వివేక్ స్మృతిలో...

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

వివేక్ స్మృతిలో...

- పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ ను ఎన్నిసార్లు చూశానో గుర్తు లేదు. కానీ ఒక సందర్భం మాత్రమే చప్పున గుర్తుకు వస్తుంది. భార‌త ఐక్య విప్ల‌వోద్య‌మానికి ప‌దేళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో... ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వేదిక హైద‌రాబాద్ స‌భ సంద‌ర్భంగా క‌లిసి అరెస్టు అయ్యాం. బొల్లారం సేషన్లోకి వెళ్లినప్పటి నుంచి తిరిగి మర్నాటి సాయంకాలం విడుదలయ్యే వరకు ఇద్దరం పక్క పక్కనే ఉన్నాం. నా వరకు వివేక్ జ్ఞాపకాలంటే ఆ రోజు తను చెప్పిన ముచ్చట్లే, ఎన్నెన్నో మాట్లాడాడు.

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు. విప్లవంలో చిన్న పిల్లలు బలైపోతున్నారని అన్న వాళ్లూ ఉన్నారు. ఇలాంటి విద్యావంతులైన యువకులను విప్లవంలో నాలుగు కాలాలపాటు కాపాడుకోకపోతే నష్టం జరుగుతుందని ఇంకొందరు అన్నారు. ఇంకా చాలా అన్నవాళ్లూ ఉన్నారు. విప్లవం ఒక సామాజిక ప్రక్రియ కాబట్టి అన్ని వైపుల నుంచి స్పందనలు వస్తాయి. అవన్నీ ఒకేలా ఉండకపోవచ్చు. వివేక్ ఒక పెద్ద త్యాగ సంప్రదాయంలో భాగం. ఉన్నత విద్యావంతులై, నవ యవ్వనంలో నిండు ప్రాణాన్ని బలిదానం చేసిన అనేక మంది వీరుల వరుసలో తనూ నిలబడ్డాడు. తను విద్యావంతుడైనందు వల్లే అతని బూటకపు ఎన్‌కౌంట‌ర్‌పై స్పందించిన వాళ్లున్నారు. ఇరవై ఏళ్లు కూడా నిండని బాలకుడు కావడం వల్ల కూడా స్పందించిన వాళ్లున్నారు. ఇది విప్లవానికి, త్యాగానికి మధ్యతరగతి శిష్టవర్గ మానవీయ ప్రతిస్పందన. ఇది చాలా విలువైనది. కానీ ఆయనతోపాటు మరో ఇద్దరు ఆదివాసీ అమ్మాయిలు అమరులయ్యారు. ఏ గుర్తింపు లేని, విద్య లేని, నేపథ్యం లేని తన వయసు వాళ్లే అయిన దేవె, జోగి అనే ఇద్దరు ఆదివాసి అమ్మాయిలతో కలిసి వివేక్ రక్తతర్పణ చేశాడు. శృతి అనే ఉన్నత విద్యావంతురాలైన అమ్మాయితోపాటు పెద్దగా చదువుకోని మరో యువకుడు విద్యాసాగర్ అమరుడయ్యాడు. కాకపోతే ఇక్కడ ఆదివాసీ పేర్లలాంటిది కాకుండా మనకు నోరు తిరిగే పేరు కాబట్టి సాగర్ ప్రస్తావన వస్తూ ఉంటుంది. దీన్నీ తప్పుపట్టలేం.

ఆమె విప్లవ జీవితాన్ని ఎంచుకున్న తీరు, క్రూరమైన హింసలతో అమరురాలైన తీరు... కేవలం ఆదర్శప్రాయమని ఒక మాటతో అని సరిపెట్టుకోలేం. అంత దూరం ప్రయాణించలేకపోయినందువల్ల, ఇంకా జీవించి ఉన్నందు వల్ల మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆమె కూడా తన గుర్తింపులన్నీ రద్దు చేసుకొని, మధ్య తరగతి గుర్తించే ఏ ప్రత్యేకతా లేని సాగర్ లాంటి వాళ్ల వలె విప్లవమనే గుర్తింపును సంతరించుకుంది.

వీళ్లంతా తమ నేపథ్యాలను, ప్రత్యేకతలను తృణీకరించి, పక్కనపెట్టి కమ్యూనిస్టు అనే విలువ ఏకైక ప్రమాణంగా విప్లవకారులయ్యారు. వివేక్ త్యాగాన్ని ఏ కారణాల వల్ల సగటు సమాజం గుర్తించిందో ఆ ప్రత్యేకతలన్నీ ఆయన వదులుకున్నాడు. ఆయన త్యాగం అక్కడ మొదలైంది. శృతి త్యాగం కూడా అక్కడే మొదలైంది. మరి జోగి, దెవె లాంటి వాళ్ల త్యాగం ఎక్కడ మొదలైంది? చెప్పడం చాలా కష్టం. ఆదివాసీ సామాజిక కట్టుబాట్లని ధిక్కరించడం దగ్గర మొదలై ఉండొచ్చు. సాగర్లాంటి వాళ్లకయితే పేదరికం వల్లనే ఏర్పడే పరిమితులను దాటుకునే దగ్గర ఆరంభమై ఉంటుంది. ఇదంతా చైతన్యవంతమయ్యే క్రమం. ఇలాంటి వాళ్లంతా విప్లవకారులుగా రూపొందడానికి అలవిగాని రాపిడికి గురై ఉంటారు. అక్కడా, ఇక్కడా చైతన్యం, దానికి ఆధారమైన ఆచరణ మూలం, అనేక వైపుల నుంచి, అనేక ఘర్షణాయుత మార్గాల్లో విభిన్న నేపథ్యాల నుంచి విప్లవంలోకి చేరుకుంటున్నారు. విప్లవానికి ఉన్న మహత్తు అదే. కానీ ఈ ʹగుర్తింపుల లోకం దీన్ని సరిగా అర్థం చేసుకోగలరా? అనేదే ప్రశ్న.

సోషల్ మీడియాలోగాని, వివేక్ మిత్రుల, అభిమానుల మాటల్లో గాని, ఇంకా ఇతరత్రా వ్యక్తీకరణల్లోగాని ఆయనతో పాటు అమరులైన ఆదివాసీ అమ్మాయిల పేర్లయినా ప్రస్తావనలో ఉండవు. ఉందనుకున్నా అది ప్రస్తావనగానే. సాగర్ విషయంలో కూడా అంతే. దీనికి ఉద్దేశాలు ఏమీ ఉండవు. ఉంటే ఉద్వేగాలే ఉండవచ్చు. వాటినేమాత్రం ప్రశ్నించలేం. ఎందుకంటే అవి అత్యంత మానవీయమైనవి కాబట్టి. కాకపోతే మన స్పందనల వెనుక రకరకాల గుర్తింపుల ప్రభావం ఏమైనా ఉన్నదా? అనే విచికిత్స కలిగితే చాలు. సమాజంలో అలాంటివన్నీ ఉండటం సహజమే.

ఎన్‌కౌంట‌ర్‌ల‌లో ఎందరో యువతీ యువకులు అమరులవుతుంటారు. ఇదంతా రోజువారి వ్యవహారమని ఓ మామూలు కవి అనుకోవచ్చు. వివేక్ లాంటి విద్యావంతుడైన యువకుడి హత్యకు చలించిపోయి కవిత్వం రాయవచ్చు. ఈ స్పందనకు విలువ కట్టలేం. దాన్ని తర్కించలేం. ఆయన విద్యావంతుడైన యువకుడు కావడమనే ప్రత్యేకత వల్లే ఇలా స్పందించి ఉండవచ్చు. ఈ ఎరుక మనకు కలిగితే చాలు. అసలు అమరత్వాన్ని తలపోసుకునే వేళ ఈ సందిగ్ధత ఎందుకు? అనుకోవచ్చు. ఇది ఉండవలసింది మరెక్కడో కాదు, ఇక్కడే అమరత్వ గానం రాజకీయమూ, మానవీయమూ, అయితే మానవ స్పందనలకూ పరిమితులుంటాయి. వాటికి పరమ ప్రమాణాలేమీ ఉండవు. వేర్వేరు మానవానుభవాల వల్ల ధిక్కారానికే కాదు, దు:ఖానికీ పరిమితులు ఏర్పడతాయి. వాటిలో గుర్తింపుల పాత్ర ఉన్నదని, మనం ఆ పరిమితుల్లో ఉ న్నామనే ఎరుక పొందడం తప్పనిసరి. మనుషులందరూ సర్వత్రా ఆ పరిమితుల్లో ఉంటూ వాటితో ఘర్షణ పడుతూ అధిగమించాల్సి ఉంటుంది. ఆ ఆదర్శం అందుకోవాల్సిందే. అదంతా చాలా పెద్ద విషయం. కానీ తప్పనిసరైనది. అయితే ఇప్పుడు మనమున్న స్థితిపట్ల మనకేమైనా విమర్శనాత్మక దృష్టి ఉన్నదా? అనేదే ప్రశ్న బహుశా అంత చిన్న వయసులో ఈ గుర్తింపులపట్ల విమర్శనాత్మక చూపు ఉన్నందుకు ముందు వివేకును స్మరించుకోవాలి. ఆయన్ను స్మరించుకోవడమంటే అలాంటి విమర్శనాత్మక చూపు అలవర్చకోవడమ

No. of visitors : 1459
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి

రోహిత్‌.. ఉప్పొంగే నినాదం

పాణి | 18.01.2017 10:34:19pm

రోహిత్‌ మరణం తర్వాత సంఘపరివార్‌ భావజాలం మన సమాజంలో ఎన్నెన్ని రూపాల్లో, ఎక్కెడెక్కడ ఎలా వ్యాప్తిలోకి వస్తుందో, ఉనికిలో ఉంటుందో తెలుసుకోవడంపట్ల అందర్నీ అప్ర...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్
  ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •