ కాలంలో ఆయన పట్టుదలగా స్వయంకృషితో తన విద్యను కొనసాగించాడు. తత్వవేత్తల, చరిత్రకారుల, అర్థశాస్త్రవేత్తల రచనలను ఆయన గాఢంగా అధ్యయనం చేసి, కొన్ని విదేశీ భాషలను కూలంకషంగా నేర్చుకున్నాడు.

యువకుడైన ఎంగెల్స్ ‌తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సన్నిహితంగా, శ్రద్ధగా పరిశీలించాడు. జవుళి కార్మికుల పేదరికాన్ని చూసినప్పుడు ఆయన మనస్సు తల్లడిల్లిపోయింది. ఆయన తన భావాలను దాచుకోలేదు. దానితో ఆయన తండ్రి కోపం కట్టలు తెంచుకుంది. 1839లో ʹʹవుప్పెర్‌తల్‌ ‌నుంచి లేఖలుʹʹలో ఆస్తిపర వర్గాల అమానుషత్వం మీద ఆయన ఇలా దుమ్మెత్తిపోసాడు : ʹʹకింది వర్గాల్లో, ప్రత్యేకించి కార్ఖానా కార్మికవర్గంలో దారుణమైన పేదతనం ప్రబలి ఉంది. కాని ధనిక కార్ఖానాదారులు దయార్ద్ర చిత్తులు కారుʹʹ2. యువ ఎంగెల్సులో అప్పటికే ఉన్న ధర్మ చింతన మూలంగా, ఆయన ఎవరి చేతులు ప్రపంచంలోని సంపదనంతటినీ సృష్టించాయో ఆ సామాన్య కష్టజీవుల పట్లా, శ్రామిక ప్రజల పట్లా ఆకర్షితుడయాడు. వారి పట్ల ఆయన సానుభూతి, ఆపేక్షలు ఎంత బలవత్తరమయాయో, వాళ్ళ పీడకుల పట్లా, బూర్జువావర్గం పట్లా, ఫ్యూడల్‌ ‌ప్రభువుల పట్లా ఆయన ద్వేషం అంత అధికతరమైంది.

మిలిటరీ సర్వీసులో ఉన్నప్పుడు ఎంగెల్స్ ‌బెర్లిన్‌ ‌విశ్వవిద్యాలయంలో లెక్చర్లకు హాజరయాడు. 1842 నవంబరులో మిలిటరీ సర్వీసు ముగించుకొన్న ఎంగెల్స్ ‌తన తండ్రి ఆదేశం మేరకు ʹʹఏర్మెన్‌ అం‌డ్‌ ఎం‌గెల్స్ʹʹ ‌స్పిన్నింగ్‌ ‌మిల్లు వ్యాపార కార్యాలయంలో కొలువు చేసేందుకు గాను ఇంగ్లండులోని మాంచెస్టరుకు వెళ్ళాడు.

ఉన్నత స్థాయి పెట్టుబడిదారీ అభివృద్ధి దేనవకి దారి తీస్తుందో, అంటే అధికతర విలాసాలకు, అధికతర లాభాలకు, మరింత భయంకరమైన దోపిడికి ఎలా దారితీస్తుందో ఎంగెల్స్ ఇం‌గ్లండులో కళ్ళారా చూసాడు. మాంచెస్టర్‌లో చూసిన వ్యత్యాసాలు ఎంగెల్సుకు దిగ్భ్రాంతి గొలిపాయి. అయితే, శ్రామికవర్గం బాధలు పడ వర్గం మాత్రమే కాకుండా, పోరాడే వర్గం కూడా అన్న మరో విషయావిష్కరణకి ఇంగ్లండు ఆయనకి అవకాశం కల్పించింది. ఆయన అభివృద్ధి చెందుతున్న చార్టిస్టు ఉద్యమాన్ని శ్రద్ధగా గమనిస్తూ, దాని నాయకుల్లో చాలామందితో పరిచయం కలిగించుకున్నాడు. ఇంగ్లండులో రాసిన ఆయన తొలి వ్యాసాలు ʹʹరైనిషె సైటుంగ్‌ʹʹ ‌ప్రచురింపబడ్డాయి. వాటిని చదివితే ఆయన సోషలిస్టు విశ్వాసాలు ఎలా క్రమంగా పరిణతమయాయో చూడవచ్చు.

ప్రపంచ సోషలిస్టు సాహిత్యంలోని అతి చక్కటి రచనల్లో ఒకటెన ʹʹఇంగ్లండులో కార్మికవర్గ పరిస్థితిʹʹని రచించే నాటిక ఆయనకింకా పట్టుమని పాతికేళ్ళు నిండలేదు. ʹʹశ్రామికవర్గం బాధలను అనుభవించుతున్న వర్గం మాత్రమే కాదని మొట్టమొదటి సారిగా చెప్పినవాడు ఎంగెల్స్ : ‌వాస్తవంలో సిగ్గుచేటె•న ఈ ఆర్థిక దుస్థితే శ్రామికవర్గాన్ని నిరాఘాటంగా ముందుకు నడిపి తన అంతిమ విముక్తి కోసం పోరాట వర్గం స్వయం సహాయం మీదనే ఆధారపడుతుంది. కార్మికవర్గపు రాజకీయ ఉద్యమం ఒక్క సోషలిజం లోనే తమకు విముక్తి ఉందని కార్మికులు గ్రహించేటట్లు తప్పనిసరిగా చేస్తుంది. మరోవైపున ఎప్పుడైతే సోషలిజం కార్మికవర్గపు రాజకీయ పోరాట లక్ష్యం అవుతుందో అప్పుడే సోషలిజం ఒక శక్తి అవుతుందిʹʹ3 అని లెనిన్‌ ‌పునరుద్ఘాటించాడు. ఎంగెల్స్ ఈ ‌రచన అర్థశాస్త్రపు శాస్య్రీ అవగాహనకు పునాదులు వేసింది. ఈ పుస్తకంలో ఆయన చారిత్రక భౌతికవాద అవగాహనను సమీపించాడు.

మార్క్సును కలుసుకున్న దరిమిలా ఎంగెల్స్ ‌జర్మనీకి తిరిగివెళ్ళి, అక్కడ బహిరంగ సభల్లో, చర్చల్లో, కమ్యూనిస్టు పత్రికల స్థానంలో, ప్రభుత్వపు ఫ్యూడల్‌ ‌విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సామూహిక కార్యాచరణల ఏర్పాటులో చురుకుగా పాల్గొన్నాడు. అయితే ఆయన విప్లవకర కార్యకలాపాలు ప్రష్యన్‌ ‌పోలీసుల నిఘాకి గురి కాకుండా తప్పించుకో లేకపోయాయి. 1845 వసంతంలో ఎంగెల్స్ ‌బ్రస్సెల్స్‌కి మారాడు. అక్కడ ఆయనా, మార్క్సు విప్లవ సిద్ధాంత విపులీకరనకు సంయుక్తంగా పూనుకొన్నారు.

1847 ప్రారంభంలో మార్క్స్‌, ఎం‌గెల్సులు న్యాయవంతుల లీగులో చేరారు. లండన్‌లోని ఈ సంఘంలో కొద్దిమంది కార్మికులు, అధికాంశం ప్రవాసులు సంఘటితులయ్యారు. ʹʹమానవులందరూ సోదరులుʹʹ అనే ఆకర్షణీయమైన నినాదాన్ని కలిగినదవడంతో, సహజంగానే అది మార్కస్, ఎం‌గెల్సు లకు ఎంతమాత్రం తృప్తి నివ్వలేకపోయింది. వారిద్దరూ దానిలో చేరిన తర్వాత న్యాయవంతుల లీగు కమ్యూనిస్టు లీగుగా పరివర్తన చెందింది. 1847 జూన్‌లో లండనులో జరిగిన ఒక మహాసభలో ఈ కొత్త సంఘం ఏర్పడింది. ఆ మహాసభలో ఎంగెల్స్ ‌పారస్‌ ‌కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ మహాసభ కొత్త నియమావళిని తయారుచేసి, కొత్త పేరును ఆమెదించింది. దాని పాత నినాదం స్థానంలో ʹʹసకల దేశాల కార్మికులారా ఏకం కండి!ʹʹ అనే విప్లవాత్మక వర్గ నినాదం స్వీకరించబడింది.

1847 అక్టోబరులో ఎంగెల్స్ ‌పారిస్‌కి తిరిగి వెళ్ళి, కమ్యూనిస్టు లీగు రెండవ మహాసభ సన్నాహాల్లో చురుకుగా తోడ్పడ్డాడు. ఆయన లీగు ʹʹకమ్యూనిజం సూత్రులుʹʹ పేరిట ఒక ముసాయిదా కార్యక్రమం తయారు చేసాడు. ఈ రచన దరిమిలా రచించబడిన ʹʹకమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ʹʹకు ప్రాతిపదికగా ఉపయోగపడింది.

1848 ఫిబ్రవరి 25న పారిస్‌ ‌కార్మికులు లూయూ ఫిలిప్‌ ‌రాజరికాన్ని కూలదోసి, రెండవ రిపబ్లిక్‌ను ప్రకటించారు. తద్వారా ఫ్రెంచి శ్రామికవర్గం యూరపియన్‌ ఉద్యమానికి మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. రిపబ్లికన్‌ ‌ప్రభుత్వపు ఆహ్వానం మీద మార్కస్ ‌ఫ్రాన్సుకు తిరిగి వెళ్ళాడు. మార్చి 20న బ్రస్సెల్స్ ‌నుంచి ఎంగెల్స్ ‌పారిస్‌కి చేరుకున్నాడు. 1848 ఏప్రిల్‌లో ఎంగెల్సూ, మార్క్సూ తమకి అత్యంత సన్నిహితులైన సహచరులతో కలిసి జర్యనీకి తిరిగి వెళ్ళారు. అక్కడ విప్లవోద్యమంలో చురుకుగా పాల్గొని, విప్లవాత్మక డెమోక్రటిక్‌ ఉద్యమపు సమరశీల పత్రిక అయిన ʹʹనోయె రైనిషె సైటుంగ్‌ʹʹ అనే పత్రికను కొలోన్‌లో స్థాపించారు. ఆ పత్రిక ద్వారా ఫ్యూడలిజానికీ, నిరంకుశత్వానికీ వ్యతిరేకంగా కృతనిశ్చితమైన పోరాటం జరపమని జర్మన్‌ ‌ప్రజలకు విజ్ఞప్తి చేసి, బూర్జువా వర్గపు ద్రోహాన్నీ, పెటీ బూర్జువా డెమోక్రట్ల భీరుత్వాన్నీ, నిలకడ లేమినీ తూర్పారబట్టారు. తమ పత్రిక సాయంలో మార్కస్, ఎం‌గెల్సులు ప్రజాతంత్ర సంఘాల కార్యకలాపాలకు మార్గదర్శకత్వం వహించి, ప్రజాసామాన్యపు పోరాటానికి నాయకత్వం వహించారు. 1848 జూన్‌లో జరిగిన పారిస్‌ ‌తిరుగుబాటును గురించి ఎంగెల్స్ ‌వరుసగా కొన్ని వ్యాసాలు రాసాడు. మహత్తరమైన ప్రతిభతో, ప్రగాఢమైన విషయ పరిజ్ఞానంతో ఆస్ట్రియన్‌ ‌రాజరికానికి వ్యతిరేకంగా ఇటలీ, హంగరీల్లో జరిగిన జాతీయ విముక్తి యుద్ధ క్రమాన్ని ఎంగెల్స్ ‌విశదీకరించాడు. సెప్టెంబరు నెలాఖరులో అధికారుల ఆజ్ఞ మేరకు ʹʹనోయె రైనిషె సైటుంగ్‌ʹʹ ‌ప్రచురణ నిలిచిపోయింది. అరెస్టు చెయ్యబడే ప్రమాదం దృష్ట్యా, ఎంగెల్స్ ‌స్విట్జర్లండుకు తప్పించుకుపోయాడు.

1849 మేలో రైన్‌లాండులనూ, దక్షిణ జర్మనీలోనూ ఒక సాయుధ విప్లవ పోరాటం ప్రారంభించబడింది. ఆ సమయంలో ఆగస్ట్ ‌విల్లిహ్‌ ఒక స్వచ్ఛంద సైనిక దళాన్ని కూడగట్టాడు. ఆ దళంలో ఎంగెల్స్ ‌కూడా చేరి, ఫల్జ్, ‌బాడెన్‌లలో జరిగిన మొత్తం కార్యాచరణ అంతట్టోనూ పాల్గొన్నాడు. అత్యంత ప్రమాదకర కార్యాలను ఆయన నిర్విహించాడు. జరిగిన పోరాటాల్లో ఆయనెప్పుడూ అగశ్రేణిలో ఉన్నాడు. చివరకు ఆ విప్లవం ఓడింపబడ్డాక మాత్రమే ఎంగెల్స్ ‌పరాజిత విప్లవ సైన్యపు తుది అవశేషాలతో బాటు జర్మనీ విడిచవెళ్ళిపోయాడు. అటు తర్వాత త్వరలోనే ఆయన లండన్‌ ‌చేరుకున్నాడు. మార్కస్ అప్పటికే అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి కమ్యూనిస్టు లీగును పునర్నిర్మించి, పటిష్ఠం చెయ్యనారంభించారు. అదే సమయంలో ఎంగెల్స్ ‌తన పరిశోదనా కార్యకలాపాలు కొనసాగించాడు.

1850 నవంబరులో ఎంగెల్స్ ‌తండ్రి మాంచెస్టరుకు పోయి, ʹʹఏరెమన్‌ అం‌డ్‌ ఎం‌గెల్స్ʹʹలో పని ప్రారంభించవలసిందిగా ఎంగెల్సును ఒత్తిడి చేసాడు. ఈ కొత్త వృత్తి అంటే తనకి ఎంత అసహ్యం అయినప్పటికీ, తన పరిశోధనా కృషిని కొనసాగించాలని ఆయన ఎంతగా కలలు కన్నప్టఇకీ, మార్క్సుకీ, ఆయన కుటుంబానికీ ఆర్థిక తోడ్పాటునివ్వాలన్న గట్టి ఆకాంక్ష వల్ల ఆయన తన తండ్రి కోర్కెను ఆమోదించాడు. తన మిత్రుడు ʹʹపెట్టుబడిʹʹ రచనా కృషిని పూర్తి చెయ్యగలిగేందుకు ఎంగెల్స్ ఏ ‌త్యాగం చేసేందుకైనా సరే సిద్ధపడ్డాడు.

ఏళ్ళు గడిచేకొద్దీ వాళ్ళ స్నేహం సన్నగిల్ల లేదు సరికదా, కలుసుకున్న ప్రతిసారీ వాళ్ళు పరస్పరం ఒకరిలో మరొకరు కొత్త సద్గుణాలను కనుగొన్నారు, తమతమ సొంత సృజనాత్మక కృషికి కొత్త శక్తిని పుంజుకొన్నారు. తన అధ్యయన క్రమంలో తను చేరుకున్న ముఖ్యమైన నిర్ధారణలు అన్నింటినీ ఎంగెల్సుకి వివరించి, ఆయన వ్య్యాలనూ, విమర్శలూ మార్కస్ అర్థించేవాడు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ముందు ఎంగెల్స్ ఆ ‌సమస్యల కూలంకష సైద్ధాంతిక విశ్లేషణకు పూనుకొనేవాడు.

మార్కస్‌తో తను సహకారం నెరపిన కాలంలోనూ, మార్కస్ ‌మరణించిన తర్వాతా ఎంగెల్స్ ʹʹయాంటీ డ్యూరింగ్‌ʹʹ, ʹʹకుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాల ఆవిర్భావంʹʹ మొదలైన కొన్ని ప్రముఖ స్వీయరచనలు చేసాడు.

శాస్త్రీయ రచన అయిన ʹʹయాంటీ డ్యూరింగ్‌ʹʹ ‌ప్రగాఢమైన మార్క్సిస్టు సైద్ధాంతిక రచనల్లో ఒకటి. అది మార్క్సిజం సైద్ధాంతిక నిర్ధారణల సూత్రాల సార సంగ్రహాన్ని క్రోడీకరిస్తుంది. అది సోషిజాన్ని శత్రుత్వపూరిత వర్గ సంగ్రహాన్ని క్రోడీకరిస్తుంది. అది సోషలిజాన్ని శత్రుత్వపూరిత వర్గ వైరుధ్యాలూ, ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడం లేని ఒక నూతన సామాజిక వ్యవస్థగా అభివర్ణిస్తుంది. ఈ గ్రంథంలో మార్క్సిస్టు తత్వశాస్త్రపు మూల సూత్రాలు విస్పష్టంగా, హేతుబద్ధంగా విపులీకరించబడ్డాయి. ఆర్థిక సిద్ధాంతానికి శాస్త్రీయమైన పునాదులు వెయ్యబడ్డాయి. గ్రంథకర్త ఈ పుస్తకంలో ఉత్పత్తి సంబంధాలను విపులంగా వర్ణించి, చరిత్ర దృష్ట్యా వాటి తాత్కాలిక స్వభావాన్నీ, పెట్టుబడిదారీ సంబంధాల స్థానంలో కమ్యూనిస్టు సంబంధాలు రావలసిన అవసరాన్నీ స్పష్టంగా చూపించాడు.

ఎంగెల్స్ ‌తన రచనల్లో ఉత్పత్తి వ్యవస్థీకరణ పట్ల విశేషమైన శ్రద్ధ చూపాడు. ప్రత్యేకించి, సామాజిక ఉత్పత్తి చైతన్యపూరిత వ్యవస్థీకరణను ప్రణాళికాబద్ధమైన పంపిణీతో మేళవించడానికి గల ప్రాముఖ్యాన్ని ఆయన గమనించాడు. ʹʹచారిత్రక పరిణామం అలాంటి వ్యవస్థీకరణను రోజురోజుకీ మరింత అనివార్యమే కాకుండా, రోజురోజుకీ మరింత సంభావ్యం కూడా చేస్తుంది. ఆనాటి నుంచి ఒక నూతన చారిత్రక యుగం ప్రారంభమవుతుంది. ఆ యుగంలో మానవ జాతీ, మానవ జాతితో బాటు దాని కార్యకలాపాల రంగాలన్నీ, ప్రత్యేకించిప్రకృతి విజ్ఞాన శాస్త్రమూ అంతకు పూర్వపు ప్రతి ఒక్కదాన్నీ పూర్తిగా మరుగుకి నెట్టివేసే పురోగమనాన్ని సాధిస్తాయిʹʹ4 అని రాసాడు ఎంగెల్స్.

ఎం‌గెల్స్ ‌మరో రచన ʹʹప్రకృతి గతితర్కంʹʹ. ఈ రచన కోసం ఆయన పదేళ్లకి పైగా వెచ్చించాడు. ఈ పుస్తకం ʹʹయాంటీ డ్యూరింగ్‌ʹʹతో ప్రత్యక్షంగా సంబంధింతమై ఉంది. ఇందులో ఆయన తన కాలపు ప్రకృతివిజ్ఞాన శాస్త్రాలు సాధించిన అతి ముఖ్య విజయాలన్నింటికీ తాత్విక సాధారణీకరణలు ఇచ్చాడు. ఈ పుస్తకంలో యాంత్రిక భౌతికవాదంపైనా, బూర్జువా పండితుల భావవాద సిద్ధాంతాలపైనా, వాళ్ళ అధిభౌతికవాద పద్ధతులపైనా లోతైన విమర్శ ఉంది.

ఎంగెల్స్ ‌శాస్త్రీయ సమాచారాన్ని ఆధారం చేసుకొని, పదార్థ చలనపు (ఆనాటికి తెలిసి ఉన్న) అతి సరళ, అతి నిమ్న రూపాల నుంచి జీవపు ఆవిర్భావ అభివృద్ధుల వరకు, మానవుడి అవతరణ, మానవ సమాజ అభివృద్ధుల వరకు ప్రకృతి గతితార్కిక అభివృద్ధి సాధరణ చిత్రాన్ని ఇచ్చాడు. పదార్థ చలనపు ఒక రూపం నుంచి మరో రూపానికి పరివర్తనను కూలంకషంగా అధ్యయనం చెయ్యాలనీ, తద్వారా విడి ప్రకృతి విజ్ఞాన శాస్త్రాల మధ్య అగాధాన్ని తొలగించాలనీ, ఆయన విజ్ఞప్తి చేసాడు. ఈ పుస్తకంలో ఎంగెల్స్ ‌భౌతిక, రసాయనిక, జీవ, మనస్తాత్విక శాస్త్ర రంగాల్లో దరిమిలా విజ్ఞాన శాస్త్రం సాధించబోయే విజయాలను ముందుచూసుతో దర్శించాడు.

మార్క్స్‌ ‌మనణానంతరం ఎంగెల్సు పన్నెండేళ్ళ పాటు జీవించాడు. ఆ కాలంలో నూతన ఆవిష్కరణల ద్వారా, నిర్ధారణల ద్వారా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయన సుసంపన్నం చేసాడు. సిసలైన విప్లవ నాయకుడి నేర్పుతో, శక్తితో యూరప్‌, అమెరికా ఖండాల్లోని సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీలకు ఆయన వివేకవంతుడైన సలహాదారుగా వ్యవహరించాడు. వివిధ దేశాలకు చెందిన పోరాటమగ్నులైన కార్మికుల, ప్రగతిశాల మేధావుల ప్రతినిధులు అనేకమంది ఆయన దగ్గరకి సలహా సహాయాల నిమిత్తం వస్తేండేవారు. ఆయన తన అపార అనుభవ, జ్ఞాన సంపదను వారికి పంచి ఇస్తూండేవాడు.

ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాలను ప్రచురణకు సన్నద్ధం చెయ్యడంలో ఎంగెల్స్ ‌కృషి ఒక కమ్యూనిస్టు శాస్త్రజ్ఞుడు చేసిన సిసటెన వీరోచిత కార్యం. మార్కస్ ‌మరణానంతరం మార్క్సిజం వ్యతిరేకులు మార్కస్ ʹʹపెట్టుబడిʹʹ మొదటి సంపుటాన్ని మించి ఏమీ రాయలేదనే, రెండవ సంపుటాన్ని గురించిన కబుర్లు మొదటి సంపుటంలో తను విశదీకరించిన విలువ, అదనపు విలువ సిద్దాంతాలను విమర్శించేవాళ్ళతో శాస్త్రీయ వాదవివాదాలను తప్పించుకునేందుకు ఆయన ఉపయోగించుకున్న ʹʹసాకుʹʹ మాత్రమేననే కథలను వ్యాపింపజెయ్య నారంభించారు.

మార్క్స్‌ ‌మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్‌ ‌సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి ప్రచురణకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయో ఎంగెల్సుకి గాని, మరెవరికి గాని తెలియదు. మార్క్స్‌ ʹʹపెట్టుబడిʹʹ అసంపూర్ణ రచనతో ఏం చెయ్యాలన్న ప్రశ్న చాలా మంది సోషలిస్టులను వేధించింది. అప్పుడు వాళ్ళు ఆశతో ఎంగెల్స్ ‌వెపు తమ దృష్టిని మళ్ళించారు. నిజంగానే బృహత్తరమైన కృషి అది. సాఫీగా చదవడానికి యోగ్యం కాని రచయిత దస్తూరీలో ఉన్న రాత ప్రతులను ఆమూలాగ్రం చదవాలి, ఇచ్చిన అనేక వివరణలనూ, సంక్షిప్త సంకేతాలనూ తెలుసుకోవాలి. ఈ పనిని నిస్సందేహంగా ఒక్క ఎంగెల్స్ ‌మాత్రమే చెయ్యగలడు.

సాపేక్షంగా తక్కువ కాలంలో రెండవ సంపుటాన్ని ప్రచురణకు తయారు చెయ్యగలనని ఎంగెల్స్ ‌మొదట్లో అనుకున్నాడు. కాని 1883 అక్టోబరులో ఆయన జబ్బుపడ్డాడు. దానితో ఆయనకి కనీసం ఆర్నెల్లు వృథా అయిపోయాయి. ఆ అస్వస్థత తనకి సైతం ఏ క్షణాన అయినా ఏమి వాటిల్లవచ్చునో తెలిపే ఒక హెచ్చరిక అయింది. ఆయన ʹʹచిత్తు ప్రతిʹʹని అర్జెంటుగా తయారు చెయ్యాలి. రాతప్రతులను ప్రత్యేకించి కుదుర్చుకున్న ఒక రాయసగాడికి డిక్టేట్‌ ‌చెయ్యాలి. ఇదొక బ్రహ్మాండమైన పని. ఇందుకు బోలెడు కాలం పట్టింది. వ్యాధి మధ్యమధ్యన తిరపెట్టడంతో ఎంగెల్స్ ‌బల్ల దగ్గర కూర్చోలేకపోయేవాడు. కానైతే ఆయన సోఫా మీద పడుకొని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ప్రతిరోజూ డిక్టేట్‌ ‌చేస్తూ ఉండేవాడు. రాత్రిపూట ఆ రోజు డిక్టేట్‌ ‌చేసిన భాగపు ప్రాథమిక దిద్దుబాటుకి పూనుకొనేవాడు. ఎంగెల్స్ ‌సంపాదకత్వంలో మార్కస్ ʹʹపెట్టుబడిʹʹ రెండవ సంపుటం 1885 జూలైలో ప్రచురింపబడింది.

మూడవ సంపుటపు తయారీలో ఇమిడి ఉన్న ఇబ్బందులు ఎంగెల్స్ ‌మొదట్లో అనుకున్నవాటిని మించిపోయాయి. ఆయన ఈ పనికి సుమారు పదేళ్ళు వెచ్చించాడు. మూడవ సంపుటాన్ని తయారు చేసేటప్పుడు ఎంగెల్స్ ‌సాధ్యమైనంతవరకు మార్కస్ ‌పరిశోధనా కృషి ఫలితాలను ఆయన సొంత మాటల్లోనే వ్యక్తం చేసేందుకు ప్రయత్నించాడు. రాతప్రతుల పాఠంలో బొత్తిగా అనివార్యమైనప్పుడు తప్ప తను జోక్యం చేసుకోలేదు. మూడో సంపుటానికి ఎంగెల్స్ ‌సమగ్రమైన ముందుమాట రాసాడు. దానిలో ఆయన రాతప్రతులు ఏ స్థితిలో ఉన్నాయో, వాటిమీద తను చేసిన కృషి ఏమిటో వివరించి, మార్కస్ ‌చారిత్రక భౌతికవాద దృక్పథాన్నీ, ఆర్థిక బోధననీ వక్రీకరించిన బూర్జువా సైద్ధాంతికుల బండారాన్ని బహిర్గతం చేసాడు.

(ఇంకా ఉంది)

No. of visitors : 1558
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నక్సల్బరీ నీకు లాల్‌సలాం

పద్మకుమారి | 06.05.2017 06:51:02pm

అమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర.......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 01.08.2016 05:59:00am

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్‌ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ.......
...ఇంకా చదవండి

సాధారణ సోషలిస్ట్ వాస్త‌వాలు

పాల్ ల ఫార్గ్ | 02.07.2016 01:29:44am

మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని.......
...ఇంకా చదవండి

స్థూపం చెప్పిన విజయగాథ

విర‌సం | 16.07.2016 03:00:12pm

మహత్తర బోల్షివిక్‌ ‌విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - కార్ల్‌ మార్క్స్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 04.08.2016 09:54:43am

రష్యన్‌ విప్లవకారులతో మార్క్స్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్‌ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా.....
...ఇంకా చదవండి

బెజ్జంగి అమ‌రుల స్ఫూర్తితో నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వాన్ని విజ‌యవంతం చేద్దాం

విరసం | 02.11.2016 11:43:24am

అమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ...
...ఇంకా చదవండి

ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"

కెన‌రీ | 21.12.2016 07:07:28am

మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ‌ఫ్రెడరిక్‌ ఎం‌గెల్స్

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 05.10.2016 04:48:27pm

తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ ‌శాస్త్రీయంగా .......
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 09.11.2016 08:16:27pm

లాసాల్‌ ‌పాత్ర మార్కస్, ఎం‌గెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్‌డోర్ఫ్ ‌కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........
...ఇంకా చదవండి

స్మార‌క స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్‌ ‌లాసాల్‌

ద్మీత్రి వలొవొయ్‌, హెచ్ ల‌ప్షియా | 24.11.2016 09:43:08pm

లాసాల్‌ ‌చెప్పేదాని ప్రకారం, కార్మిక సంఘాలు ఉత్పత్తి నిర్వహణను క్రమంగా తమ చేతుల్లోకి తీసుకుంటాయి. సార్వజనిక ఓటు హక్కును ప్రవేశపెట్టిన ఫలితంగా రాజ్యం ʹʹ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •