అకస్మాత్తుగా తోడేళ్ల మంద వచ్చి పడుతుంది. తెల్లారే సరికి గూడెం లో విషాదం అలుముకుంటుంది. అవును.... బస్తర్‌లో నిత్యకృత్యమైన వాతావరణం ఇది. పొలం పని చేసుకునే రైతు... చదువుకునే విద్యార్థి... చంటి పిల్ల తల్లి... తునికాకు ఏరే యువతి... ఎవరైనా సరే... మావోయిస్టులుగా మారిపోతారు. ఎదురు కాల్పుల్లో హతమైతారు. ఇప్పుడు అది అర్జున్ వంతు. నూనుగు మీసాల నవ యువకుడు. రొటీన్ కట్టుకథలో కమాండర్ పాత్ర ఆపాదించబడ్డ వాడు. అడవి బిడ్డ అయినందుకు రాజ్యం చేతిలో హత్యగావించబడ్డాడు.
రెండేళ్ల క్రితం.. తమ గ్రామం దగ్గరలోని సంతకు వెళ్లిన అర్జున్ను పోలీసులు హఠాత్తుగా వచ్చి తీసుకెళ్లారు. అక్రమ కేసులు మోపి కోర్టు ముందు హాజరుపరిచారు. 17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువకుడిగా తప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జవాన్లు చనిపోవడానికి కారణమైన అంబులెన్స్ పేల్చివేత ఘటనలో అర్జున్‌ని నిందితుడిగా పేర్కొన్నారు. బడి పిల్లవాడిని నక్సలైట్‌గా చిత్రీకరించడమంటే బస్తర్‌లో అమలవుతున్న పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆదివాసీల దుస్థితిని ఊహించవచ్చు.
జగదల్పూర్ లీగల్ ఎయిడ్ గ్రూప్ అతనిపై మోపిన కేసులు తప్పుడు కేసులని వాదించింది. అర్జున్ వయసు కేవలం 17 సంవత్సరాలే అని, అతడు చదువుకునే పాఠశాల నుంచి అందుకు తగిన ఆధారాలను సేకరించి కోర్టు ముందుంచింది. దీంతో అర్జున్ కేసు జువెనిల్ కోర్టుకు బదిలీ చేశారు. గత డిసెంబర్లో బెయిల్‌పై విడుదలయ్యాడు అర్జున్. ప్రతి నెలా జువెనిల్ కోర్టుకు హాజరవుతున్నాడు. చివరి సారిగా జూలై 27న కోర్టుకు హాజరైన అర్జున్ తిరిగి ఆగస్టు 31న హాజరు కావల్సి ఉంది. కానీ ఈ లోగానే బూటకపు ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు.
పోలీసుల నుంచి ఎప్పుడూ వినే కథే వినిపించింది. ఒరిస్సా - చత్తీస్ఘడ్ సరిహద్దులోని కందనార్ గ్రామంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్), జిల్లా రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) బృందాలు అక్కడికి వెళ్లాయని, తమపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, ప్రతిగా తాము జరిపిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించాడని రోటీన్ కథ. చనిపోయిన వ్యక్తిని స్థానిక గ్రామస్తులు అర్జున్‌గా గుర్తించారని, ఆగస్టు పదవ తేదిన కందనార్ గ్రామంలో పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో మావోయిస్టులతో కలిసి అర్జున్ ఒక వ్యక్తిని హత్య చేశాడని పోలీసులు ప్రకటించారు. అర్జున్ మావోయిస్టు ప్రజా మిలీషియా చందోమెట ఏరియా కమాండర్ అని, అతను 2014లో ఐదుగురు జవాన్లు మరణించిన అంబులెన్స్ పేల్చివేతలో పాల్గొన్నాడని పేర్కొన్నారు. అతని కేసును వాదిస్తున్న జగదల్పూర్ లీగల్ ఎయిడ్ గ్రూప్ సభ్యురాలు, అడ్వకేట్ ఇషా కండేల్వాల్ ఇది పూర్తి అవాస్తమని, ఒక అండర్ ట్రాయిల్ ముద్దాయిని పట్టుకొని కాల్చిచంపిన పోలీసులు మావోయిస్టుగా చిత్రిస్తున్నారని పేర్కొంది.
చత్తీస్ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ 2016 పేరుతో విప్లవోద్యమాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అందులో భాగంగా బస్తర్‌లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఆదివాసీ గ్రామాలపై వేలాది మంది గ్రేహౌండ్స్‌ని ఎగదోసి నెత్తురు పారిస్తోంది. అడవిలోని సహజ వనరులను బడా కంపెనీలకు అప్పగించేందుకు, ఆదివాసీలను అడవి నుంచి గెంటి వేసేందుకు ప్రయత్నిస్తోంది. జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ నినాదాలతో వనరులపై హక్కు మాదే అని పోరాడుతున్న ఆదివాసీల ప్రజలపై అణచివేతను ప్రయోగిస్తోంది. అందులో భాగంగా ఇలాంటి అమానుష హత్యాకాండలు, మహిళలపై అత్యాచారాలు, బూటకపు ఎదురు కాల్పులు. ఈ దేశ సంపదను కాపాడుతున్న ఆదివాసీలకు ఇప్పుడు బాహ్య ప్రపంచం అండ అవసరం. వాళ్ల పోరాటాలతో కలిసి నడవాల్సిన భాద్యత ప్రజాస్వామికవాదులపై ఉంది.
Type in English and Press Space to Convert in Telugu |
అక్కడ డేనియల్ ఉన్నాడుఅక్కడ బాల్యం భయంలో... యవ్వనం నిర్బంధంలో గడిచిపోతుంది. ఇంటి నుంచి బయటకెళ్లిన పిల్లలు తిరిగి వస్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక... |
బోధనా హక్కు కోసం మరో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్.సాయిబాబా1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట... |
దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజంసామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........ |
పొట్టకూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారుతాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్టయ్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన మనోహర్ శవమై తిరిగి వచ్చాడు. "ఎన్కౌంటర్" కథ రిపీట్ అయ్యింది.... |
సంతకు వెళ్లిన వాళ్లు.. శవాలై వచ్చారుఏకంగా ఇరవై రోజుల నుంచి మృత దేహాలను ఖననం చేయకుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఈ విషయంలో స్పందించకపోవ... |
ఆ చెట్టుకు నోరుంటే ..ఆటపాటల్లో మురిసిపోయే పసివాడు ఉట్టన్నట్టుండి నక్సలైటయ్యాడు. కసిగా గుచ్చుకున్న బయోనెట్ మొన వాడి మొర ఆలకించలేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల... |
అధికారం నీడలో.... అంతులేని హింస మోదీ ప్రభుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ సహజ వనరులను వేదాంత, ఎస్సార్, టాటా, జిందాల్ వంటి బహుళజాతి సంస్థలకు కట్టబెడుతోంది. అందుకు...... |
ఆరని మంటలు...2011 మార్చిలో చత్తీస్‌ఘడ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జరిగిన మారణహోమం పోలీసుల పనే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెషల్ పోలీస్... |
హక్కుల కార్యకర్తలను మోటారు వాహనాలతో తొక్కిస్తాడట హక్కుల కార్యకర్తలను రోడ్డు మీద వాహనాలతో తొక్కించాలంటూ వ్యాఖ్యానించడం హంతక రాజ్యం నగ్నంగా ఊరేగుతోందనడానికి నిదర్శనం. ... |
అమరత్వపు జాడల్లో...అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావదినం సందర్భంగా జూలై 18న హైదరాబాద్‌లో జరిగిన రాజ్యహింస వ్యతిరేఖ సభ దృశ్యాలు....... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |