హిందూ మ‌తోన్మాద దాడుల‌కు వ్య‌తిరేకంగా స‌ద‌స్సు

| కార్య‌క్ర‌మాలు

హిందూ మ‌తోన్మాద దాడుల‌కు వ్య‌తిరేకంగా స‌ద‌స్సు

- హిందూ మ‌తోన్మాద వ్య‌తిరేక వేదిక‌ | 01.09.2016 01:04:11am

ఈ దేశ ప్రజల మధ్య వర్ణం పేర, కులం పేర, మతం పేర వైషమ్యాలను రెచ్చగొట్టి నరమేధాలు సృష్టించిన హిందూ మతోన్మాద శక్తులు నేడు మరింత క్రూరంగా హత్యలు చేస్తున్నాయి. సాంఘిక కట్టుబాట్ల ఉల్లంఘన పేర దళితులను, తీవ్రవాదం పేర ముస్లింలను, మతమార్పిడుల నెపంతో క్రైస్తవులను ఊచకోతకోసిన హిందూ మతోన్మాదులు తమ వ్యూహాలను మార్చుకొని సరికొత్త పద్ధతుల్లో హత్యాకాండలకు పాల్పడుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో చదివే దళిత, పీడిత కులాల విద్యార్థుల పట్ల కులవివక్షను ప్రదర్శిస్తూ ఆత్మహత్యలకు పరికొల్పుతున్నారు. తీవ్రవాదుల పేర అక్రమంగా నిర్బంధిస్తున్నారు. రోహిత్ వేముల, కన్నయ్య, ఉమర్ ఖలీద్లు మచ్చుకు కొన్ని పేర్లు మాత్రమే. హిందూ మతోన్మాదుల దాడులను ఖండించిన రచయితలను, హేతువాదులను సైతం క్రూరంగా నరికి చంపే స్థాయికి తెగబడ్డారు. నరహంతక నరేంద్రమోడీ అండతో రెచ్చిపోయిన ఉన్మాదమూకలు దేశవ్యాప్తంగా స్వైరవిహారం చేస్తున్నాయి.

గోహత్య రాజకీయాలను మరింత పాశవికంగా అమలుచేస్తూ దళితులను బహిరంగంగానే హత్యలు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని ఊనా నుండి ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం వరకు ఈ దాడుల పరంపర నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ʹక్రిష్ణాష్టమి, సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దళితుల, ముస్లింల హత్యలను ప్రోత్సహించేలా విష ప్రచారం చేస్తున్నారు.

ఆవు చర్మం వొలిచారనే నెపంతో గుజరాత్లోని దళితులపై జరిగిన దాడి మొత్తం దళిత సమాజాన్ని కదిలించింది. "చచ్చిన పశువులను తీయం" "అపరిశుద్ధమైన కులవృత్తులను చేయం" అంటూ దళిత ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాటానికి నడుం కట్టారు. లక్షలాది మందితో ఆత్మగౌరవ - స్వేచ్చా ర్యాలీలను నిర్వహించి దళితుల ఐక్యతను చాటారు. హిందూ మతోన్మాద దాడులను ప్రతిఘటిస్తామని ప్రతినబూనారు. ఈ పోరాట స్పూర్తిని ఎత్తిపడుతూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు సాగుతున్నాయి. దళితులు, మైనార్టీలు,పీడిత కులాలు, ప్రజాస్వామికవాదులు సంఘటితంగా కదులుతున్నారు. ఇలాంటి సంఘటిత పోరాటాలు నేడు ఎంతో అవసరం. కనుక 2002 సంవత్సరం నుండి హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా వివిధ దళిత, మైనారిటీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్న హిందూమతోన్మాద వ్యతిరేక వేదికను విస్తృతపరచి కలిసివచ్చే ప్రగతిశీల, దళిత, మైనారిటీ ప్రజాసంఘాల భాగస్వామ్యంతో విశాల ఐక్యవేదికను నిర్మించడం కోసం తేది: 2 సెప్టెంబర్ 2016 న సదస్సు నిర్వహిస్తున్నాం. కావున దళితులు, ఆదివాసీలు, మహిళలు, పీడిత కులాలు, మైనారిటీ మతస్తులు,పీడిత వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు విద్యార్థి మేధావులు ఈ ఉద్యమంలో కలిసి రావాలని కోరుతున్నాం.

స‌ద‌స్సు


తేది : 2 సెప్టెంబ‌ర్ 2016
స‌మ‌యం : సాయంత్రం 4గంట‌ల‌కు
స్థ‌లం : తెలుగు విశ్వ‌విద్యాల‌యం ఆడిటోరియం, నాంప‌ల్లి, హైద‌రాబాద్‌

అధ్య‌క్ష‌త : బూరం అభినవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎన్‌.పి.ఎస్‌
వ‌క్త‌లు :
లతీఫ్ మహ్మద్ ఖాన్, సిఎల్ఎంసి
వరవరరావు, విరసం
ప్రొఫెస‌ర్ సూరేప‌ల్లి సుజాత‌, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ
వి. సంధ్య, పిఓడబ్యూ

ప్రజాకళామండలి, అరుణోదయ క‌ళాకారుల సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లుంటాయి.





No. of visitors : 997
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఉనా ఉద్యమం - దళిత, ముస్లిం ప్రగతివాద రాడికల్‌ ఎజెండా

జిగ్నెష్‌ మెవాని | 17.09.2016 10:33:02am

ఇది గుజరాత్‌లో వచ్చిన పటీదార్‌ ఉద్యమం వంటిది కాదు. అది విప్లవ ప్రతీఘాతుకమైనది. మాది ప్రగతిశీలమైన రాడికల్‌ ఉద్యమం. అది భూమి కొరకు పోరాటం. ఇంటి మహిళ పేరు ......
...ఇంకా చదవండి

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో పెట్టాలి

విరసం | 09.08.2016 02:15:21pm

వర్గీకరణ సాధన కోసం మాదిగ, మాదిగ ఉపకులాలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనది. ప్రజాస్వామికమైనది. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశాలలోనే ఎస్సీ........
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఆగస్టు 2019

    ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
    వేటగాడి వల
    పదునెక్కుతున్న కోరలు
    ఎదురుచూపులు
    యురేనియమం
    మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
    నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
    దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
    చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
    ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •