స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

- సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

ఆరిందమ్ దత్తా అనే భవన నిర్మాణ శాస్త్ర పరిశోధకుడు రాసిన "On the Way to the Thousand-Pillared Mandapam: Travelogue on the Monuments of an Agrarian Insurgency" అనే వ్యాసాన్ని అమరుల బంధుమిత్రుల సంఘం ʹకన్నబిడ్డల కలల యాది ʹ పేరుతో తెలుగులో ప్రచురించింది .పద్దెనిమిదో శతాబ్దిలో బ్రిటన్లో సంభవించిన FINANCIAL REVLOUTION ప్రభావం వలన బ్రిటన్, అమెరికా, బెంగాల్ లో వ్యవసాయ మిగులు నిల్వల కోసం చేసిన నిర్మాణాలను, వాటి ద్వారా అప్పటి రాజకీయార్థిక వ్యవస్థను విశ్లేషించడం రచయత పరిశోధ‌నాంశం. అయితే 2004లో విప్ల‌వ పార్టీలు - ప్ర‌భుత్వం మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో INDIAN EXPRESS సండే మ్యాగజైన్లో వచ్చిన ఇంద్రవెల్లి స్థూప చిత్రం ఆరిందమ్ దత్తా దృష్టిలో పడింది. అలా తన పరిశోధనాంశానికి ఉపయోగపడుతుందని ఇక్క‌డి స్థూపాలను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ కి వచ్చాడు . ఆ సమయంలో భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను, విప్ల‌వోద్య‌మ ప్రభావాన్ని, అప్పటి పీపుల్స్ వార్ తో చర్చలు జరగడానికి ఏర్పడిన కారణాలను కూడా త‌న వ్యాసంలో వివ‌రించాడు.

స్మారక చిహ్నాలను అమరుల కుటుంబ సభ్యులు తమవారి స్మృతిలో నిర్మించుకున్నప్పటికీ వాటిని రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనాలుగాను, రాజ్యాన్ని ధిక్కరించే గుర్తులుగానో గుర్తిస్తాడు ర‌చ‌యిత‌. ఈ చిహ్నాలను భవన నిర్మాణ సాంకేతిక భాషలో విశ్లేషిస్తూనే, వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయ, సాంస్కృతిక పరమైన విషయాలను తెలియజేస్తాడు . స్థూపాల పట్ల రాజ్య స్వభావాన్ని, దానికి కుటుంబాల నుంచి లేదా సమాజం నుంచి వచ్చే ప్రతిస్పందనలను చెప్తూ "స్మారక చిహ్నం రాజ్యపు సహనాన్ని నిత్యం పరీక్షిస్తుంటుంది. అది ఒక బహిరంగంగా రెచ్చగొట్టే చిహ్నంగా , ప్రజా సాధికారతకూ, చట్టబద్దమైన సాధికారతకూ మధ్య కుదరని సమన్వయానికి దృశ్యరూపంగా " ఉంటుందంటాడు .

మృతవీరుల అమరత్వాన్ని ఎత్తిపట్టడానికి వారి త్యాగాన్ని గానం చేస్తూ, వారి స్మృతిలో స్థూపాలను నిర్మిస్తుంటే రాజ్యం అందుకు ప్రతిగా మానసిక దాడికి పాల్పడుతూ బేగంపేట , జఫ‌ర్‌ఘ‌డ్‌ల‌లోని స్థూపాలమీద మావోయిస్టుల ఫోటోలు, లొంగిపోతే వచ్చే నజరానాలు అతికించింది . అంతేగాక అమరుల కుటుంబాలు నిర్మించుకున్న ఆ చిహ్నాలను కూల్చడం, వారి మీద నిర్బంధాన్ని ప్రయోగించడం ద్వారా రాజ్యం తన స్వభావాన్ని చాటుకుంటుంది. అయితే రాజ్యం ఎన్ని సార్లు స్తూపాలను కూలగొట్టినా కుటుంబాలు తిరిగి వాటిని నిర్మించడాన్ని చూసి రచయత వాటిని ప్రతిస్మారకచిహ్నాలు అని నిర్వచిస్తాడు .

ర‌చ‌యిత ఈ చిహ్నాలను రాజకీయ భావజాల ప్రచారంలో భాగంగా, కుటుంబీకులు తమ వాళ్ళ జ్ఞాపకాలకు సంబంధించినవిగాను,ఇక్కడి రాజకీయ పరిస్థితులని ప్రతిబింబించే కట్టడాలుగాను, సామూహిక పోరాటాలకు గుర్తుగా ఉన్నాయంటాడు. వీటిని తెలంగాణ గ్రామీణ ప్రాంతపు సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకలుగా చూస్తాడు. మొత్తంగా ఈ స్మారక చిహ్నాలు సంస్కృతి, రాజకీయాలతో మిళితమై ఉన్నాయంటాడు.

ఈ స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను, ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను, వారి అమరత్వపు గుర్తులుగాను, కుటుంబ సభ్యులకు జ్ఞాపకాలుగాను నిలుస్తున్నాయి. మొత్తంగా అవి గత కాలపు పోరాటాలకు చిహ్నాలుగా మనముందున్నాయి .

No. of visitors : 1050
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •