కామ్రేడ్‌ చలసాని ప్రసాద్‌ మొదటి వర్ధంతి సభ

| కార్య‌క్ర‌మాలు

కామ్రేడ్‌ చలసాని ప్రసాద్‌ మొదటి వర్ధంతి సభ

- | 12.09.2016 09:35:57am

కామ్రేడ్‌ చలసాని ప్రసాద్‌ అమరుడై ఏడాదయింది. ఆయనతో కలిసి ఆలోచించి, రాసి, మాట్లాడి, పని చేసిన అనుభూతులు సజీవంగా ఉన్నాయి. మానవ సంబంధాలపై, మేధో, సృజన కలాపాలపై ఆయన ముద్ర గాఢమైనది. వర్గపోరాటాలు, వాటి విలువలు, సంస్కృతి సాధిస్తున్న నూతన మానవ వికాస క్రమంలో చలసాని భాగం. ఈ ఏడాదిగా సాహిత్యాభిమానుల దగ్గరి నుంచి దండకారణ్య రచయితలు, కళాకారుల దాకా, విప్లవోద్యమ నాయకుల దాకా చలసానిని సన్నిహితంగా, ప్రేమగా, విమర్శనాత్మకంగా ఇలాగే అర్థం చేసుకుంటున్నాం.

భారత కమ్యూనిస్టు ఉద్యమంతోపాటు, మరీ ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధకాలంనాటి ఫాసిస్టు వ్యతిరేక సాహిత్య, సాంస్కృతిక, మేధో ఉద్యమాల్లో నిర్మాణమైన చలసాని ప్రసాద్‌ దండకారణ్య ప్రజా ప్రత్యామ్నాయం దాకా, క్రాంతికారీ జనాతన సర్కార్‌ దాకా బుద్ధిజీవిగా, రచయితగా విస్తరించాడు. కామ్రేడ్‌ చలసాని ప్రసాద్‌ వర్గపోరాటం రూపొందించిన నూతన మానవుడు. మనిషిని మార్కెట్‌ ధ్వంసం చేస్తే వర్గపోరాటం మనిషిని తిరిగి సమాజానికిస్తుంది. అటువంటి విప్లవ మానవుడు చలసాని ప్రసాద్‌ మొదటి వర్ధంతి సందర్భం 50 ఏళ్ల మహత్తర శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ సందర్భంతో కలిసి వచ్చింది. ప్రపంచవ్యాపంగా శ్రామికవర్గ పోరాటాలకు సైద్ధాంతిక, ఆచరణాత్మక స్ఫూర్తిని అందించిన చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం భారతదేశంలో నక్సల్బరీ వసంత మేఘమై గర్జించింది. పాత విగ్రహాలను ధ్వంసం చేసింది. కొత్త విలువలను అందించింది. శ్రీకాకుళ పోరాటంలో, పాణిగ్రాహి పాటల్లో కళాసాహిత్యాలు కొత్త ఒరవడి దిద్దుకున్నాయి. అటువంటి చారిత్రక సన్నివేశంలో విప్లవ రచయితల సంఘం ఆవిర్భావానికి కార్యకర్తృత్వం వహించిన చలసాని విరసం శ్వాసగా, విప్లవం ధ్యాసగా జీవించాడు. సాహిత్యాన్ని ప్రాణప్రదంగా ప్రేమించాడు. ప్రతి సాహితీ బృందం, ప్రతి ఉద్యమ కార్యకర్త ఎంతగానో ప్రేమించే చలసాని ప్రసాద్‌ ది ఎల్లలు లేని స్నేహశీలత. రాజకీయ భిన్నాభిప్రాయాలు వేరు, వ్యక్తుల మధ్య మానవ సంబంధాలు వేరు అని అందరికీ స్నేహాన్ని, ప్రేమను పంచిన సి.పి వ్యక్తిగత జీవితమంతా సమాజపరమే. ఆయన విస్తారమైన మానవ సంబంధాలను కూడా ఏదో ఒక కొస నుండి ఉద్యమానికి ఉపయోగపడేలా చేయగలిగేవాడు.

సాహిత్యం మానవ సమాజ హృదయమని గోర్కీ అన్నాడు. చలసాని హృదయం నిండా మనుషులు, పుస్తకాలు. వర్గపోరాట రాజకీయ ఆచరణతో ముడివేసుకున్న సాహిత్య వ్యక్తిత్వం ఆయనది. కనుక ఆయనే కాదు తెలుగు సాహిత్యాన్నే నక్సల్బరీ పక్షాన నిలబెట్టడానికి కృషి చేశాడు. తెలుగు సాహిత్య రంగంలో ఆయన కృషి విలక్షణమైనది. ఆయన పరిశోధించి సంకలనం చేసిన రచనలు యూనివర్సిటీలు, ఆకెడమీలు కూడా చేయలేనివి. అది ఒక ఎత్తైతే ఆయన సాహిత్య వ్యాసాలన్నీ సేకరించి చూస్తే తెలుగు సమాజ సాహిత్య చరిత్రకు అవసరమైన ముడి సరుకు వాటిలో విస్తారంగా దొరుకుతుంది. విరసం చలసాని ప్రసాద్‌ సాహిత్య సర్వస్వం మొదటి భాగం ఆరువందల పేజీలు ప్రచురించింది. ఇంకా సంకలనం చేయవలసిన వ్యాసాలు, కవిత్వం, ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు, లేఖలు ఎన్నో ఉన్నాయి. చలసాని మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సాహిత్య సర్వస్వం మొదటి సంపుటిని ఆవిష్కరించుకుంటున్నాం.

మూడు తరాల విరసం సభ్యులకు స్నేహితుడు, ఉపాధ్యాయుడు, నిరంతర స్ఫూర్తి సి.పి. తను జీవితమంతా సేకరించిన వేల కొద్ది గ్రంధాలను తన తదనంతరం విరసానికి చెందాలని పదేపదే చెప్పేవాడు. విరసానికి అరుణతారనిచ్చి, అది ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉండాలని హామీ తీసుకున్నాడు. అరుణతార ఏ ఇబ్బందులూ లేకుండా నడవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎంతగానో ఆరాటపడ్డాడు. ఆయన చివరి సంతకం, ఆయన చివరి ఉత్తరం అరుణతార గురించే. విరసం పతాకలో అరుణతార వెలుగుల్లో కామ్రేడ్‌ చలసాని ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటాడు. 50 ఏళ్ల శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ సందర్భంలో కామ్రేడ్‌ చలసాని ప్రసాద్‌ ను స్మరించుకుంటూ ఆయన వర్గపోరాట సాంస్కృతిక ఆచరణను కొనసాగిస్తామని ప్రతినబూనుదాం.

కార్యక్రమం


తేది: 14 అక్టోబ‌ర్ 2016
స‌మ‌యం: సాయంత్రం 6గంట‌ల‌కు
స్థ‌లం : తెలంగాణ సార‌స్వ‌త ప‌రిష‌త్తు, బొగ్గులకుంట‌, హైద‌రాబాద్‌

అధ్యక్షత: గీతాంజలి
చలసాని ప్రసాద్‌ సాహిత్య సర్వస్వం-1 ఆవిష్కరణ: కాక‌రాల‌

చలసాని సాహిత్య వ్యక్తిత్వం
వక్తలు: అమ్మంగి వేణుగోపాల్‌, బజారా, వరవరరావు, చంద్ర‌య్య‌

విర‌సం, సిటీయూనిట్‌






No. of visitors : 1595
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కామ్రేడ్ చ‌ల‌సాని ప్ర‌సాద్ మొద‌టి వ‌ర్థంతి స‌భ‌

విర‌సం | 11.07.2016 08:20:09am

కామ్రేడ్ చ‌ల‌సాని ప్ర‌సాద్ అమ‌రుడై అప్పుడే ఏడాది గ‌డిచిపోయింది. మాన‌వ సంబంధాల‌పై, మేధో, సృజ‌న క‌లాపాల‌పై ఆయ‌న ఘాడ‌మైన ముద్ర‌కు చ‌ల‌సాని జ్ఞాప‌కాలునిద‌ర్శ‌నం...
...ఇంకా చదవండి

చ‌ల‌సాని ప్ర‌సాద్ సాహిత్య స‌ర్వ‌స్వం - 1 ఆవిష్క‌ర‌ణ‌స‌భ‌

| 27.07.2016 12:20:17am

జూలై 31 ఆదివారం సాయంత్రం 6.00 గం.లకు విజయవాడ, బందరు రోడ్డులో రాఘవయ్య పార్క్ ఎదురుగా , మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం కామ్రేడ్ చ‌ల‌సాని...........
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జులై - 2018
    కత్తి మహేష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం
    కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
    రాజ్య హింసలో కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలతో తెలుగు ప్రభుత్వాలు కూడా సరిసమానమే
    వీళ్లు చేసిన నేరం ఏంటి?
    జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ
    కార్పోరేట్ కంపెనీల ఏజెంట్‌గా మోదీ స‌ర్కారు
    నెలవంక సందేశం
    The tree of the world
    వాళ్లు భూమి కలను నిజం చేసుకుంటారా?
    వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి
    రాజ్యం బరితెగింపు వెనక

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •