దేవతా - దెయ్యమూ

| సంభాషణ

దేవతా - దెయ్యమూ

- మిసిమి | 03.09.2016 12:53:20am

వ్యవస్థ అపసవ్య రూపాలు

ఈ మధ్య పాత సృజన సంచికలు చూస్తూ చైనా విప్లవ కాలం నాటి ఒక కథ గురించి చదివాను. 1940లో వాయువ్య హోపే కొండప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో తెల్ల కురుల దేవత కనిపిస్తోందని పుకారు ఉండేదట. ఊరిబయట దేవాలయం ఆమె ఆవాసం. రోజూ నైవేద్యాలు పెడితే మాయం అయ్యేవి. ఎప్పుడైనా పెట్టకపోతే "దేవతను నిర్లక్ష్యం చెస్తున్నారు, ఫలితం అనుభవిస్తారు" అనే మాటలు భయంకరంగా వినిపించేవి. పార్టీ బాధ్యులు ఒకసారి ఆ ఊరిలో సభ ఏర్పాటు చేస్తే ఎవరూ రాలేదట. కారణం ఏమిటంటే తెల్ల కురుల దేవతకు నైవేద్యం అర్పించడానికి వెళ్లారు.

విషయం తేల్చడానికి కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యకర్త గ్రామ రాక్షణాధికారిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. వాళ్ళు ఒకరోజు రాత్రిపూట దేవాలయం వద్ద కాపుగాసారు. ఒక తెల్లటి ఆకారం ఆలయంలోకి ప్రవేశించింది.

ఎవర్నువ్వు అని గద్దించగా అది ఒకరి మీదికి లంఘించింది. తుపాకీతో కాల్పులు జరుపుతూ దాన్ని వెంబడించారు. అడవి వెంబడి పరిగెత్తుతూ ఒక కొండెక్కి మాయమైంది. దాన్ననుసరిస్తూ పోయిన వారికి దూరంగా పసిపాప ఏడుపు వినిపించింది. అది ఒక గుహ నుండి వస్తోంది.

గుహలో చిన్న వెలుతురు. వీళ్ళు ʹఎవర్నువ్వు? చెప్పు, లేదంటే కాల్చేస్తాంʹ అని తుపాకీ గురిపెట్టారు. ఆ తెల్ల కురుల దేవత పసిపాపను ఆడిస్తూ ఉంది. ఏడుస్తూ తన కథ చెప్పనారంభించింది.

ఆ అమ్మాయి పదిహేనేళ్ల వయసులో చాలా అందంగా ఉండేదట. ఆ ఊరి భూస్వామి ఆమె మీద మోజుపడి, కుట్రపన్ని ఆమె తండ్రిని హత్య చేసి ఆమెను చేరదీసి ఇంట్లో బంధించి అత్యాచారం చేసాడు. ఆమె గర్భం దాల్చిందని తెలిసి చంపాలని చూసాడు. ఆమె పారిపోయింది. భయంభయంగా ఎక్కడెక్కడో తలదాచుకుంది. మనుషులకు దూరంగా గుహలో చేరింది. అక్కడే ఆమెకు ప్రసమవుతుంది. సరైన ఆహారం, పోషణ లేక పాలిపోయి, శుష్కించి, ఆమె జుట్టు తెల్లబడిపోయింది. తిండి కోసం రహస్యంగా రాత్రి పూట దేవాలయంలోకి వస్తూ ఉంటుంది. గ్రామస్తులు ఆమెను దేవత అనుకున్నారు. పార్టీ సాయంతో ఆమె మామూలు మనిషిగా మారిందనుకోండి. ʹఇప్పుడున్నది ప్రజాప్రభుత్వం నీకేం భయం లేదుʹ అని ఆ కామ్రేడ్స్ భరోసా ఇచ్చి ఆమెను ఊరు తీసుకెళ్లారు.

అప్పట్లో భూస్వామ్య వ్యవస్థ దుర్మార్గాన్ని ఎత్తి చూపుతూ ఈ కథని సంగీతరూపకంగా తయారుచేసారట.

ఇలాంటి కథే మ‌హాశ్వేతాదేవి ʹదెయ్యాలున్నాయి జాగ్రత్తʹ పేరుతో తెలుగులో వచ్చింది. ఈ కథలో అత్యాచారానికి గురైన అమ్మాయి ʹదెయ్యమʹవుతుంది. గర్భంతో ఉంటుందా.. ఆకలికి తాళలేక చిన్న చిన్న జీవుల్ని చంపి పచ్చి మాంసం తింటూ ఉంటుంది. పెద్ద కడుపుతో నగ్నంగా ఒళ్ళు గగుర్పొడిచేలా ఆమె రూపం. ఆమె మూతికి రక్తం అంటి ఉంటుంది. బతికున్న జీవుల్ని అమాంతం పళ్లతో చీల్చి తినేయడం చూసి మనుషులు గుండె ఆగి చస్తారు. కాని ఆమె కథ ఎంతగా గుండెల్ని పిండేస్తుందో! వ్యవస్థ దుర్మార్గం ఆమె బీభత్స రూపంలో చూపిస్తారు రచయిత. సినిమాల్లో చూపిస్తుంటారు, చచ్చిపోయి దెయ్యాలై ప్రతీకారం తీర్చుకోవడం. ఆ చవకబారు అభూతకల్పనలనా ఉంచుదాం.

ఈ హృదయవిదారక అపసవ్య బీభత్స రూపాలు ఈ వ్యవస్థవే కదా.

No. of visitors : 977
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ

-మాయా పలిత్ | 02.01.2017 11:54:34pm

ʹCaste, Conflict and Dress Changeʹ అనే అధ్యాయాన్ని 9వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుండి తొలగిస్తున్నట్లు సి.బి.ఎస్.ఇ (ఉన్నత పాఠశాల కేంద్రీయ విద్యా ...
...ఇంకా చదవండి

తెలుగువారి ముంగిట్లోకి ప్రపంచం

మిసిమి | 17.06.2016 11:09:21am

విశ్వ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన మనిషి గురించి, ఆ మనిషి సృష్టించుకున్న ప్రపంచం గురించి ఆలోచించినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, కవిగా శ్రీశ్రీ పొందిన ఉద్వేగా...
...ఇంకా చదవండి

చదివిన వారిని ʹపాల్గుణʹ ఆవహిస్తాడు!

మిసిమి | 16.07.2016 12:56:55pm

పాల్గుణ మట్టివేళ్ళ నుండి రూపొందిన విప్లవకారుడు. సింగరేణి గని కార్మికుడిగా అత్యంత సహజంగా కార్మికోద్యమానికి దగ్గరై, కార్మికవర్గ రాజకీయాలను సొంతం చేసుకున్న......
...ఇంకా చదవండి

మాయమైన నజీబ్ మాట్లాడే సంగతులు

మిసిమి | 05.04.2017 09:43:48pm

దేశంలో అసహనం (ఉన్మాదం అనవలసినదాన్ని) గురించి రచయితలు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు మూకుమ్మడి నిరసన తెలిపినప్పుడు మన ప్రభుత్వం వెటకారం చేసిన విషయం ఎంత.......
...ఇంకా చదవండి

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన

| 01.10.2018 10:37:48pm

సమాజంలో బలహీనవర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులపై రాజ్యం తీవ్రవాద వ్యతిరేక చట్టాలను సరైన ఆధారం లేకుండా ప్రయేగించేటప్పుడు అది కూడా ఒక రకమైన టెర్రర్... ...
...ఇంకా చదవండి

చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ

రాహుల్ మాగంటి | 22.09.2018 11:48:04pm

ఆంధ్రప్రదేశ్ లోని ఆ తీర ప్రాంత గ్రామంలో పారిశ్రామిక కాలుష్యం చేపల్ని చంపేసాక మత్యకారులు ఏమయ్యారు? సముద్రమంత గతానికి అనిశ్చిత భవిష్యత్తుకు మధ్య పెనుగులాడు.....
...ఇంకా చదవండి

మానవహక్కులను వెటకారం చేసే ద్వేషభక్తులు అర్థం చేసుకోలేనిది.

మిసిమి | 17.03.2019 09:38:24am

జెనీవా ఒప్పందం గురించి ఎంత ప్రచారం జరిగింది! పట్టుబడిన యుద్ధ ఖైదీని, అది సివిల్ వార్ అయినా సరే మానసిక శారీరక హింసకు గురిచేయకుండా ఎట్లా చూసుకోవాలో సోషల్ మీ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •