ప్రజల మనిషి బొజ్జా తారకంకి అరుణారుణ జోహార్లు

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

ప్రజల మనిషి బొజ్జా తారకంకి అరుణారుణ జోహార్లు

- విరసం | 17.09.2016 09:40:02pm

ఆయన విప్లవ రచయితల సంఘం తొలితరం నాయకుల్లో ఒకరు. పౌరహక్కుల సంఘంలో క్రియాశీలకంగా పనిచేశారు. విద్యార్థి దశలోనే దళిత విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. దళిత మహాసభ వ్యవస్థాపకుడు. రాజకీయ ఖైదీల విడుదల కోసం ఏర్పడిన కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పోలిటికల్ ప్రిజనర్స్ అధ్యక్షులు. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్. పదేళ్ళ ఐక్య విప్లవోద్యమం సందర్భంగా వర్గపోరాట రాజకీయాలను చర్చించడానికి ఏర్పడిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలో కూడా సభ్యులు. ఇంతటి విస్తారమైన సామాజిక రాజకీయ జీవితం బొజ్జా తారకం గారిది. అన్ని ప్రగతిశీల శిబిరాలు ఎంతగానో ప్రేమించే తారకం గారు ఇక లేరంటే ఎంతో కష్టంగా ఉంటుంది.

తండ్రి దళిత ఉద్యమ వారసత్వాన్ని చిన్న వయసు నుండే స్వీకరించిన తారకం గారు సాంస్కృతిక కార్యకర్తగా, విద్యార్థి ఉద్యమకారుడిగా తన సొంతవూరిలో దళిత యువకుల్ని సంఘటితం చేశారు. వర్గపోరాట రాజకీయాలతో ప్రభావితమై విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనారు. ఆయన రాసిన ʹకులం-వర్గంʹ భారతదేశంలో జమిలిగా జరగవలసిన కుల వర్గ పోరాటాలను నొక్కి చెబుతుంది. తారకం గారు ఎమర్జెన్సీ దాకా విరసం కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. కవిత్వం, నవల, సామాజిక, సైద్ధాంతిక అంశాలపై రచనలు చేశారు. సామాజిక సమస్యల్ని సాధారణ కార్యకర్తలకు అర్థం అయ్యే రీతిలో విశ్లేషించి చెప్పారు. ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నప్పుడు ఆయన రాసిన ʹపోలీసులు అరెస్టు చేస్తేʹ పుస్తకం నిత్యం
రాజ్యహింసను అనుభవించే ప్రజాసంఘాల కార్యకర్తలకు దిక్సూచి వంటిది.

అంబేడ్కర్ నూ, కార్ల్ మార్క్స్ నూ ప్రేమించినట్లే దళిత ఉద్యమాన్ని, విప్లవోద్యమాన్ని ప్రేమించారు. దళితులు, ఉద్యమ కార్యకర్తలు, నిర్వాసితులు..ఇలా హక్కులు నిరాకరించబడిన సమూహాలన్నిటి పక్షాన కోర్టుల్లో న్యాయపోరాటం చేశాడు. కారంచేడు, చుండూరు, లక్షింపేట నిండి రోహిత్ వేముల దాకా, ప్రజాసంఘాల కార్యకర్తల నుండి విప్లవోద్యమ నాయకుల దాకా కేసులు వాదించాడు. బూటకపు ఎంకౌంటర్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు నడిపాడు. ఎన్నో ప్రజాసంఘాల వేదికలపై ఆయన గళం సముద్రం వలె గర్జించింది. వేలాది ఉపన్యాసాలు, చర్చలు, వీధి పోరాటాలతో, నిత్య నదీ ప్రవాహం ఆయన జీవితం. వ్యవస్థపై రాజీ లేని పోరాటం చేసిన బొజ్జా తారకం బ్రైన్ ట్యూమర్ తోనూ పోరాడాడు. అనారోగ్యం నుండి కోలుకుని మళ్ళీ ప్రజాజీవితంలో అడుగుపెట్టారు. డెబ్భై ఎళ్ళు ప్రజల కోసం అలోచనలు పోయిన మెదడు అలసిపోయి మళ్ళీ వ్యాధినబడి శాశ్వతంగా విశ్రమించింది. ఆయన ఆలోచనలు, ఆచరణ ప్రజాపోరాటాల్లో మిగిలే ఉంటాయి. విరసం ఆయనకు వినమ్రంగా జోహార్లర్పిస్తున్నది.

-వరలక్ష్మి
కార్యదర్శి, విరసం





No. of visitors : 874
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    అరుణతార సెప్టెంబర్ - 2018
    యాంటి నేషనల్
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
    అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
    కుట్ర
    ఇప్పటికైనా అర్ధమయిందా....?
    యుద్ధానంతర యుద్ధగీతం
    పోలీసుల నీడలో రాపూరు
    అర్హత

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •