ఆపరేషన్ దేశభక్తి

| సంపాద‌కీయం

ఆపరేషన్ దేశభక్తి

- వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

సర్జికల్ స్ట్రయిక్స్ అంటే శస్త్ర చికిత్స చేసినంత సున్నితంగా ఆపరేషన్ నిర్వహించడమట. అవసరమైనంత మేరకే కోత పెట్టి చెడిపోయిన భాగాన్ని తీసివేయడమట. భారత సైన్యం గీత దాటింది. కోత పెట్టింది. ఇది ఉరీకి ప్రతీకారమా? పాక్‌కు సమాధానామా? సర్జరీ మాత్రం జరిగింది. నూటా ముప్పై నాలుగు కోట్ల మంది మెదళ్ళకు సర్జరీ చేసి చికాకు పెట్టే ప్రశ్నలను పెళ్ళగించి పారేసి, నిండా దేశభక్తిని కూరే ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. పాకిస్తాన్ అధీనంలో ఉన్న కశ్మీర్ భూభాగం మీద అర్ధరాత్రి దాడి చేసి నలభై మంది ఉగ్రవాదులను చంపిన ఘట్టాన్ని ఢిల్లీ నుండి ప్రధానమంత్రి ఉత్కంఠభరితంగా లైవ్ లో చూశాడు. ఒక్కటే వార్తతో మీడియా దేశాన్నంతా స్వీప్ చేసి పడేసింది. రాహుల్ గాంధీ మోడీని మెచ్చుకున్నాడు. వామపక్షాలతో సహా అఖిలపక్షం ఒక్కటే మాట మాట్లాడింది. యుద్ధం పాలకవర్గాల చివరి అస్త్రం. ఆ అస్త్రాన్ని ఇప్పుడు మోడీ ప్రయోగించాడు.

ఎప్పటికప్పుడు ఒక్కో సంచలనం మన ఆలోచనలను బ్రేక్ చేస్తూ ఉంటుంది గాని కొంచెం వెనక్కి వెళ్దాం. సరిగ్గా ఏడాది క్రితం దేశం ʹఅసహనంʹతో కదిలింది. సంఘపరివార్ ఉన్మాదానికి ప్రభుత్వ ప్రోత్సాహం తోడై దేశం ఫాసిజం రుచి చూస్తున్నపుడు న్యాయాన్యాయ విచక్షణ ఉన్న ప్రతి ఒక్కరి మనసును లౌకిక ప్రజాస్వామిక ధర్మావేశం ఆవహించింది. రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు మూకుమ్మడిగా తమ అవార్డులను తిరిగిచ్చి నిరసన తెలిపారు. ఇది ప్రభుత్వానికి నైతిక సవాల్. కానీ అక్కడున్నది సంఘపరివార్. జరిగిన వాటిపై పైపై సానుభూతులు కూడా కురిపించలేదు. అడిగిన వాళ్లపై ఎదురుదాడి చేసింది. అటు తర్వాత రోహిత్ వేముల నుండి ఉనా దాకా చిక్కనైన ధిక్కారం మోడీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో చిక్కులు తేబోతున్నది. ఘర్ వాపసీ మొదలుకుని ఆవు రాజకీయాల దాకా అది ప్రయోగిస్తున్న అస్త్రాల్లో దేశభక్తి తిరుగులేనిదని తేలింది. కశ్మీర్ అంశం ముందుకొస్తే విపక్షం, స్వపక్షం తేడా లేదు. ʹకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది, ఉంది, ఉంటుందిʹ దశాబ్దాలుగా జనాన్ని నమ్మించిన అబద్దం కశ్మీర్ భూభాగాన్నే కాదు, దేశభక్తి మూఢ విశ్వాసంగా దేశప్రజల విధేయత ప్రభుత్వానికి ఇస్తున్నది. కశ్మీర్ భూభాగం భారత పెట్టుబడిదారులకు కావాలి. కశ్మీర్ వంటి నిరంతరం మండుతున్నగాయం ఒకటి పాలకులకు కావాలి. పోయేదేముంది. పోతే కొన్ని లక్షల ప్రాణాలు.

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది ప్రజలు (అందులో ఎక్కువ శాతం యువకులు ఉన్నా పసిపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు) భారత సైనికుల పెల్లెట్ల దాడుల్లో చనిపోయారు. 1100 మందికి పైగా పాక్షికంగానో పూర్తిగానో చూపు కోల్పోయారు. రాళ్ళు రువ్వుతున్న యువకుల మీదనే కాదు ఆంబులెన్సుల మీద కూడా సైన్యం తుపాకులు కాల్చింది. వీటిని రిపోర్టు చేస్తారని అర్ధరాత్రి పత్రికల ఆఫీసులపై, ప్రెస్సులపై దాడులు చేసారు. బైటి ప్రపంచంతో సంబంధాల్ని తెంచుతూ ఇంటర్నెట్ కట్ చేశారు. ప్రజల రక్షణ కోసమే తీవ్రవాదులతో తలపడుతున్నదని ప్రభుత్వం చెప్తున్న విషయమే నిజమైతే బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తర్వాత వచ్చిన ప్రతిస్పందనతో ఎలా వ్యవహరించాలి? జమ్మూ కశ్మీర్ పౌరహక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్ జానీవాలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ముందు కశ్మీర్ లో గురించి మాట్లాడాడానికి వెళ్తుండగా భారత సైన్యం అరెస్టు చేసింది. అతన్నో ప్రమాదకరమైన వ్యక్తి అని కేసులు పెట్టి నిర్బంధించింది.

కశ్మీర్ గురించి మాట్లాడితే పాకిస్తాన్ ఏజెంట్ అయిపోతారు. అయితే ఇప్పుడు కశ్మీర్ విషయంలో, ముఖ్యంగా పెల్లెట్ దాడుల దుర్మార్గంపై మానవ హక్కుల హననం కింద అంతర్జాతీయంగా సమాధానం చెప్పుకునే స్థితిలో భారత ప్రభుత్వం పడిపోయింది. ఆ దశలో పెల్లెట్ల బదులు కారం బాంబులు వాడదామనో, అత్యవసరమైతే పెల్లెట్లు వాడదామనో మాట్లాడింది గాని కశ్మీర్ ప్రజలతో చర్చలు జరపాలని మాత్రం అనుకోలేదు. అంత దుర్మార్గంగా తన వైఖరి బైటపెట్టుకున్నందుకే పాకిస్తాన్ కూడా తనకన్నా ఏమీ తక్కువ కాదని బెలూచిస్తాన్ వైపు వేలు చూపింది. యుద్ధం వద్దు అంటేనో, శాంతి గురించి మాట్లాడితేనో, ఇప్పుడు దేశద్రోహం కావొచ్చు. పద్దెనిమిది మంది ఇక్కడి సైనికులు చనిపోతే అంతకు రెండింతల మందిని సరిహద్దు ఆవల చంపితే చాలదంటుంది మీడియా. యుద్ధానికి తయారు కమ్మంటూ అందుకు పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో 15 లక్షల మంది జనాన్ని ఏ దిక్కూ చూపకుండా ఖాళీ చేయిస్తుంటే ముందుజాగ్రత్త చర్యలను మురిపెంగా చెబుతుంది.

సిరియా శరణార్థుల గురించి ఆర్ద్రంగా మాట్లాడుకున్న మనమే ఇప్పుడు యుద్ధం జరిగితే చూడాలని, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని కోరుకునేలా చేస్తుంది. పాకిస్తాన్ లోనూ జనం ఇదే కోరుతూ ఉండొచ్చు. రెండు దేశాల అధినేతలు యుద్ధ ఒప్పందం చేసుకున్నట్లుగా ఉంది. ఈ యుద్ధాన్ని సమర్థించడం అంటే పాలకుల కోసం ప్రజల ప్రాణాల్ని, సైనికుల ప్రాణాల్ని పణంగా పెట్టడం. పాలకుల వైఫల్యాలు, సంక్షోభాలు, దురాశలు యుద్ధం రూపంలో వికృతంగా బైటికి వస్తాయి. ఇప్పుడు ఇండియాలో కశ్మీరే కాదు రోహిత్ నుండి ఉనా దాకా, సవాళ్లన్నిటికీ ప్రభుత్వం ఏకైక సమాధానం యుద్ధం. యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా మలచమని లెనిన్ చెప్తాడు. ప్రజా పోరాటాల్ని యుద్ధంతో తుడిచేయాలని చూస్తున్నది భారత ప్రభుత్వం.

No. of visitors : 1547
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •